రాజా మలయసింహ
స్వరూపం
(రాజ మలయ సింహ నుండి దారిమార్పు చెందింది)
'రాజా మలయసింహ' తెలుగు చలన చిత్రం1959 ఫిబ్రవరి 27,న విడుదల.విక్రం ప్రొడక్షన్స్ పతాకంపై బి.ఎస్.రంగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రంజన్,రాజసులోచన, షావుకారు జానకి, పద్మనాభం,మొదలగు వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం విశ్వనాథన్, రామమూర్తి అందించారు .
రాజమలయసింహ (1959 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బి.యస్. రంగా |
రచన | అనిశెట్టి |
తారాగణం | రంజన్, రాజనాల, షావుకారు జానకి, రాజసులోచన, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, పి.హేమలత, బి.పద్మనాభం |
సంగీతం | విశ్వనాథన్ - రామమూర్తి, జి.కె.వెంకటేష్(సహాయకుడు) |
నేపథ్య గానం | పి.సుశీల, జానకి, జమునారాణి, రాజేశ్వరి, పి.నాగేశ్వరరావు, పి.బి.శ్రీనివాస్, మాధవపెద్ది సత్యం, విశ్వనాధన్, జి.కె.వెంకటేష్ |
నృత్యాలు | ఏ.కె.చోప్రా |
గీతరచన | అనిశెట్టి |
నిర్మాణ సంస్థ | విక్రమ్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- రంజన్ - రాజు
- శ్రీరామ్ - అజయ్
- రాజనాల - ప్రతాప్
- షావుకారు జానకి - మాలతి
- రాజసులోచన - యువరాణి చిత్రలేఖ
- కె.ఎస్.అంగముత్తు - సుగంధి
- సూర్యకళ - కామిని
- సి.ఎస్.ఆర్. ఆంజనేయులు - హిందూ మహారాజు
- పి.హేమలత - మనోరమ
- బి.పద్మనాభం - మాధవ
- డా. శివరామకృష్ణయ్య - బోండయ్య
- వంగర - భైరవసింహం
- రామకోటి - మాంత్రిక సహాయకుడు
- గణపతి భట్ - మలయా రాజు
- వ.విశ్వనాథం - ధర్మకీర్తి
- ప్రకాశరావు - రఘుపతి
- లీలావతి
పాటలు
[మార్చు]- ఆనందసీమలో అందాల భామతో సయ్యాటలాడరావయా, రచన: అనిశెట్టి, గానం. జమునా రాణి
- ఏమనందు గోపాలుని లీల రేపల్లెయంత ఒకటే గోల, గానం. రాజేశ్వరి
- ఆశే విరిసే మనసే కలిసే నవ జీవనమే పలియించెనులే, గానం.పి.బి.శ్రీనివాస్, పి సుశీల
- ఒరన్నా మోసపు కాలము మాయాజాలం మంచికిదే, గానం: పిఠాపురం, పి.బి.శ్రీనివాస్ బృందం
- కత్తికన్నా కలంమిన్నా కనులు తెరచి చూడుమన్నా కలకాలపు, గానం.శిష్ట్లా జానకి, పిఠాపురం
- చినవాడా ఓవన్నెకాడా సొగసైన ముద్దులమామా, గానం.మాధవపెద్ది సత్యం
- జయ జయ భారత వీరుడా జయ స్వాతంత్ర్యయోధుడా, గానం.పిఠాపురం బృందం
- తక తై తై తై అందములన్నీ నీకే విందులివేరా సుందరి మదిలో, రచన: అనిశెట్టి, గానం.పి.సుశీల
- నందారే నారి ముద్దుగుమ్మ హరే చెలి ఏమి, గానం. మాధవపెద్ది , కె. జమునా రాణి బృందం.
- మొగమే చూసి మోసపోదువా తులువా పలువా, గానం.మాధవపెద్ది, పిఠాపురం బృందం
- వెన్నెలయే హాయి తలపించేనోయీ మధుర మధుర మొహంలో , గానం.రాజేశ్వరి
- సంగీత సాహిత్యలీల అదే జగముల నూగింపు సమ్మోహన, రచన: అనిశెట్టి, గానం.పి.సుశీల