రెడ్ (2021 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెడ్
దర్శకత్వంకిషోర్ తిరుమల
స్క్రీన్ ప్లేకిషోర్ తిరుమల
దీనిపై ఆధారితంతమిళ సినిమా ‘తడమ్‌’
నిర్మాతస్రవంతి రవి కిషోర్
తారాగణంరామ్
నివేదా పేతురాజ్
మాళవికా శర్మ
అమృత అయ్యర్
ఛాయాగ్రహణంసమీర్‌ రెడ్డి
కూర్పుజునైద్‌ సిద్ధిఖ్‌
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
14 జనవరి 2021 (2021-01-14)
సినిమా నిడివి
146 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

రెడ్ 2021లో తెలుగులో విడుదలైన సినిమా. తమిళంలో 2019లో విడుదలైన ‘తడమ్‌’ సినిమా ఆధారంగా శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై తెలుగులో 'రెడ్' పేరుతో స్రవంతి రవికిశోర్‌ నిర్మించిన ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. రామ్, నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 14న విడుదలైంది.[1]

సిద్ధార్థ (రామ్‌) ఇంజినీరింగ్ పూర్తిచేసి సొంతంగా కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టుకొని వర్క్ చేస్తుంటాడు. మహిమ (మాళవికా శర్మ)ను ప్రేమించి పెళ్ళాడాలని అనుకుంటాడు. ఆదిత్య (రామ్‌ ద్విపాత్రాభినయం), అతని స్నేహితుడు వేమ (స‌త్య‌)తో క‌లిసి మోసాలకి పాల్పడుతుంటాడు. వేమ త‌న అప్పుల్ని తీర్చడం కోస‌మ‌ని దాచుకున్న రూ.8 లక్షల మొత్తాన్ని ఆదిత్య‌ పేకాట‌లో పోగొడ‌తాడు. ఆ త‌ర్వాత ఆ డ‌బ్బు ఎలా స‌ర్దాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతాడు. వాళ్ళు డబ్బు కోసం ఇబ్బందిపడుతున్నసమయంలో ఆదిత్యకు, గాయత్రి (అమృతా అయ్యర్‌) ఎదురవుతుంది. ఈ క్రమంలో బీచ్‌ రోడ్డులో ఓ హత్య జరుగుతుంది. ఈ హ‌త్య చేసిందెవ‌రు? ప‌రిశోధ‌న‌లో ఎలాంటి నిజాలు తెలిశాయి ? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]

పాటలు

[మార్చు]
Track listing
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."నువ్వే నువ్వే"సిరివెన్నెల సీతారామశాస్త్రిరమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి4:12
2."డించక్ డించక్ [3]"కాసర్ల శ్యామ్సాకేత్ కొమండూరి, కీర్తన శర్మ5:20
3."కౌన్ అచ్చా కౌన్ లుచ్చా"కళ్యాణ్ చక్రవర్తిఅనురాగ్ కులకర్ణి4:23
4."మౌనంగా ఉన్న"సిరివెన్నెల సీతారామశాస్త్రిదినకర్, నూతన మోహన్4:27
మొత్తం నిడివి:18:20

మూలాలు

[మార్చు]
  1. Zee News Telugu (25 October 2020). "సంక్రాంతి బరిలోనే రామ్ సినిమా". Archived from the original on 10 November 2021. Retrieved 10 November 2021.
  2. TV9 Telugu (14 January 2021). "మూవీ రివ్యూ: 'థ్రిల్'‌ను పెంచే 'రెడ్' మూవీ.. ఉస్తాద్ 'రామ్' డబుల్ యాక్షన్ అదుర్స్." Archived from the original on 10 November 2021. Retrieved 10 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Zee News Telugu (15 May 2020). "హెబ్బా పటేల్‌తో రామ్ 'డించక్ డించక్' మసాలా సాంగ్". Archived from the original on 10 November 2021. Retrieved 10 November 2021.