Coordinates: 16°06′15″N 80°54′30″E / 16.10417°N 80.90833°E / 16.10417; 80.90833

మేకావానిపాలెం (మచిలీపట్నం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మేకావానిపాలెం, కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

మేకావానిపాలెం
రెవెన్యూయేతర గ్రామం
మేకావానిపాలెం is located in Andhra Pradesh
మేకావానిపాలెం
మేకావానిపాలెం
మేకావానిపాలెం is located in India
మేకావానిపాలెం
మేకావానిపాలెం
Coordinates: 16°06′15″N 80°54′30″E / 16.10417°N 80.90833°E / 16.10417; 80.90833
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా జిల్లా
Time zoneUTC+5:30 (IST)

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: మచిలీపట్నం, విజయవాడ 74 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

భవిష్య తెక్నో స్కూల్, మచిలీపట్నం హర్ష జూనియర్ కాలేజి, అరిశేపల్లి

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ జొన్నల పాండురంగారావు సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ దాసరి సూరిబాబు ఎన్నికైనారు. [1]

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

  1. మేకావానిపాలెం హౌసింగ్ నగర్ లోని ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలను పురస్కరించుకొని, 2014,జూన్-11, బుధవారం నాడు, పలు విశేషపూజలు నిర్వహించారు. గోపూజ, మంటపదేవతార్చన, వేదపారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా, గ్రామంతోపాటు, పట్టణ, మండల పరిధిలోని భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి, పూజలు చేసారు. ఆయా ప్రాంతాలకు చెందిన పలువురు సంతానార్ధులు, వివాహార్ధులకోసం, వేదపండితులు ప్రత్యేక హోమాలు నిర్వహించారు. అనంతరం 16 విగ్రహాలకు స్నపన, జలాధివాసం కార్యక్రమాలను శాస్త్రబద్ధంగా, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ, ఘనంగా నిర్వహించారు. గురువారం విగ్రహప్రతిష్ఠామహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ పరిసర ప్రాంతాలనుండి, భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహంతో పాటు, 16 దేవతామూర్తుల విగ్రహాలను గూడా, వేదపండితుల ఆధ్వర్యంలో, వేదమంత్రోచ్ఛారణల నడుమ, శాస్త్రబద్ధంగా, ప్రతిష్ఠా కార్యక్రమాలను నిర్వహించారు. ధ్వజస్తంభ, ప్రతిష్ఠ నిర్వహించగా, పూజలు నిర్వహించడానికి, భక్తులు పోటీపడినారు. అనంతరం నిర్వహించిన అన్నసంతర్పణ కార్యక్రమానికి విశేషస్పందన లభించింది. [2] & [3]
  2. ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం, 2015,జూన్-1వ తేదీ సోమవారంనాడు నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయంలో పలువిశేష పూజలు నిర్వహించెదరు. [4]
  3. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్టి వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించెదరు. [5]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామములో 2015,డిసెంబరు-19 నుండి 24 వరకు, మచిలీపట్నం హిందూ కళాశాల ఎన్.ఎస్.ఎస్. అధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.ఎస్.ఎస్.వలంటీర్లు గ్రామంలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటినారు. [6]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2013,ఆగష్టు-5; 5వపేజీ. [2] ఈనాడు కృష్ణా; 2014,జూన్-12; 5వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014,జూన్-13; 5వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2015,జూన్-1; 5వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2015,డిసెంబరు-17; 5వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2015,డిసెంబరు-24; 5వపేజీ.