Jump to content

వాడుకరి చర్చ:Doddanna Akhila

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
  • లలితా సహస్రనామ భాష్యము*
  • "అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహా*"

సృష్టికి మూలం స్త్రీ శక్తి ఆ శక్తి యందు ఇమిడియున్న దివ్యవిగ్రహాలు రెండు:- 1.అమ్మవారు 2. జన్మనిచ్చిన తల్లి

బ్రహ్మాండములు అమ్మవారి యోని నుండీ జన్మిస్తాయి

పరమాత్మ నుండి పరాశక్తి

పరాశక్తి నుండి ప్రకృతి అనగా పంచభూతములు

ఆకాశము నుండి వాయువు

వాయువు నుండి అగ్ని

అగ్ని నుండి జలము
జలము నుండి పృథ్వీ

ఆవిర్భవించి ప్రకృతి నిర్మాణం జరిగింది

ఈ పంచ భూతములె పంచ ముఖములు గాయత్రి

ఈ ప్రకృతిలో పిండాండములు స్త్రీ యోని నుండి జన్మిస్తాయి .

ముందుగా బ్రహ్మాండ జనన క్రమాన్ని పరిశీలిస్తే ఈ యొక్క పాంచభౌతిక ప్రకృతి స్వరూపిణీ (పంచభూతేశి) యగు జగన్మాతకు 6 ఋతువులు .. బ్రహ్మాండములన్నియు జగద్యోని స్వరూపిణీ జగన్మాత యోని నుండి జన్మించినవి.

పిండాండ జనన క్రమాన్ని పరిశీలిస్తే పాంచభౌతిక దేహానికి 12 ఋతువులు. దీనినే రుతుచక్రం అంటారు.

పిండాండములు మానవ దేహం నందు రజోబిందు శ్వేత బిందు కలయిక వలన పిండంగా ఏర్పడి రుతుక్రమం స్తంభించి నవమాసములు తల్లియొక్క గర్భాలయం నందు నవ దేవీ నిర్మిత నవ ఆవరణ పురి ఈ శరీరం (శరీరమే శ్రీ చక్రం) గా రూపుదిద్దుకుంటుంది

  • దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః*

ఇట్టి దైవీ స్వరూపమైన దేహం నందు ఏర్పడిన రుతుక్రమం స్తంభించనిదే ఈ దేహం నిర్మాణం కాదు

సభ్య సమాజంలో

రుతు సమయాన్ని

ముట్టు అంటు అనే ఏహ్యమైన ప్రక్రియగా చూస్తున్నారు

అనాచార సంస్కృతి ప్రభలి 

స్త్రీని రుతు సమయంలో ముట్టుకోకుండా దూరంగా ఉంచే విధానం కొనసాగుతుంది.

దానిని విచారించి చూస్తే మానవ దేహం (నవమాసముల రుతు రక్తము మల మూత్రము) యందు కదా నిర్మాణము జరిగిది .

ఈ శరీరము ఏ విధంగా దైవీ ఆరాధనకు పూజలకు యజ్ఞయాగాది క్రతువులకు నోము లకు వ్రతాలు చేయడానికి అర్హమవుతుంది.?

పూర్వ ఆమ్నాయ గ్రంథాలు ఏం చెబుతున్నాయి?

ఋతుక్రమమును ఒక యజ్ఞంగా చెబుతున్నాయి శాస్త్రాలు.

స్త్రీ ఋతుక్రమం 4వ రోజు నుండి దేహం అనూతన అండములను నిర్మాణము చేస్తుంది . అట్టి అండములు సంతానొత్పత్తి కొరకు 16 దినములు స్త్రీ దేహములో సిద్దంగా ఉంటాయి. రజోబిందు శ్వేత బిందు (శుక్రకణాలు) కలయికతో పిండంగా మారుతుంది. ఈ క్రమములో గర్భం ధరించని యెడల ఋతువు ఏర్పడి 3 దినములు రజస్సును ప్రకృతికి ఇవ్వడం జరుగుతుంది .

ఈ ప్రక్రియ స్త్రీ దేహమునందుదేవతలు సృష్టించినది కాదా

వేదములు ఋషి ప్రోక్త ములు పూర్వకాలము నందు ఋషి కన్యలు అనగా స్త్రీలు కూడా వేద అధ్యయనం చేసేవారు

కాలక్రమంలో స్త్రీలను వేద అధ్యయనానికి

దూరం చేసినారు 

ఆమ్నాయములు తంత్రములు శివ పార్వతి సంవాదం శివునిచే పార్వతికి చెప్పబడినవి

ఊర్ధ్వ ఆమ్నాయము నుండి విరచితమైన కులార్ణవ తంత్రం జ్ఞానార్ణవ తంత్రం

రుతుక్రమాన్ని ఒక యజ్ఞముగా చెప్తుంది.
దేహమునందుజరుగు ఉచ్వాస నిశ్వాస మొదలు స్త్రీ పురుష సంగమం మరియూ రుతుక్రమాన్ని కూడా ఒక యజ్ఞంగా చెప్పింది శాస్త్రం 

స్త్రీ యొక్క రుతుక్రమ సమయాన్ని అంటరానితనంగా చూసే మానసిక దుర్భరత్వ స్థితి నుండి మేల్కొని స్త్రీ ఋతు సమయాన్ని పవిత్ర భావనతో ఆచరించనివ్వండి..

దక్షయజ్ఞమునందు యోగాగ్నిలో శరీరాన్ని చాలించిన సతీదేవి శరీర భాగాలు పడిన

స్థలములే శక్తి పీఠాలు

అట్టి పీఠాలలో ప్రధాన శక్తిపీఠం అస్సాం లోఉంది కామాఖ్య శక్తిపీఠం . 

సతీదేవి శరీర భాగముల లో (యోని) (భగము) పడిన స్థానము

ఇప్పటికీ అమ్మవారి యోని భాగమునే  ఆరాధిస్తారు  

సతీ దేవి యోని భాగం ఈరోజు వరకు ప్రతి సంవత్సరం రుతుక్రమం జరుగుతూ ఉంటుంది.

అట్టి సమయాన్ని అక్కడ అర్చకులు మహా పర్వదినములుగా ఆచరిస్తారు.

కామాఖ్య అమ్మవారు రహోయాగ క్రమారాధనలో ఉంటుంది అని ఈ ప్రకృతికి సమస్తానికి సృష్టి స్థానంగా భావిస్తారు

కామాఖ్య దేవి ప్రకృతికి సృజనాత్మక శక్తిని ప్రసాదిస్తుంది అని నమ్ముతారు.

ఆ పర్వదినాలలో విశేషంగా మంత్ర,,యంత్ర ,తంత్ర, జప, తప ,యజ్ఞ ,యోగ, సాధనలు చేస్తారు.

వేదమాత, ప్రకృతి శక్తి ,గాయత్రి ,గీతామాత, నదీమ తల్లి ,గోమాత , భూమాత అని చివరికి ద్విజులు ధరించే గాయత్రి కూడా స్త్రీ శక్తి రూప నిర్మితమై ఉంది

సర్వత్రా స్త్రీ రూపంలో దేవతలను ఆరాధించే సంస్కృతిలో జన్మించిన మనము స్త్రీ విలువను తెలుసుకుందాం

యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః

సర్వభూతములు మాతృత్వాన్ని సంతరించుకున్నాయి అని మంత్రాలు చెబుతున్నాయి
 

స్త్రీ ని అంటరానిదానిగా చూస్తున్న ఓ సభ్యసమాజమా మేలుకో..

స్త్రీ లేనిదే సృష్టి లేదు.నీవు లేవు..నేను లేను..ఏదీ లేదు

స్త్రీ విలాస వస్తువు కాదు. పరాశక్తి.

  • స్త్రీ యోని నుంచి జన్మించిన జీవుడు

భగవతి యోనిలో ప్రవేశించడమే మోక్షం*

స్త్రీ నీ పూజిద్దాం.. స్త్రీ ని గౌరవిద్దాం..

(స్త్రీ శరీరంలో అవయవాలను చూసినపుడు

స్తనాలు నీకు పాలిచ్చి పోషించిన అమృతభాండములని ,

నాభిస్థానం నీ శరీర నిర్మాణము జరిగిన గర్భాలయ స్థానమని, 

నడుము నీ బాల్యదశలో పారాడి అధిష్టించిన సింహాసనమని,

యోని నీ జన్మస్థానం అని ఆలోచిస్తే.

స్వాగతం

[మార్చు]
Doddanna Akhila గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

Doddanna Akhila గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ వాడుకరి:B.K.Viswanadh గారిని ప్రత్యేకంగా మీకోసం గురువుగా కేటాయించారు. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూడండి. అక్కడ మీకవసరమైన ఏ సహాయమైనా చేసేందుకు B.K.Viswanadh గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరించండి.
  • తెలుగు వికీపీడియా పరిచయానికి అంచెలంచెల(step by step) పారస్పరిక (interactive)బోధన, వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం) చూడండి. తెలుగు వ్యాసరచన గురించి విషయ వ్యక్తీకరణ, కంప్యూటర్ లో తెలుగు టైపు చెయ్యడం గురించి టైపింగు సహాయం, కీ బోర్డు వ్యాసాలు ఉపయోగపడతాయి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 01:18, 22 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]

== #జంతుబలులు

- పాత మహేష్ గారి వ్యాసం

కొన్ని సంప్రదాయాలలో మరియు కొన్ని ఇతర సనాతన ధర్మ ఆచారాలలో కొంతమంది దేవతలకు జంతు బలులు సమర్పిస్తారు. దానిలోని అంతరార్థం ఏమిటి..?

సనాతన ధర్మంలోని కొన్ని సంప్రదాయాలలో తమ కోరికలు నెరవేర్చుకోవడానికనీ, మొక్కుబడిగా కానీ జంతు బలులు ఇచ్చే ఆచారం ఉన్నది.

కానీ సనాతన ధర్మంలోని అన్ని విషయాలు మనుష్యుల మరియు ఇతర ప్రాణుల యొక్క హితం కోసం చెప్పబడ్డాయి. లోకమంతా సుఖంగా ఉండాలీ అన్న సనాతన ధర్మం..దానికి మూలం ఐన ఆ భగవంతుడూ ఒకరి కోరికలు తీర్చడానికి ఇంకొక ప్రాణాన్ని బలి కోరతాడా..?

బలి అంటే...:

గుడిలోని బలి పీఠం సనాతన ధర్మంలో భూత బలి అనే ఆచారం స్పష్టంగా చెప్పబడింది. ప్రజలు తాము ఇంటిలో వండిన అన్నమును కానీ, ఇతర పదార్థమును కానీ, గుడిలో వివిధ దిక్కులలో కానీ బలి పీఠం వద్ద కానీ ఉంచుతారు. వాటిని జంతువులూ, ప్రకృతి లోని ఉగ్ర భూతములూ తింటాయి. ప్రకృతిలోని ఇతర ప్రాణులకూ కూడా ఆహారం అందించే మంచి ఉద్దేశ్యముతో ఇది చెప్పబడినది. ఇది గృహస్తులు కూడా ఇంటివద్ద చేయాల్సిన పనిగా చెప్పబడింది. ఐతే బలికి,  హోమానికి తేడా ఉన్నది..  హోమం అగ్ని ద్వారా ఇస్తారు.

ఆచరణలో దోషం :

కొన్ని సంప్రదాయాలలో జంతు బలుల ప్రస్తావన ఉన్నది....  అవి దేవతలకు ఒక పొట్టేలునో, మేకపోతునో,  నల్లపిల్లినో,  దున్నపోతునో బలి ఇవ్వమని చెప్పాయి.

ఐతే దాని అర్థం... ఒక అమాయకమైన జంతువును దేవుడి పేరు చెప్పి అన్యాయంగా హత్య చేయమని కాదు.

నల్ల పిల్లి  దొంగతనానికి సంకేతం. అందుకే పిల్లిలా వచ్చాడు రా అంటూ ఉంటారు. చప్పుడు చేయకుండా వచ్చి చీకట్లో దొంగతనం చేయడంలో పిల్లిని ఉదాహరణగా చెప్తారు. ఇక నల్ల పిల్లి ఐతే అసలే కనపడదు. నల్ల పిల్లిని బలియ్యి అంటే నీలోని పరుల సొమ్ముపై ఉన్న ఆశ అనే నల్ల పిల్లిని బలియ్యి అని.. అంతే కానీ.., ఒక నల్ల పిల్లిని చంపేయమని కాదు.

మేకపోతు లేక పొట్టేలు మూర్ఖత్వానికి ప్రతీకలు. ఒకటి ఎటు వెళితే మిగిలినవి కూడా అనుసరించి వెళ్ళిపోతూ ఉంటాయి. నీలోని మూర్ఖత్వాన్ని బలి ఇవ్వడం ద్వారా చేసిన కర్మ వలన మరలా పునర్జన్మ వస్తుంది అనే సత్యం తెలుసుకుని మోక్ష మార్గం లో ప్రయాణించవచ్చు.

దున్నపోతు పిరికితనానికీ బద్దకానికీ జడత్వానికి ( చైతన్యం లేకపోవుట)  ప్రతీక... నీలోని జడత్వాన్ని వదిలి చైతన్యం వైపూ,  బద్దకాన్ని విడిచి ఉన్నతమైన జీవితం వైపూ...  నాకేమౌతుందో అన్న పిరికితనం లో ఉన్న శరీరం పైన మోహాన్ని త్యజించి మోక్షం వైపూ ప్రయాణించమని దాని అర్థం.

ఆ విధంగా మనలోని లోపాలను బలియ్యమని శాస్త్రాలు చెప్పాయి తప్ప జీవహింస చేయమని కాదు.

మూఢనమ్మకం...

కోరికల కోసం జంతు బలులు ఇవ్వడం అనేది ఒక మూఢనమ్మకం మాత్రమే.

భాగవతంలో కృష్ణుడిచే...పశూమ్ దృశ్యంతి విశబ్దా:.... అని బలి పేరిట అన్యాయంగా చంపివేయబడ్డ జంతువులు స్వర్గంలో చంపిన వాడిపై పగతో ఎదురు చూస్తాయి అని చెప్పబడింది.

అదేవిధంగా భగవద్గీత (5-18) ప్రతి జీవి దేవుడి దృష్టిలో సమానం అని చెప్పినది.

ఒక కాలంలో చారిత్రక తప్పిదంగా ఏర్పడిందే తప్ప సనాతన ధర్మంలో జంతుబలి లేదు.

అశ్వం నైవా గజంనైవ వ్యాఘ్రం నైవచ నైవచ…

అంటూ పూర్వం చెప్పిన రీతిలో గుఱ్ఱమును, ఏనుగును, పులులను చంపలేరు కనుక లోకువగా దొరికిన మేకను దేవుని పేరుతో చంపినారు అని..,

ఋగ్వేదంలో దున్నపోతుల, మేకపోతుల బలులు బ్రాహ్మణులు అర్పించి ఇంద్రుడిని తృప్తి పరిచారు అని ఉన్నది.... ఇంద్రుడు ఇంద్రియములకు దేవత....  అంటే వారి ఇంద్రియాలలో మనసులో లోపాలను బలిగా సమర్పించారు అనే తప్ప చంపేశారు అని కాదు.

వేదాలు .. ఇతర ఐతిహాసిక గ్రంథాలు పుస్తక రూపంలో రావడం వలన, గురువు వద్ద నేర్చుకోకుండా వారి వారి సొంత అభిప్రాయాలకు రావడం వలన ఏర్పడిన తప్పిదమే తప్ప మరొకటి కాదు.

ఇప్పుడు మనకు జంతు బలుల యొక్క అంతరార్థం తెలిసింది....  కనుక ఇకనైనా విచక్షణతో ప్రవర్తిద్దాం.

అమాయకమైన జంతువులను బ్రతకనిద్దాం. ఇకనైనా నోరులేని మూగజీవాలని మొక్కుబడుల పేరుతో  దారుణంగా హింసించకండి... దైవాన్ని ప్రసన్నం చేసుకునే ఉత్తమమైన మార్గాలు ఎన్నో ఉన్నాయి..వాటిని ఆచరించండి.

ముందుగా బలి ఇవ్వవలసింది మనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని 🙏

జీవిజంపుటెల్ల శివభక్తి తప్పుటే

జీవునరసి కనుడు శివుడె యగును

జీవుడు శివుడనుట సిద్ధంబు తెలియరా

విశ్వదాభిరామ వినుర వేమ...!

జీవుడికి, శివుడి మధ్య బేధం లేదు. తరచి చూస్తే జీవుడే శివుడు, శివుడే జీవుడు. ఏ జీవినీ హీనంగా చూడరాదు. జీవిని చంపడమంటే శివభక్తి తప్పడమేననీ, జీవహింస మహాపాపమని ఈ పద్యంలో చెప్పారు వేమన మహాకవి. Akhila Doddanna (చర్చ) 04:29, 24 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Akali porataam

[మార్చు]

యుద్ధం గురించి

యుద్ధం ఎప్పుడూ అబద్ధాలే చెబుతుంది.

వివస్త్ర అయిన ఆకలి ఒక్కటే నిజం చెబుతుంది!

--------------------------------------------------

ఆకలి

ప్రపంచంలో ఆకలి అంటే ఒకటే.

భాష మారొచ్చు, పదాలు మారొచ్చు

ఆకలి నుంచే శ్రమ పుట్టింది.

ఆకలి నుంచే సమూహం ఏర్పడింది.

అలాగే ...యుద్ధమూ పుట్టింది.

నీలిరంగులో మునిగిపోయినట్టు వుండే

చిన్న ప్రదేశం,  చిద్ర ప్రదేశం

నిన్నటి దాకా నేను ద్వేషించిన ప్రదేశం

ఇప్పుడు కడుపులో దేవేస్తోంది

ఇప్పుడు గుండెల్లో పొదువుకోవాలనిపిస్తోంది

నేను తినే ముద్దలో నాలుగు మెతుకులు

దానికి తినిపించాలనిపిస్తోంది.

భూసంబంధమైన అనుబంధం ఏదో

నా చుట్టూ వున్న నీళ్ళల్లో కరిగి పోతున్నట్టు

అనిపిస్తోంది.

నిజానికి అది కరిగిపోవడం కాదు...

స్వీయత్వపు పాత చర్మాన్ని తొలగించి

నా పక్కటెముకల మధ్య ఖాలీలో

సుడులు తిరుగుతూ శ్వాస తీసుకొనివ్వడం లేదు.

పదునైన అంచుల మెరుపు సముద్రం

కన్నీటిని రుచి చూపిస్తుంది.

సరిగ్గా పద్నాలుగేళ్ళ పిల్ల నా కూతురు వయసు పిల్ల

పిడికెడు అన్నం కోసం బజారులో నిలబడుతుంది

ఈరోజు ఆ పిల్లకు ఒక రొమ్ము లేదు.

ఎవడిలో వున్న ఆకలి దాన్ని కొరుక్కుతినేసిందో?

ఎడుపోస్తోందిరా నా సింహాలీ తల్లీ!

నెత్తురోడుతున్న ఆ ఒంటి రొమ్ముతోనే

మళ్లీ వచ్చి నువ్వు అక్కడ బజారులో నిలబడటాన్ని

గురించి చదివినప్పుడు...

గజగజ వణికిపోతూ నా కూతుర్ని గుండెల్లో

పొదువుకున్నాను.

ఇప్పుడా పసి తల్లికి రెండో రొమ్ము కూడా వుండివుండదు.

ఆకలి దుర్మార్గమైనది

ఏ ఆకలైనా మానవత్వాన్ని మసి చేసేస్తుంది.

ఆకలే యుద్ధాలకు పురిగొల్పుతుంది.

యుద్ధంలో ఏ దేశమూ సురక్షితం కాదు.

యుద్ధంలో సురక్షితమైన చేతులు వుండవు

యుద్ధం సురక్షితమైన దేశం వుండదు

అసురక్షితమని భావించేందుకే

దేశాలు యుద్ధానికి దిగుతాయి.

దేశాలు యుద్ధంలో భద్రతను పణంగా పెడతాయి.

దేశాలు యుద్ధంలో నష్టాలను లెక్కిస్తాయి.

యుద్ధం లెక్కించలేనిది ఆకలి.

తమని తాము అమ్ముకునే పసిపిల్లలనీ.

యుద్ధం అంటే మృతదేహాల లెక్కింపు.

మరి రక్తాన్ని ఎలా లెక్కస్తారు?

ఆకలి అమానుషాల్ని ఎలా లెక్కిస్తారు?

కన్నీటిని, ఎడబాటునీ దేంతో కొలుస్తారు.

చిత్రంగా యుద్ధం చేసే దేశాలు

ఈ విషయాన్ని అనుకూలంగా మరచిపోతాయి.

చరిత్ర చరిత్రను మరచిపోయినప్పుడు,

అది యుద్ధానికి వెళుతుంది.

యుద్ధం అనేది చెడ్డ జ్ఞాపకశక్తి ఉన్న వ్యక్తి.

యుద్ధానికి రెండు చేతులు ఉన్నాయి.

యుద్ధం చేయాలంటే రెండు చేతులు కావాలి.

ఒక్కోసారి

యుద్ధంలో రెండు చేతులు సరిపోవు.

యుద్ధం చేతులను కట్టివేస్తుంది

యుద్ధం నోళ్లని కుట్టివేస్తుంది.

యుద్ధం అంటే సర్కాస్లో తాడుమీద నడవడం యుద్ధం పిచ్చిని సమతుల్యం చేస్తుంది.

యుద్ధం అనేది భూమి, గాలి సముద్రాలమీద 

చావు ఈత

యుద్ధం ఎత్తునుంచి ఎగిరి దూకడం

యుద్ధం ఒక మతి తప్పిన ఒక వాహనం

దాన్ని వెనుక నుచి తోయడానికి సురక్షితమైన బలమైన,చేతులు అవసరం.

సురక్షితమైన చేతుల్లో యుద్ధం సురక్షితం కాదు.

యుద్ధం అనేది ఇతరులు జీవించే ప్రమాదం.

యుద్ధానికి వెళ్లని వారు ప్రత్యక్ష యుద్ధం చేస్తారు.

యుద్దానికి వెళ్లిన వారు మృత్యువుని చూస్తారు.

యుద్ధం అనేది గమనించకుండా

వదిలివేయబడిన స్విచ్.

యుద్ధంలో ప్రతి ఒక్కరికి తెలిసిన రహస్యం ఇది

కానీ చాలా అనుకూలంగా మరచిపోతారు.

యుద్ధం ఎలా ప్రారంభించాలో తెలుసు కానీ ఎలా ముగించాలో తెలియదు.

యుద్ధం యుద్ధం గురించి అబద్ధాలు చెబుతుంది

ఆ అబద్దాలతినే యుద్ధం మిమ్మల్ని

సురక్షితంగా ఉంచుతుంది.

లేదా మీరు ఇప్పటికి చనిపోయి ఉండేవారు.

యుద్దానికి దేశాలు , ఎల్లలు ఎప్పుడో చేరిగిపోయాయి.

ఏక్కడైనా యుద్ధం జరగనీ

ఆకలి ప్రపంచాన్నే కుదిపేస్తోంది

అగ్రదేశాలు  అంతటా మాల్స్ ని తెరుస్తాయి.

అంగళ్లనీ, అన్ లైన్ విక్రయాల్ని మొదలుపెడతాయి.

ఆకలితో అల్లాడుతున్న ప్రతీ దేశాన్నీ మార్కెట్ సంతల్ని చేస్తాయి.

యుద్ధానికైనా,విక్రయానికైనా

కావాల్సింది మనిషే

కావాల్సింది ఆకలే !

( మనష్ ఫిరాక్ భట్టాచార్య కవిత నుంచి కొన్ని వాఖ్యాలు తీసుకున్నాను...)

         -       ----అఖిల. Akhila Doddanna (చర్చ) 04:32, 24 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]