Jump to content

వాడుకరి చర్చ:Rajanptsk

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
Rajanptsk గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. __చదువరి (చర్చ, రచనలు) 13:27, 19 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

మీ సందేహాలకు సాయం

[మార్చు]

రాజన్ గారూ,
వికీపీడియాలో మీ సందేహాలు తీర్చి సాయం చేసే బాధ్యత నేను తీసుకుంటున్నానండీ. మీకు ఇక ఏ సందేహం వచ్చినా నన్ను అడగవచ్చు. ప్రస్తుతానికి మీరు ఫేస్‌బుక్ మెసెంజర్‌లో నన్ను అడిగిన సందేహాలకు ఇక్కడ సమాధానాలు ఇస్తున్నాను. ఏం లేదు, మీకు భవిష్యత్ రిఫరెన్సుకు పనికివస్తుందని రికార్డు చేస్తున్నానన్న మాట.

ఫోటోలు ఎలా మార్చాలి

[మార్చు]
  • వికీపీడియాలో ఉన్న ఫోటోలు నూటికి తొంభైపాళ్ళు కాపీహక్కులు లేనివి అయివుంటాయి. అలా కాపీహక్కులు లేని ఫోటోలను commons.wikimedia.org అన్న వెబ్సైటులో చేర్చి అక్కడి నుంచి వికీపీడియాల్లో వాడతారు. ఇందులో ఎక్కించేందుకు రెండు ప్రధానమైన నియమాలు
    • అవి మనం తీసినవైతే ఎవరైనా తిరిగి వాడుకునేందుకు వీలుగా ఎక్కించెయ్యొచ్చు. అలా ఎక్కించాకా ఆ ఫోటో మనల్ని అడిగి వాడనక్కరలేదు, మనం తీశామన్న ముక్క రాసి ఎవరైనా వాడెయ్యొచ్చు.
    • మనం తీసినవి కాకుంటే - తీసినవారు, ఆ ఫోటోల కాపీహక్కులు ఉన్నవారో (ఫోటోలకు కూడా కాపీహక్కులు ఉంటాయి) పై నియమాలను అంగీకరిస్తూ ఒక మెయిల్ పంపేలా చేయగలిగితే ఎక్కించవచ్చు.
  • ఈ తలపోటంతా అనవసరం అనుకుంటే ఇప్పటికే వికీమీడియా కామన్సులో ఉన్న ఫోటోలు వెతికి, సంబంధించినవి ఉంటే తెచ్చి చేర్చవచ్చు.
  • మనం పెట్టదలుచుకున్న ఫోటోలు మనం తీసినవీ కావు, తీసినవారో, హక్కులున్నవారో తెలీదు, కానీ చేర్చి తీరాల్సిన ఫోటోలు అనుకుంటే తక్కువ రిజల్యూషన్‌లో బొమ్మని వికీపీడియా:ఫైల్ ఎక్కింపు విజర్డు ద్వారా తెలుగు వికీపీడియాలో ఎక్కించవచ్చు.
  • ఎక్కించామయ్యా, దాన్ని ఎలా వాడతాం అంటారా చాలా సింపులు [[File:మీరెక్కించిన లేక మీక్కావాల్సిన ఫోటో పేరు.jpg|Thumb|Left]] అని పెడితే వచ్చేస్తుంది ఎడమ పక్కన. ఆ లెఫ్టు పెట్టకపోతే అప్రమేయంగా కుడిపక్క తయారైపోతుంది. Thumb అన్న ముక్క పీకేసి శుభ్రంగా 125px, 150px అని మనక్కావాల్సినంత సైజు కూడా చెప్పి చేయొచ్చు.
  • ఇంతేనా అంటే ఇంకా చాలా రకాలుగా పెట్టొచ్చు కానీ అన్నీ ఒకసారి చెప్పేస్తే అజీర్తి చేస్తాది ;-) ఒక్కోటీ మెల్లిగా తెలుసుకుందామండీ.

సమాచారపెట్టె (రైట్ సైడ్ బాక్స్)లో మార్పుచేర్పులు

[మార్చు]

టేబుల్స్ చేర్చడం ఎలాగ

[మార్చు]

వికీపీడియాలో పట్టికలు చేర్చడానికి వికీపీడియాలోనే చేయదగ్గ మార్గాలు ఉన్నాయి. కానీ నేను మీకు తేలికగా ఉండేందుకు ఈ టేబుల్స్ జనరేటర్ అన్నది వాడమని సూచిస్తూవున్నాను. ఈ కింది ఫ్లో అనుసరించండి. ఏమైనా ఇబ్బంది వస్తే నాకు చెప్పండి.
tablesgenerator.com > Mediawiki tables > File > New table > Rows, columns decide cheyandi > Create > పైన ఉండే ఖాళీ టేబుల్లో మీకు కావాల్సిన సమాచారం నింపుకుంటూ వెళ్ళండి > Generate button > Copy to clipboard

మీరు ఇవన్నీ ప్రయోగాలు చేసేందుకు మీ ప్రయోగశాల వాడవచ్చు. మీరు లాగినైతే పైన కుడివైపు, చర్చ పక్కన ప్రయోగశాల ఉంటుంది, నొక్కి సృష్టించి వాడండి. ఇవి మీకు సరిగా వచ్చాయో, లేక మరేవైనా సూచనలు చేయాలో నేను ప్రయోగశాల ద్వారా చూసి చేస్తాను. ఓకేనాండీ? --పవన్ సంతోష్ (చర్చ) 10:14, 12 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం

[మార్చు]

@Rajanptsk గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మ(ల)కు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.

  1. File:Parameswarudu.jpg

వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}} లేక {{Non-free use rationale}} తో వర్గం:Wikipedia_image_copyright_templates లో సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఉదాహరణలకు ఆంగ్లవికీలో అటువంటి ఫైళ్ల వివరాలు చూడండి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. పై వాటిని సవరించితే పై ఫైళ్ల వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 06:00, 21 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]