వాడుకరి చర్చ:కాసుబాబు/పాతచర్చలు 9
అహ్మద్ నిసార్ నిర్వాహకత్వ ప్రతిపాదన
అలాగే నేను ప్రతిపాదిస్తాను. రవిచంద్ర(చర్చ) 07:19, 9 జనవరి 2009 (UTC)
NOT ABLE TO WRITE IN TELUGU
Suddenly, I found today (04 01 2008) that I am unable to write in Telugu in Wiki. This is happening while I am logged in. When I am not logged in, I am able to write in Telugu. This is quite strange phenomenon. Can youkindly let me know, what could be the reason and how to rectify this.--S I V A 07:28, 4 జనవరి 2009 (UTC)
నిర్వాహకుల వాండలిజం
వాడుకరి:వైజాసత్య మాటి మాటికి మూలాలున్న పేజిలతో సహా అనేక వ్యాసాలు తొలిగిస్తోంది. క్లారా జెట్కిన్ వ్యాసం కూడా పొంతన లేని కారణాలు చెప్పి తొలిగించింది. మోడరేటర్లకి నీతి నియమాలు అవసరం లేదన్న మాట.
ఏమి జరిగింది
ఇటీవలి మార్పులు చూసినప్పుడు ఈ కింది ఎంట్రీ ఉన్నది- (తేడాలు) (చరితం) . . చి చర్చ:నాస్తికులు; 20:56 . . (-1,092) . . C.Chandra Kanth Rao (చర్చ | రచనలు) (121.245.40.164 (చర్చ) చేసిన మార్పులను, Vu3ktb వరకు తీసుకువెళ్ళారు)
నాదాకా తేవటం ఏమిటి?? నాస్తికులు చర్చా పేజీలో నాకు తొచిన విషయాలు వ్రాసాను. చంద్ర కాంత రావు గారు ఈ విషయం గురించి నాకేమీ సందేశం ఇవ్వలేదు. అసలు ఏమి జరిగింది తెలుపగలరు.--SIVA 16:43, 27 డిసెంబర్ 2008 (UTC)
అంటే 121.245.40.164 ఐ.పి. నుండి చేసిన మార్పులు రద్దు చేసి, విషయాన్ని అంతకు ముందు పొజిషన్‌కు revert చేశారన్నమాట. దుశ్చర్యలను, పొరపాటులను సరిదిద్దే విధానంలో ఇలా చేస్తారు. అంతకు ముందు last acceptable edit మీది గనుక "మీదాకా" వచ్చింది. చూశారా! సామాన్య భాష పదజాలాన్ని పారిభాషిక సందర్భంలో వాడడంలో ఉన్న ఇబ్బంది? అప్రస్తుతమే అయినా నాకు తోచిన ఒక విషయం చెబుతాను. తెలుగు అకాడమీ వారి సంస్కృత భూయిష్ట పదజాలాన్ని చాలామంది విమర్శిస్తారు. ముఖ్యంగా popular science వ్రాసేవాళ్ళు. దీనికంటే ఆంగ్లపదాలే తేలికగా ఉన్నాయంటారు. కాని ఒక శాస్త్రాన్ని తెలుగు భాషలో చదవడానికి సరిపడ పదజాలం చేయాలన్న ఒక ప్రాజెక్టును ఊహించండి. ఆ పనికి చాలా constraints ఉంటాయి. మరింత లోతుగా వెళ్ళిన కొద్దీ పెరిగే derivative పదజాలానికి అవుసరమైనంత vocabulary space రిజర్వు చేయడం. ఇతర భారతీయ భాషలనుండి వ్యత్యాసాన్ని వీలయినంత నివారించడం. వాడుక భాష పదాలను వాడడం వలన రాగలిగే అస్పష్టతను తొలగించడం. మనం ఇంటర్మీడియట్ చదివిన కాలంలో తెలుగు అకాడమీవారు చాలా ప్రశంసనీయమైన కృషి చేశారు. అది విజయవంతంగానే జరుగుతున్నట్లనిపించింది. కాని ఎక్కడో మధ్యలో బొక్కబోర్లా పడింది! --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:07, 27 డిసెంబర్ 2008 (UTC)
- ఇక్కడ వచ్చిన సమాచార అంతరం, తెలుగులో ఆంగ్ల పదానికి సరిపోయే సరైన పదం వాడక కాదు!! అక్కడ వచ్చిన రిమార్క్, ఆటోమాటిక్‌గా వచ్చినట్టుంది. ఆటువంటప్పుడు రావలిసిన వ్యాఖ్య ఈ కింది విధంగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశ్యం
వాడుకరి xxx చేసిన వ్యాఖ్య తొలగించటమైనది. కారణం xx. ఇది నిర్వాహక చర్య.
నిర్వాహకులు వ్యాఖ్యలు తొలగించే సమయంలో కారంణం 1, 2, 3 లేదా 4 అని ఇవ్వాలి. ఆ అంకెలు సూచించే కారంణం మార్గదర్శక సూత్రాలలో పొందుపరచి ఉండాలి. ఆ కారణం సంఖ్య వత్తగానే, కారణం కనపడాలి. ఇలా గనుక చేస్తే, ఏవిధమైన అపార్ధాలకు దారి ఇవ్వటం జరగదు. దీనికి ప్రొగ్రామింగ్‌తో సంబంధం లేకుండా మనం వ్రాశే పద్ధతులను కొద్దిగా మార్చి, మార్గదర్శకాలలో తొలగింపు కారణాల వర్గీకరణ చేస్తే సరిపోతుంది. దయచేసి పరిశేలించండి.--SIVA 03:33, 28 డిసెంబర్ 2008 (UTC)
తెలుగు వాడుక పదాలు
తెలుగులో అన్ని శాస్త్రాలకు సరిపొయయట్టు ఉండాలంటే తెలుగు వాళ్ళందరూ సహకరించాలి. ఏదన్న ఒక ఆంగ్ల పదాన్ని తెలుగీకరించి ఎవరైన ఇచ్చినప్పుడు, ఆ పదం ఎంతవరకు సబబు అన్న విషయం మీద సమగ్రమైన చర్చ జరగాలి. అటువంటి పదం చూసి నవ్వటం, గేలి, హేళన చెయ్యటం చెయ్యకూడదు. ఇదేదో పత్రికా విలేఖరులు, వికీ పీడియన్లు చెస్తారులే అని ఉపేక్షించకూడదు. ఎవరికి తోచినం తవరకు వారు సాధ్యమైనంత సవ్యమైన తెలుగు పదాలు వాడటం పశస్తం. నేను వికీలోకి వచ్చిన కొత్తల్లో, ఒక ప్రతిపాదన చేశాను. అది ఏమంటే, వ్యాసాలు వ్రాశేటప్పుడు అతి చిన్న ఆంగ్ల పదాలకు కూడ తెలుగు పదం వెంటనే తట్టదు. ఇది వికీపీడియన్లందరికి అనుభవంలోకి వచ్చి ఉంటుంది. అందుకని, అంగ్లం నుండి తెలుగు తర్జుమా సహాయానికి ఒక పుట ఏర్పరిచి, అక్కడ సభ్యులు ఎవరైనా సరే వారికి తెలుగు పదం దొరకని, ఏ భాషకు చెందిన (సస్కృతం, తెలుగు శుద్ధ గ్రాంధిక పదాలతో సహా)పదమైనా అక్కడ వ్రాస్తే, తెలిసిన ఇతర సభ్యులు , అటువంటి పదానికి సమాన్య వాడుక తెలుగు పదం సూచించవచ్చు. అలా సూచించబడ్డ తెలుగు పదం సరికానప్పుడు, చర్చా పుటలో చర్చకు వచ్చి, అందరూ అమోదించిన తెలుగు పదం నిగ్గు తేలుతుంది.
సవ్యమైన తెలుగు వాడుక పదాలు శాస్త్రాలలో (Sciences) కూడ రావాలంటే, సంస్కృతం మీద, శుద్ధ గ్రాంధికం మీద ఆధారపడటం మానెయ్యాలి. సాధ్యమైనంతవరకు, సరిపోయే తెలుగు పదం ""పుట్టించాలి"". అలా సాధ్యం కానప్పుడు, ఇతర భాషా పదాన్ని మరీ యధాతధంగా కాకుండా, అటువంటి పదాన్ని 'తెలుగు' చెయ్యాలి, పదం చివర సరైన అచ్చులు కలిపి. అలా కాకుండా , అటువంటి పదం అందరికి అర్ధమవాలన్న కనీసపు ఇంగితాన్ని విస్మరించి, ఏమైనా సరే ఒక పద-సృష్టి చేస్తే చాలు అని కనుక శాస్త్ర విషయాల గురించి వ్రాయటం కొససాగించి(ముఖ్యంగా తరగతి పుస్తకాలు) చిత్రాతిచిత్రమైన, నోరుతిరగజాలని పదాలను తయారుచేస్తే, చదువరులు, పాఠకులు, ముఖ్యంగా విద్యార్ధులు పుంజాలు తెంపుకుని పారిపోయి ( వెనక్కి చూడటానికి కూడ భయపడి) సూటిగా వెళ్ళి ఆంగ్ల మహాప్రవాహంలో పడి కొట్టుకు పోతారు. వికీలో ఇతర భాషా శాస్త్ర పదాలకు తెలుగు పదాల తయారీ కి ముందు, ఒక పుట ఏర్పరిచి, వచ్చే స్పందన ప్రకారం అది ప్రాజెక్ట్ (దీనికి తెలుగు ఏమిటి) గా మార్చవచ్చని నా అభిప్రాయం.--SIVA 04:48, 28 డిసెంబర్ 2008 (UTC)
జయదేవ్ వికి సభ్యుడు
జయదేవ్ దగ్గరనుండి ఇ మైల్ వచ్చింది,ఆయన వికీ లో సభ్యుడయినట్టు. వారి వయస్సు (68 సంవత్సరములు)వారికున్న అనుభవ రీత్యా, స్వతహాగా చిత్రకారుడవటంవల్ల మంచి వ్యాసాలు వికీలో వ్రాస్తారని అనుకుంటున్నాను.--SIVA 02:50, 23 డిసెంబర్ 2008 (UTC)
న్యాయ శాస్త్ర, బ్యాంకింగ్ సంబంధిత వ్యాసాలు
మీ సూచనకు ధన్యవాదాలు కాసుబాబు గారూ! దయ చేసి వికీపీడియాలో వ్రాయదగ్గ న్యాయ శాస్త్ర విషయాలను సూచించండి. "సాక్ష్యము", "ఒప్పందము" ఇలా రాసుకుంటూ పోతే చాలా అవుతాయి. మౌలికమయిన విషయాల మీద వ్రాద్దామా లేక కొన్ని కొని న్యాయ సంబంధమయిన మాటలు (legal vocabulary)గురించి వ్రాద్దామా?? అలోచించి ఒకసారి సూచిచండి, ఇతర సభ్యుల అభిప్రాయం కూడ తీసుకుంటే బాగుంటుంది. తప్పకుండా వ్రాయటానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను.అలాగే, బ్యాంకింగ్ సంబధించిన విషయాలు కూడ, చెక్కు, డిడి, బిల్లు, గృహ రుణాలు(అచ్చు అరు(!!) ఎలా వ్రాయాలో తెలియక ర కు కొమ్మిస్తే రు వ్రాసేసాను క్షంతవ్యుణ్ణి)రిజర్వు బాంకు, నిగొషియబుల్ ఇనుస్ట్రుమెంటు, మొదలగు వాటి గురించి వ్రాద్దామా? మీరన్నట్టు, సరైన తెలుగు పదాలు కొంత సమస్య.కంకర్రాళ్ళవంటి తెలుగు గ్రాంధిక పదాలకు (ఉ దా ప్రీక్వెన్సీ= దైర్ఘ్యమానము)బదులుగా, నలుగురికీ తెలిసి ఇప్పటికే వాడుకలో ఉన్న ఆంగ్ల పదాలను తెలుగులోకి లాక్కొచ్చి (ఉ దా రోడ్=రోడ్డు, పెన్=పెన్ను)ఈ సమస్యను అధిగమించవచ్చు.సాధ్యమయినంతవరకు ఆంగ్ల పదానికి సరయిన తెలుగు పదం వాడాటమే శ్రేష్టం. అలా అని అంతు చిక్కని పదాలు సృష్టించి పాఠకులను భయ భ్రాంతులను చెయ్యటంకూడ అభిలషణీయం కాదు. కొంత చర్చ జరిగిన మీదట ఇటువంటి విషయాలమీద వ్యాసాలు వ్రాయటం మొదలుపెడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఇద్దరు ముగ్గురు సభ్యులు కలసి వ్యాసాలకు ఒక రూప కల్పన చేసి ఆ తరువాత వ్రాస్తే, వ్యాసాలు అర్ధవంతంగా ఉంటాయి, మొలకల బెడద తక్కువవుతుందని కూడ నా అభిప్రాయం.--SIVA 15:36, 18 డిసెంబర్ 2008 (UTC)
తెలుగు సినిమా రికార్డులు
కాసుబాబుగారు. నమస్తే! మీరు ఈ వ్యాస చర్చా పుటలో వ్రాసిన వ్యాఖ్య చదివాను. నాకు చేతనైనంతవరకు వ్యాస రూపాన్ని తేవటానికి ప్రయత్నించాను. ఒకసారి చూసి చెప్పండి. తరువాత, ఈ వ్యాసానికి తెలుగు సినిమా మైలురాళ్ళు అని పేరు మారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.--SIVA 19:30, 17 నవంబర్ 2008 (UTC)
కాసుబాబుగారూ! నమస్తే.మీరు సూచించిన ప్రకారం అమరావతి కథల గురించి, ప్రత్యేక పుట ఏర్పరిచి అక్కడకు కథలగురించిన వ్యాసాంశాలను మార్చటం జరిగింది. అమరావతి కథా సంగ్రహం వ్యాస పుటను పది ఉప పుటలుగా చేసి ఒక్కొక్క ఉప పుటకు పదేసి కథల గురించి వ్రాదామని ఉన్నది. ఇందుకోసం "పాత చర్చల" మూసను వాడి పాత చర్చలు అన్న మాట బదులు కథలు 1 నుండి 10 వరకు అని వ్రాసి ఏర్పరిచాను. మీరు ఒక సారి చూసి మీ సూచన ఇవ్వగలరు. మీ దగ్గరనుండి సూచన వచ్చిన తరువాత మాత్రమే, ఉప పుటకు కథల గురించిన వ్యాసంశాలను మారుస్తాను.--SIVA 02:49, 9 నవంబర్ 2008 (UTC)
- ఒక రోజు ఆగండి. చూసి చెబుతాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 03:39, 9 నవంబర్ 2008 (UTC)
టైటానిక్ నౌక
టైటానిక్ వ్యాసం మెరుగు పరచడానికి ఏమి చెయ్యాలో సలహాలు ఇవ్వండి. దానికి మరింత సమాచారం చేరుస్తాను. వైవిధ్యం కోసమే నేనూ ఈ వ్యాసాన్ని ప్రతిపాదించాను. ఎప్పుడూ వ్యక్తులూ, ప్రదేశాలూ గురించే మొదటి పేజీ వ్యాసాలు ఉంటే బావుండదని! రవిచంద్ర(చర్చ) 14:45, 25 సెప్టెంబర్ 2008 (UTC)
కృతజ్ఞతలు
- నాకు గండపెండేరాన్ని ప్రధానం చేసిన కాసుబాబు గారికి మరియు తెవికీ సభ్యులందరికీ కృతజ్ఞతలు. నేను తెవికీలో పదివేల దిద్దుబాట్లు చేసినా కొండంత లక్ష్యం ముందు ఇది గోరంత కూడా కాదు. ఇంకనూ చేయాల్సింది ఎంతో ఎంతో ఉంది. అయిననూ నన్ను ఈ దశ వరకు తీసుకువచ్చిన ఘనత, ప్రారంభం నుంచి నన్ను ప్రోత్సహిస్తూ, అడుగడుగునా ఉత్సాహపరుస్తూ ముందుకు పయనించేలా చేసిన ఘనత నిస్సందేహంగా వైజాసత్య, కాసుబాబు, దేవా గార్లకే దక్కుతుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 17:16, 1 అక్టోబర్ 2008 (UTC)
మీ సూచన ను పరిగణిస్తాను. 2007లో 'ఈనాడు' ఆదివారం అనుబంధం లో చక్కని వ్యాసము వచ్చింది. వెబ్ లో కూడ చాల సమాచారము ఉన్నది. బెజ్జల వారి వ్యాసము చాల పెద్దది. ఆన్ని వివరాలు సమకూర్చి వ్రాస్తాను.Kumarrao 15:42, 2 అక్టోబర్ 2008 (UTC)
ఆంగ్ల వికీ బొమ్మలు
రవీ! ఆంగ్ల వికీలోని బొమ్మలు తెలుగు వికీలో వాడాలంటే క్రింది విషయాలు గమనించు.
- అవి వికీమీడియా కామన్స్‌లో ఉంటే సమస్యే లేదు. నేరుగా వాడేయవచ్చును.
- అవి ఆంగ్ల వికీలో మాత్రమే ఉండి, ఉచిత కాపీహక్కు బొమ్మలైతే
- నువ్వు వాటిని తెలుగు వికీలోకి తిరిగి లోడ్ చేసావు. ఇది నిషేధం కాదు కాని అంతగా ప్రోత్సహింపబడదు. ఆంగ్ల వికీనుండి వికీమిడియా కామన్స్‌కు ఎగుమతి చేయడం సరైన పద్ధతి. ఇందుకు ఆ ఆంగ్ల వికీ బొమ్మలో {{copy to commons}} ఆనే మూస పెట్టడం ద్వారా చేయడం మంచి పద్ధతి.
- నువ్వు వికీమీడియా కామన్స్‌లో సభ్యత్వం తీసుకొని ఎగుమతి చేసేయవచ్చును.
- ఒకవేళ అది ఉచిత బొమ్మకాకపోయినట్లైతే "Non-free Fair Use" క్రింది తెలుగు వికీలో వాడాలి. అప్పుడు దానిని తెలుగు వికీలోకి అప్‌లోడ్ చేయాల్సిందే.
--కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:38, 3 అక్టోబర్ 2008 (UTC)
- కామన్స్ లోకి బొమ్మను చేర్చి తెవికీ నుంచి తీసేస్తాను. అప్పుడు ఓకే కదా! రవిచంద్ర(చర్చ) 08:55, 3 అక్టోబర్ 2008 (UTC)
బుద్దుడు
విశ్వనాధ్! బొమ్మ:Budda-1.jpg - మీరు స్వయంగా గీసిందా? లేక ఏదైనా బొమ్మనుండి తీసిన ఫొటోనా? ఇది ఈ వారం బొమ్మ పరిగణనలో ఉంది గనుక స్పష్టమైన సమాచారం ఆ బొమ్మ సారాంశంలో వ్రాయ గలరు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:29, 6 జూలై 2008 (UTC)
- సుదాకర్ గారూ ఈ మెసేజ్ నేను గమనించలేదు. ఇప్పుడే చూసా. ఇది నేను తీసిన పొటోనే. ఇలాంటి చిత్రాలు అమ్మకమునకు పెట్టిన స్టాల్ నుండి తీసుకొనబడినది. వేరొకటి ఉన్నది. వాటి ప్రక్కన నేను నిల్చుని ఉన్నది. అది కూడా అప్ లోడ్ చేయమంతే చేస్తాను. కాకుంటే అందులో నేనే ఎక్కువ స్థలం ఆక్రమించి ఉన్నాను. ఆచిత్రానికి తగిన వివరణ సారాంశములో వ్రాస్తాను. శెలవు.--విశ్వనాధ్. 07:30, 7 అక్టోబర్ 2008 (UTC)
మీకు తెలుసా
కాసుబాబు గారూ ! మీకు తెలుసా మూసలో కొత్త వ్యాసాలలో మీకు ఆసక్తిగా అనిపించిన కొన్ని వాక్యాలను కామెంట్లలో చేరుస్తూ ఉండండి( అప్పుడప్పుడు ఒక్కొక్కటి అయితే సులభంగా ఉంటుంది). ఒక ఐదారు వాక్యాలు పోగుచేశాక పాతవాటిని భద్రపరచి కొత్తవాటితో నింపుదాం. ఈ ఆలోచన ఎలా ఉంది. నేను ఇప్పటికే ఒక వాక్యాన్ని చేర్చాను చూడండి. రవిచంద్ర(చర్చ) 17:27, 11 అక్టోబర్ 2008 (UTC)
- తప్పకుండా బాగుంటుంది. కాని నాకు ప్రస్తుతం క్రొత్త శీర్షికలు నిర్వహించడానికి కష్టంగా ఉంది. ఇతరులు ఇలాంటి పనిని చేసేలా ప్రోత్సహిద్దాము. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:31, 11 అక్టోబర్ 2008 (UTC)
కొత్తలైను
కాసుబాబు గారూ మీసూచన చూశాను సూచించినందుకు కృతజ్ఞతలు.అలాగే పాతచర్చలకు వేరే పేజీ సృష్టించనికి ఎలాంటి అయంతరంలేదు.--t.sujatha 03:23, 13 అక్టోబర్ 2008 (UTC)
తెలుగు పతాకం
తెలుగు మెడల్ | ||
తెలుగు సాహిత్యం, సాహిత్య చరిత్ర, కవులు మొదలైన తెలుగు భాషా వ్యాసాలపై కాసుబాబు గారు చేస్తున్న విశేష కృషికి కృతజ్ఞతాంజలిగా తెవికీ సభ్యులందరి తరఫున వీరికి తెలుగు పతకం సమర్పించుకుంటున్నాను --వైజాసత్య 15:37, 2 నవంబర్ 2008 (UTC) |
- కృతజ్ఞతలు. గందరగోళం లేకుండా ఇతరులు పాల్గొనడానికి వీలుగా మూసలు చేస్తున్నాను. ఉత్సాహంగా సాహిత్యంపై వ్యాసాలు కూర్చమని కోరుతున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:40, 2 నవంబర్ 2008 (UTC)
కుశలమా?
నమస్తే కాసుబాబు గారూ, కుశలమా! నిసార్ అహ్మద్ 16:27, 5 నవంబర్ 2008 (UTC)
- కుశలమే. మీదే చిరకాల దర్శనం. అంతా క్షేమమేనా? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:26, 5 నవంబర్ 2008 (UTC)
కాసుబాబు గారూ, క్షేమమే. గత మూడు నెలలుగా చాలా బిజీగా యుంటిని. ఇపుడు కొంచెం తీరిక దొరికింది. తెవికీలో పాలుపంచుకుంటున్నాను. Big Bang కు సరియైన తెలుగు పదం 'మహావిస్ఫోటం' లేదా 'మహావిస్ఫోటనం' రెండింటిలో ఏది సరైనదో కొంచెం తెలుపగలరా నిసార్ అహ్మద్ 15:23, 7 నవంబర్ 2008 (UTC)
- నాకూ తెలియదు. ప్రస్తుతానికి మహా విస్ఫోటనం - వాడవచ్చును అనుకొంటాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:42, 7 నవంబర్ 2008 (UTC)
కాసుబాబు గారూ నమస్తే, 'వికీపీడియాలో వుండవలసిన వ్యాసాలు'లో సోక్రటీస్ ను మూలం చేసుకుని ఓ పేజీ సృష్టించి కొంచెం వ్రాసాను. కాని తీరా చూస్తే సోక్రటీసు పేరుతో ఇంతకు మునుపే ఒక వ్యాసం ఉన్నది. దీంట్లో ఏదో ఒకటి వుంచి, ఇంకోదానిని తీసివేయండి ప్లీజ్. నిసార్ అహ్మద్ 19:38, 10 నవంబర్ 2008 (UTC)
తెవికీలో తప్పకుండా వుండవలసిన వ్యాసాల జాబితా
కాసుబాబు గారూ నమస్తే, "తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు" జాబితా తయారుకు ప్రారంభం శుభసూచకం. సభ్యులందరికీ అభినందనలు. మీరు దీనికి మార్గ దర్శకాలు ఇస్తున్నారు, దీనికీ అభినందనలు అందుకోండి. అలాగే, నాపేజీలో చివరిభాగాన ఓ నమూనా జాబితా తయారీకి శ్రీకారం చుట్టాను. దీనికి మూలం వికీపీడియా:వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు. ఈ రూపేణా జాబితా తయారీకి అనుకూలమా కాదా, ఓ మోస్తరులా వున్నది అని తోచితే, సవరణలు చేసి జాబితా తయారు చేయండి, లేదా తగు సూచనలివ్వండి. సోదరుడు నిసార్ అహ్మద్ 19:21, 19 నవంబర్ 2008 (UTC)
- అలాగే చేస్తాను. ఇది కొంత సమయం పట్టేలా ఉంది. అందరూ పాల్గొంటారని ఆశిస్తున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:52, 20 నవంబర్ 2008 (UTC)
గమనించ వలెను
రవీ (వైజా సత్య) మరియు రవీ (రవి చంద్ర) ! నేను డిసెంబరు మాసంలో ఆఫీసు పనిలో బిజీగా ఉంటాను. 2009 జనవరి, ఫిబ్రవరి నెలల్లో సెలవు లేదా పని వత్తిడిలో ఉంటాను. కనుక ఈ విషయాలు గమనించగలరు. (1) ఈ వారం వ్యాసం, ఈ వారం బొమ్మలు 52 వారాల వరకు సిద్ధం చేస్తాను. 2009 బొమ్మలు, వ్యాసాలు కొంత కాలం మీరు చూసుకోండి. (2) ఈ రోజు చిట్కా ఖాళీగా ఉన్న రోజులలో రవి పూర్తి చేయగలడనుకొంటాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:02, 24 నవంబర్ 2008 (UTC)
కూర్పులు కనబడకపోవడానికి కారణం
కాసుబాబు గారూ, నమస్తే, నేను వ్రాసిన చాలా వ్యాసాలకు కూర్పుల చరిత్ర కనబడుటలేదు, కారణం తెలియదు. ఉదాహరణకు, ఊపిరి తిత్తులు, కలువ పువ్వు మొ. (ఇంకనూ ఇలా చాలా వున్నవి). వ్యాసాలు మొదలెడితే వాటి చరిత్ర నిక్షిప్తమై యుంటుందని అంటారు, కానీ, ఇలా ఎందుకు కనబడుటలేదో కారణం కొంచెం తెలుపగలరా. తెలుసుకోగోరుచున్నాను. ధన్యవాదములు. నిసార్ అహ్మద్ 16:09, 27 నవంబర్ 2008 (UTC)
అభినందనలు
కాసుబాబుగారూ నమస్తే, వివాదాస్పద వ్యాసాల పట్ల సీరియస్ గా మీరు తయారు చేసిన 'సున్నిత విషయాలు' మూస బాగుంది, అభినందనలు. నిర్వాహకుడిగా మీరు చూపిన నిశిత పరిశీలన మరియు స్పురద్రూపానికి నా మన॰పూర్వక ధన్యవాదాలు. మీరు చూపిన మార్గదర్శకాలు మరియు ప్రతిస్పందిచిన తీరు 'పరిణతి చెందిన' నిర్వాహకుడికి కావలసిన లక్షణాలతో కూడి వున్నవి. ధన్యవాదాలు. నిసార్ అహ్మద్ 04:48, 14 డిసెంబర్ 2008 (UTC)
ప్రతినమస్కారం
ఇంతకు మునుపు కంటే ఇప్పుడు తెలుగులో టైపు చేయడం చాలా సులువుగా ఉందండి. ఆవికీలో నిర్వాహకునిగా కంటే మాతృభాషలో మామూలు సభ్యునిగానే బావుంది. తెవికీ 50,000 వ్యాసాలకు చేరువైనందుకు మీకు నా అభినందనలు - ఈ మైలురాయిని చేరుకోవడానికి ఉడతాభక్తిగా నా సహాయం అందిస్తాను. ఏకవచన ప్రయోగం కొంచెం ఇబ్బందిగా ఉంది. :-) --Gurubrahma 19:50, 15 డిసెంబర్ 2008 (UTC)
ఈ వారపు వ్యాసం ప్రణాళిక ప్రతిపాదన
కాసుబాబు గారు, వికీపీడియా చర్చ:ఈ వారపు వ్యాసం జాబితా లో ఈ వారపు వ్యాసం ప్రణాళిక ప్రతిపాదన చేసాను. మీ అభిప్రాయాలు తెలుపగలరు - --Svrangarao 23:41, 15 డిసెంబర్ 2008 (UTC)
తెలుగు వికీపీడియాకు మారుపేరు వైజాసత్య గారు
ప్రారంభం నుంచి తెలుగు వికీపీడియాకు అహర్నిషలు కృషిచేసిన వైజాసత్య గారి పైన కొందరు పిచ్చిపట్టిన అనామక వ్యక్తులు విమర్శలు చేయడం భాధ కలుగుతుంది. ఇది లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేనేలేదు. తెలుగు వికీపీడియన్ల సంపూర్ణ మద్దతు అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వైజాసత్య గారికి ఉంటుంది. వైజాసత్య గారు ఏది చేసిననూ అది తెవికీ అభివృద్ధికేనన్న మాట సంపూర్ణ తెలుగు సమాజానికి తెలుసు. తెలుగు వీపీడియాపై విమర్శలు చేసిన పిచ్చి వ్యక్తికి ఏ మాత్రం జ్ఞానం ఉన్నా ఇక ఈ విజ్ఞానసర్వస్వం లోకి రానేకూడదు. అతను చేసిన అన్ని రచనలకు ఇక తొలిగించడమే తరువాయి. దీనికి చర్చ కూడా అనవసరం. తెలుగు వికీపీడియాకు వ్యతిరేకంగా నీచవ్యాఖ్యలు చేసిన అతడి రచనలను మనం మాత్రం ఎందుకుంచాలి. సభ్యులందరూ దీన్ని గమనించగలరు. -- C.Chandra Kanth Rao(చర్చ) 09:06, 28 డిసెంబర్ 2008 (UTC)