వడివుక్కరసి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వడివుక్కరసి
జననం (1962-07-07) 1962 జూలై 7 (వయసు 62)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు1978- ప్రస్తుతం
పిల్లలుపద్మప్రియ

వడివుక్కరసి ఒక భారతీయ చలనచి, టెలివిజన్ నటి. తమిళ చిత్రం సిగప్పు రోజక్కల్ (1978) ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించిన ఆమె తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషలలో 350 కి పైగా సినిమాల్లో, 25 టెలివిజన్ సీరియల్స్ లో నటించింది.[1][2] చిత్ర దర్శకుడు ఎ. పి. నాగరాజన్ ఆమెకు తండ్రి వైపు నుండి మామయ్య.

ప్రారంభ జీవితం

[మార్చు]

ఆమె 1960 జూలై 7న జన్మించింది. ఆ రోజున ఆమె మామయ్య ఎ.పి.నాగరాజన్ దర్శకత్వం వహించిన వడివుక్కు వలై కప్పు చిత్రం విడుదలైంది. కనుక ఈ చిత్రం తరువాత ఆమెకు ఆ చిత్రం పేరును పెట్టారు. ఆమె సాంప్రదాయకమైన వన్నియార్ కుటుంబంలో జన్మించింది.[3][4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె కుమార్తె పద్మప్రియ.

జీవిత విశేషాలు

[మార్చు]

వడివుక్కరసి ప్రారంభంలో ప్రాథమిక పాఠశాలలో ఉద్యోగంలో చేరింది. కష్టాలు పడుతున్న కుటుంబ పరిస్థితుల కారణంగా ఆమె వేర్వేరు ఉద్యోగాలు చేయడానికి ఎంచుకుంది.[5] ఆమె తమిళ సినిమా రంగంలో "సిగప్పు రోజక్కల్" ద్వారా ప్రవేశించింది. ఆమె మొదటి సినిమా "కన్ని పరువథిలె". ఆమె సినిమాలలో వివిధ పాత్రలు పోషించింది. ఆమె ప్రధాన పాత్రలను కూడా పోషించింది. సహాయ పాత్రలలో పాటు వివిధ పాత్రలు పోషించింది. 2000 ల ప్రారంభంలో, ఆమె టెలివిజన్ సీరియల్స్ లో నటించడం ప్రారంభించింది.[6]

సినిమాలు

[మార్చు]

ఆమె తమిళ సినీ పరిశ్రమలో ప్రధానంగా పనిచేసింది. అదే విధంగా తెలుగు, కన్నడ, మళయాళ భాషా చిత్రాలలో కూడా నటించింది. ఆమె డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పనిచేసింది.

తెలుగు సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. S. R. Ashok Kumar (17 December 2009). "Grill Mill-Vadivukkarasi". The Hindu. Retrieved 19 October 2016.
  2. " 'சிகப்பு ரோஜாக்கள்'ல நடிச்சேன்; செம அடி வாங்கினேன் - நடிகை வடிவுக்கரசி பிரத்யேகப் பேட்டி". The Hindu Tamil. 30 April 2020. Retrieved 25 June 2020.
  3. "I prefer to be in films, says Vadivukkarrasii". The Hindu (in Indian English). 2006-05-25. ISSN 0971-751X. Retrieved 2020-06-25.
  4. https://web.archive.org/web/20161019144524/http://www.nadigarthilagam.com/thisdaythatageJuly.htm
  5. "' I Played Wife, Mother & Grandmother In My 20s. I Got Used To It': In Conversation With Vadivukkarasi". Silverscreen.in (in అమెరికన్ ఇంగ్లీష్). 26 November 2018. Retrieved 2020-03-31.
  6. "TV actress Vadivukkarasi gets robbed; files a police complain". The Times of India. 27 May 2019. Retrieved 25 June 2020.

బాహ్య లింకులు

[మార్చు]