వనం జ్వాలా నరసింహారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వనం జ్వాలా నరసింహారావు
Vanam Jwala Narasimharao.jpg
వనం జ్వాలా నరసింహారావు
జననం
వనం జ్వాలా నరసింహారావు

1948, ఆగస్టు 8
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రచయిత
జీవిత భాగస్వామివిజయలక్ష్మీ
పిల్లలుఇద్దరు కుమార్తెలు (ప్రేమ మాలిని, కిన్నెర), ఒక కుమారుడు
తల్లిదండ్రులుశ్రీనివాసరావు - సుశీలమ్మ

వనం జ్వాలా నరసింహారావు, తెలంగాణకు చెందిన రచయిత. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి (సీపీఆర్‌ఓ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. శ్రీమద్భాగవత కథలు, రామాయణ రసరమ్య గాథలు, శ్రీమదాంధ్ర మహాభారత కథలు వంటి పుస్తకాలను రాశాడు.[1]

జననం, విద్య[మార్చు]

జ్వాలా నరసింహారావు 1948 ఆగస్టు 8న శ్రీనివాసరావు - సుశీలమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలోని వనంవారి కృష్ణాపురం గ్రామంలో జన్మించాడు. నరసింహరావుకు ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళు, నలుగురు తమ్ములు ఉన్నారు. సొంత గ్రామంలో మాధ్యమిక విద్య, ఖమ్మంలో ఉన్నత పాఠశాల విద్యను చదివాడు. తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి లెక్కలు, భౌతిక రసాయన శాస్త్రాల్లో డిగ్రీ, అడ్మినిస్ట్రేషన్ లో ఎంఏ, లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ పూర్తిచేశాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

జ్వాలా నరసింహారావుకు 1969 ఏప్రిల్ 30న అయితరాజు రాంరావు - రాధ దంపతుల కుమార్తె విజయలక్ష్మీతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు (ప్రేమ మాలిని, కిన్నెర), ఒక కుమారుడు ఉన్నారు.

ఉద్యోగజీవితం[మార్చు]

లైబ్రేరియన్ గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన నరసింహరావు గవర్నర్ కుముద్ బెన్ జోషి దగ్గర ప్రాజెక్టు అధికారిగానూ, హస్తకళల అభివృద్ధి సంస్థలో కొంతకాలం, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో కొంతకాలం, అత్యవసర సహాయ సేవల సంస్థలో మరికొంతకాలంపాటు పనిచేశాడు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన పౌర సంబంధాల అధికారి (సీపీఆర్వో)గా పనిచేస్తున్నాడు

రచనలు[మార్చు]

 1. అనుపమ గీతాల తిలక్ (2006)
 2. మందర మకరందం (5 కాండాలు) (2017)
 3. ఎ సింక్రోనస్ హిస్టరీ స్క్రాప్ బుక్
 4. యాన్ ఎజెండా ఫర్ డెవెలప్మెంట్ ఆఫ్ ఏపీ
 5. గవర్నెన్స్ విత్ డిఫరెన్స్
 6. అనుభవాలే అధ్యాయాలుగా
 7. ఇదీ సుపరిపాల
 8. ధర్మధ్వజం
 9. మహాకవి బమ్మెర పోతనామాత్య శ్రీ మద్భాగవత కథలు (281 పేజీలు, ప్రచురణ 2020 అక్టోబరు)
 10. తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఎట్ ఎ గ్లాన్స్ (2020)[2]
 11. ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు (350 పేజీలు, ప్రచురణ 2021 మార్చి)
 12. ఆస్వాదన-కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారత కథలు (474 పేజీలు, ప్రచురణ 2021 ఏప్రిల్‌)

మూలాలు[మార్చు]

 1. telugu, NT News (2021-07-12). "అమూల్య జ్వాలా తోరణం". Namasthe Telangana. Archived from the original on 2021-07-14. Retrieved 2022-10-10.
 2. Today, Telangana (2020-12-27). "KCR appreciates books penned by Vanam Jwala Narasimha Rao". Telangana Today. Archived from the original on 2020-12-27. Retrieved 2022-10-10.