వాడుకరి చర్చ:Newsnip

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Newsnip గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:16, 20 ఆగష్టు 2011 (UTC)


ఈ నాటి చిట్కా...
ఏకవచన ప్రయోగం

విజ్ఞాన సర్వస్వంలో ఏకవచన ప్రయోగం అమర్యాద కాదు. మీరు వ్రాసే వ్యాసాలలో ఏకవచనాన్నే వాడవచ్చు. వివరాలకు వికీపీడియా:ఏకవచన ప్రయోగం చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

నగరిపాడు[మార్చు]

నగిరిపాడు

చిట్వేలి మండలం

నగరిపాడు గ్రామం[మార్చు]

నగరిపాడు గ్రామం చిట్వేలి మండలంలోని ఓక పంచాయితీ. ఈ ఊరి యోక్క ప్రత్యేకతలు వివరిస్తాను.

రాజంపేట డివిజన్‌లో విశేష చారిత్రాత్మక విశేషాల సమాహారంగా చిట్వేలి మండలం నగరిపాడులో 17వ శతాబ్దం నాటి శ్రీ రంగనాయకస్వామి విరాజిల్లుతుంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ బ్రహ్మోత్సవాలు దళితుల తొలిపూజతో మొదలయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్ల జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్న ఈ ఆలయ చరిత్రలో కాలజ్ఞానం రచించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పాత్ర కూడా ఇమిడి ఉంది. చిట్వేలి-రైల్వేకోడూరు మార్గంలో తిరుమల గిరుల నుండి ప్రవహించే కుంజరీనది ఒడ్డున అటు నెల్లూరు, ఇటు కడప అడవులకు మధ్యన శ్రీ వీరబ్రహ్మం వరపుత్రునిగా శ్రీ రంగనాయకులు 1717 ఫిబ్రవరి 21వ తేదీన అగ్నిగుండ ప్రవేశం చేసి చరిత్రకెక్కినట్టు ఇతిహాసాలున్నాయి. ఈ అగ్నిగుండ ఆనవాళ్ళు, శ్రీ బ్రహ్మంగారి కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు నేటికి ఆలయంలో చెక్కుచెదరకుండా ఉన్నాయి. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వాసికెక్కిన నగరిపాడులో శ్రీ రంగనాయకస్వామి ఆలయంతో పాటు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రచించిన విధంగా ఇటీవల శ్రీ వీరబ్రహ్మంగారి ఆలయం, శ్రీ ఈశ్వరీదేవి ఆలయం నిర్మించబడ్డాయి. ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో కర్కటేశ్వరుని రూపంలో ప్రత్యక్ష దైవమైన గుండాలకోన ఇక్కడే ఉండడం విశేషం. కొలిచే వారి కొంగుబంగారంగా, అడిగిన కోరికలు తక్షణం ఇచ్చే విధంగా చుట్టూ పక్కల ప్రాంతీయులు శ్రీ రంగనాయకస్వామిని కొలుస్తుంటారు. ఈ ఆలయ చరిత్రను తీసుకుంటే పూర్వం 17వ శతాబ్దంలో జగ్గరాజు సతీమణి జగ్గమ్మలు నగరిపాడును పరిపాలించేవారు. వీరికి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వరంతో 1692వ సంవత్సరం మార్చి 17వ తేదీ రంగరాజు జన్మించారు. రంగరాజు 12 సంవత్సరాల వయసు వరకు అన్ని విద్యలు నేర్చుకొని చిన్నప్పటి నుండి భక్త్భివాలతో ఉంటూ గ్రామానికి ఉత్తరాన ఆరిచెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉండేవారు ఆయనకు కేశారపుమారయ్య అనే భక్తుడు ఉండెను. రంగరాజు 16 సంవత్సరాల వయసు రాగానే దేశాటన చేసి తీర్థయాత్రలు చేస్తూ కందిమల్లాయపల్లెలోని శ్రీ బ్రహ్మేంద్రమఠానికి చేరుకున్నారు. మఠం ప్రాంగణంలో కూర్చొని ఉండగా బ్రహ్మంగారి మనవరాలు గోవిందయ్య కుమార్తె ఈశ్వరీదేవి నైవేధ్యం తీసుకొని మఠంలోకి పోతుండగా రంగరాజు చూసి ఆమెను వివాహం చేసుకోవాలని తలచెను. అంతలో ఆమె పినతల్లి పోతులూరి ఆచారి కూడా మఠంలోకి వెళ్తు రంగరాజును చూసి మీరెవ్వరని అడుగగా మాది నగరిపాడు అని చెప్పెను. మఠంలోకి నైవేధ్యం తీసుకొని వెళ్తున్న స్ర్తిని వివాహం చేసుకొనవలెనని తలిచానని చెప్పెను. అందుకు పోతులూరయ్య మాట్లాడుతూ మా తండ్రి రాసి ఉన్న కాలజ్ఞానం బనగానపల్లెలో ఉందని, ఆ కాలజ్ఞానంలో ఏమి రాసి ఉంటే ఆ ప్రకారం వివాహం చేస్తామని చెప్పెను. ఆ తరువాత వారిరువురు బనగానపల్లెకు వెళ్లి కాలజ్ఞానం తీసుకొచ్చి చదువగా అందులో నగరిపాడు నుండి రంగరాజు వస్తారు. ఆయన ఈ జన్మలో అగ్నిసమాధి అవుతారు. ఈశ్వరమ్మ కూడా జీవసమాధి అవుతుందని తెలిపారని ఉంది. తర్వాత వారు వచ్చే జన్మలో వీరభోగవసంతరాయులుగా అవతరిస్తారని, అప్పుడు వారిద్దరికి వివాహం జరుగుతుందని కాలజ్ఞానంలో రాసి ఉంది. అదిచూసి రంగరాజు నగరిపాడుకు వెళ్లి గ్రామానికి తూర్పుదిశ కొండల్లో వెలసిఉన్న గుండాలేశ్వరకోనలో ఒక ఏడాది తపస్సు చేసి అక్కడ శివుని వద్ద వరములు పొంది ఆ తరువాత నగరిపాడుకు వచ్చి ఆరిచెట్టు వద్ద ఏడాది తపస్సు చేసెను. ఆ తరువాత మారయ్యభూమిలో అగ్నిగుండం తవ్వి అందులో 1717 డిశంబర్ 21వ తేదీ అగ్నిగుండ ప్రవేశం చేసెను. అగ్నిగుండ ప్రవేశానికి ముందు కుంజరినదిలో స్నానం చేసి మారయ్యను పిలిచి నేను గుండంలోకి దిగకముందే నీవు దిగవలెనని చెప్పగా మారయ్య నా భార్యపిల్లలకు చెప్పివస్తానని చెప్పెను. ఆ తర్వాత రంగరాజు అక్కడికి వచ్చిన భక్తులకు కాలజ్ఞానం చదివి వినిపించి తాను గుండంలో ప్రవేశించేందుకు కాలం అతిక్రమించి పోవునని గుండ ప్రవేశం చేశెను. ఆ తర్వాత మారయ్య వచ్చి విలపించగా గుండం నుండే నీవు కూడా వచ్చే జన్మలో కలుసుకుంటావని, నీవు చనిపోయిన తరువాత నాకు ఎదురుగా సమాధి చేస్తారని, ప్రతి ఏడాది దసరా ఉత్సవాల్లో మీ కుటుంబస్తులు నాకు పూజలు అర్పించిన తరువాత మిగతా భక్తులు నా యొక్క పూజలు జరుపుకుంటారని అభయమిచ్చారు. ఆ తరువాత బ్రహ్మంగారి మఠం నుండి అనేకమంది వచ్చి గుండం ఆర్పించి అందులో ఉండబడిన కాలజ్ఞానం, పావుకోళ్ళు, రుద్రాక్షమాల, బేరికోమటిశెట్టి తక్కెడ పుల్లలు బయటకి తీసి అక్కడ సమాధి కట్టి వెళ్లిపోయారు. ఆ తరువాత జీవసమాధి అయిన చోటే స్వామివారి మూలవిరాట్టును ఏర్పాటుచేసి ఆలయాన్ని కట్టించి అప్పటి నుండి ఇప్పటివరకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో కార్యక్రమాలు హరికథలు, వీరబ్రహ్మంగారి జీవిత చరిత్ర, హరికథ, నాటక ప్రదర్శనలు, శ్రీ వీరబ్రహ్మంగారు తాళపత్ర గ్రంథాల ప్రదర్శన, అగ్నిగుండంలో బయటపడిన శ్రీ రంగనాయకుల స్వామి వారి పాదుకలు, యోగ దండం, రుద్రాక్షమాల, అడ్డఖడ్గం బేరికోమటి తప్పిట ప్రదర్శన, మండల పూజ, పాటకచ్చేరిలు, వీరబ్రహ్మంగారి నాటక ప్రదర్శనతో పాటు బ్రహ్మోత్సవాలు జరిగే ప్రతిరోజూ అన్నదాన కార్యక్రమాలు, గ్రామోత్సవం ఏర్పాటు చేశారు.