రథోత్సవం

వికీపీడియా నుండి
(రథోత్సవము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
జనన్నాథ రథ యాత్ర - పూరీ

రథోత్సవం అనగా రథంపై దేవుని ఊరేగించడం. రథోత్సవంను రథ యాత్ర అని కూడా అంటారు. రథ యాత్ర హిందూవుల పండుగ. ఉత్సవాల సమయంలో వాహనంపై పలు దేవతల ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. రథోత్సవం జరిగే ముందుగా దేవ ఉత్సవ విగ్రహలకు కళ్యాణం జరిపిస్తారు. ఈ కళ్యాణాన్ని కళ్యాణోత్సవం లేదా కళ్యాణ మహోత్సవం అంటారు. కళ్యాణోత్సవం తరువాత స్వామి వారు సతీ సమేతంగా అత్తవారింటికి రథంపై ఊరేగింపుగా వస్తున్నట్టు ఈ ఉత్సవాన్ని భక్తజనులు ఆనందంగా జరుపుకుంటారు.

రథోత్సవం నాడు రథంను బాగా అలంకరిస్తారు, రథంను భక్తులు లాగేందుకు రథానికి మోకు కడతారు. రథయాత్ర ప్రారంభ పూజలు తరువాత జయజయధ్వనాలతో రథయాత్ర నిర్వాహకుని సూచనల మేరకు మోకులను పట్టుకుని భక్తులు రథాన్ని కదలిస్తారు.

భారతదేశం ముఖ్య రథోత్సవాలు[మార్చు]

రథయాత్ర పేరు రథ యాత్ర జరుగు ఊరు/ప్రదేశం ఉత్సవ మూర్తి
జగన్నాథ రథయాత్ర పూరి జగన్నాథ స్వామి (కృష్ణుడు), బలభద్రుడు (బలరాముడు), సుభద్ర
రథోత్సవం తిరుమల మలయప్ప స్వామి (శ్రీనివాసుడి ఉత్సవబేరం)[1]
వీరరాఘవస్వామి రథయాత్ర తిరువళ్ళూరు వీరరాఘవస్వామి
గోవిందరాజస్వామి రథోత్సవం తిరుపతి గోవిందుడు
రంగనాథస్వామి తేరు పులివెందుల రంగనాథస్వామి
తిరుచానూరు పద్మావతి అమ్మవారి రథోత్సవం తిరుచానూరు పద్మావతి
వెంకమ్మ పేరంటాలు పెనమలూరు, (కృష్ణా జిల్లా) వెంకమ్మ గ్రామదేవత

మూలాలు[మార్చు]

  1. బ్రహ్మోత్సవ నాయకునికి బ్రహ్మాండ నీరాజనం - సాక్షి ఫండేలో కథనం

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రథోత్సవం&oldid=3163253" నుండి వెలికితీశారు