Jump to content

లీడర్ (2010 సినిమా)

వికీపీడియా నుండి
(లీడర్ (2010) నుండి దారిమార్పు చెందింది)
లీడర్
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం శేఖర్ కమ్ముల
నిర్మాణం ఎం.శరవణన్, ఎం. ఎస్ గుహన్
రచన శేఖర్ కమ్ముల
కథ శేఖర్ కమ్ముల
చిత్రానువాదం శేఖర్ కమ్ముల
తారాగణం దగ్గుబాటి రానా, రిచా గంగోపాధ్యాయ, ప్రియ ఆనంద్, సుబ్బరాజు, హర్షవర్ధన్, కోట శ్రీనివాసరావు , ఆహుతి ప్రసాద్, తనికెళ్ళ భరణి, సుహాసిని, సుమన్, ఉదయభాను
సంగీతం మిక్కీ జె. మేయర్
సంభాషణలు శేఖర్ కమ్ముల
ఛాయాగ్రహణం విజయ్ సి. కుమార్
కళ తోట తరణి
కూర్పు మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
భాష తెలుగు

లీడర్ 2010 లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో విడుదలైన రాజకీయ కథా చిత్రం.[1] నిర్మాత డా.డి. రామానాయుడు మనుమడు, నిర్మాత దగ్గుబాటి సురేష్ కుమారుడు దగ్గుబాటి రానా ఈ చిత్రం ద్వారా కథానాయకునిగా పరిచయం అయ్యాడు. రాజకీయ నాయకుల అవినీతి, పదవీ కాంక్షల చుట్టూ కథ నడుస్తుంది.

చిత్రకథ

[మార్చు]

ముఖ్యమంత్రి సంజీవయ్య (సుమన్) హత్యకు గురవుతాడు. అమెరికాలో వుంటున్న ముఖ్యమంత్రి కొడుకు అర్జున్ ప్రసాద్ (రానా) తన తండ్రి చివరి కోరిక ప్రకారం తదుపరి ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. అప్పటికే ముఖ్యమంత్రి అన్న కొడుకు ధనుంజయ (సుబ్బరాజు) తానూ ముఖ్యమంత్రి కావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. రాజకీయాలలో ఏ మాత్రం అనుభవం లేని అర్జున్ ధనుంజయని, ఆ పార్టీ సభ్యులని తన దారిలోకి తెచ్చుకుని ముఖ్యమంత్రి అవుతాడు. అది భరించలేని ధనుంజయ ముఖ్యమంత్రి పై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత అర్జున్ ను ముఖ్యమంత్రి పదవి నుండి దించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు ధనుంజయ. రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల నల్ల ధనాన్ని బయటికి తీసి ప్రజలకి అందేలా చూడాలన్న లక్ష్యంతో ఉన్న అర్జున్ ప్రసాద్ తన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసం తన పార్టీకి ప్రధాన మద్దతుదారయిన మునుస్వామి (ఆహుతి ప్రసాద్) కూతురు అర్చన (రిచా గంగోపాధ్యాయ్) ని ప్రేమిస్తున్నట్లు నటిస్తాడు. కానీ, తన ప్రయత్నం ఫలించదు. అర్జున్ రాజీనామా చేస్తాడు. ఎన్నికలు వస్తాయి. ప్రజలను చెత్యనవంతులను చేసి, రాజకీయ వేత్తగా కాక, నాయకుడవుతాడు.

నటీనటులు

[మార్చు]

పాటలజాబితా

[మార్చు]
  • మా తెలుగుతల్లికి రచన: శంకరంబాడీ సుందరాచారి, గానం.టంగుటూరి సూర్యకుమారి
  • ఔననా కాదన , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.నరేష్ అయ్యర్ , శ్వేతా పండిట్
  • వందేమాతరం , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. నాకష్ అజీజ్
  • రాజశేఖర , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం శ్వేతా పండిట్
  • హే సి. ఎం , రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం. సునీత, సారథి
  • సిరులు పొంగిన , రచన: రాయప్రోలు సుబ్బారావు, గానం. కృష్ణ చైతన్య, సిద్ధార్ద్ , క్రాంతి, శశి కిరణ్, ఆదిత్య

చిత్రవిశేషాలు

[మార్చు]
  • మూవీ మొఘల్ గా ప్రఖ్యాతి చెందిన డా.డి.రామానాయుడు మనుమడు, ప్రముఖ నిర్మాత దగ్గుభాటి సురేష్ కుమారుడు, రానా కథానాయకునిగా ఈ చిత్రంతో పరిచయమయ్యారు.
  • ప్రముఖ టి.వి.యాంకర్ ఉదయభాను ఈ చిత్రంలో ఒక ఐటం సాంగ్ లో నటించింది.

మూలాలు

[మార్చు]
  1. బి.వి.ఎస్. ప్రకాష్. "Leader Movie Review". timesofindia.indiatimes.com. టైమ్స్ గ్రూప్. Retrieved 21 September 2016.