Jump to content

లాల్‌భాగ్ బొటానికల్ గార్డెన్

వికీపీడియా నుండి
లాల్‌భాగ్ బొటానికల్ గార్డెన్‌
ఉద్యానవనంలో ఉన్న గ్లాస్ హౌస్
ఉద్యానవనంలో ఉన్న గ్లాస్ హౌస్
Countryభారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాబెంగళూరు పట్టణం
Metroబెంగుళూరు
విస్తీర్ణం
 • Total0.971246 కి.మీ2 (0.375000 చ. మై)
భాషలు
 • అధికారకన్నడ
Time zoneUTC+5:30 (IST)

లాల్‌భాగ్ బొటానికల్ గార్డెన్‌ కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు లో ఉన్న అతి పురాతనమైన ఉద్యానవనం. ఈ ఉద్యానవనం 240 ఎకరాల్లో విస్తరించి ఉంది. వెయ్యికి పైగా పూల మొక్కల రకాలు, అందులో వందకు పైగా వంద సంవత్సరాలు నిండిన భారీ చెట్లు ఉన్నాయి.[1]

చరిత్ర

[మార్చు]

ఈ ఉద్యనవనాన్ని హైదర్ అలీ 1760 లో నిర్మాణానికి తలపెట్టి, తన కుమారుడైన టిప్పు సుల్తాన్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. మొఘల్ ఉద్యనవాన్ని పర్యవేక్షించే మహ్మద్ అలీ, అబ్దుల్ ఖాదర్ ఈ ఉద్యనవాన్ని పర్యవేక్షించేవారు.18 వ శతాబ్దం నుంచి ఈ ఉద్యనవనాన్ని పేమాస్టర్ కంపెనీ మేజర్ గిల్బర్ట్ వా పర్యవేక్షించేవాడు. 1814 నుంచి ఉద్యానవన పర్యవేక్షణ బాధ్యతలు మైసూర్ ప్రభుత్వానికి బదిలీ అయ్యాయి. 1874 వరకు ఈ ఉద్యానవన విస్తీర్ణం 45 ఎకరాల్లో ఉండేది. 1889 లో తూర్పు భాగాన మరో 30 ఎకరాలు, 1891 లో మరో 13 ఎకరాలు, 1894 లో 94 ఎకరాలు ఇలా మొత్తం 240 ఏకరాలుగా విస్తరించింది.[2]

మరిన్ని విశేషాలు

[మార్చు]

ఈ ఉద్యానవనంలో ఉన్న మొక్కలు విదేశాల నుంచి పర్షియా, ఆఫ్ఘనిస్తాన్, ఫ్రాన్స్ దేశాల నుంచి వస్తాయి. ఇందులో 3000 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి లాల్ బాగ్ గా పిలువబడే కొండ ఉంది. ఈ ఉద్యనవనాన్నికి నాలుగు ముఖద్వారాలు ఉన్నాయి.[3]

చిత్రమాలికలు

[మార్చు]

ఇవి కూడ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Benjamin Rice, Lewis (1897). Mysore: A Gazetteer Compiled for the Government, Volume I, Mysore In General, 1897a. Westminster: Archibald Constable and Company. p. 834.
  2. Bowe, Patrick (2002) Charles Maries: Garden Superintendent to Two Indian Maharajas. Garden History 30(1):84-94
  3. "Department of Horticulture, Bangalore". Retrieved 5 August 2019.[permanent dead link]