రెండు రెళ్ళు ఆరు
రెండు రెళ్ళ ఆరు (1986 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జంధ్యాల |
---|---|
తారాగణం | చంద్రమోహన్ , రజని, రాజేంద్ర ప్రసాద్, ప్రీతి |
సంగీతం | రాజన్ - నాగేంద్ర |
నిర్మాణ సంస్థ | విజయ కమర్షియల్స్ |
భాష | తెలుగు |
రెండు రెళ్ళు ఆరు రాజేంద్రప్రసాద్, ప్రీతి, చంద్రమోహన్, రజని ప్రధాన పాత్రలలో నటించిన తెలుగు సినిమా. జంధ్యాల దర్శకత్వంలో విజయ కమర్షియల్స్ బ్యానర్‌పై జి.సుబ్బారావు నిర్మించిన ఈ సినిమా 1986, జనవరి 11వ తేదీన విడుదలయ్యింది.
పాత్రలు - పాత్రధారులు
[మార్చు]- మధుసూధనరావు - రాజేంద్రపసాద్
- సద్గుణరావు - చంద్రమోహన్
- వింధ్య - రజని
- కీర్తన - ప్రీతి
- ఐరావతం - సుత్తి వీరభద్రరావు
- లలిత - శ్రీలక్ష్మి
- దత్తాత్రేయులు - పి.ఎల్.నారాయణ
- దత్తాత్రేయులు భార్య - డబ్బింగ్ జానకి
- గిరీశం - సుత్తివేలు
- తికమకరావు- రాళ్ళపల్లి
- సర్వానందం - పుచ్చా పూర్ణానందం
- జగపతిరావు - సాక్షి రంగారావు
- స్వామీజీ - పొట్టి ప్రసాద్
- వార్డెన్ - కాకినాడ శ్యామల
- పట్టాభిరాం - బి.వి.పట్టాభిరామ్
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ: మల్లాది వెంకటకృష్ణమూర్తి
- సంభాషణలు: జంధ్యాల
- కళ: దిలీప్ సింగ్
- నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి
- కూర్పు: గౌతంరాజు
- సంగీత దర్శకత్వం: రాజన్-నాగేంద్ర
- ఛాయాగ్రహణం: బి.కోటేశ్వరరావు
- నిర్మాత: జి.సుబ్బారావు
సంక్షిప్త కథ
[మార్చు]మధుసూదనరావు(Mad), సద్గుణరావు (Sad) ఇద్దరూ మంచి రూమ్మేట్స్. ఒక సినిమా థియేటర్‌లో పరిచయమైన కీర్తనను గాఢంగా ప్రేమిస్తాడు మధుసూదనరావు(రాజేంద్ర ప్రసాద్). కీర్తన (ప్రీతి), వింధ్య (రజని) ఒకే హాస్టల్‌లో ఉంటారు. మధుసూదనరావు అసలు పేరు వెంకటశివం. కీర్తన అసలు పేరు విఘ్నేశ్వరి. వెంకటశివం, విఘ్నేశ్వరి లకు ఇష్టం లేకుండానే చిన్న వయసులోనే పెళ్లి అయిపోతుంది. తల్లిదండ్రుల ఉద్యోగరీత్యా ఇద్దరూ చిన్న వయసులోనే వేరుపడిపోతారు. విఘ్నేశ్వరి పెద్దనాన్న సర్వానందం (పుచ్చా పూర్ణానందం) ఎన్నోసార్లు ఊరు రమ్మంటాడు. విఘ్నేశ్వరి స్థానంలో వింధ్య, వెంకటశివం స్థానంలో సద్గుణరావు(చంద్రమోహన్) మంగళగిరి వెళ్తారు. అక్కడ ఇద్దరూ ద్వేషిస్తున్నట్లు నటిస్తూనే మనసులో ప్రేమ పెంచుకుంటారు. ఇంట్లో వాళ్లకి వీళ్ళిద్దరూ అసలు వారు కాదని తెలిసి కంగారు పడతారు. చివరికి మధుసూదనరావు - కీర్తన, సద్గుణరావు - వింధ్య ఒక్కటవుతారు.[1]
పాటలు
[మార్చు]ఈ సినిమాలో మూడు పాటలున్నాయి. ఈ మూడు పాటలను వేటూరి సుందరరామమూర్తి వ్రాయగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి పాడారు. ఈ పాటలకు రాజన్-నాగేంద్ర బాణీలు కట్టారు.
సం. | పాట | నటీనటులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "కాస్తందుకో... దరఖాస్తందుకో..." | రాజేంద్రప్రసాద్, ప్రీతి | |
2. | "జోహారు పెళ్ళామా" | చంద్రమోహన్, రజని | |
3. | "విరహవీణ నిదురరాక వేగే వేళలో..." | రజని, చంద్రమోహన్ |
మూలాలు
[మార్చు]- ↑ పులగం చిన్నారాయణ (1 October 2004). "జంధ్యామారుతం" (PDF). హాసం - హాస్య సంగీత పత్రిక. 4 (73): 24–30. Retrieved 1 April 2018.[permanent dead link]