రాజీవ్ భరద్వాజ్
రాజీవ్ భరద్వాజ్ | |||
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 4 జూన్ 2024 | |||
ముందు | కిషన్ కపూర్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | కాంగ్రా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మంగ్వాల్, కాంగ్రా జిల్లా, హిమాచల్ ప్రదేశ్ | 1963 ఫిబ్రవరి 9||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | ఎన్‌డీఏ | ||
తల్లిదండ్రులు | ఓ.పి. భరద్వాజ్, పుష్పా భరద్వాజ్ | ||
జీవిత భాగస్వామి | పర్వీన్ భరద్వాజ్ | ||
నివాసం | జస్సూర్, నూర్పూర్, కాంగ్రా జిల్లా, హిమాచల్ ప్రదేశ్ | ||
వృత్తి |
|
డాక్టర్ రాజీవ్ భరద్వాజ్ (జ. 9 ఫిబ్రవరి 1963) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రా లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]రాజీవ్ భరద్వాజ్ 1962 నవంబరు 25న హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో ఓ.పి. భరద్వాజ్, పుష్పా భరద్వాజ్ దంపతులకు జన్మించాడు. అహ్మదాబాద్‌లోని గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీని, ఆ తరువాత రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీని పూర్తి చేశాడు.[3]
రాజకీయ జీవితం
[మార్చు]రాజీవ్ భరద్వాజ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌తో తన రాజకీయ జీవితం ప్రారంభించి ఆ తర్వాత 1989లో బీజేపీలో చేరి ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, 2008 నుండి 2012 వరకు హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా, కాంగ్రా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్‌లో ఛైర్మన్‌గా పని చేసి 2019లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రా శాసనసభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి దీపేంద్ర సింగ్ హుడాపై 7503 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రా లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ శర్మపై 251895 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Kangra". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
- ↑ The Indian Express (28 May 2024). "'Depot Bazar-wale doctor' Rajeev Bhardwaj, BJP's Kangra candidate, sees himself as a Pong Dam evictee" (in ఇంగ్లీష్). Archived from the original on 28 June 2024. Retrieved 22 July 2024.
- ↑ India Today (13 July 2024). "Doctors | Healthy corps" (in ఇంగ్లీష్). Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
- ↑ TV9 Bharatvarsh (5 June 2024). "कौन हैं राजीव भारद्वाज? जिन्होंने 251895 वोटों से जीती कांगड़ा सीट". Retrieved 22 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Economic Times (6 June 2024). "Bullish Wins & Bearish Losses: Here are the key contests and results of 2024 Lok Sabha polls". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.