Jump to content

రాహుల్ శర్మ

వికీపీడియా నుండి
రాహుల్ శర్మ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రాహుల్ శర్మ
పుట్టిన తేదీ (1986-07-20) 1986 జూలై 20 (వయసు 38)
న్యూఢిల్లీ
ఎత్తు6 అ. 4 అం. (1.93 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగులెగ్‌బ్రేక్ గూగ్లీ
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 193)2011 డిసెంబరు 8 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2012 ఫిబ్రవరి 5 - ఆస్ట్రేలియా తో
తొలి T20I (క్యాప్ 41)2012 ఫిబ్రవరి 1 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2012 ఫిబ్రవరి 3 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006–presentపంజాబ్
2010డెక్కన్ ఛార్జర్స్
2011–2013పుణె వారియర్స్ ఇండియా
2014ఢిల్లీ డేర్‌డెవిల్స్
2015చెన్నై సూపర్ కింగ్స్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్ డే ట్వంటీ20 ఫస్ట్-క్లాస్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 4 2 21 25
చేసిన పరుగులు 1 538 97
బ్యాటింగు సగటు 1.00 18.55 8.08
100లు/50లు 0/0 0/3 0/0
అత్యుత్తమ స్కోరు 1 95 31
వేసిన బంతులు 206 44 3,514 1206
వికెట్లు 6 3 39 40
బౌలింగు సగటు 29.50 18.66 51.58 22.45
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/43 2/29 6/92 4/28
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 0/– 17/– 12/–
మూలం: Cricinfo, 2012 డిసెంబరు 18

రాహుల్ శర్మ, ఢిల్లీకి చెందిన క్రికెట్ ఆటగాడు. కుడిచేతి వాటం లెగ్‌బ్రేక్, గూగ్లీ బౌలర్ గా రాణించాడు. 2006 నుంచి పంజాబ్ క్రికెట్ జట్టులో సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2011లో పూణే వారియర్స్ తరఫున తన అద్భుతమైన బౌలింగ్ తో గుర్తింపు పొందాడు.

జననం

[మార్చు]

రాహుల్ శర్మ 1987, జూలై 20న ఢిల్లీలో జన్మించాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

మీడియం పేసర్‌గా ప్రారంభించిన రాహుల్, అతని కోచ్ సూచించిన విధంగా లెగ్ స్పిన్ వైపు మళ్ళాడు.[1] 2006 డిసెంబరు 25నన పంజాబ్ తరపున రాజస్థాన్‌పై ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసాడు. కానీ మళ్ళీ తనకి 2009 వరకు ఆడే అవకాశం రాలేదు. రంజీ ట్రోఫీ 2009-10 సీజన్‌లో, ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 13 వికెట్లు తీశాడు. 2010–11 సీజన్‌లో ఒకేఒక్క రంజీ మ్యాచ్ ఆడాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్

[మార్చు]

2010లో డెక్కన్ ఛార్జర్స్ తరపున ఐపిఎల్ లోకి అరంగేట్రం చేశాడు. డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడిన ఆరు మ్యాచ్‌లలో కేవలం ఐదు వికెట్లు తీయడంతోపాటు ఓవర్‌కు 8.08 పరుగులు ఇచ్చాడు. 2011 ఐపిఎల్ లో పూణే వారియర్స్ తరపున కొన్ని మంచి బౌలింగ్ ప్రదర్శనలతో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు. ముంబై ఇండియన్స్‌పై 4-0-7-2 గణాంకాలతో 2011 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత పొదుపుగా ఆడాడు. భారత్‌లో ట్విట్టర్‌లో అతని పేరు ట్రెండ్‌ని చూడటానికి ఈ ప్రదర్శన తగినంత సంచలనాన్ని సృష్టించింది.[2][3][4] 2015లో ఐపీఎల్ 8 వేలంలో రాహుల్ శర్మను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

2011 డిసెంబరు 8న వెస్టిండీస్‌తో జరిగిన 4వ వన్డేలో భారతదేశం తరపున తన వన్డే అరంగేట్రం చేసి మూడు వికెట్లు తీశాడు. ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు బౌల్డ్ అయ్యారు. అదే మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ వన్డేల్లో అత్యధిక స్కోరు (219) నమోదు చేశాడు.

2012 ఫిబ్రవరి 5న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ఇంటర్నేషనల్స్‌లో రాహుల్ తన మొదటి పరుగును సాధించాడు. అతను 2 బంతుల్లో 1 పరుగు సాధించి జేవియర్ డోహెర్టీ బౌల్డ్ అయ్యాడు.[5]

2012 ఫిబ్రవరి 1న ప్రస్తుతం ఎ.ఎన్.జెడ్. స్టేడియంగా పిలువబడే స్టేడియం ఆస్ట్రేలియా/సిడ్నీ ఒలింపిక్ పార్క్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో 1వ టీ20లో భారతదేశం తరపున తన ట్వంటీ20 అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. తన మొదటి ఓవర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు అతని వేలికి గాయమైంది, అయితే బౌలింగ్ కొనసాగించడానికి తర్వాత తిరిగి వచ్చాడు. మొదటి ట్వంటీ 20 అంతర్జాతీయ వికెట్ డేవిడ్ హస్సీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

బెల్ పాల్సి

[మార్చు]

రాహుల్ శర్మ[6] ఐపిఎల్ 2010 సిరీస్ ప్రారంభానికి కొన్నిరోజులముందు బెల్స్ పాల్సీ అనే ఒక రకమైన ముఖ పక్షవాతంతో బాధపడ్డాడు.

వివాదాలు

[మార్చు]

రేవ్ పార్టీలో డ్రగ్స్ సేవించినట్లు పరీక్షించిన వేన్ పార్నెల్‌తోపాటు రాహుల్ శర్మ కూడా పట్టుబడ్డాడు.[7] రేవ్ పార్టీ గురించి తనకు ఎలాంటి క్లూ లేదని, పుట్టినరోజు వేడుకకు హాజరయ్యేందుకు అక్కడికి వెళ్ళానని ఆ తర్వాత చెప్పాడు.[8]

మూలాలు

[మార్చు]
  1. "Warriors' lone beacon". Hindustan Times. 2011-05-06. Archived from the original on 21 October 2012. Retrieved 2023-08-14.
  2. "John Doe finds his identity". ESPNcricinfo. Retrieved 2023-08-14.
  3. "Rahul Sharma: This IPL's star bowler battles nerve disorder to spin success story". The Indian Express. 2011-05-06. Retrieved 2023-08-14.
  4. "Rahul Sharma benefits from Harbhajan tips". ESPNcricinfo. Retrieved 2023-08-14.
  5. "Rahul Sharma left out of Indian team for first ODI against Sri Lanka". The Times of India. 21 July 2012. Archived from the original on 26 January 2013.
  6. "Rahul Sharma: The man who stared adversity in the eye | Indian Premier League 2011". ESPNcricinfo. Retrieved 2023-08-14.
  7. "Rave party: Rahul Sharma faces arrest after testing positive for drugs - Indian Express".
  8. "Had no clue about the rave party: Rahul Sharma".

బయటి లింకులు

[మార్చు]