లాపతా లేడీస్
లాపతా లేడీస్ (2024 హిందీ సినిమా) | |
దర్శకత్వం | కిరణ్ రావు |
---|---|
నిర్మాణం | రావు, అమీర్ ఖాన్, జ్యోతి దేశ్ పాండే |
రచన | కధ : బిప్లబ్ గోస్వామి[1]
స్క్రీన్ ప్లే : స్నేహా దేశాయ్ మాటలు : దివ్యనిధి శర్మ |
తారాగణం | ఫూల్ కుమారి గా - నితాన్షి గోయల్ దీపక్ కుమార్‌గా - స్పర్శ్ శ్రీవాస్తవ్ |
సంగీతం | రామ్ సంపత్ |
ఛాయాగ్రహణం | వికాష్ నౌలాఖా |
కూర్పు | జబీన్ మర్చంట్ |
పంపిణీ | యష్ రాజ్ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 8 సెప్టెంబరు 2023(TIFF) 1 మార్చి 2024 |
నిడివి | 124 నిముషాలు [2] |
దేశం | భారత దేశం |
భాష | హిందీ |
వసూళ్లు | ₹21.65 crore[3] |
లాపతా లేడీస్ (హిందీ: लापता लेडीज) అంటే తప్పి పోయిన స్త్రీలు అని అర్ధం. ఇది 2023లో తీసిన భారతీయ హిందీ భాషా హాస్య-నాటకీయ చిత్రం, ఈ సినిమాకు కిరణ్ రావు దర్శకత్వం వహించింది. దీనిని రావు, అమీర్ ఖాన్, జ్యోతి దేశ్పాండే నిర్మించారు.[4][5] ఇందులో నితాన్షి గోయల్, ప్రతిభా రాంటా, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్, రవి కిషన్ మొదలగువారు నటించారు. ఈ సినిమా రైలు ప్రయాణంలో తమ ఉనికిని కోల్పోయిన ఇద్దరు నవ వధువుల కథ.[6]
ఈ చిత్రం 48వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో 2023 సెప్టెంబరు 8న ప్రదర్శించబడింది. కాగా, థియేటర్లలో 2024 మార్చి 1న విడుదలైంది.[7] ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. దాని కథ, స్క్రీన్ ప్లే, తారాగణం అన్నీ విషయాల్లోనూ ప్రశంసలు అందుకుంది.[8]
ఈ చిత్రం 97వ అకాడమీ అవార్డులకు ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కోసం భారతీయ ఎంట్రీగా ఎంపిక చేయబడింది.[9]
కధ
[మార్చు]2001లో నిర్మల్ ప్రదేశ్ (కల్పితం)లో, దీపక్ అనే రైతు తన నూతన వధువు ఫూల్ తో తన గ్రామానికి తిరిగి వెళ్తున్నాడు. ఆ క్రమంలో వారు అనేక ఇతర కొత్త జంటలతో పాటు రద్దీగా ఉండే ప్రయాణీకుల రైలు ఎక్కుతారు. ఆ వధువులందరూ తమ సంప్రదాయాన్ననుసరించి ఒకే రంగు దుస్తులను ధరిస్తారు, వారి ముఖాలు పూర్తిగా మేలి ముసుగుతో కప్పబడి ఉంటాయి. దీపక్ ప్రయాణం లో నిద్రపోయి, తన స్టేషన్ వచ్చిందని గ్రహించి, రాత్రి చీకటిలో మేల్కొని దిగాలనే హడావిడిలో తన సామాను పట్టుకుని ఫూల్ను తన వెంట రమ్మని దిగిపోతాడు. అయితే జయ అనే మరో ఇదే విధమైన దుస్తులు, మేలిముసుగు ధరించిన నవ వధువు అతనితో వెళుతుంది. ఫూల్ రైలులో ఉండిపోతుంది.
ఈ జంట గ్రామానికి చేరాక స్నేహితులు, కుటుంబ సభ్యులు స్వాగతం పలుకుతారు. తాను తప్పు వ్యక్తితో ఉన్నానని ఇప్పుడు గ్రహించిన జయ, ఈ విషయాన్ని బహిర్గతం చేయదు. దీపక్, అతని కుటుంబం ఈ విషయం గ్రహించినప్పుడు ఆమె తన గురించి తప్పు సమాచారం చెబుతుంది.
ఇంతలో, జయ భర్త ప్రదీప్ ఇంకో స్టేషన్ కు చేరుకుని, అక్కడ ఉన్న ఫూల్ను జయ అని భావించి తనతో పాటు దిగమని ఆదేశిస్తాడు. ఫూల్ పరిస్థితిని అర్థం చేసుకుని, భయపడి స్టేషన్లో దాక్కోవాలని నిర్ణయించుకుంటుంది. అయితే ఉదయం, ఆమె దీపక్ గ్రామం పేరు తెలియకపోవడం వల్ల ఇంకా ఆమె తన పుట్టింటికి ఒకతే తిరిగి వెళ్లడానికి సంప్రదాయం కాదని, స్టేషన్ మాస్టర్ ని సహాయం అడుగుతుంది. దీపక్ వస్తే చూడడానికి అవకాశం ఉంటుందని ఆమె స్టేషన్లోనే ఉంటుంది, అక్కడ టీ దుకాణం నడుపుతున్న మంజు మాయి ఆమెకు సహాయం చేస్తుంది, ఆ దుకాణం లో పూల్ కూడా ఆమెకు పని లో సాయం చేస్తుంటుంది. ఆమె క్రమంగా స్వతంత్రంగా ఉండటం నేర్చుకుంటుంది, తన స్వంత గౌరవాన్ని గుర్తింపును పొందుతూ ఉంటుంది.
ఫూల్ కోసం వెతుకుతున్న దీపక్, సబ్ ఇనస్పెక్టర్ శ్యామ్ మనోహర్ వద్దకు వెళ్లి పరిస్థితిని వివరిస్తాడు. తప్పిపోయిన వ్యక్తి నివేదికను దాఖలు చేసి, జయని రక్షక భట నిలయం (పోలీస్ స్టేషన్) కు తీసుకు వెళ్తాడు. జయ తన గురించి అబద్ధం చెబుతోందని, ఆమె దొంగ కావచ్చు అని ఇన్స్పెక్టర్ అనుమానిస్తాడు. తప్పిపోయిన మరో వధువు గురించి అతను మరొక పోలీస్ స్టేషన్ నుండి సమాచారం తెలుస్తుంది. ఇది జయ కావచ్చు అని ఊహించి జయను వెంబడించడం ప్రారంభిస్తాడు. ఆమె ఆభరణాలను విక్రయించడం, మొబైల్ ఫోన్ ఉపయోగించడం, బస్సు టిక్కెట్లు కొనడం చూస్తాడు.
జయ దీపక్ కుటుంబంతో సన్నిహితంగా ఉండి ఆశ్చర్యకరంగా సేంద్రీయ వ్యవసాయానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని చూపిస్తుంది. దీపక్ వదిన మంచి చిత్రకారిణి అని తెలుసుకుని, ఫూల్ ని వెతకడములో సహాయపడటానికి ఆమె చిత్రపటాన్ని గీయమని ఆమెను అడుగుతుంది.
ఎస్ఐ మనోహర్ జయ ఛాయాచిత్రాలు, రుజువును తీసుకుని ఆమెను బందీ చేసాడు. దీపక్ అతని కుటుంబం ఆమె చేసే పనులు చూసి నివ్వెర పోతారు. అయితే పోలీస్ స్టేషన్ లో విచారణ లో వరకట్నంపైనే ఆశతో ఇదివరకే వివాహం అయి భార్య చనిపోయిన ప్రదీప్‌తో జయ తన ఇష్టంలేని పెళ్లి చేసుకున్నట్లు, ఆమె సేంద్రీయ వ్యవసాయంలో వృత్తిని కొనసాగించాలని డెహ్రాడూన్‌లోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో ప్రవేశం కూడా పొందింది అని తెలుస్తుంది. అనుకోకుండా దీపక్‌తో కలిసి రైలు బయల్దేరి వెళ్లినప్పుడు, ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రదీప్‌కు దూరమై తన కలలను నెరవేర్చుకోవాలని నిర్ణయించుకుని, ఆమె తన చదువుకు, డెహ్రాడూన్‌కి వెళ్లే టిక్కెట్ కు చెల్లించడానికి కొన్ని నగలను విక్రయించింది.
జయ కోసం ప్రదీప్ పోలీస్ స్టేషన్ కి వస్తాడు. పోలీసుల ఎదుటే ఆమెను బెదిరించి, దాడి చేసి ఆమెను బలవంతంగా తీసుకు వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తాడు. మిస్సింగ్ కేసు ముగిసింది కానీ, ఇప్పుడు దాడి కేసు మొదలు అయిందని ఎస్ ఐ మనోహర్ అడ్డుకున్నాడు, అంతేకాదు జయ స్వతంత్ర వ్యక్తి (మేజర్) కావడంతో ఎవరూ బలవంతంగా తీసుకు వెళ్లడం కుదరదు, అతను జయను కానీ వెళ్లనివ్వకపోతే ప్రదీప్‌పై అనేక ఇతర నేరాలు మోపుతానని బెదిరిస్తాడు.
జయ తయారు చేయించిన పూల్ కు సంబంధించిన చిత్రం ఇతర పోలీస్ స్టేషన్ లలో ప్రదర్శించిన కారణంగా, ఫూల్ చివరకు రైలు పట్టుకుని దీపక్ వద్దకు సంతోషంగా తిరిగివస్తుంది. ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్న జయ, డెహ్రాడూన్ కు తన చదువును కొనసాగించడానికి బయలుదేరుతుంది, దీపక్ కుటుంబం ఆమెను ఆప్యాయంగా సాగనంపుతారు.
తారాగణం
[మార్చు]- ఫూల్ కుమారి గా - నితాన్షి గోయల్
- దీపక్ కుమార్‌గా - స్పర్శ్ శ్రీవాస్తవ్
- జయ / పుష్పా రాణి, శ్రేయ వేషధారణలో - ప్రతిభా రంతా
- మంజు మాయిగా - ఛాయా కదమ్
- రవికిషన్ - ఇన్‌స్పెక్టర్ శ్యామ్ మనోహర్‌గా నటించారు
- యశోదగా - గీతా అగర్వాల్ శర్మ
- ఛోటూగా - సతేంద్ర సోనీ
- బబ్లూగా - అబీర్ జైన్
- ప్రదీప్ - భాస్కర్ ఝా
- గుంజన్‌గా - దావూద్ హుస్సేన్
- దూబే జీగా - దుర్గేష్ కుమార్
- బేలాగా - కనుప్రియ రిషిముమ్
- దీపక్ తండ్రిగా - పంకజ్ శర్మ
- మూర్తిగా - సంజయ్ డోగ్రా
- హనీఫ్‌గా - షాద్ మొహమ్మద్
- అబ్దుల్‌గా - రవి కపాడియా
- స్టేషన్ మాస్టర్‌గా - వివేక్ సావ్రికర్
- పూనమ్‌గా - రచనా గుప్తా
- రఘుగా - ప్రాంజల్ పటేరియా
- బిలాస్‌గా - సమర్థ్ మేయర్
- ఖైదీగా - అభయ్ దూబే
సంగీతం
[మార్చు]ఈ చిత్రానికి రామ్ సంపత్ సంగీతంఅందించాడు, దివ్యనిధి శర్మ, ప్రశాంత్ పాండే, స్వానంద్ కిర్కిరే పాటలు రాశారు.[10]
పాట | సాహిత్యం | గానం | నిడివి | |
---|---|---|---|---|
1 | "డౌట్వా" | దివ్యనిధి శర్మ | సుఖ్వీందర్ సింగ్ | 2:30 |
2 | "సజ్ని" | ప్రశాంత్ పాండే | అరిజిత్ సింగ్ | 2:50 |
3 | "ధీమే ధీమే" | స్వానంద్ కిర్కిరే | శ్రేయా ఘోషల్ | 4:28 |
4 | "బేడ పార్" | ప్రశాంత్ పాండే | సోనా మోహపాత్ర | 2:26 |
మొత్తం నిడివి | 12:14 |
ఇతర విశేషాలు
[మార్చు]ఈ చిత్రం టొరంటో అంతర్జాతీయ సినిమా ఉత్సవం (TIFF)లో 2023 సెప్టెంబరు 8న ప్రదర్శించారు, థియేటర్లలో 2024 మార్చి 1న విడుదలైంది.[11] యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ లాపతా లేడీస్ చిత్రానికి సంబంధించి ప్రపంచ పంపిణీ హక్కులను (యు.కె. తో సహా) కొనుగోలు చేసింది. ఈ చిత్రానికి 26 ఏప్రిల్ 2024న నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ప్రదర్శించుతున్నారు.[12] ఈ చిత్రం మొదటి రోజు ₹₹75 lakh, రెండవ రోజు ₹1.45 కోట్లు, మూడవ రోజు ₹1.7 కోట్లు, మొదటి వారాంతంలో మొత్తం ₹3.75 కోట్లు వసూలు చేసింది. 11 ఏప్రిల్ 2024 నాటికి, ఈ చిత్రం భారతదేశంలో ₹20.49 కోట్లు ప్రపంచవ్యాప్తంగా ₹21.65 కోట్లు వసూలు చేసింది.[13]
సమీక్షలు
[మార్చు]సమీక్షలను ప్రచురించే అగ్రిగేటర్ వెబ్‌సైట్ రాటెన్ టొమాటోస్, ప్రచురించిన 21 విమర్శకుల సమీక్షలలో 100% సానుకూలంగా ఉన్నాయి, సగటు రేటింగ్ 7.7/10.[14]
ఎన్డీటీవీకి చెందిన సైబల్ ఛటర్జీ ఈ చిత్రానికి రేటింగ్ ఇస్తూ, కిరణ్ రావు దర్శకురాలిగా తిరిగి వస్తుందని, " ఒక భయంకర చిక్కులలో ఉన్న ఇద్దరు వధువుల చురుకైన కథలో ముగ్గురు కొత్త నటులను నియమించింది." అని పేర్కొన్నారు.[15]
బాలీవుడ్ హంగామా ఈ చిత్రానికి 3/5 నక్షత్రాలను రేట్ చేస్తూ, "లాపటా లేడీస్ వినోదభరితమైన కథాంశం, ప్రదర్శనలు, అంతర్లీన సందేశం కొంత చిరస్మరణీయమైన హాస్యము ఇంకా భావోద్వేగ సన్నివేశాల తో నడుస్తుంది." అని రాసింది. ది గార్డియన్ చెందిన కేథరీన్ బ్రే ఈ చిత్రానికి 5 కి 3 నక్షత్రాలను ఇచ్చి, " కిరణ్ రావు నవదంపతుల కథలో గౌరవపూర్వకమైన హాస్యాన్ని చూపిస్తుంది" అని పేర్కొంది.[16][17]
ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక సమీక్షలో, శుభ్రా గుప్తా ఈ చిత్రానికి 5 కి 3.5 నక్షత్రాలను రేట్ చేసి, "కిరణ్ రావు చిత్రం అనాలోచితంగా గట్టిగా చెప్పిన సందేశం స్త్రీవాద హృదయం విస్తృతంగా చూపించింది. కొన్నిసార్లు విషయాలను బిగ్గరగా, స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది" అని రాసింది.[18]
పింక్విల్ల చెందిన రిషీల్ జోగాని ఈ చిత్రానికి 5/4 రేటింగ్ ఇచ్చారు. లాపటా లేడీస్ చిత్రం "హాస్యంగా, చమత్కారమైన, వినోదాత్మకంగా, సాధికారికంగా ఉంటుంది. ఇది సినిమా శక్తిని సరైన మార్గంలో ఉపయోగించుకునే చాలా ముఖ్యమైన చిత్రం" అని అభిప్రాయపడ్డారు.[19]
ఇండియా టుడే చెందిన తుషార్ జోషి తన సమీక్షలో "లాపటా లేడీస్" ఒక అద్భుతమైన చూడతగ్గ సినిమా. దీని నిడివి కొంచెంఎక్కువ ఉన్నా తప్పిపోయిన ఇద్దరు మహిళల కథలో మనసు పెడితే, ఇది ఒక విందు" అని పేర్కొన్నారు.[20]
అమర్ ఉజాలా చెందిన పంకజ్ శుక్లా ఈ చిత్రానికి 5 కి 4 రేటింగ్ ఇచ్చారు. ఈ చిత్ర నిర్మాత అమీర్ ఖాన్, దర్శకురాలు కిరణ్ రావు తమ చిత్రంలో కొత్తవారికి అవకాశాలు ఇచ్చినందుకు ప్రశంసించారు. కిరణ్ రావు 14 సంవత్సరాల విరామం తర్వాత దర్శకురాలుగా తిరిగి రావడం గురించి ఆయన స్వాగతించారు. తన సమీక్షలో, పంకజ్ శుక్లా స్క్రిప్ట్ రచయిత్రి స్నేహా దేశాయ్ గురించి 'ఆమె రచన ప్రతి సన్నివేశంలో కొన్ని కొత్త సూక్ష్మ నైపుణ్యాలను కనపరచి, తన తదుపరి సన్నివేశం కోసం మరికొన్ని దాచిపెడుతుంది' అని వ్రాశారు.[21]
మూలాలు
[మార్చు]- ↑ Gopalakrishnan, Aswathy (15 February 2024). "Interview | Kiran Rao on 'Laapataa Ladies', her comeback film as a director". The Hindu (in Indian English). Retrieved 1 May 2024.
- ↑ "Laapataa Ladies (R)". British Board of Film Classification. 1 March 2024. Archived from the original on 1 March 2024. Retrieved 1 March 2024.
- ↑ "Laapataa Ladies Box Office Collection". Bollywood Hungama (in ఇంగ్లీష్). 2024-03-01. Archived from the original on 2024-03-03. Retrieved 2024-03-03.
- ↑ "Laapataa Ladies teaser: Kiran Rao, Aamir Khan promise an lethargic, thought-less film on the subject of 'missing' wives". The Indian Express. 8 September 2023. Archived from the original on 1 March 2024. Retrieved 1 March 2024.
- ↑ "Laapataa Ladies teaser: Kiran Rao returns to direction 13 years after Dhobi Ghat with a tale of lost brides. Watch". Hindustan Time. 8 September 2023. Archived from the original on 1 March 2024. Retrieved 1 March 2024.
- ↑ "Director Kiran Rao attends 'Laapataa Ladies' screening at the Toronto International Film Festival". The Times of India. 9 September 2023. Archived from the original on 1 March 2024. Retrieved 1 March 2024.
- ↑ "Laapataa Ladies trailer: Kiran Rao directorial slowly and surely lifts the veil on its comedy of errors Watch". Hindustan Times. 24 January 2024. Archived from the original on 26 February 2024. Retrieved 1 March 2024.
- ↑ "Laapataa Ladies: A fantasy by those who have never lived in a village". Indian Express. 7 May 2024. Archived from the original on 7 May 2024. Retrieved 7 May 2024.
- ↑ "Laapataa Ladies is India's official entry to Oscars 2025; trumps Animal, Aattam and All We Imagine As Light". The Indian Express (in ఇంగ్లీష్). 23 September 2024. Retrieved 23 September 2024.
- ↑ "Laapataa Ladies (Original Motion Picture Soundtrack)". JioSaavn. Archived from the original on 29 February 2024. Retrieved 2 March 2024.
- ↑ "Laapataa Ladies trailer: Kiran Rao directorial slowly and surely lifts the veil on its comedy of errors Watch". Hindustan Times. 24 January 2024. Archived from the original on 26 February 2024. Retrieved 1 March 2024.
- ↑ "Kiran Rao's Laapataa Ladies: OTT Release Details". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2024-03-13. Archived from the original on 2024-03-27. Retrieved 2024-03-21.
- ↑ "Laapataa Ladies Box Office Collection". Bollywood Hungama. 2024-03-01. Archived from the original on 2024-03-03. Retrieved 2024-03-03.
- ↑ "Lost Ladies". Rotten Tomatoes. Retrieved 3 May 2024.
- ↑ Chatterjee, Saibal (1 March 2024). "Laapataa Ladies Review: Emotionally Engaging Film Laced With Doses Of Wry Humour". NDTV. Archived from the original on 2 March 2024. Retrieved 2 March 2024.
- ↑ "Laapataa Ladies Movie Review". Bollywood Hungama. 28 February 2024. Archived from the original on 1 March 2024. Retrieved 1 March 2024.
- ↑ Bray, Catherine (1 March 2024). "Laapataa Ladies review – Shakespearean carry-on in Indian arranged-marriage comedy". The Guardian. Archived from the original on 1 March 2024. Retrieved 1 March 2024.
- ↑ Gupta, Shubhra (2024-03-01). "Laapataa Ladies movie review". The Indian Express. Archived from the original on 2024-03-01. Retrieved 2024-03-01.
- ↑ "Laapataa Ladies review". Pinkvilla. 2024-02-29. Archived from the original on 2024-03-01. Retrieved 2024-03-01.
- ↑ Joshi, Tushar (2024-03-01). "'Laapataa Ladies' review: Kiran Rao's comeback is a terrific watch". India Today. Archived from the original on 2024-03-02. Retrieved 2024-03-02.
- ↑ Shukla, Pankaj (28 Feb 2024). "Laapataa Ladies Review: असल भारत को कैमरे में खींच लाईं किरण राव, बेटियों को लापता लेडीज न बनने देने की मुहिम". Amar Ujala.
{{cite web}}
: CS1 maint: url-status (link)