మోదుగ

వికీపీడియా నుండి
(మోదుగ చెట్టు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మోదుగ
STS 001 Butea monosperma.jpg
In Bangalore, India
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): యుడికాట్స్
(unranked): రోసిడ్స్
క్రమం: Fabales
కుటుంబం: ఫాబేసి
జాతి: బుటియా
ప్రజాతి: B. monosperma
ద్వినామీకరణం
Butea monosperma
(Lam.) Taub.
పర్యాయపదాలు

Butea frondosa Roxb. ex Willd.
Erythrina monosperma Lam.[1]
Plaso monosperma

కలకత్తాలో ఒక మోదుగ పువ్వు
మోదుగ చెట్టు

మోదుగ ఒక ఎర్రని పూల చెట్టు. ఈ పువ్వులను అగ్నిపూలు అని పిలుస్తారు. ఇది ఫాబేసి కుటుంబంలో బుటియా ప్రజాతికి చెందిన పుష్పించే మొక్క. దీని శాస్త్రీయ నామం బుటియా మోనోస్పెర్మా (Butea monosperma)

moduga tree at araku

లక్షణాలు[మార్చు]

 • మోదుగ నిటారుగా పెరిగే వృక్షం. ఈ చెట్టు దాదాపు 15 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది నెమ్మదిగా పెరిగే చెట్టు.
 • కంటకిత అగ్రంతో విపరీత అండాకారంలో పత్రకాలు ఉన్న త్రిదళయుత హస్తాకార సంయుక్త పత్రం.
 • శాఖాయుత అనిశ్చిత విన్యాసంలో అమరి ఉన్న నారింజరంగుతో కూడిన ఎర్రని పుష్పాలు.
 • మృదువైన కేశాలతో కప్పబడిన తప్పడగా ఉన్న ద్వివిధారక ఫలాలు.

ప్రాంతీయ భాషల్లో పిలుచు పేర్లు[మార్చు]

ఆవాసం/ఉనికి[మార్చు]

ఈ చెట్టు భారతదేశమంతట వ్యాపించి ఉంది.సముద్రమట్టంనుండి 1200 అడుగుల ఎత్తు వ్యాపించి పెరుగుతుంది.ఈచెట్టు పచ్చిక మైదానాలు/బయలు ప్రదేశాలలోను పెరుగుతుంది.విదేశాలలో పాకిస్తాన్, మయన్మార్, మరియుశ్రీలంకలలో వ్యాప్తి చెందివున్నది..

చెట్టు :

చిన్న, మధ్య తరహ చెట్టు.ఆకురాల్చును.అసౌష్టంగా చెట్టుకొమ్మలు వ్యాపించివుండును.ఎత్తు10-15' అడగుల వరకుండును.పొద వైశాల్యం 5'-6'అడగులవరకుండును.లక్క పురుగులకు అతిథిచెట్టు.చెట్టుయొక్క కలపను ప్యాకింగ్ పెట్టెలను తయారుచేయుటకు, కర్రబొగ్గును తయారుచేయుటకుపయోగింతురు.ఈ చెట్టునుండి ఉత్పత్తిచేసిన బొగ్గును తుపాకిమందు (Gun powder) లో దట్టింపునకుపయోగింతురు.ఈ చెట్టునుండి వచ్చుబంక (gum) ను టానింగ్ (Tanning, రంగులఅద్దకం (dyeing) పరిశ్రమలలో వాడెదరు.కాండం యొక్క బెరడు (Bark) ను కూడా టానింగ్ పరిశ్రమలోనుపయోగింతురు.కాండంయొక్క బెరడునుండి నార (fibre) కూడా తీస్తారు.

పూలు:

పూలు ఫిబ్రవరి-మార్చినెలల్లో పూయును.స్కార్లెట్-ఆరెంజి రంగులో వుండును.నల్లటి గుండ్రని అండకోశంపై పుష్పదళాలు ఏర్పడి వుండును.ఈ పూలు చూచుటకు 'చిలుక ముక్కను'పోలివుండును. దగ్గరదగ్గరగా కొమ్మ అంతట గుత్తులుగా పూయును.పూల పుప్పొడి నుండి అబిర్ (Abir) అనే, హోలి రంగుల్లో కలిపే రంగును తయారుచేయుదురు.పూలమొగ్గలు ముదురు బ్రౌన్ రంగులో వుండును.చెట్టు శిఖరంలో పూలు విస్తరించి ఎర్రగా అగ్నిశిఖవలె వుండటం వలన వీటిని 'Flame of Forest'అంటారు.

పళ్ళు-గింజలు:

కాయలు/పళ్లు ఏప్రిల్ నుండి జూన్ నెల వరకు ఏర్పడును.పొట్టుకాయ (pods) గా ఏర్పడును.కాయ 15-20 సెం.మీ.పొడవుండి,2.2-5 సెం, మీ వెడల్పు (Broad) వుండును.పాలిపోయిన పచ్చరంగులో వుండి, పండినప్పుడు పసుపు ఛాయతోకూడిన బ్రౌన్ రంగులోకి మారును.కాయ పైన తెల్లటి కేశంలవంటి నూగు వుండును.కాయ తేలికగా వుండును.కాయకు వైద్య, ఔషధ గుణాలున్నాయి.గింజలోపలి విత్తనం ఎరుపుతో కూడిన బ్రౌన్ రంగులో, చదునుగా (flat, అండాకారంగా (oval, మూత్రపిండాకారంలో వుండును.గింజలో నూనెశాతం 17-19% వరకుండును.చెట్టునుండి ఒక కేజి విత్తనంసేకరించు వీలున్నది.

మోదుగ నూనె[మార్చు]

ఉపయోగాలు[మార్చు]

 1. మోదుగ జిగురు విరోచనాలలో మరియు డీసెంట్రీ లలో బాగా ఉపయోగపడుతుంది.
 2. పిల్లల్లో వచ్చే విరోచనాలలో బాగా ఉపయోగపదినట్టు పరిశోధకులు చెబుతున్నారు.
 3. మోదుగ గూర్చి ఆయుర్వేదంలో అనేక ఔషధాలుగా ఉపయోగిస్తారు.
 4. యిది కడుపులోఉండే ఎలాంటి క్రిమినైనా హరిస్తుంది.
 5. మోదుగ విత్తనాల్ని పొడిగా చేసి దానిలో కొద్దిగ తేనెని కలిపి తిసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ముఖంగా ఎన్ని మందులకీ లొంగని ఏలికపాములు, టేప్ వర్ములు (బద్ద్ పురుగు) లాంటి మొండి ఘటాలని కూడా మోదుగ చాలా చక్కగా పనిచేస్తుంది.
 6. 1 గ్రాము మోదుగ విత్తనాల పొడిని 1 చెంచా తేనెలో కలిపి రోజూమూడు సార్లు చొప్పున మూడు రోజులు పాటు తీసుకుంటే క్రిములన్నీ చనిపోతాయి. నాల్గవ రోజున విరోనలాలకి మందు తీసుకుంటే యివన్నీ బయటికి వచ్చేస్తాయి.
 7. మోదుగ విత్తనాల పౌడర్ లో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి అగ్జిమాలో రాస్తే ఉపశమనం కనిపిస్తుంది. అలాగే లేమంలో కూడా ఉపయోగకారిగా ఉంటుంది.
 8. పురుగులు పట్టిన పుళ్ళలో మోదుగ విత్తనాల పొడిని వేస్తే ఆ పురుగులు చనిపోతాయి.
 9. మోదుగ ఆకుల పొడి డయాబెటిస్ రోగులు వాడితే షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
 10. రక్తంలో ఇంకా కనిపించకుండా కేవలం మూత్రం లోనే షుగర్ ఉంటే గ్లైకోజ్ యూరియా లాంటి పరిస్థితుల్లో ఇది బాగా ఉపయోగకరంగా ఉన్నట్లు తెలుస్తుంది.
 11. మోదుగ ఆకుల కషాయాన్ని లూకేరియాలో వెజైనల్ డూష్ గా వాడితే బావుంటాయి.
 12. మోదుగ ఆకుల కష్యాన్ని వేడిగా ఉండగానే పుక్కిలిస్తే మౌత్ వాష్ గా ఉపయోగపడుతుంది.

హిందూ సంస్కృతిలో మోదుగ[మార్చు]

మోదుగు ఆకులే కాదు మోదుగు కాడలు, కొమ్మలను సైతం హిందువులు పూజ కార్యాక్రమాల్లో ఉపయోగిస్తారు. ఇంటిలో చేడు పోయి మంచి జరగాలని కోరుకుంటూ.. చేసే యజ్ఞాలు, యాగాలు, హోమాల్లో పూజారులు ముఖ్యంగా ఎండిపోయిన మోదుగు కొమ్మలను విరిచి కాలుస్తారు. వాటి ద్వారా వచ్చే పొగ ఇంట్లో వుండే చేడును సంహారించి మంచి కలిగిస్తుందని హిందువు సంప్రదాయాల్లో నమ్ముతారు. ఇదే కాదు మోదుగు చెట్టుకు పూసే పువ్వును మోదుగు పువ్వు అంటారు. ప్రతియేటా హోలి పండుగకు ముందుగా ఈ పువ్వు చెట్లకు పూస్తుంది. ఈ పువ్వులను హిందువులు ఎంతో పవిత్రమైన పువ్వుగా చూస్తారు. అడవుల్లో మైదానాల్లో వుండే ఈ చెట్లకు పూసే పువ్వులు ఒకరకమైన సువాసతోపాటు అందంగా వుంటాయి. థిక్ ఆరేంజ్ రంగులో కనిపించే ఈ పువ్వులను చూస్తే మనసు ఉప్పోగిపోతుంది. మోదుగు పువ్వులు అంటే పరమశివుడికి అత్యంత ఇష్టం. అందుకే శివాలయాల్లో పూజలు చేసే క్రమంలో పూజారులు మోదుగు పువ్వులను శివుడికి సమర్పిస్తుంటారు. అంతేకాదు మోదుగు పువ్వులో వచ్చే కొద్ది పాటీ నీటి బిందువులను సైతం శివుడికి ప్రితీప్రాతంగా భావిస్తారు. ఇక మోదుగు పువ్వులకు హోొలీ పండుగకు విడదీయరాని బందం ఉంది. కొన్నోళ్ల క్రితం హోలీ పండుగ వస్తుందంటే.. వారం రోజుల ముందుగానే పిల్లలు, యువకులు మోదుగు పువ్వులను తీసుకొచ్చి నీటిలో నానబేట్టేవారు. తర్వాత రేపు హోలీ పండుగ అనగా బాగా ఉడకబెట్టిేవారు. ఉడికిన తర్వాత వచ్చే రంగునీళ్లను చల్లారినంక సీలాల్లో.. డబ్బాల్లో నింపుకునేవారు. హోలీ పండుకు రసాయన రంగుల కన్న మోదుగు పువ్వుల ద్వారా వచ్చే రంగునీళ్లను వాడడంతో చర్మరోగాలు రాకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం చాలా వరకు హోలీ పండుగ రోజు మోదుగు పువ్వుల ద్వారా వచ్చే రంగునీల్లను వాడడం లేదు. కెమికల్ తో తయారయ్యే రంగులను వాడుతున్నారు. దీని ద్వారా చాలా వరకు హోలీ పండుగ రోజు హోలీ ఆడి కంటిలో రంగులు పడేసుకోవడం, చర్మరోగాలకు గురికావడం జరుగుతుంది.

మూలాలు[మార్చు]

 1. "Butea monosperma (Lam.) Taub". Germplasm Resources Information Network. United States Department of Agriculture. 2006-05-18. Retrieved 2009-10-24.
"https://te.wikipedia.org/w/index.php?title=మోదుగ&oldid=2612922" నుండి వెలికితీశారు