వాడుకరి చర్చ:O.V.Rao

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొత్త సభ్యులకు స్వాగతం

[మార్చు]

O.V.Rao గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Rajasekhar1961 (చర్చ)Rajasekhar1961 (చర్చ) 06:52, 14 నవంబర్ 2012 (UTC)


ఈ నాటి చిట్కా...
అభిప్రాయ విభేదాలను గౌరవించండి

ప్రతి విషయం గురించీ ఇద్దరు ఏకీభవిస్తుంటే ఆ ఇద్దరిలో ఒకరు అనవుసరం - అన్న సూక్తి మీరు వినే ఉంటారు. వ్యాసం పేరు గురించీ, లేదా వ్యాసంలో వ్రాసే విషయం గురించీ, లేదా అది వ్రాసిన తీరు గురించీ, అందులోని బొమ్మల గురించీ - మీరనుకున్నదే మీకు సరైనదనిపించవచ్చును. (కాదని తెలిస్తే అలాగనుకోరు కదా?).

ఏతావతా అభిప్రాయ భేదాలను సమీకరించడం అంత సులభం కాదు. మీరనుకొన్నదానికి వ్యతిరేకంగా ఒకరు పట్టుపడితే కాస్త తగ్గండి. ఇతర పనులపై దృష్టి సారించండి. వికీలో చేయవలసిన పనులకు కొదువ లేదు గదా?

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

విద్యుత్‌ వినియోగదారులపై రాష్ట్ర ప్రభుత్వం ఇంధన సర్దుబాటు సర్‌ఛార్జి (ఎఫ్‌ఎస్‌ఎ) పేరిట మరో పిడుగు వేసింది. 2012-13 మూడో త్రైమాసికానికి రూ.1,068 కోట్లను ఎఫ్‌ఎస్‌ఎగా జనం నుంచి వసూలు చేసుకోవడానికి అనుమతి కోరుతూ డిస్కాంలు సోమవారం ఎపిఇఆర్‌సికి ప్రతిపాదించాయి. ఇప్పటికే రాష్ట్ర సర్కారు విద్యుత్‌ వినియోగదారుల నుంచి 33 వేల కోట్ల రూపాయలను ముక్కుపిండి వసూలు చేస్తోంది. అది చాలదన్నట్లు ఇప్పుడు మరో వెయ్యి కోట్ల రూపాయల భారాన్ని ప్రతిపాదించడం అమానుషం.

ప్రపంచబ్యాంకు ఆదేశిత సంస్కరణల్లో భాగంగానే ఎఫ్‌ఎస్‌ఎ తంతు మొదలుపెట్టారు. ఏటా విద్యుత్‌ ఛార్జీల పెంపుదల ప్రతిపాదనలను డిస్కాంలు ఎపిఇఆర్‌సి ముందుంచుతాయి. వాటి ఆధారంగా పబ్లిక్‌ హియరింగ్‌ జరిపి కమిషన్‌ తుది ప్రకటన చేస్తుంది. విద్యుత్‌ ఛార్జీల పెంపుదలలో చూపకుండా వినియోగదారులను దొంగదెబ్బ తీయడానికి ఎఫ్‌ఎస్‌ఎ రూపొందించబడింది. తొలి నుంచీ వామపక్షాలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. గతంలో యూనిట్‌ రేటుతో పోలిస్తే ఎఫ్‌ఎస్‌ఎ స్వల్పంగా ఉండేది. అందుకని జనానికి దాని తీవ్రత అర్థంకాలేదు. కానీ ఇటీవల సంవత్సరాల్లో యూనిట్‌ రేటుతో దాదాపు సమానంగా ఎఫ్‌ఎస్‌ఎ భారం పడడంతో జనానికి మోయలేని భారమవుతుంటే 2012-13 టారిఫ్‌ ఆర్డర్‌లో వేసిన భారం రూ.4,442 కోట్లు. తరువాత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అదనపు సబ్సిడీతో అది రూ.4,269 కోట్లయింది. అయితే, ఇదే ఏడాది తొలి త్రైమాసికంలో రూ.1,780 కోట్లు, రెండో త్రైమాసికంలో రూ. 982 కోట్లు, మూడో త్రైమాసికంలో రూ.1,068 కోట్లు ఎఫ్‌ఎస్‌ఎగా వేస్తున్నారు. చివరి త్రైమాసికం కూడా వెయ్యి కోట్ల రూపాయలకు తగ్గకపోవచ్చు. ఈ రీత్యా మొత్తం భారం రూ.4,800 కోట్లు అవుతుంది. అంటే టారిఫ్‌ ఆర్డర్‌లో పెంచిన దానికంటే ఎఫ్‌ఎస్‌ఎ భారమే ఎక్కువ. అసలును మించిన కొసరన్నమాట. ఇంతకంటే దుర్మార్గం వేరేమైనా ఉంటుందా? నిరుపేదలపై భారీగా వడ్డించడం ఎఫ్‌ఎస్‌ఎ నిర్ణయంలో మరో మోసం. నెలకు యాభై యూనిట్ల లోపు విద్యుత్‌ వినియోగించే వారు యూనిట్‌కు ఎనర్జీ ఛార్జీగా చెల్లించేది రూ.1.45. అదే నెలకు 500 యూనిట్ల పైబడి వినియోగించేవారు చెల్లించేది రూ.7.25. అయితే వినియోగదారులంతా ప్రతి యూనిట్‌కూ రూ.1.32 (2012-13 తొలి త్రైమాసికం) ఎఫ్‌ఎస్‌ఎగా చెల్లిస్తున్నారు. నిరుపేద వినియోగదారుడు ఎఫ్‌ఎస్‌ఎతో కలిపి యూనిట్‌కు చెల్లిస్తున్నది రూ.2.77 కాగా 500 యూనిట్లు పైబడిన సంపన్న వినియోగదారుడు యూనిట్‌కి చెల్లించేది 8.57 రూపాయలే! టారిఫ్‌ ఆర్డర్‌లో నిరుపేదల కంటే సంపన్నులు ఐదు రెట్లు ఎక్కువ రేటు చెల్లించినట్లనిపిస్తుంది. వాస్తవానికి చెల్లించేది మూడు రెట్లు మాత్రమే ఎక్కువ.

రానున్న ఏడాదికి వేయనున్న రూ.12,723 కోట్ల విద్యుత్‌ భారాన్ని చూసి ప్రజలు రగిలిపోతున్నారు. మూలిగే నక్కపై తాడిపండులా ఈ ఎఫ్‌ఎస్‌ఎ భారం వారి కోపాన్ని మరింత పెంచుతోంది. ఎఫ్‌ఎస్‌ఎ విధానాన్ని రద్దు చేయాలి. డిస్కాంలు నష్టపోతాయనుకుంటే ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలి తప్ప ప్రజలపై వేయరాదు.

రాజకీయ ప్రముఖులు

[మార్చు]

తెలుగు రాజకీయ ప్రముఖులు జాబితా ప్రారంభంలో ఉన్నది. మీకు తెలిసిన ప్రముఖులందరినీ జాబితాలో చేర్చండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 06:00, 25 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]