రవివర్మ అడ్డూరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రవివర్మ అడ్డూరి
జననం (1975-09-12) 1975 సెప్టెంబరు 12 (వయసు 48)
కాకినాడ, ఆంధ్రప్రదేశ్
ప్రసిద్ధిసినీ నటుడు.
మతంహిందూమతం

రవివర్మ అడ్డూరి (జననం 12 సెప్టెంబర్ 1975) (సంతోష్ కుమార్ వర్మ అడ్డూరి) ఒక భారతీయ నటుడు, దర్శకుడు. ఇతను ప్రధానంగా తెలుగు సినిమాలు సీరియల్స్‌లో పనిచేస్తున్నాడు. "అరుగు పతివ్రతలు" సినిమాతో నటజీవితాన్ని ప్రారంభించిన ఈయన "ఉయ్యాల జంపాలా" సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. టెలివిజన్‌లో, "మొగలిరేకులు" సీరియల్‌లో సెల్వ స్వామి పాత్రను పోషించి ప్రసిద్ధి చెందాడు.[1]

ప్రారంభ జీవితం, విద్య

[మార్చు]

రవివర్మ 12-సెప్టెంబర్-1975న ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ పట్టణంలో జన్మించాడు. ఇతని బాల్యం, పాఠశాల విద్య ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో గడిచింది. సింగపూర్‌లోని ITE లో మెకాట్రానిక్స్‌లో అడ్వాన్స్‌డ్ డిప్లొమా చేసి ఆరున్నరేళ్లు అక్కడే పనిచేశాడు. ఇతను వైజాగ్ సత్యానంద్ ఫిల్మ్ అకాడమీ నుండి నటన, దర్శకత్వం లో శిక్షణ పొందాడు.

కెరీర్

[మార్చు]

రవివర్మ అడ్డూరి 2004లో "EVV సత్యనారాయణ" దర్శకత్వం వహించిన "అరుగురు పతివ్రతలు" అనే తెలుగు సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశాడు. బుల్లితెరపై, "మొగలిరేకులు" సీరియల్‌లో సెల్వ స్వామి పాత్రతో ప్రేక్షకుల మన్ననలు పొందాడు. “ఉయ్యాల జంపాలా” సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. అతను తన కెరీర్‌లో అనేక అవార్డులను గెలుచుకున్నాడు. 2009లో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం "మనసున మనసై" టెలి ఫిలిం కొరకు గాను ఉత్తమ ప్రతినాయకుడిగా "నంది అవార్డు"తో సత్కరించింది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

చిత్రాల జాబితా

[మార్చు]
  1. ఆరుగురు పతివ్రతలు (2004)
  2. కొడుకు (2004)
  3. థంబ్స్ అప్ (2005)
  4. అవునన్నా కాదన్నా (2005)
  5. పందెం (2005)
  6. నిరీక్షణ (2005)
  7. కోకిల (2006)
  8. అడివి బిడ్డలు (2006)
  9. మీ శ్రేయోబిలాషి (2007)
  10. నేరము శిక్ష (2009)
  11. ప్రవరాక్షుడు (2009)
  12. స్వామి రా రా (2013)
  13. ఉయ్యాల జంపాలా (2013)[2][3]
  14. డి కె బోస్ (2013)
  15. రౌడీ ఫెలో (2014)
  16. ఓ మనిషికదా (2014)
  17. బస్తీ (2015)
  18. వేర్ ఈజ్ విద్యా బాలన్ (2015)
  19. దోచేయ్ (2015)
  20. అవును 2 (2015)
  21. ఓక అమ్మాయి తప్పా (2016)
  22. మీకు మీరే మాకు మేమే (2016)
  23. రామ్ NRI (2016)
  24. మరలతెలుపునప్రియ (2016)
  25. ప్రేమిక (2017)
  26. పైసా వసూల్ (2017)
  27. ఒక్క క్షణం (2017)
  28. Fashion designer ladies tailor part 2 (2017)
  29. నన్ను దోచుకుందువటే (2018)
  30. Dear Comrade (2019)
  31. సైరా నర్సింహా రెడ్డి (2019)
  32. దృష్టి (2019)
  33. Rajdooth (2019)
  34. కళాకారుడు (2020)
  35. బుచ్చి నాయుడు కండ్రిగ (2020)[4]
  36. నాంది (2021)
  37. తెల్లవారితే గురువారం (2021)
  38. Shekar (2022)
  39. అల్లూరి (2022)[5]
  40. ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం (2022)
  41. 18 పేజెస్ (2022)
  42. మళ్ళీ పెళ్లి (2023)
  43. ప్రత్యర్ధి (2023)[6]
  44. సింధూరం (2023)
  45. హిడింబ (2023)
  46. ఏందిరా ఈ పంచాయితీ (2023)
  47. కలశ (2023)
  48. పిండమ్ (2023)
  49. నా సామి రంగా (2024)

తమిళంలో సినిమాలు

[మార్చు]
  1. రా రా సరసకు రా రా (2023)

వెబ్ సిరీస్

[మార్చు]
  1. 3 Roses

సీరియల్స్

[మార్చు]
  1. త్రిశూలం
  2. సంధ్యారాగం
  3. మేఘసందేశం
  4. అగిరేపావురం
  5. సావిరహే
  6. చంద్రముఖి
  7. హృదయం
  8. స్రవంతి
  9. మంధర
  10. మొగలిరేకులు
  11. మమతలకోవెల
  12. అనుబంధాలు
  13. బృందావనం
  14. అగ్నిపువ్వులు
  15. రాజా రాణి

షార్ట్ ఫిల్మ్స్

[మార్చు]
  1. ఓంకారం (2 నంది అవార్డులు పొందారు)
  2. కర్త కర్మ క్రియ
  3. లడ్డూ (4 నంది అవార్డులు & 30+ జాతీయ, అంతర్జాతీయ నామినేషన్లు & అవార్డులు పొందాడు)
  4. శాంతి సుభ్రమణ్యం
  5. నన్నుక్షమించండి (60+ జాతీయ, అంతర్జాతీయ నామినేషన్లు & అవార్డులు పొందాడు)

మూలాలు

[మార్చు]
  1. "Ravi Varma Adduri : Biography, Age, Movies, Family, Photos, Latest News". Filmy Focus (in ఇంగ్లీష్). Retrieved 2024-01-30.
  2. kavirayani, suresh (2013-12-28). "'Uyyala Jampala' Review: A predictable love story narrated well". www.deccanchronicle.com (in ఇంగ్లీష్). Retrieved 2024-02-07.
  3. "Uyyala Jampala review - Telugu cinema review - Raj Tarun, Avika Gor/Anandi, Ravi Varma, Anita, Punarnavi Bhupalam, Peela Gangadhar, Alluri Hanuma, Kireeti Dammaraju etc". www.idlebrain.com. Retrieved 2024-02-07.
  4. "BucchiNaidu Kandriga Telugu Movie Review". 123telugu.com (in ఇంగ్లీష్). 2020-08-22. Retrieved 2024-02-07.
  5. "Alluri Movie Review : Sri Vishnu gives his best in this lengthy action-packed saga". The Times of India. ISSN 0971-8257. Retrieved 2024-02-07.
  6. "Review : Prathyardhi - Crime thriller that works only in parts". 123telugu.com (in ఇంగ్లీష్). 2023-01-06. Retrieved 2024-02-07.