Coordinates: 16°16′40″N 80°50′45″E / 16.277814°N 80.845800°E / 16.277814; 80.845800

మేడూరు (పమిడిముక్కల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మేడూరు
—  రెవిన్యూ గ్రామం  —
మేడూరు is located in Andhra Pradesh
మేడూరు
మేడూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°16′40″N 80°50′45″E / 16.277814°N 80.845800°E / 16.277814; 80.845800
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పమిడిముక్కల
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి స్వాతి
జనాభా (2011)
 - మొత్తం 4,357
 - పురుషులు 2,202
 - స్త్రీలు 2,155
 - గృహాల సంఖ్య 1,328
పిన్ కోడ్ 521247
ఎస్.టి.డి కోడ్ 08676

మేడూరు, కృష్ణా జిల్లా, పమిడిముక్కల మండలానికి చెందిన గ్రామం.ఇది మండల కేంద్రమైన గంపలగూడెం నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తిరువూరు నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది.

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1358 ఇళ్లతో, 4924 జనాభాతో 942 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2516, ఆడవారి సంఖ్య 2408. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2034 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 2. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588952[1].పిన్ కోడ్: 521401.

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4533. ఇందులో పురుషుల సంఖ్య 2281, స్త్రీల సంఖ్య 2252, గ్రామంలో నివాస గృహాలు 1115 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1320 హెక్టారులు.

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో ఈలూరు (ఐలూరు), కుదేరు, కృష్ణాపురం, చోరగుడి, పమిడిముక్కల గ్రామాలు ఉన్నాయి.

గ్రామ పంచాయతీ[మార్చు]

ధూళిపూడిపాలెం, మేడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

2013 జూలైలో మేడూరు గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో గుళ్ళపల్లి స్వాతి సర్పంచిగా ఎన్నికైంది. [2]

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి గంపలగూడెంలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల గంపలగూడెంలోను, ఇంజనీరింగ్ కళాశాల తిరువూరులోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల తిరువూరులోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు విజయవాడలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల నూజివీడులోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు విజయవాడలోనూ ఉన్నాయి.

యలమంచిలి వెంకటరత్నం స్మారక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల -ఈ గ్రామానికి చెందిన కీ.శే. యలమంచిలి వెంకటరత్నం, వారి కుమారుడు రామమోహనరావు, ఈ పాఠశాల నిర్మాణానికి స్థల దాతలు. [5]

కృష్ణా జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఇటీవల విజయవాడలోని ఆంధ్ర లయోలా కలాశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో. ఈ పాఠశాలలో పదవ తరగతి చదువుచున్న ఎం.బిందులత అను విద్యార్థిని, 800 మీటర్ల పరుగు పందెంలో ప్రథమస్థానంలో నిలిచి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. 2017, ఆగస్టులో కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో నిర్వహించు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో ఈమె పాల్గొంటుంది. [6]

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

మేడూరులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు.

గ్రామంలో జన్మించిన ప్రముఖులు[మార్చు]

యలమంచిలి హనుమంతరావు, రేడియో హనుమంతరావుగా తెలుగు రాష్ర్టాల రైతులకు సుపరిచితుడైన వ్యక్తి.
  • యలమంచిలి హనుమంతరావు:రేడియో హనుమంతరావుగా తెలుగు రాష్ర్టాల రైతులకు సుపరిచితుడైన వ్యక్తి.[2]బాపట్ల వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ బి.ఎస్.సి., చదివిన వీరు, తొలుత పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో వ్యవసాయశాఖలో డిమానుస్టేటరుగా ఉద్యోగంలో చేరినారు. అ శాఖలో అంచెలంచలుగా పైకి వస్తూ, 1971లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆకాశవాణిలో చేరినారు. 1992లో ఆకాశవాణిలో అసిస్టెంట్ డైరెక్టరుగా నియమితులైన వీరు, రైతులకు ఉపయోగపడే పరిచయ, సంభాషణలు, సూచనలు, సలహాలు, చర్చాగోష్టులు, నాటికలు, వాస్తవ చిత్రణలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలు రూపొందించారు.[4]
  • గుమ్మడి గోపాలకృష్ణ :ప్రముఖ రంగస్థల నటుడు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

మేడూరులో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

వుయ్యూరు, కూచిపూడి నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 40 కి.మీ దూరంలో ఉంది.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.శ్రీ వేణుగోపాల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం.భారతీయ స్టేట్ బ్యాంక్ ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

మేడూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 115 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 12 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 8 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 14 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 11 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 6 హెక్టార్లు
  • బంజరు భూమి: 6 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 770 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 332 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 450 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

మేడూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 125 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 75 హెక్టార్లు
  • చెరువులు: 250 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

మేడూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, ప్రత్తి వరి, చెరుకు, అపరాలు, కాయగూరలు

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

ఇటుకలు, సిమెంటు ఉత్పత్తులు

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి ఆలయం -ఈ ఆలయంలో, కార్తీకమాసం సదర్భంగా, కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం నుండి సాయంత్రం వరకూ, ప్రత్యేకపూజలు చేయుదురు. మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి కార్తీక దీపాలు వెలిగించెదరు. అనంతరం స్వామివారికి తీర్ధప్రసాదాలు పంపిణీ చేయుదురు. [3]

శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామంలో 2016, ఫిబ్రవరి-21వ తేదీ ఆదివారంనాడు, యలమంచిలి ప్రథమ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. [5]

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. రేడియో హనుమంతరావు ఇకలేరు 21-01-2016 02:01:03[permanent dead link]

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2013,జూలై-25; 8వపేజీ.[3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2013,నవంబరు-28; 2వపేజీ.[4] ఈనాడు అమరావతి; 2016,జనవరి-21; 19వపేజీ. [5] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఫిబ్రవరి-22; 2వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2017,ఆగస్టు-21; 2వపేజీ.