వంజరి
వంజరి | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 17°55′46.488″N 82°30′7.776″E / 17.92958000°N 82.50216000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అల్లూరి సీతారామరాజు |
మండలం | గంగరాజు మాడుగుల |
విస్తీర్ణం | 1.42 కి.మీ2 (0.55 చ. మై) |
జనాభా (2011)[1] | 299 |
• జనసాంద్రత | 210/కి.మీ2 (550/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 147 |
• స్త్రీలు | 152 |
• లింగ నిష్పత్తి | 1,034 |
• నివాసాలు | 87 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 531029 |
2011 జనగణన కోడ్ | 584943 |
వంజరి, అల్లూరి సీతారామరాజు జిల్లా, గంగరాజు మాడుగుల మండలానికి చెందిన గ్రామం.[2] ఇది మండల కేంద్రమైన గంగరాజు మాడుగుల నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 100 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 87 ఇళ్లతో, 299 జనాభాతో 142 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 147, ఆడవారి సంఖ్య 152. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 0 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 264. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 584943[3].
2022 లో చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం విశాఖపట్నం జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. [4]
గ్రామం పేరు వెనుక చరిత్ర
[మార్చు]వంజరి' వారి చరిత్ర
[మార్చు]ఉత్తర భారతదేశం నుంచి మొగలాయిల సైన్యంతో వలస వచ్చిన వీరిలో కొందరు తెలంగాణ ప్రాంతంలో స్థిరపడ్డారు. వీరు అటవిక జీవితం గడిపేవారు. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలతో వ్యాపారం కూడా చేసేవారు. ఆంగ్లేయుల రాకతో వీరి వ్యాపారం దెబ్బతింది. ఫలితంగా మళ్ళీ అడవులలోనే జీవితం కొనసాగించారు. కనుకనే మన ప్రభుత్వం తొలుత వీరిని ఎస్టీలుగా గుర్తించింది. చేతికందిన రిజర్వేషన్ ఫలాలు నోటికందే దశలో వీరిని బిసీల జాబితాలో చేర్చింది.వంజరులు వ్యవసాయ „కూలీలుగా, హమాలీలుగా, బీడీకార్మికులుగానే కాదు, పశువుల కాలి గిట్టలకు నాడాలు కొట్టేవారిగా మనకు దర్శనమిస్తున్నారు.బ్రాహ్మణులచే వంచింపబడి అడవులలోనికి తరిమేసిన కారణంగా ఈ జాతికి వంజరులు అని పేరు వచ్చిందనే నానుడి ఉంది. వంజరి అనే పదం వనజారే నుండి పుట్టింది. సంస్కృత భాషలో వంజరి అనగా వనచరి అడవులలో సంచరించేవారనే అర్థం వినిపిస్తుంది. వన చరులుగా గుర్తింపు పొందిన వీరు కాలక్రమేణా వంజరులుగా పిలువడుచున్నారు. వంజారా అను మూల పదం దేశ, భాషలో మిళితమై రూపాంతరం చెందిన పర్యాయ పదాలే వంజారా, బంజారా, లంబాడా, లామాన. ఈ విధంగా పిలువబడుతున్నవారంతా అప్పట్లో గిరిజనులే. కనుకనే వీరిలో ఒకే విధమైన ఆచార వ్యవహారాలు కనిపిస్తాయి. ఉదాహరణకు కుల పెద్దను నాయక్ అనటంతో పాటు పెళ్ళి సమయంలో మంగళ సూత్రం కట్టక పోవటం, గోనె సంచులు కుట్టటం... వంటి అంశాలను మనం గమనించవచ్చు. వంజరిలలో నాలుగు అంతర్గత శాఖలున్నాయి. రా„హుజిన్ వంజరి (రఘుపతి), లాట్ వంజరి (కాహోరుపతి), భూసార్జిన్ వంజరి (అధిపతి), మథుర్ వంజరి (సుభాసుపతి). మన రాష్ర్టంలో అత్యధిక సంఖ్యలో రా„హుజిన్ వంజరులున్నారు.ఉత్తర భారతదేశంలోని గుజరాత్, రాజస్థాన్‌ల్లో సంచార జాతిగా జీవించిన వీరు మొగలాయి సైన్యాలతో పాటు మహారాష్ర్ట, ఆంధ్రప్రదేశ్, దిగువ దక్షిణాది రాష్ట్రాలకు వలస వచ్చినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వస్తు సామాగ్రిని ఒక చోట నుండి మరొక చోటకు చేర్చే బాధ్యతను ఆ రోజుల్లో వీరు తీసుకున్నారు. వీరు ఏ ప్రాంతంలో నివసిస్తే అ ప్రాంతీయ భాషనే తమ మాతృ భాషగా స్వీకరించేవారు. అరణ్య ప్రాంతాలలో సంచరిస్తున్న సందర్భాలలో ఆయా ప్రాంతాల భాషలనే తమ మాతృ భాషగా ఎంచుకోవటం జరిగింది. స్థిర నివాసాలు లేకపోవటంతో అరణ్య ప్రాంతాలలో సంచరిస్తూ వర్తక వ్యాపారం సాగించేవారు.భారత దేశ చరిత్ర మధ్య యుగములో వర్తక, వ్యాపార, రవాణా సౌకర్యాలు ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలలో ఆధిపత్యం ఈ జాతి వారిదే. కనుకనే వీరు ధాన్యం, ఆహార పదార్ధాలు, పొగాకు వంటివాటిని ఎడ్లపైన పెఱికలలో వేసుకునో, బండ్లపైన కట్టుకునో గ్రామాలకు, సంతకు తిరిగి విక్రయించేవారు. తిరుగు ప్రయాణంలో వీరికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసేవారు. ఆంగ్లేయుల రాకతో వీరి వ్యాపారం దెబ్బతింది. ఆ కాలంలో రహదార్లు ఏర్పాటు చేయటంతోపాటు గూడ్సు రైళ్ల ప్రవేశం వీరి వృత్తికి ప్రతిబంధకమైంది. మరో వృత్తి చేపట్టలేక అరణ్య ప్రాంతాలను వదలి పల్లెలు, నగరాలకు వలస పట్టారు. ఆయా ప్రాంతాలలో కూలి చేసుకుంటూ పొట్టపోసుకున్నారు. ఈ క్రమంలో వీరు ఎద్దులు, ఆవులను పోషిస్తూ సంచార వ్యాపారం చేపట్టి దక్షిణ రాష్ట్రాలకు విస్తరించారు. వంజరులు తెలంగాణలో గోనె సంచులు కుట్టే కూలీ లుగా, బీడీ కార్మికులుగా, విస్తళ్లు కుట్టేవారిగా, పశువుల కాపరులుగా, వ్యవసాయ కూలీలుగాను జీవిస్తున్నారు. వీరు స్థిరజీవితం ఏర్పరచుకున్నప్పటికీ సంచార వ్యాపారులుగా కూడా జీవిస్తున్నారు. కొందరు ఎద్దులు, ఆవులను అమ్మే వ్యాపారం చేస్తుంటే మరికొందరు పశువుల కాలి గిట్టలకు నాడాలు కొట్టగా వచ్చే ఆదాయంతో జీవిస్తున్నారు. వీరు ప్రస్తుతం బీసీ గ్రూప్ `డి'లో కొనసాగుతున్నారు. గిరిజన లక్షణాలు కలిగి ఉండటం, సుగా లీ జాతిలో ఒక తెగ కావటంతో 1977లో ప్రభుత్వం ఎస్టీగా గుర్తించింది. రిజర్వేషన్ సౌకర్యాలు పూర్తిగా పొందక మునుపే 1979లో వీరిని బిసీ-డీ గ్రూప్‌లోకి మార్చింది. 1979కి పూర్వం ఎస్టీగా ఉన్న వంజరి కులాన్ని తిరిగి ఎస్టీ జాబితాలో చేర్చాలి' అని వీరు కోరుతున్నారు.తెలంగాణ ప్రాంతంలో దాదాపు 11 నియోజకవర్గాల్లో వీరిజనాభా ఉంది.
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉంది. బాలబడి గంగరాజు మాడుగులలోను, మాధ్యమిక పాఠశాల గెమ్మేలిలోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల గంగరాజు మాడుగులలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల పాడేరులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విశాఖపట్నంలోను, పాలీటెక్నిక్ పాడేరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల అరకులోయలోను, అనియత విద్యా కేంద్రం అనకాపల్లిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విశాఖపట్నం లోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
[మార్చు]ప్రభుత్వ వైద్య సౌకర్యం
[మార్చు]వంజరిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
[మార్చు]గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు.
తాగు నీరు
[మార్చు]బావుల నీరు గ్రామంలో అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం
[మార్చు]గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
[మార్చు]పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్ ఉంది. పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్, ఆటో సౌకర్యం, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో కంకర రోడ్లు ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
[మార్చు]గ్రామంలో స్వయం సహాయక బృందం ఉంది. పౌర సరఫరాల వ్యవస్థ దుకాణం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. ఉన్నాయి. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
విద్యుత్తు
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది.
భూమి వినియోగం
[మార్చు]వంజరిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- అడవి: 6 హెక్టార్లు
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 2 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 7 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 3 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 122 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 103 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 19 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]వంజరిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- ఇతర వనరుల ద్వారా: 19 హెక్టార్లు
ఉత్పత్తి
[మార్చు]వంజరిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-08-05.
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితాలో డి గ్రూపు కులం.`
వంజరి' వారి చరిత్ర
[మార్చు]ఉత్తర భారతదేశం నుంచి మొగలాయిల సైన్యంతో వలస వచ్చిన వీరిలో కొందరు తెలంగాణ ప్రాంతంలో స్థిరపడ్డారు. వీరు అటవిక జీవితం గడిపేవారు. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలతో వ్యాపారం కూడా చేసేవారు. ఆంగ్లేయుల రాకతో వీరి వ్యాపారం దెబ్బతింది. ఫలితంగా మళ్ళీ అడవులలోనే జీవితం కొనసాగించారు. కనుకనే మన ప్రభుత్వం తొలుత వీరిని ఎస్టీలుగా గుర్తించింది. చేతికందిన రిజర్వేషన్ ఫలాలు నోటికందే దశలో వీరిని బిసీల జాబితాలో చేర్చింది.వంజరులు వ్యవసాయ „కూలీలుగా, హమాలీలుగా, బీడీకార్మికులుగానే కాదు, పశువుల కాలి గిట్టలకు నాడాలు కొట్టేవారిగా మనకు దర్శనమిస్తున్నారు.బ్రాహ్మణులచే వంచింపబడి అడవులలోనికి తరిమేసిన కారణంగా ఈ జాతికి వంజరులు అని పేరు వచ్చిందనే నానుడి ఉంది. వంజరి అనే పదం వనజారే నుండి పుట్టింది. సంస్కృత భాషలో వంజరి అనగా వనచరి అడవులలో సంచరించేవారనే అర్థం వినిపిస్తుంది. వన చరులుగా గుర్తింపు పొందిన వీరు కాలక్రమేణా వంజరులుగా పిలువడుచున్నారు. వంజారా అను మూల పదం దేశ, భాషలో మిళితమై రూపాంతరం చెందిన పర్యాయ పదాలే వంజారా, బంజారా, లంబాడా, లామాన. ఈ విధంగా పిలువబడుతున్నవారంతా అప్పట్లో గిరిజనులే. కనుకనే వీరిలో ఒకే విధమైన ఆచార వ్యవహారాలు కనిపిస్తాయి. ఉదాహరణకు కుల పెద్దను నాయక్ అనటంతో పాటు పెళ్ళి సమయంలో మంగళ సూత్రం కట్టక పోవటం, గోనె సంచులు కుట్టటం... వంటి అంశాలను మనం గమనించవచ్చు. వంజరిలలో నాలుగు అంతర్గత శాఖలున్నాయి. రా„హుజిన్ వంజరి (రఘుపతి), లాట్ వంజరి (కాహోరుపతి), భూసార్జిన్ వంజరి (అధిపతి), మథుర్ వంజరి (సుభాసుపతి). మన రాష్ర్టంలో అత్యధిక సంఖ్యలో రా„హుజిన్ వంజరులున్నారు.ఉత్తర భారతదేశంలోని గుజరాత్, రాజస్థాన్‌ల్లో సంచార జాతిగా జీవించిన వీరు మొగలాయి సైన్యాలతో పాటు మహారాష్ర్ట, ఆంధ్రప్రదేశ్, దిగువ దక్షిణాది రాష్ట్రాలకు వలస వచ్చినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వస్తు సామాగ్రిని ఒక చోట నుండి మరొక చోటకు చేర్చే బాధ్యతను ఆ రోజుల్లో వీరు తీసుకున్నారు. వీరు ఏ ప్రాంతంలో నివసిస్తే అ ప్రాంతీయ భాషనే తమ మాతృ భాషగా స్వీకరించేవారు. అరణ్య ప్రాంతాలలో సంచరిస్తున్న సందర్భాలలో ఆయా ప్రాంతాల భాషలనే తమ మాతృ భాషగా ఎంచుకోవటం జరిగింది. స్థిర నివాసాలు లేకపోవటంతో అరణ్య ప్రాంతాలలో సంచరిస్తూ వర్తక వ్యాపారం సాగించేవారు.భారత దేశ చరిత్ర మధ్య యుగములో వర్తక, వ్యాపార, రవాణా సౌకర్యాలు ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలలో ఆధిపత్యం ఈ జాతి వారిదే. కనుకనే వీరు ధాన్యం, ఆహార పదార్ధాలు, పొగాకు వంటివాటిని ఎడ్లపైన పెఱికలలో వేసుకునో, బండ్లపైన కట్టుకునో గ్రామాలకు, సంతకు తిరిగి విక్రయించేవారు. తిరుగు ప్రయాణంలో వీరికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసేవారు. ఆంగ్లేయుల రాకతో వీరి వ్యాపారం దెబ్బతింది. ఆ కాలంలో రహదార్లు ఏర్పాటు చేయటంతోపాటు గూడ్సు రైళ్ల ప్రవేశం వీరి వృత్తికి ప్రతిబంధకమైంది. మరో వృత్తి చేపట్టలేక అరణ్య ప్రాంతాలను వదలి పల్లెలు, నగరాలకు వలస పట్టారు. ఆయా ప్రాంతాలలో కూలి చేసుకుంటూ పొట్టపోసుకున్నారు. ఈ క్రమంలో వీరు ఎద్దులు, ఆవులను పోషిస్తూ సంచార వ్యాపారం చేపట్టి దక్షిణ రాష్ట్రాలకు విస్తరించారు. వంజరులు తెలంగాణలో గోనె సంచులు కుట్టే కూలీ లుగా, బీడీ కార్మికులుగా, విస్తళ్లు కుట్టేవారిగా, పశువుల కాపరులుగా, వ్యవసాయ కూలీలుగాను జీవిస్తున్నారు. వీరు స్థిరజీవితం ఏర్పరచుకున్నప్పటికీ సంచార వ్యాపారులుగా కూడా జీవిస్తున్నారు. కొందరు ఎద్దులు, ఆవులను అమ్మే వ్యాపారం చేస్తుంటే మరికొందరు పశువుల కాలి గిట్టలకు నాడాలు కొట్టగా వచ్చే ఆదాయంతో జీవిస్తున్నారు. వీరు ప్రస్తుతం బీసీ గ్రూప్ `డి'లో కొనసాగుతున్నారు. గిరిజన లక్షణాలు కలిగి ఉండటం, సుగా లీ జాతిలో ఒక తెగ కావటంతో 1977లో ప్రభుత్వం ఎస్టీగా గుర్తించింది. రిజర్వేషన్ సౌకర్యాలు పూర్తిగా పొందక మునుపే 1979లో వీరిని బిసీ-డీ గ్రూప్‌లోకి మార్చింది. 1979కి పూర్వం ఎస్టీగా ఉన్న వంజరి కులాన్ని తిరిగి ఎస్టీ జాబితాలో చేర్చాలి' అని వీరు కోరుతున్నారు.తెలంగాణ ప్రాంతంలో దాదాపు 11 నియోజకవర్గాల్లో వీరిజనాభా ఉంది.
గణాంకాలు
[మార్చు]- జనాభా (2011) - మొత్తం 299 - పురుషుల సంఖ్య 147 - స్త్రీల సంఖ్య 152 - గృహాల సంఖ్య 87