మామిళ్ళపల్లి (పమిడిముక్కల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మమిల్లపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పమిడిముక్కల
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 697
 - పురుషులు 338
 - స్త్రీలు 359
 - గృహాల సంఖ్య 227
పిన్ కోడ్ 516004
ఎస్.టి.డి కోడ్ 08676

మామిళ్ళపల్లి, కృష్ణా జిల్లా, పమిడిముక్కల మండలానికి చెందిన గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పమిడిముక్కల మండలం[మార్చు]

పమిడిముక్కల మండలం మొత్తం ప్రాంతంతో పాటు, పట్టణ ప్రాంతం కూడా ఉంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[2] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, తెనాలి, మచిలీపట్నం, పెడన

సమీప మండలాలు[మార్చు]

వుయ్యూరు, పామర్రు, మొవ్వ, తోట్లవల్లూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

వుయ్యూరు, మొవ్వ నుండే రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 40 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, ఐనపూరు

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామ సర్పంచిగా శ్రీ ఆముదాలపల్లి వెంకటేశ్వరరావు 2001 నుండి 2006 వరకూ పనిచేశారు. అందరినీ కలుపుకొని ఈయన పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాతనేటికీ క్షురక వృత్తిని కొనసాగించుచున్నారు. బ్యాండుమేళంలో సన్నాయివాద్యకారునిగా, గ్రామంలో క్షురకునిగా జీవించుచున్నారు. ఈయన భార్య లక్ష్మి 2006 నుండి 2011 వరకూ గ్రామ సర్పంచిగా పనిచేశారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ గోవిందమాంబా సమేత శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం[మార్చు]

మామిళ్ళపల్లి గ్రామములోని శ్రీ గోవిందమాంబా సమేత శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం, మొదట 1927లో, శ్రీ మార్తి కోటయాచార్యులు మరియూ శ్రీ మార్తి యలమందాచార్యులచే నిర్మితమై, అందులో శివలింగ ప్రతిష్ఠ మాత్రమే జరిగింది. 1959లో భక్తుల సహకారంతో పునరుద్ధరించి, అందులో గోవిందమాంబా సమేత వీర బ్రహ్మేంద్రస్వామి, మాతా ఈశ్వరీదేవి, సాధు సిద్ధమూర్తి, శీతలాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాలను అగినపర్రుకు చెందిన శ్రీ బండి బాపయ్య, చిగురుపాటి సూర్యనారాయణ, బొబ్బా రామారావు విరాళంగా ఇచ్చారు. ధూప, దీప, నైవేద్యాలకోసం, అగినపర్రు, మామిళ్ళపల్లికి చెంఇదిన దాతలు మాగాణి భూమిని విరాళంగా ఇచ్చారు. 1992 నుండి ఆలయాభివృద్ధికి బొబ్బా సాధ్వి, వెంట్రప్రగడ శేషగిరిరావు సహకరిస్తున్నారు. ఇప్పుడు ఆ ఆలయంలో 2014, ఫిబ్రవరి-9న, ఉదయం 08-14 గంటలకు, నూతన ధ్వజస్తంభ, పునహ్ ప్రతిష్ఠా కార్యక్రామం జరుపుటకు నిశ్చయించారు. ఇప్పుడు ప్రతిష్ఠించుచున్న ద్వజస్తంభమును, మఛిలీపట్నానికి చెందిన శ్రీ కొండిశెట్టి హరినాధ్ బాబు, శ్రీమతి శేషారత్నం దంపతులు సమర్పించుచున్నారు. [3]

శ్రీ సరస్వతీ దేవాలయం[మార్చు]

ఈ ఆలయంలో 2016, ఫిబ్రవరి-13వ తేదీ శనివారంనాడు, వసంతపంచమి సందర్భంగా, ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తుల తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. [4]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, చెరకు, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 767.[3] ఇందులో పురుషుల సంఖ్య 377, స్త్రీల సంఖ్య 390, గ్రామంలో నివాస గృహాలు 234 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 181 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 697 - పురుషుల సంఖ్య 338 - స్త్రీల సంఖ్య 359- గృహాల సంఖ్య 227

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamidimukkala/Mamillapalli". Retrieved 24 June 2016. External link in |title= (help)
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-08.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2013, జూలై-13; 8వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014, ఫిబ్రవరి-9; 3వపేజీ. [4] ఈనాడు అమరావతి/పామర్రు; 2016, ఫిబ్రవరి-14; 1వపేజీ.