రుద్రవీణ (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రుద్రవీణ
కృతికర్త: దాశరథి కృష్ణమాచార్య
అంకితం: తెలంగాణ
దేశం: భారత దేశం
భాష: తెలుగు
ప్రక్రియ: ఖండకావ్యం
ప్రచురణ: చిలుకూరి శ్రీరాములు
విడుదల: 1950
పేజీలు: 30

రుద్రవీణ పుస్తకం ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్య వ్రాసిన ఖండ కావ్యం.

రచన నేపథ్యం

[మార్చు]

రుద్రవీణ ఖండకావ్యాన్ని చిలుకూరు శ్రీరాములు 1950లో ప్రచురించారు. స్వతంత్ర తదితర పత్రికలలో ఈ ఖండకావ్యంలోని కవితలు ప్రచురితమయ్యాయి.[1] రుద్రవీణ కావ్యాన్ని దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణకు అంకితం చేశారు.

గ్రంథకర్త గురించి

[మార్చు]

ప్రధానవ్యాసం: దాశరథి కృష్ణమాచార్య
దాశరథి కృష్ణమాచార్యులు ప్రముఖ కవి, నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, సినీ గేయకర్త. యువకునిగా ఉన్నప్పుడే దాశరథి ఆంధ్రమహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం విధించిన జైలు శిక్ష అనుభవించాడు. నిజామాబాదు లోని ఇందూరు కోటలో ఆయన్ని మరో 150 మందితో ఖైదు చేసి ఉంచింది, నిజాము ప్రభుత్వం. ఆయనతోపాటు ఖైదులో వట్టికోట ఆళ్వారుస్వామి కూడా ఉన్నాడు. పళ్ళు తోముకోవడానికిచ్చే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బలు తిన్నాడు. మంచి ఉపన్యాసకుడు. భావప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో ఒకడు. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడుగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించాడు. ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా 1977 ఆగష్టు 15 నుండి 1983 వరకు పనిచేసాడు. రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు గెల్చుకున్నాడు. అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మీర్జాగాలిబ్ ఉర్దూ గజళ్ళను తెలుగులోకి గాలిబ్ గీతాలు పేర అనువదించారు.తల్లి మీద, తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి.

కవితా వస్తువులు

[మార్చు]

నిరుపేదల తరతరాల బీదతనం ఊడ్చివేయాలనే తొందర దాశరథి ప్రతిమాటలో కనిపిస్తుందని ప్రకాశకులు చిలుకూరు శ్రీరాములు ప్రకాశికలో పేర్కొన్నారు. ఈ అంశాలు రుద్రవీణ కవితావస్తువుల్లో చాలావరకూ ప్రతిఫలిస్తాయి. కొన్ని కవితల్లో ప్రేమ భావనలు కూడా కనిపిస్తాయి.

కవితల జాబితా

[మార్చు]

రుద్రవీణ ఖండకావ్యంలో మొత్తం 16 కవితలు ఉన్నాయి. అవి:[2]

  • మంగళగీతి
  • మూర్చన
  • రససమాధి
  • ఉషస్సుందరి
  • మేలుకొలుపు
  • స్వామి పూజ
  • పచ్చని గడ్డిపై
  • వీర తెలంగాణము
  • ముక్త భూమి
  • అగ్ని కుంకుమము
  • సుప్రభాతం
  • రానున్నది
  • రుధిరపక్షులు
  • కవాటం
  • మహాగీతం
  • రుధిర దీపిక

మూలాలు

[మార్చు]
  1. రుద్రవీణ కావ్య ప్రకాశిక: చిలుకూరు శ్రీరాములు
  2. రుద్రవీణ:దాశరథి కృష్ణమాచార్య:విషయసూచిక