Coordinates: 28°38′26″N 77°14′58″E / 28.640550°N 77.249433°E / 28.640550; 77.249433

రాజ్ ఘాట్, తదితర స్మారక స్థలాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

28°38′26″N 77°14′58″E / 28.640550°N 77.249433°E / 28.640550; 77.249433

రాజ్ ఘాట్, ఢిల్లీ

రాజ్ ఘాట్ అనునది 1948, 31 జనవరిన మహాత్మా గాంధీ అంత్యక్రియలు జరిగిన చోట నల్లని పాలరాతితో కట్టబడిన స్మారక స్థలము. ఢిల్లీలో యమునానదీ తీరాన ఉన్న ఈ ఆరుబయలు కట్టడము వద్ద ఒక అనంతజ్వాల అవిశ్రాంతముగా ప్రజ్వలిస్తూ ఉంటుంది. పచ్చికబయళ్ళగుండా వెళ్ళు ఒక రాతి కాలిబాట ద్వారా చుట్టుగోడల మధ్య ఉన్న ఈ స్మారక స్థలాన్ని చేరవచ్చు. మహాత్మా గాంధీ ఆఖరి మాటలుగా భావించబడే హే రామ్ అను అక్షరాలు ఇక్కడి సమాధి పై దేవనాగరి లిపిలో చెక్కబడి ఉన్నాయి. ఆయనకు అంకితమొనర్చబడిన రెండు సంగ్రహశాలలు ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాయి.

భారతదేశ పర్యటనకు విచ్చేసిన విదేశీ అధికారులు రాజ్ ఘాట్ వద్ద పుష్పగుఛ్ఛం ఉంచి నివాళులర్పించటం ఒక సాంప్రదాయంగా మారింది. పర్యాటకులు విధిగా స్మారక స్థలాన్ని సందర్శించబోయేముందు తమ పాదరక్షలను గౌరవసూచకంగా తొలగించాలి. గాంధీ మరణించిన రోజుకు గుర్తుగా ఇక్కడ ప్రతి శుక్రవారం స్మారకోత్సవాలు జరుగుతాయి. ప్రతి గాంధీ జయంతి, వర్థంతుల సందర్భములో రాజ్ ఘాట్ వద్ద భజన కార్యక్రమాలు నిర్వహింపబడతాయి.

భారతదేశ పర్యటనకు విచ్చేసిన రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సతీమణి ల్యూద్మిలాతో కూడి రాజ్ ఘాట్ వద్ద పుష్పగుఛ్ఛం ఉంచుతున్న దృశ్యం; తేదీ: 3 అక్టోబర్, 2000

రాజ్ ఘాట్ అను మాటకు రాజ్య సదనం అనునది అర్థముగా భావించవచ్చు (ఇక్కడ "రాజ్య" అను పదము ఆ స్థలం యొక్క ప్రాముఖ్యాన్ని సూచిస్తోంది). యమునానదీ తీరంలోనే రాజ్ ఘాట్ సమీపంలో ఇతర ప్రముఖ నాయకుల సమాధులు, స్మారక స్థలాలు ఉన్నాయి. భారత వ్యవసాయ ఉద్యానవన సంఘానికి (Agri Horticultural Society of India) కార్యదర్శిగా, భారత ప్రభుత్వమందు ఉద్యానవన కార్యక్రమాలకు నిర్వాహకునిగా (Superintendent of Horticultural Operations) పనిచేసిన ఆఖరి ఆంగ్లేయుడైన సిడ్నీ పెర్సీ-లాంకాస్టర్ ఈ స్మారకస్థలికి రూపకల్పన చేసారు.

రాజ్ ఘాట్ కి ఉత్తరాన శాంతివన్ పేరుతో జవహర్‌లాల్ నెహ్రూ సమాధి ఉంది. దేశదేశాల అధ్యక్షులు, అధికారులు నాటిన మొక్కలతో కూడిన ఒక చక్కని ఉద్యానవనం ఇక్కడ ఉంది. నెహ్రూ మనవడైన సంజయ్ గాంధీ సమాధి నెహ్రూ సమాధి పక్కనే ఉంది.

ఈ దిగువ రాజ్ ఘాట్, పరిసర స్మారక స్థలాల పట్టిక ఇవ్వడమైనది (నాయకులు మరణించిన వరుస క్రమములో) : -

నాయకుని పేరు స్వతంత్ర భారతావనిలో

అధిరోహించిన అత్యుత్తమ

రాజకీయ స్థానం

స్మారక స్థలం పేరు అర్థము విశేషము
మహాత్మా గాంధీ --- రాజ్ ఘాట్ రాజ్య సదనం నల్లని పాలరాతి తాపడము
జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రి శాంతివన్ ప్రశాంత ఉద్యానవనము పచ్చికబయళ్ళ మధ్య ఒక దిమ్మె
లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి విజయ్ ఘాట్ విజయ పథము ఇక్కడ "విజయ" అను పదము

ఆయన నాయకత్వములో 1965లో

జరిగిన భారత-పాక్ యుద్ధాన్ని సూచిస్తోంది

సంజయ్ గాంధీ లోక్‌సభ సభ్యుడు --- --- శాంతివన్లో నెహ్రూ సమాధి పక్కన ఉన్నది
ఇందిరా గాంధీ ప్రధానమంత్రి శక్తి స్థల్ శక్తి పీఠం ఒక పెద్ద బూడిద-ఎరుపు ఏకశిలా రాయి
జగ్జీవన్ రాం ఉప ప్రధానమంత్రి సమ్తా స్థల్ సమతా స్థలి ---
చరణ్ సింగ్ ప్రధానమంత్రి కిసాన్ ఘాట్ రైతు పథము ---
రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి వీర్ భూమి వీరుల గడ్డ ఆయన జీవించినన్ని ఏళ్ళకు గుర్తుగా 46

చిన్న తామరపువ్వుల రాతిబొమ్మల మధ్య

రాతితో చెక్కబడిన పెద్ద వికసించిన కమలం;

చుట్టూ భారతదేశములోని అన్ని రాష్ట్రాలనుండి

తీసుకువచ్చిన రాళ్ళు ఉంటాయి

జ్ఞాని జైల్ సింగ్ భారత రాష్ట్రపతి ఏక్తా స్థల్ ఐక్యతా స్థలి ---
శంకర్ దయాళ్ శర్మ భారత రాష్ట్రపతి --- --- విజయ్ ఘాట్కు దగ్గరలో ఉన్నది
దేవీలాల్ ఉప ప్రధానమంత్రి --- --- కిసాన్ ఘాట్కు దగ్గరలో ఉన్నది

బయటి లింకులు[మార్చు]