రంజన్ ఘోష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రంజన్ ఘోష్
జననం
వృత్తిదర్శకుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు2011 – ప్రస్తుతంం

రంజన్ ఘోష్ పశ్చిమ బెంగాల్‌ చెందిన సినిమా దర్శకుడు, రచయిత.[1]

జననం, విద్య

[మార్చు]

రంజన్ ఘోష్ పశ్చిమ బెంగాల్‌లో జన్మించాడు. దుర్గాపూర్ లోని సెయింట్ జేవియర్స్ స్కూల్, బిసి ఇన్స్టిట్యూషన్‌లో చదివాడు. ఆ తర్వాత జాదవ్‌పూర్ యూనివర్సిటీలో ఫిజిక్స్ చదవడానికి కలకత్తా వెళ్ళాడు. ఆ చదువును వదిలేసి ముంబై విశ్వవిద్యాలయం నుండి నాటికల్ సైన్సెస్‌లో చేరి, డిగ్రీని పొందాడు.[2] 2007లో ఫిల్మ్ మేకింగ్ అధ్యయనం చేయడానికి ముంబైకు చెందిన ఫిల్మ్ స్కూల్ విస్లింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్‌లో చేరాడు. 2009 లో స్క్రీన్ రైటింగ్‌లో పట్టభద్రుడయ్యాడు.

సినిమారంగం

[మార్చు]

ఫిల్మ్ స్కూల్‌లో ఉన్నప్పుడే నేషనల్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్న 2009 అంతహీన్‌ అనే బెంగాలీ సినిమాకు స్క్రిప్ట్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఆ తర్వాత అదే సినిమా షూటింగ్‌లో దర్శకుడు అనిరుద్ధ రాయ్ చౌదరికి సహాయం చేశాడు. అపర్ణా సేన్ తీసిన ఇతి మృణాళిని సినిమాకి తొలిసారిగా స్క్రీన్ ప్లే రచయిత పరిచయమై, ప్రశంసలు పొందాడు.[3][4][5]

2014లో అబిర్ ఛటర్జీ, రైమా సేన్ నటించిన హృద్ మఝరే అనే బెంగాలీ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.[6][7] ఆ తరువాత రోంగ్‌బెరోంగర్ కోర్హి సినిమా తీశాడు. ఈ సినిమా దుబాయ్,[8] ఢాకా, లండన్, జాతీయ స్థాయిలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణె,[9] హైదరాబాద్‌లలో జరిగిన చిత్రోత్సవాలలో ప్రదర్శించడానికి ముందు 2018లో విడుదలై విస్తృతంగా ప్రశంసలు పొందిన చిత్రంగా నిలిచింది.[10][11][12]

2019లో అహా రే సినిమా తీశాడు. అంతర్జాతీయ చలనచిత్ర వెబ్ మ్యాగజైన్ ఏషియన్ మూవీ పల్స్ సంకలనం చేసిన 25 ఆల్-టైమ్ గ్రేట్ ఆసియా సినిమాల గౌరవనీయమైన జాబితాలో ఈ సినిమా కూడా చేర్చబడింది.[13][14] [15][16]

2022లో మహిషాసుర్ మర్దిని - ఎ నైట్ టు రిమెంబర్ అనే సినిమాను తీశాడు. ఈ సినిమాను జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ , జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలలో ప్రదర్శించారు.[17][18][19] ఇంతకు ముందు న్యూ ఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్ నిర్వహించిన 21వ హేబిటాట్ థియేటర్ ఫెస్టివల్ 2022లో నాటకోత్సవంలో ప్రదర్శించబడిన మొదటి భారతీయ సినిమాగా నిలిచింది.[20][21][22]

సినిమాలు

[మార్చు]
 • అంతహీన్ (2009) (స్క్రిప్టింగ్ అసిస్టెంట్)
 • ఇతి మృణాళిని (2011) (స్క్రీన్ ప్లే రచయిత, డైరెక్టర్ అసిస్టెంట్)
 • హృద్ మఝరే (2014) (స్క్రీన్ ప్లే రచయిత, దర్శకుడు)
 • రోంగ్‌బెరోంగర్ కోర్హి (2018) (స్క్రీన్ ప్లే రచయిత, ప్రొడక్షన్ డిజైనర్, దర్శకుడు)
 • ఆహా రే (2019) (స్క్రీన్ ప్లే రచయిత, ప్రొడక్షన్ డిజైనర్, దర్శకుడు)
 • మహిషాసుర మర్దిని (2022) (స్క్రీన్ ప్లే రచయిత, ప్రొడక్షన్ డిజైనర్, దర్శకుడు)

మూలాలు

[మార్చు]
 1. "There are a million similar stories everywhere because we are all connected: Filmmaker Ranjan Ghosh". cinestaan.com. 10 July 2018. Archived from the original on 10 జూలై 2018. Retrieved 26 జూలై 2023.
 2. "University of Mumbai: Alumni". Archived from the original on 2015-09-04. Retrieved 2023-07-26.
 3. "Seven years of Iti Mrinalini". The Times of India. 29 July 2018.
 4. "Interview with Ranjan Ghosh: I have an enormous interest to explore the human condition, and I guess I have imbibed this from Ray-Ghatak-Sen". asianmoviepulse. 5 February 2020.
 5. "Script is King in any film". Archived from the original on 3 December 2010. Retrieved 2023-07-26.
 6. "Love, and jealousy, 450 years after the Bard – The Times of India". The Times of India. 4 August 2014.
 7. "Many Bengali films are said to be inspired by Bard's works". Business Standard India. Press Trust of India. 13 July 2014.
 8. "Rongberonger Korhi to be screened at the Dubai International Film Festival". The Times of India. 10 July 2018.
 9. "Rongberonger Korhi makes it to the Pune National Film Archive". The Times of India. 24 December 2018.
 10. "Rongberonger Korhi is creating waves all around". The Times of India. 19 December 2018.
 11. "Habitat Film Festival selects Ranjan Ghosh's movie Rongberonger Korhi". gulgal. 10 July 2018. Archived from the original on 10 జూలై 2018. Retrieved 26 జూలై 2023.
 12. "Rongberonger Korhi". biffes. 19 March 2019. Archived from the original on 30 జూలై 2021. Retrieved 26 జూలై 2023.
 13. "25 Great Asian Films about Food". asianmoviepulse. 28 May 2020.
 14. {{Cite web|date=1 August 2020|title=Ranjan Ghosh's Bengali crossover Ahaa Re is a gentle, hope-filled gastronomical romance|url=https://indianexpress.com/article/lifestyle/art-and-culture/ranjan-ghosh-bengali-crossover-ahaa-re-film-6534026/%7Cwebsite=indianexpress}[permanent dead link]
 15. "Ranjan Ghosh's Ahaa Re Starring Rituparna Sengupta, Arifin Shuvoo Is Chosen As Best Films About Food". spotboye. 27 April 2020.
 16. "Rituparna, Ranjan Ghosh talk about Ahaa Re ranking among great Asian films". archive.dhakatribune. 4 May 2020.[permanent dead link]
 17. "JNU screening of 'Mahishasur Marddini' leaves Ranjan emotional". timesofindia.indiatimes]. 16 December 2022.
 18. "Ranjan Ghosh on Mahishasur Marddini's JNU screening". telegraphindia.com. 16 December 2022.
 19. "Special screening of upcoming Bengali feature film Mahishashur Mardini at JMI" (PDF). jmi.ac.in. 30 September 2022.
 20. "Mahishasur Marddini to be screened at IHC Theatre Festival". telegraphindia. 13 September 2022.
 21. "The selection of Mahishasur Marddini at a prestigious theatre festival is pathbreaking: Rituparna Sengupta". [timesofindia.indiatimes. 1 October 2022.
 22. "Ranjan Ghosh: 'Mahishasur Marddini' getting selected at a prestigious theatre fest is really special". timesofindia.indiatimes. 14 September 2022.

బయటి లింకులు

[మార్చు]