Coordinates: 16°21′21″N 80°52′46″E / 16.355915°N 80.879492°E / 16.355915; 80.879492

తాడంకి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాడంకి
—  రెవెన్యూ గ్రామం  —
తాడంకి is located in Andhra Pradesh
తాడంకి
తాడంకి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°21′21″N 80°52′46″E / 16.355915°N 80.879492°E / 16.355915; 80.879492
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పమిడిముక్కల
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,869
 - పురుషులు 1,435
 - స్త్రీలు 1,434
 - గృహాల సంఖ్య 824
పిన్ కోడ్ 521256
ఎస్.టి.డి కోడ్ 08676

తాడంకి, కృష్ణా జిల్లా, పమిడిముక్కల మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన పమిడిముక్కల నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుడివాడ నుండి 21 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 824 ఇళ్లతో, 2869 జనాభాతో 423 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1435, ఆడవారి సంఖ్య 1434. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 171 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 60. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589535[1].పిన్ కోడ్: 521256. సముద్రమట్టానికి 9 మీ.ఎత్తులో ఉంది.

సమీప గ్రామాలు[మార్చు]

మంటాడ 2 కి.మీ, కపిలేశ్వరపురం 4 కి.మీ, కురుమద్దాలి 4 కి.మీ, కనుమూరు 4 కి.మీ, గరికపాడు 4 కి.మీ

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి ఉంది.సమీప బాలబడి, ప్రాథమిక పాఠశాల పమిడిముక్కలలోను, ప్రాథమికోన్నత పాఠశాల వుయ్యూరులోను, మాధ్యమిక పాఠశాల వుయ్యూరులోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల వుయ్యూరులోను, ఇంజనీరింగ్ కళాశాల విజయవాడలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ విజయవాడలో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడలో ఉన్నాయి.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

  1. ఈ పాఠశాల 1915లో, తాడంకికి చెందిన అమ్మనమంచి వెంకటసుబ్బయ్య చే వీధిబడిగా ప్రారంభమై, 1920లో చెన్నకేశవస్వామి మిడిల్ స్కూల్ గా రూపుదిద్దుకుంది. 1924లో ఉన్నత పాఠశాలగా మార్పుచెందింది. స్థానిక, పరిసరప్రాంతాల రైతుల వితరణతో పది ఎకరాల స్థలంలో పక్కా భవనాలు ఏర్పరచుకుంది. అప్పట్లో ఈ పాఠశాలలో చదువుకున్నవారిలో అనేకులు విదేశాలలో స్థిరపడగా, పలువురు వివిధ రంగాలలో స్థిరపడినారు. [5]
  2. ఈ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడుగా పని చేయుచున్న జి.వి.రమణ, హైదరాబాదు ఆర్ట్స్ అకాడమీ వారు ప్రతి సంవత్సరం ప్రకటించే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎన్నికైనాడు. హైదరాబాదులో 2013 అక్టోబరు 16 నాడు ఈ ప్రదానం ఇచ్చి సత్కరిస్తారు. [1] గుడి వెంకటరమణ, హైదరాబాదులోని ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ సంస్థ 2013-14 సంవత్సరానికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎన్నిక చేసింది. 20-10-2012న ఈ పురస్కారం అందుకున్నాడు. [2]
  3. ఈ పాఠశాలలో చదువుచున్న శాఖమూరి శ్రీవల్లిక, కూచిపూడి భువనేశ్వరి అను విద్యార్థినులు, ఇటీవల సి.బి.ఆర్.అకాడమీ, కేతనకొండలో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్కూల్ గేంస్ ఫెడరేషన్, బాక్సింగ్ పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలలో శ్రీవల్లిక అండర్-17 విభాగంలో, 75 కిలోల విభాగంలో, స్వర్ణపతకం సాధించి, 2016, మే-14 నుండి 19 వరకు పంజాబ్ రాష్ట్రంలో, స్కూల్ గేంస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (S.G.F.I) ఆధ్వర్యంలో నిర్వహించు జాతీయస్థాయి బాక్సింగ్ క్రీడాపోటీలలో మన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించుటకు ఎంపికైనది. భువనేశ్వరి, 63 కిలోల విభాగంలో రజతపతకం అందుకుంది. [4]&[6]
  4. ఇప్పటికీ పూర్వ విద్యార్థులు దాతలుగా ఉంటూ ఈ పాఠశాల అభివృద్ధికి తోడ్పడుచున్నారు. పలువురు వదాన్యూల వితరణతో ప్రతి సంవత్సరం విద్యార్థులకు మూడు లక్షల రూపాయలను బహుమతులుగా అందించుచున్నారు. [5]
  5. ఈ పాఠశాల విద్యార్థులు క్రీడలలో గూడా రాణించుచున్నారు. 1960 దశకంలో వరుసగా 14 సార్లు రాజాజీ షీల్డ్ సంపాదిందించుకున్న ఘనత ఈ పాఠశాలది. ప్రముఖ జాతీయ మహిళా కబడ్డీ ఛాంపియన్ మాదు పుష్పావతి, యలమంచిలి సత్యనారాయణ, ఫోర్ బ్రదర్స్ ఈ పాఠశాల విద్యార్థులే కావడం విశేషం. [5]
  6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల విజయవాడలో నిర్వహించిన 3వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ - 2016 పోటీలలో, ఈ పాఠశాలలో చదువుచున్న యాదంరెడ్డి పావనిలక్ష్మి అను విద్యార్థిని, హై జంప్ పోటీలలో మూడవ స్థానం సంపాదించి కంచుపతకం పొందినది. ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ పోటీలలో, ఈమె కృష్ణాజిల్లా తరఫున పాల్గొని, 14 సంవత్సరాలలోపు విభాగంలో హైజంప్ పోటీలలో ప్రథమస్థానం పొంది, స్వర్ణ పతకం సాధించి, త్వరలో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు నగరంలో నిర్వహించబోవు జాతీయస్థాయి పోటీలలో పాల్గొనడానికి ఎంపికైనది. [7]&[8]
  7. జనజాగృతి సాహిత్య సాంస్కృతిక సంస్థ, రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఆన్‌లైన్‌లో నిర్వహించిన కవితల పోటీలలో, ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ సి.హెచ్.రవికుమార్, ద్వితీయ బహుమతి అందుకున్నారు. వీరు పంపిన "సర్వేపల్లి రాధాకృష్ణ" అను అంశానికి వీరికి ఈ బహుమతి లభించింది. [9]

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

తాడంకిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. పశు వైద్యశాల, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

తాడంకిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్ ఉంది. మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. పబ్లిక్ ఫోన్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

రాష్ట్ర రహదారి గ్రామం గుండా పోతోంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ఏటీఎమ్ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 9 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

తాడంకిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 5 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 418 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 53 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 365 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

తాడంకిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • చెరువులు: 365 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

తాడంకిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, చెరకు

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2013, సెప్టెంబరు-18; 16వపేజీ. [2] ఈనాడు కృష్ణా; 2013, అక్టోబరు-17; 8వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015, అక్టోబరు-8; 25వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015, అక్టోబరు-10; 23వపేజీ. [5] ఈనాడు అమరావతి/పామర్రు; 2016, ఫిబ్రవరి-26; 1వపేజీ. [6] ఈనాడు అమరావతి/పామర్రు; 2016, మే-12; 1వపేజీ. [7] ఈనాడు అమరావతి/పామర్రు; 2016, సెప్టెంబరు-29; 2వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2016, నవంబరు-11; 12వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2020, సెప్టెంబరు-7; 3వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=తాడంకి&oldid=4115473" నుండి వెలికితీశారు