యార్లగడ్డ వెంకన్న

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యార్లగడ్డ వెంకన్న చౌదరి (1911 - 1986) ప్రకాశం జిల్లా కారంచేడు వాస్తవ్యుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, మహా దాత మరియు పారిశ్రామిక వేత్త. గణితములో మరియు న్యాయశాస్త్రములో మంచి ప్రవేశము గల మేధావి. ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని ఒక సంవత్సరము జైలు శిక్ష అనుభవించాడు[1]. మద్రాసులోని ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్కు అధ్యక్షునిగా పనిచేశాడు. శంభూ ఫిల్మ్స్ పతాకంపై వెంకన్న నిర్మించిన 'నమ్మిన బంటు' (1960) అనే చలనచిత్రము భారత రాష్ట్రపతి నుండి రజత పతకము పొందింది. స్పెయిన్లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్ర వేడుకలో ప్రదర్శించబడి పలువురి ప్రశంశలు పొందింది.

దాతృత్వం[మార్చు]

వెంకన్న చౌదరి మహా దాత. పలు పాఠశాలకు, కళాశాలలకు భూరి విరాళాలిచ్చాడు. తన తండ్రి పేరిట 'యార్లగడ్డ నాయుడమ్మ ఓరియంటల్ విద్యాలయము' స్థాపించాడు. తిరుపతి, తిరుత్తణి, శ్రీశైలం వంటి దేవస్థానములలో కాటేజీలు, సత్రములు నిర్మించాడు. గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద కాన్సర్ ఇన్స్టిట్యూట్ నకు 30 లక్షల విరాళమిచ్చాడు. భార్య రాజ్యలక్ష్మి పేరిట 1980 నుండి తెలుగువారిలో పేరుప్రఖ్యాతులు పొందిన వ్యక్తులకు పురస్కారములు ఇవ్వబడుచున్నవి.

మూలాలు[మార్చు]

  1. స్వాతంత్ర్య సమరము: Who's who of Freedom Struggle in Andhra Pradesh, 1978, State Committee for the Compilation of the History of the Freedom Struggle in Andhra Pradesh, Ministry of Education and Cultural Affairs, Govt. of Andhra Pradesh, Hyderabad, p. 114