ముదివర్తి కొండమాచార్యులు
Appearance
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ముదివర్తి కొండమాచార్యులు | |
---|---|
జననం | |
వృత్తి | పండితుడు, రచయిత, కవి |
ప్రసిద్ధి | బ్రహ్మగాంధర్వము |
మతం | హిందూ |
ముదివర్తి కొండమాచార్యులు నెల్లూరు జిల్లా గూడూరు వాస్తవ్యుడు. ఇతడు 1923, సెప్టెంబర్ 2న జన్మించాడు. ఇతడు మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ‘విద్వాన్’ పట్టా పుచ్చుకున్నాడు. నెల్లూరు జిల్లా పరిషత్తు ఉన్నతపాఠశాలల్లో 30 సం||లు ప్రధానాంధ్రపండితుడిగా పనిచేసి ఉద్యోగ విరమణచేశాడు. 1980లో తిరుమల తిరుపతి దేవస్థానంవారి పుస్తక ప్రచురణ విభాగంలో ఉపసంపాదకునిగా చేరి ఆ విభాగం సంచాలకునిగా పనిచేశాడు[1].
రచనలు
[మార్చు]వీరి రచనల్లో కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానముల ఈ-బుక్స్ ద్వారా చదువుకొనడానికి అందుబాటులోకి తేబడ్డాయి.[2]
- హిందూ ధర్మ పరిచయము, స్తోత్ర మంజరి - సముద్రాల లక్ష్మణయ్యతో కలిసి
- ముకుందమాల (టి. లక్ష్మణాచార్యుల టీకాతాత్పర్యసహితము) (సంపాదకులు: ముదివర్తి)[3]
- చ్యవనమహర్షి
- అన్నమయ్య విన్నపాలు
- ఆనంద నిలయము
- అమృతసారము
- శ్రీనివాసతేజము
- బ్రహ్మగాంధర్వము, 1988 (అన్నమాచార్యులవారి ఆధ్యాత్మసంకీర్తనలకు సీసపద్యానుసరణము) [4]
- మధూకమాల
- కూనలమ్మ
- వీరమనీడు
- ధర్మదీక్ష - ఖండకావ్యం
- నారాయణమ్మ
- త్యాగమూర్తి చారిత్రక నవల
- రాజర్షి
- కనిష్ఠ భిక్షువు
- కుమార రాముడు
- పూర్ణాహుతి
- వకుళమాల (కథలసంపుటి, మొదటి ముద్రణ: 1949)[5]
మూలాలు
[మార్చు]- ↑ ఎమెస్కో బుక్స్ వారి జాలస్థలిలో ముదివర్తి కొండమాచార్య వివరాలు[permanent dead link]
- ↑ తిరుమల.ఆర్గ్ లో విద్వాన్ ముదివర్తి కొండమాచార్యులు.
- ↑ https://archive.org/details/in.ernet.dli.2015.385258/mode/2up
- ↑ ముదివర్తి కొండమాచార్యులు (1988). బ్రహ్మగాంధర్వము. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానములు. Retrieved 20 September 2020.
- ↑ ముదివర్తి కొండమాచార్యులు (1949). వకుళమాల. నెల్లూరు: వడ్లమూడి రామయ్య. Retrieved 20 September 2020.