జనవరి 31
(31 జనవరి నుండి దారిమార్పు చెందింది)
జనవరి 31, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 31వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 334 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 335 రోజులు).
<< | జనవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1943: రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైన్యాలు రష్యా లోని స్టాలిన్గ్రాడ్ వద్ద రష్యా సైన్యానికి లొంగిపోయాయి.
- 1953: శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువుని వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులు 1953లో తిరిగి ముద్రించదలచారు. ఈ బృహత్తర కార్యం కోసం వీరు ఎస్.నారాయణ అయ్యంగార్, వేదం లక్ష్మీనారాయణ శాస్త్రి సమున్నత కృషిచేశారు. వీరి ప్రచురణ 1953 జనవరి 31లో ప్రచురించబడింది. ఈ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు మొదటిసారిగా 1900 సంవత్సరంలో మద్రాసు నుండి ప్రచురించబడింది. చూడు : పి.శంకరనారాయణ
- 1963: నెమలిని జాతీయ పక్షిగా భారత్ ప్రకటించింది.
- 1972: నేపాల్ రాజుగా బీరేంద్ర అధికారంలోకి వచ్చాడు.
- 2009: ఆస్ట్రేలియన్ ఓపెన్ బాలుర విభాగంలో భారత్ కు చెందిన యూకీ బాంబ్రీ టైటిల్ నెగ్గి ఆస్ట్రేలియన్ ఓపెన్ జూనియర్ టైటిల్ పొందిన తొలి భారతీయుడిగా అవతరించాడు.
జననాలు
[మార్చు]- 1763: జెన్స్ ఎస్మార్క్ డానిష్-నార్వేయిన్ భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు. ప్రపంచవ్యాప్త మంచు యుగాల క్రమాన్ని వివరించాడు. (మ.1839)
- 1895: రాగ్నర్ ఫ్రిష్, ఆర్థికవేత్త
- 1905: కందుకూరి రామభద్రరావు, తెలుగు రచయిత, కవి, అనువాదకుడు. (మ.1976)
- 1927: రావెళ్ళ వెంకట రామారావు, తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (మ.2013)
- 1972: కళ్యాణ్ మాలిక్ , గాయకుడు,సంగీత. దర్శకుడు
- 1974: రక్ష, భారత సినీ నటి.
- 1974: వనమాలి, వర్థమాన సినీ గీత రచయిత.
- 1975: ప్రీతీ జింటా , తెలుగు, హిందీ నటి
మరణాలు
[మార్చు]- 1626: సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, గోల్కొండను పరిపాలించిన కుతుబ్షాహీ వంశమునకు చెందిన ఆరవ చక్రవర్తి.
- 1961: అమ్జద్ హైదరాబాదీ; తెలంగాణకు చెందిన ఉర్దూ కవి. (జ. 1888)
- 1666: షాజహాన్, మొఘల్ సామ్రాజ్యపు ఐదవ చక్రవర్తి. (జ.1592)
- 1969: మెహర్ బాబా, అవతార్, (జ.1894)
- 1972: మహేంద్ర, నేపాల్ రాజు.
- 1973: రాగ్నర్ ఫ్రిష్, ఆర్థికవేత్త .
- 2003: మేకా రంగయ్య అప్పారావు, నూజివీడు జమిందారీ కుటుంబానికి చెందిన విద్యావేత్త, మాజీ మంత్రి
- 2009: నగేష్, దక్షిణ భారతదేశానికి చెందిన హాస్యనటుడు, రంగస్థల నటుడు (జ.1933).
- 2017: అబ్బూరి గోపాలకృష్ణ, బహుముఖ ప్రజ్ఞాశాలి. (జ. 1936)
- 2022: భరత్ భూషణ్, తెలంగాణ చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్ (జ. 1953)
- 2024: అనిల్ బాబర్, శివసేనకు చెందిన మహారాష్ట్ర మాజీ శాసనసభ్యుడు. (జ.1950)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- నౌరు దేశ స్వాతంత్ర్యం దినోత్సవం
- వీధి బాలల దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]జనవరి 30 - ఫిబ్రవరి 1 - డిసెంబర్ 31 - ఫిబ్రవరి 28 - (ఫిబ్రవరి 29) -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |