రస్సెల్ ఆర్నాల్డ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రస్సెల్ ఆర్నాల్డ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రస్సెల్ ప్రేమకుమారన్ ఆర్నాల్డ్
పుట్టిన తేదీ (1973-10-25) 1973 అక్టోబరు 25 (వయసు 50)
కొలంబో, శ్రీలంక
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబ్యాట్స్ మాన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 68)1997 ఏప్రిల్ 19 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు2004 జూలై 1 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 91)1997 నవంబరు 6 - దక్షిణాఫ్రికా తో
చివరి వన్‌డే2007 ఏప్రిల్ 28 - ఆస్ట్రేలియా తో
ఏకైక T20I (క్యాప్ 1)2006 జూన్ 15 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20I
మ్యాచ్‌లు 44 180 1
చేసిన పరుగులు 1,821 3,950 7
బ్యాటింగు సగటు 28.01 35.26 7.00
100s/50s 3/10 1/28 0/0
అత్యధిక స్కోరు 123 103 7
వేసిన బంతులు 1,334 2,157
వికెట్లు 11 40
బౌలింగు సగటు 54.36 43.47
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 3/76 3/47
క్యాచ్‌లు/స్టంపింగులు 51/– 48/– 0/–
మూలం: Cricinfo, 2016 మే 2

రస్సెల్ ప్రేమకుమారన్ ఆర్నాల్డ్ (జననం 1973, అక్టోబరు 25), తమిళ సంతతికి చెందిన శ్రీలంక మాజీ క్రికెటర్. ఇతను క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లలో ఆడాడు.[1][2] అంతర్జాతీయ స్థాయిలో శ్రీలంక జట్టు బ్యాటింగ్ చేయడంలో ఫినిషర్ పాత్ర పోషించాడు.[3] ప్రస్తుతం అంతర్జాతీయ వ్యాఖ్యాతగా పనిచేస్తున్నాడు. శ్రీలంక మొట్టమొదటి టీ20 జట్టులో భాగంగా ఉన్న ఇతను శ్రీలంకకు మొదటి ట్వంటీ 20 అంతర్జాతీయ క్యాప్ అందుకున్నాడు. 2007 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్‌లో ఫైనల్ ఆడిన తర్వాత 2007లో క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు.[4][5]

జీవితం తొలి దశలో[మార్చు]

తన తాత ప్రోత్సాహంతో క్రికెట్ లోకి వచ్చిన ఆర్నాల్డ్‌, కొలంబోలోని సెయింట్ పీటర్స్ కళాశాలలో పాఠశాల క్రికెట్ ఆడాడు. అక్కడ ప్రాథమిక, మాధ్యమిక విద్యను అభ్యసించాడు. శ్రీలంక అండర్ 19 క్రికెట్ జట్టుకు ఆడాడు. 1992లో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్ పర్యటనలో ఆకట్టుకున్నాడు. 48.40 సగటుతో 242 పరుగులు చేశాడు. 20 సంవత్సరాల వయస్సులో 1993లో తొలిసారిగా దేశవాళీ క్రికెట్‌కు వచ్చాడు.[6]

అంతర్జాతీయ కెరీర్[మార్చు]

1997 ఏప్రిల్‌లో పాకిస్తాన్‌పై తన తొలి టెస్టును, ఆ తర్వాత నవంబరు 6న దక్షిణాఫ్రికాపై వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.[7][8][9]

పదవీ విరమణ[మార్చు]

2007 ఏప్రిల్ లో 2007 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అవుతానని టీమ్ మేనేజర్ మైఖేల్ టిస్సెరా ద్వారా ప్రకటించాడు.[10][11]

పదవీ విరమణ తర్వాత హార్న్స్‌బై డిస్ట్రిక్ట్ క్రికెట్ క్లబ్ కోసం సిడ్నీలో ఎ-గ్రేడ్ క్రికెట్ ఆడాడు. మెల్‌బోర్న్‌లోని మెల్‌బోర్న్ సూపర్ కింగ్స్ తరపున కూడా ఆడాడు. ఇండియన్ క్రికెట్ లీగ్‌లో చెన్నై సూపర్ స్టార్స్ తరపున కూడా ఆడాడు.[12] సిడ్నీ ఉత్తరాన ఉన్న ఒక ప్రతిష్టాత్మకమైన ప్రైవేట్ పాఠశాల అయిన బార్కర్ కాలేజీలో శిక్షణ పొందాడు. ఐపిఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా కూడా ఉన్నాడు.

మూలాలు[మార్చు]

  1. "Russel Arnold Profile – ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-01.
  2. "Russel Arnold profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-01.
  3. "Russel recalls". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-01.
  4. "Where are Herath's team-mates from his 1999 Test debut?". ESPN Cricinfo. 5 November 2018. Retrieved 13 March 2019.
  5. "Arnold to quit after the World Cup". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-01.
  6. "Russel Arnold: 17 facts about former Sri Lankan cricketer-turned-commentator". Cricket Country. 2015-10-25. Retrieved 2023-09-01.
  7. "Russel says changes should be made | The Sunday Times Sri Lanka". Retrieved 2023-09-01.
  8. "Full Scorecard of Sri Lanka vs Pakistan 1st Test 1996/97 – Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-01.
  9. "Full Scorecard of South Africa vs Sri Lanka 6th Match 1997/98 – Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-01.
  10. "Arnold handed World Cup opportunity". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-01.
  11. "Arnold and Chandana handed World Cup lifeline". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-01.
  12. Sygall, David (2008-02-17). "Arnold: It was an offer I couldn't refuse". The Sydney Morning Herald (in ఇంగ్లీష్). Retrieved 2023-09-01.

బాహ్య లింకులు[మార్చు]