వాడుకరి చర్చ:Nalinimohankumarkalva

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Nalinimohankumarkalva గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర(చర్చ) 12:19, 12 సెప్టెంబర్ 2008 (UTC)


ఈ నాటి చిట్కా...
అనువదించేటప్పుడు ఇబ్బంది

అనువాదం చేసేటప్పుడు ఒక ఆంగ్లపదానికి సరైన తెలుగు మాట ఎంత ఆలోచించినా తట్టడంలేదు

గూగుల్ లో ఆ పదం టైపు చేసి meaning in Telugu చేర్చి వెతకండి. ఆంధ్రభారతి వెబ్సైట్లో నిఘంటు శోధన ద్వారా వివిధ నిఘంటువులలో వెతకండి. అయినా తెలుగు పదం తెలియకపోతే ఆ పదాన్ని అలా తెలుగు లిప్యంతరీకరణ చేసి వ్రాయండి. తరువాత ఇతరులు మెరుగైన పదంతో మారుస్తారు. లేదా మరో రోజు మీకే తట్టవచ్చు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

స్వాగతం, గమనించండి[మార్చు]

నళినీ మోహన కుమార్ గారూ! నమస్కారం మరియు స్వాగతం. పత్రికారంగం నుండి వికీలో పాలుపంచుకొనేవారు తక్కువగా ఉన్న స్థితిలో మీవంటివారు వికీలో సభ్యులుగా చేరడం చాలా సంతోషం. మీ పరిచయ వాక్యాలను "వ్యాసం"లా కాకుండా మీ సభ్యుని పేజీలో వ్రాయడం వికీ ఆనవాయితీ. కనుక మీరు వ్రాసిన పరిచయ వాక్యాలను మీ సభ్యుని పేజీలోకి మార్చి, ఆ వ్యాసాన్ని తొలగిస్తున్నాను. మీకు ఆసక్తి ఉన్న విషయాలపై వ్యాసాలు వ్రాసి, ఉన్న వాటిని మెరుగు పరచి, తెలుగు వికీని మరింత పరిపుష్టం చేస్తారని ఆశిస్తున్నాను. ఏవయినా సందేహాలుంటే తప్పక నా చర్చా పేజీలో వ్రాయండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:19, 15 సెప్టెంబర్ 2008 (UTC)

హేతువాదం పేజిలో మీ వాక్యాలు[మార్చు]

* కమ్యునిస్ట్లు లు ప్రాదమికంగా నాస్థికులు గా వుండాలని కారల్ మార్క్స్ అన్నాడు. కాని నే టి మన సో కాల్డ్ కమ్యునిస్ట్లు లు నాస్థికత్వం ను పట్టిం ఛుకోకుండా ఆ స్తికుల మాదిరిగానే వారి జీవిత ములను వెళ్ళ దీ స్తున్న వైనం మనం గమనించవచ్చు

గతితార్కిక భౌతికవాదంని అర్థం చేసుకోవడానికి నాస్తికత్వం అవసరమే కానీ మీకు ఇంగిత జ్ఞానం మరియు ఆజ్ఞేయవాదం వంటి విషయాల గురించి తెలిసినట్టు లేదు. ఆజ్ఞేయవాదితోనైనా హేతుబద్దమైన వాదన చెయ్యగలం కానీ ఇంగిత జ్ఞానం లేని వాడితో వాదించలేం అని నా ఆస్ట్రేలియన్ కమ్యూనిస్ట్ స్నేహితుడు అన్న వాక్యం గుర్తుకు వస్తుంది. మీరు కూడా మనుషులలో జ్ఞాన స్థాయిని అంచనా వెయ్యండి.

బాగా చదువుకున్న డాక్టర్లు, సైంటిస్టులు కూడా తమ శాస్త్ర జ్ఞానానికి విరుద్ధంగా దేవున్ని, ఆత్మల్ని నమ్ముతారు. కానీ దేవుని దగ్గరకి (స్వర్గానికి) వెళ్ళడానికి నిప్పులోనో గంగలోనో దూకు చావమంటే ఆ సాహసం ఎవరూ చెయ్యరు. ఎందుకంటే అలాంటివి నిజంగా ఉండటం అసంభవం అనే డౌట్ వాళ్ళకి కూడా వస్తుంది. దీన్ని కనిష్ట హేతుజ్ఞానం అంటారు. ఈ మాత్రం కనిష్ట హేతుజ్ఞానం లేనంత మూర్ఖులు ఎవరూ ఉండరు. అందుకే ప్రభాకర్ సాంజ్గిరి అన్నారు "మత భక్తులలో కూడా చాలా మంది నిజ జీవితంలో నాస్తికులే" అని. రంగనాయకమ్మ వ్రాసిన నీడతో యుద్ధం పుస్తకం కూడా చదవండి. పల్లేటూరి జనం ఏ పరిస్థితులలో పాము పుట్టల్లో పాలు పొయ్యడం లాంటివి చేస్తారో, ఆర్థికత పరిస్థితికి అజ్ఞానానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో అర్థమవుతుంది. మీరు, నేను ఆర్థికంగా మంచి పొజిషన్ లో ఉన్నాం కాబట్టి అదృష్టం, దురదృష్టం, దైవ నిర్ణయం, కర్మ లాంటి వాటి మీద ఆధార పడాల్సిన అవసరం మనకి కనిపించదు. కానీ ప్రపంచంలో 80% మంది నిత్యం ఆర్థిక సమస్యలతో బాధ పడే కార్మిక వర్గ ప్రజలు. వాళ్ళ సమస్యలకి కర్మలే కారణం అనుకుంటారు. ఈ పరిస్థితులలో కర్మవాదులుగా మారిన వారిని నాస్తికులుగా మార్చడం కష్టం. అందుకే కమ్యూనిస్టులు అన్ని సందర్ఛాలలోనూ నాస్తికవాదాన్ని ముందుకు తీసుకురారు. మతతత్వ రాజకీయ పార్టీలని విమర్శించేటప్పుడు మాత్రం తప్పని సరిగా నాస్తికత్వాన్ని పైకి తీసుకురావలసి వస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా కమ్యూనిస్టులు దేవున్ని నమ్ముతున్నారని వాదించొద్దు.