వాడుకరి చర్చ:Sai2020/క్రితం చర్చ 2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Archive ఇది ఇంతకు ముందు జరిగిన చర్చలను భద్రపరిచిన పేజి. ఈ పేజిని మార్చ వద్దు. మీరు గనక కొత్త చర్చ మెదలు పెట్టాలనుకుంటే, లేదా పాత చర్చ కొనసాగించాలనుకుంటే, ప్రస్తుత చర్చా పేజిలో వ్రాయండి.

అడోబీ ఫోటోషాప్

అడోబీ ఫోటోషాప్ ని ఈ వారపు వ్యాసంగా అసలు ఎలా ఎంచుకున్నారు? సాయీ(చర్చ) 06:39, 19 మార్చి 2008 (UTC)

సాయీ! నేను అవలంబించిన పద్ధతి ఇది.(ఇంతకు క్రితం ఎవరూ చర్చించలేదు గనుక నా సెలెక్షన్‌ను పునఃసమీక్షించుకొనే అవకాశం నాకు లభించలేదు. ఈ మధ్యనే మొదటి పేజీ వ్యాసంపై ఫోకస్ వస్తున్నది.) ఒక మాదిరి విపులంగా, పొడవుగా ఉన్న వ్యాసాలను నేను పరిగణనలోకి తీసుకొన్నాను. అందులో వైవిధ్యానికి (అన్ని వ్యాసాలూ వ్యక్తుల గురించో, పుణ్య స్థలం గురించో ఉండకుండా) ప్రాధాన్యత ఇచ్చాను. ఒక సాఫ్ట్‌వేర్ గురించి ఇంత మాత్రం వ్రాసిన వ్యాసం ఇదే మొదటిదనుకొంటాను. అనువాదం కానివి, లేదా మరీ అస్తవ్యస్తంగా ఉన్నవి తీసుకోలేదు. కాని వ్యాసం చాలా బాగుందనే అభిప్రాయం అందులో అంతర్గతం కాదు. ఉన్నంతలో తెలుగు వికీలో వ్యాసాలు ఇలా ఉన్నాయని చూపవచ్చనుకొన్నాను. అడోబీ ఫొటోషాప్ వచ్చే వారానికి సిద్ధమౌతుందనుకొన్నాను. అయితే ఇప్పటికి వ్యాసంలో చేయవలసిన పని చాలా ఉన్నట్లున్నది. కనుక టంగుటూరి ప్రకాశంవ్యాసం 13వ వారానికి, అడోబీ ఫోటోషాప్ను 18వ వారానికి మార్చవచ్చనుకొంటాను . నువ్వే మార్చెయ్యి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:33, 19 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
సాయీ! నువ్వు జాబితాలో పేర్లు మాత్రం స్థానాలు మార్చావు. వాటి పైనున్న టేబుల్‌లో ఆ వారం లింకులు నొక్కితే మూసలు తెరుచుకుంటాయి. 'అడోబీ' విషయాన్ని 18వ వారం మూసలోకి మార్చాలి. 'టంగుటూరి ప్రకాశం'కు 13వ వారం మూసలో క్రొత్తగా సంక్షిప్త వ్యాసం వ్రాయాలి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:29, 19 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


అడ్డదారులు

ఇలాంటి అడ్డదారులు ఓకే కదా సాయీ(చర్చ) 11:09, 20 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సాయి, కొత్త కొత్త అడ్డదారులను ఏర్పాటు చేస్తున్నప్పుడు వాటి పేర్లు ఆంగ్లంలో తయారుచేయి. వికీ:శైలి బదులుగా WP:STYLE అని; వికీ:ఐదు బదులుగా WP:FIVE అని. సాధారణంగా లింకుల పేర్లు తెలుగులో ఉంటే కొన్ని ఈమెయిలు వ్యవస్థలలో పాడయిపోతాయి, అళాంటి సమస్యలు రాకుండా ఇలాంటి అడ్డదారులను తెలుగులో కాకుండా ఆంగ్లపదాలను ఉపయోగిస్తుండటం జరిగింది. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:23, 20 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
సాయీ! ఇప్పటి వరకు ఇటువంటి విషయాల గురించిన విధానం నాకు తెలియదు. కావి "నేమ్ స్పేస్" వంటి ప్రాధమిక నిర్ణయాలు తీసుకోవాలన్నా, మార్చాలన్నా ముందుగా చర్చకు పెట్టడం మంచిది. అదే ఆంగ్ల పొడి అక్షరాలు వ్రాసే విధానానికీ వర్తిస్తుంది. ఇప్పటికి తెలుగు వికీలో well reserched decisions రావడం కష్టంగా ఉంది. ఎందుకంటే దాదాపు అందరూ ఔత్సాహికులే. కనీసం Broad consesus సాధించగలం. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:24, 20 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సాయి గారు, నేను అప్‌లోడ్ చేసిన బొమ్మ గురించి 'don't put stupid license tags.' అన్నారు. ధన్యవాదములు. ఇప్పుడు ఆ బొమ్మ గురించి ఏమి చేయాలి?--Svrangarao 22:59, 24 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం మూస

{{subst:స్వాగతం|సభ్యుడు=Dev|చిన్నది=అవును}}, ఇది నేను వాడే మూస. సభ్యుడు=సభ్యనామం ఇవ్వాలి. ఇంకా వివరాలకు మూస:స్వాగతం చూడవచ్చు. δευ దేవా 18:16, 25 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

డైరీ ఐకాన్

నేనే అడుగుదామనుకొన్నాను. నువ్వు మార్చేశావు. చాలా బాగుంది. "నాగురించి"కి ఆడ మనిషి బొమ్మ అన్యాయం కదా! ఆడువారు తమకు అవమానంగా భావించవచ్చును. ఒక డబ్బా బొమ్మ గాని, మైకు బొమ్మ గాని బాగుంటాయేమో. నీ ఆటోగ్రాఫ్ పేజీలో సంతకం చేసినందుకు చర్చ:ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ లో కృతజ్ఞతలు తెలుపవచ్చును గదా!. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:54, 26 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మలు కలుపడానికి నేను Arcsoft PAnorama Maker (Panasonic కెమేరా తో పాటు ఉచితంగా వచ్చింది) వాడాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:16, 27 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

పూర్ణ సంఖ్యలు

పూర్ణ సంఖ్యలంటే ఆంగ్లంలో Whole numbers. కాబట్టి వాటిని W చేతనే సూచిస్తారు. రవిచంద్ర(చర్చ) 05:42, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

గణిత శాస్త్రము భావనలు తెలుగులో ప్రామాణికంగా రచనలు చేసేవారు తెలుగు అకాడమీ వారు మాత్రమే. కాబట్టి మనం వారు చెప్పినట్లు అనసరించడం సబబు. natural numbers తెలుగు అకాడెమీ పాఠ్య పుస్తకాల్లో సహజ సంఖ్యలుగా అభివరించడం జరుగుతుంది. రవిచంద్ర(చర్చ) 05:53, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
సున్న మాత్రమే. సహజ సంఖ్యలలో సున్న ఉండదు. పూర్ణ సంఖ్యలలో సున్న ఉంటుంది. రవిచంద్ర(చర్చ) 05:58, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
కానీ సాయీ గారూ! మంచి చర్చను లేవనెత్తారు. నేను కూడా తెలుగులో గణితం పదవ తరగతి వరకే చదివాను. నాకు కూడా కొద్దిగా అనుమానం కలుగుతున్నది. మీరు చెప్పిన దాన్ని గురించి తెలుగు అకాడెమీ పాఠ్య పుస్తకాల్ని చూసి నివృత్తి చేసుకుటాను.దానికి తగ్గట్లుగా ఇక్కడ కూడా మార్పులు చేద్దాం. రవిచంద్ర(చర్చ) 06:07, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఇతరాలు

ఇంతకు ముందు 'శైలి' మార్గదర్శకాలలో ఎక్కడో వ్రాశారనుకొంటాను. వెతికి చూస్తాను. - వ్యాసం పేరు మొదటి రెండు లైన్లలోపు బొద్దుగా రావాలి. ఆంగ్ల నామం కూడా బ్రాకెట్లలో ఉండాలి. (బహుశా Search ఫలితాలలో వికీపీడియా రావడం కోసం కావచ్చును) --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:01, 19 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

శైలి మార్గదర్శకాలలో ఏం వ్రాసారు? సాయీ(చర్చ) 10:50, 19 మార్చి 2008 (UTC)

వికీపీడియా:శైలిలో లేదు. ఎక్కడో చర్చ జరిగింది కాని గుర్తు లేదు. ఏమయినా ఇది అంత దృఢమైన నియమం కాదు. అవసరమైతే మళ్ళీ చర్చించవచ్చు. తెలుగు రానివారు తెలుగు వికీలోకి (అంతర్వికీ లింకుల ద్వారా గాని, వెతకటం ద్వారా గాని) వస్తే వారికి కనీసం ఈ పేజీ దేనిని గురించో తెలుస్తుంది. నేను అలా అప్పుడప్పుడు ఇతర భాషల వికీలు చూస్తుంటాను (పోలికల కోసం)

ఆంగ్లము భారతీయ భాషా? సాయీ(చర్చ) 11:02, 19 మార్చి 2008 (UTC)

మొదటి పేజీలో భారతీయ భాషలలో "ఆంగ్ల వికీ" ఎందుకుంచారో తెలియదు. అడుగుదాము. "India has 22 officially recognised languages. But around 33 different languages and 2000 dialects have been identified in India. Hindi, in the Devanagari script is the official language of the Federal government of India. English is an associate official language. [1] " నా అభిప్రాయం మాత్రం భారతీయ భాష అంటే ఇక్కడ పుట్టిన భాష కాదు. ఇక్కడ వాడే భాష. కనుక ఓ.కే. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:39, 19 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


కే. వి. చలం దారిమార్పు గురించి - - ఒకమారు వికీపీడియా:శైలిలో పేర్ల ఆంగ్ల పొడి అక్షరాల గురించి కొన్ని సూచనలున్నాయి. చూడగలవు.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:29, 19 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
"భారతీయ భాషలలో ఆంగ్ల వికీ" గురించి చర్చ:మొదటి పేజీ లో చర్చ మొదలు పెట్టు. ఇది మార్చడం సమస్య కాదనుకొంటాను. కాకపోతే మొదటి పేజీ డిజైన్ లో నేను ఇదివరకు వేలు పెట్టలేదు. "ఆంగ్ల పొడి అక్షరాల గురించి" వికీపీడియా చర్చ:శైలిలో చర్చ మొదలు పెట్టు. ఈ విషయంలో కొంత చర్చ జరిగిన తరువాతనే పాలిసీ డిసైడ్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుత విధానం నేను తెలుగు వికీలో చేరక ముందునుండి ఉన్నది గనుక దానికి ఆధారం తెలియదు. తెలుగులో ఈ విషయమై ఇంతకు ముందే (జర్నలిజమ్ రంగంలో) కొన్ని ఆనవాయితీలు ఉన్నట్లున్నాయి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:10, 20 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
సాయీ! "ఆంగ్ల పొడి అక్షరాల గురించి" చర్చ మొదలు పెడదామనుకొంటున్నాను. ఇదే సమయంలో ఇతర శైలి విషయాలు కూడా పరిగణించవచ్చును. ఉదాహరణకు - ఎమ్. లేదా యమ్., కె. లేదా కే. వంటివి. నీకు వీలున్నంత వరకు కొంచెం పరిశోధన చేయగలవా? ఇప్పటికే తెలుగులో ఏమయినా సంప్రదాయాలున్నాయేమో? ఎందుకంటే ప్రతిపాదనకు తగిన ఆధారాలు చూపాలి. నేను కూడా పరిశీలిస్తాను.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:55, 21 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


సాయీ! ఇప్పడే నేను గమనించిన విషయం. నా ఫైర్‌ఫాక్స్‌లో (1)నీ సభ్యుని పేజీ బాగానే కనిపిస్తుంది. (2) వీ చర్చా పేజీ అలికినట్లుంది. (3) నా సభ్యుని పేజీ, చర్చా పేజీ కూడా అలికేసినట్లు కనిపిస్తున్నాయి. ఇది నీకు ట్రబుల్ షూటింగ్‌లో ఉపయోగం కావచ్చును ---కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:41, 13 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఇప్పటికీ సమస్య అలానే ఉంది. తరువాత పరిశీలిస్తాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:58, 15 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి పేజీ

బాగుంది సాయి గారూ! మీకు మంచి సృజనాత్మక శక్తి ఉంది. అందరితో చర్చించి ఈ పేజీని మొదటి పేజీగా పెడదాం. అన్నట్లు మొదటి పేజీ సోర్సును ఎక్కడ చూడవచ్చు. రవిచంద్ర(చర్చ) 06:17, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సాయీ! నీ డిజైన్ నాకు చూడగానే నచ్చింది. కాని పరిశీలించడానికి రెండు రోజులు టైమివ్వు. తరువాత మొదటి పేజీ చర్చలో పెడదాము. ఒకసారి http://www.telugupedia.com/ కూడా చూడు. వారి పేజి లే అవుట్ వగైరాలు చాలా చక్కగా ఉన్నాయనిపిస్తుంది నాకు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:26, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రతి విభాగానికి (బాక్సులకు) మరియు పైన పరిచయం, అన్వేషణ... లకు కూడా ఐకాన్లు ఉంచడం నాకు నచ్చింది. పేజీ ఎడమభాగాల ఉంది కాబట్టి వికీపీడియాకు స్వాగతం కుడి వైపున మళ్ళీ ప్రయోగశాల అవసరం లేదనుకుంటా. ఆ అంశాలను కూడా కిందికి తెచ్చి ఐకాన్లు ఉంచితే బాగుంటుంది.-- C.Chandra Kanth Rao(చర్చ) 08:14, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
(ఇతర వెబ్‌సట్ల వలే తయారుచేయడం కష్టం కాసుబాబు గారు. ఎందుకంటే, వికి మార్కప్ హెచ్‌టీఎంఎల్ అంత శక్తివంతమైన భాష కాదు. ఇంకొకటి వాళ్ళు వాడే బొమ్మలు వగైరాలు ఉచితం కావు. వేరొక వికీనుండైతే సులభంగా చేయచ్చు. ఇంకొకటి, నేను రంగులు సరిగా పెట్టలేదు. ఒకో పెట్టెకు ఒకో రంగు ఉంది. అందులో ఏది బావుంటే అది అన్నిటికి పెడతాను.) - రంగులు, పెట్టెలు ఎక్కువగా ఉండడం నాకూ ఇష్టం ఉండదు. నేను గమనించిన మరో విషయం. మొదటి పేజీలో సహాయం, శైలి, పరిచయం వంటి విషయాలు రిపీట్ అవుతున్నాయి. ఇక్కడ స్థలాన్ని పొదుపుగా వాడుకోవాలి కదా? కనుక అలా రిపీట్ అయినవాటిని తొలగించాలి. ఏమిటి? ఎందుకు? ఎలా? అన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. కామెంట్లు ఎన్నయినా చేయవచ్చును. కాని ఇంక నువ్వు ఫైనల్ ప్రపోజల్ చేసి మొదటి పేజీ చర్చలో పెట్టవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:40, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
సాయీ! మొదటిపేజీ బాగుంది. ఇతర సీనియర్ సభ్యులైన Mpradeep, వైజాసత్య, Chaduvari మొదలగు వారి అభిప్రాయాలు తెలుసుకొని పేజీని మార్చవచ్చు. δευ దేవా 11:33, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

SVR

ఈరోజునే నేను రంగారావు వ్యాసం మార్చి ఆయన నటించిన చిత్రాలను వేరే పేజీకి మార్చాను. కాసేపటీకి అది తొలగించబడినదని సందేశం చూశాను. అక్కడ నేను ఉంచిన చిత్రాల జాబితా పోయిందేమో అని కంగారులో చరితంలోకి వెళ్ళి రద్దుపరిచాను. కాని చూస్తే,అక్కడ ఆ జాబితా వేరే పుటకు జాబితాను మార్చినట్లు కనబడింది.ఇప్పుడు మళ్ళీ ఆ జాబితాను రంగారావు వ్యాసంలో ఉప పేజీ ఉంచాను. దయచేసి ఒక సారి చూడండీ. ఈలింక్ లు ఇవ్వటం నాకు కొత్త. సరిచేస్తో మరో పొరపాటు ఏమన్నా చేసి ఉంటే సరిదిద్దగలరు.--SIVA 12:55, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదములు సాయీ గారూ. చిత్రాలు పేజి తొలగించేముందు, ఆ పేజీకి ఎస్వి రంగారావు పుటకు ఉన్న లింక్ గమనించి చిత్రాల జాబితాను, ఉప పుటలో జత పరచి ఉంతే నా కంగారు తప్పేదనుకుంటాను.కాని ఒక కొత్త విషయం ఈ సంఘటన వల్ల తెలుసుకునాను. మరొక్కసారి ధన్యవాదములు--SIVA 13:32, 30 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

WP:WA

ఈ పేజీ ఎప్పుడూ ఈ వారం వ్యాసనికి దారి తీస్తుంది. కాబట్టి WP:WA ప్రతీవారం, ఆ వారం మొదటిపేజీలో ప్రదర్శిస్తున్న వ్యాసానికి redirect అయ్యేటట్లు చెయ్యాలి. __మాకినేని ప్రదీపు (+/-మా) 05:55, 31 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త మొదటి పేజీ

మొదటి పేజీగురించి మీ అభిప్రాయాలు తెలుపనేలేదు. సాయీ(చర్చ) 06:35, 31 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

దాని చర్చా పేజీలో ఇచ్చాను చూడండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 06:42, 31 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు పతకం

తెలుగు మెడల్
సాయీ గారి కృషికి దేవా ఇస్తున్న చిన్న బహుమానం. వచ్చిన ఒక నెలలోపే తెలుగు వికీపీడియాలో వెయ్యికి పైగా మార్పులు చేసారు. మిగతా సభ్యులతో చురుగ్గా చర్చిస్తూ ముందుకుసాగిపోతున్నారు. ఈ మెడల్ ఇంతకు ముందే బహుమానించవలసింది. కొంత ఆలస్యం అయ్యింది. మీ కృషిని ఇదేవిధంగా తెలుగువికీపీడియాకు అందిస్తారని ఆశిస్తున్నాను.δευ దేవా 09:26, 2 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
మెడల్ అందుకున్నందుకు సాయికి, ఇచ్చినందుకు దేవాకు అభినందనలు. సాయి దిద్దుబాట్ల సంఖ్య మాత్రమే కాదు. ఇతర ముఖ్య విషయాలు - (1) క్రొత్త సభ్యులకు సాంకేతిక సలహాలు ఇవ్వడం (2) చేరిన కొద్ది కాలానికే మొదటి పేజీ డిజైన్ క్రొత్తది ప్రతిపాదించడం (ఒప్పుకుంటారో లేదో వేరే సంగతి) --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:01, 15 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు పతకాన్ని అందుకున్న సాయిగారికి అభినందనలు --వైజాసత్య 20:13, 15 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
కృతజ్ఞతలు. సాయీ(చర్చ) 01:48, 16 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అర్థం

fourier series ను తెలుగులో ఫోరియర్ శ్రేణులు అనవచ్చు. రవిచంద్ర(చర్చ) 07:54, 4 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మూస ఏమిటి

సాయి గారూ దిద్దుబాట్ల నుంచి రక్షించాలంటే ఏ మూసను వాడాలో తెలియడం లేదు. రవిచంద్ర(చర్చ) 09:10, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సంరక్షణ మూస చేర్చాను చూడండి. రవిచంద్ర(చర్చ) 09:17, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బోయింగ్

కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం లేదు. అది ప్రతీ వికీ సభ్యుడూ చేసే పనే కదా! δευ దేవా 16:17, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చాలా సులువనుకుంటా, వ్యాసం పరిమాణం చూడడానికి ఆ పేజీ చరితం చూస్తే సరిపోతుంది. అన్నింటికన్నా పైన ఉన్న మార్పులో ప్రస్తుతం వ్యాసం సైజు ఉంటుంది. δευ దేవా 17:16, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం సమైక్య కృషి

సాయీ గారూ! ఈ వారం సమైక్య కృషిని నడిపించే మార్గంలో వికీపీడియా:ఈ వారం సమైక్య కృషి తయారు చేసాను, మూస:ఈ వారము సమైక్య కృషిలో కూడా మార్పులు చేసాను. ఇకనుండి తెలుగు వికీపీడియాలో ఉన్న మొలకలను అరికట్టడానికి కృషి చేద్దాం. ఇది సఫలీకృతం కావాలంటే దీనికి మీ కృషి చాలా అవసరం. δευ దేవా 20:10, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రంగారావుగారి వ్యాఖ్య

ధన్యవాదములు సాయీగారూ.వారు వ్రాసిన వ్యాఖ్య చూసి వెంటనే, వారు ఏకారణాన అటువంటి వ్యాఖ్య వ్రాశారు అని చర్చా పుటలో వ్రాసాను, కాని సమాధానం లేదు నా ఉద్దేశ్యం, ఎవరూ కూడా ఆవతలి వారిని బాధ పెట్టే వ్యాఖ్యలు చెయ్యకూడదని. నలుగురూ కూడి చెయ్యవలసిన పని ఇది. చివరకు అందరికి అమోదయోగ్యమయినది నిలుస్తుంది. మార్పు చేసినవాళ్ళమీద దురుసుగా వ్యాఖ్యలు చెయ్యటం తగదు అన్న విషయం సభ్యుడి/ల కు తెలియాలి. నేనుకూడా అంత కటువుగా జవాబు వ్రాస్తే బాగుండదుకదా! అందుకనే నేను ఈ విషయం ఇతర సభ్యులకు తెలియచేసినది. ఈ సంఘటన పర్యవసానం మాత్రం, ఎవరినే కించపరచకుండా ఉండాలి.రచనలు చేసే సభ్యులు, ఇతర సభ్యులు చేసే మార్పులను గౌరవించగలగాలి, అవసరమయితే చర్చ చెయ్యాలి, వ్యాఖ్యలకు చోటు ఉండకూడదు అని నా అభిప్రాయం.నేను అనేక వ్యాసాలకు మార్పులు చేసాను. చందమామ వ్యాసాన్ని మరింత సమాచారముతో నింపాను,రచయిత చలం మీద వ్యాసాన్ని విస్తరించాను. అక్కడాకూడా, ఎవరూ నా మార్పులుల మీద ఇలా దురుసుగా వ్యాఖ్యానించలేదు.--SIVA 19:59, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

svg

సాయీ! నేను బొమ్మ:Trans.svg అప్లోడ్ చేసాను. కానీ బొమ్మ కనిపించడం లేదు. బహుషా కాష్ ప్రాబ్లమ్ అనుకుంటా, నువ్వు ఒకసారి చూసి బొమ్మ కనిపిస్తుందో లేదో చెప్పు. δευ దేవా 16:12, 21 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఆ బొమ్మ నాకు కూడా కనిపించడం లేదు. ఎందుకో అర్థం కావడం లేదు. రవిచంద్ర(చర్చ) 06:44, 23 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
svg+telugu ప్రస్తుతానికి వికీపీడియాలో పనిచేయవు. వికీపీడియా సాఫ్టువేరుకు svgని pngలుగా మార్చే ఒక ప్లగిన్ ఉంటుంది. ఆ ప్లగిన్ సాఫ్టువేరుకు తెలుగు ఫాంట్ల గురించి తెలీదు. అందుకని తెలుగు అక్షరాలున్న svgలను pngలుగా మారుస్తున్నప్పుడు exception ఇస్తుందిగావచ్చు, ఫలితంగా మనకు తెలుగు అక్షరాలున్న svgలు కనపడవు. దీనికి పరిషార మార్గం, svgలను భద్రపరుస్తున్నప్పుడు అందులో ఉండే తెలుగు అక్షరాలను objectలుగా మార్చాలి. __మాకినేని ప్రదీపు (+/-మా) 07:27, 23 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి పేజీ బొమ్మ, వ్యాసం

సాయీ, 19,20 వారాలకు ఈ వారం బొమ్మ, 19వ వారానికి ఈ వారం వ్యాసం ఫైనలైజ్ చేయగలవా? నేను ఇప్పుడు వేరే పనిలో కాస్త బిజీగా ఉన్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:44, 25 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]


క్షమాపణ

నీతో సంబంధాలు చెడిపోగూడదని నేనే ఆ సభ్యుని క్రియేట్ చేసి వ్యతిరేఖించాను. నేను చేసింది తప్పయితే, నా వల్ల నీకేదైనా మనస్థాపం కలిగిఉంటే క్షమించు. ఇది తెవికీ నియమాలకు విరుద్ధమైతే నిషేధానికి కూడా నాకు సమ్మతమే. నా మాటలు నిన్ను భాధించి ఉంటే మరొక్కసారి క్షమించు. నువ్వు చేసే మార్పులన్నీ చూస్తూనే ఉన్నాను అవన్నీ సాంకేతికంగా మెరుగైన అంశాలే. కానీ ఎందుకో ఇంకా కొంతకాలం ఆగి నీవు నిర్వాహకుడవైతే బాగుండుననిపించింది. అందుకనే అలా. చంద్రగుప్త మౌర్యుడు పేరు మార్చడం వలన క్షణికావేశంలో అలా వ్యతిరేఖించాను. రవిచంద్ర(చర్చ) 13:09, 28 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు మీ మీద ఏలాంటి కోపము లేదు. నాకు ఎవరైనా చేసింది తప్పనిపిస్తే డైరెక్టుగా చెప్పేస్తాను. మీరు అలానే చేయాల్సింది. వికీ నియమాలు ప్రకారం ఒక account ఉండి, ఇంకో account తో వోటు వేయడం చాలా పెద్ద తప్పు. నా CheckUser విజ్ఞప్తి చూసిన steward, desyospping procedure మొదలుపెట్టమన్నారు. You will the first person to be desysopped. చర్చసాయీరచనలు 02:29, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వోటింగ్

సాయీ! వోటింగ్ పూర్తి కాకుండా నువ్వు వ్యాఖ్యలకు సమాధానాలు చెప్పడం (కృతజ్ఞతలు చెప్పడం కూడా) మంచి పద్ధతి కాదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:02, 28 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞతలు ఎవరు ఎవరికి చెప్పారు. మీరంటున్నది విషయం గురించేనా? ఇందులో తప్పేముంది. δευ దేవా 16:14, 28 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రత్యేక పేజీల మార్పు

ప్రత్యేక:Statisticsలో png బొమ్మ వాడుతున్నారు. దానికి బదులు svg బొమ్మ ఉంది. కాని మార్చు ట్యాబు లేదు. ఏలా మార్చాలి? చర్చసాయీరచనలు 06:21, 25 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రత్యేక పేజీలలో మీడియావికీలో ఉన్న సందేశాలను తీసుకుని చూపిస్తూ ఉంటుంది. ఈ పేజీలలో ఉన్న సమచారాన్ని మార్చాలంటే మీడియావికీ నేంస్పేసులో ఉన్న సంబందిత ప్జీలను మార్చాల్సి ఉంటుంది. బొమ్మను నేను మార్చాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 19:07, 28 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

Bot help

Can you move all the articles in వర్గం:విశేషవ్యాసాలు to వర్గం:విశేష వ్యాసాలు with the space. using your bot. చర్చసాయీరచనలు 09:59, 26 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఎందుకు? __మాకినేని ప్రదీపు (+/-మా) 18:57, 28 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
సరైన పేరు కాబట్టి. చర్చసాయీరచనలు 02:28, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

Meta CheckUser

నాకు Gopikrishna123 (చర్చదిద్దుబాట్లు) మరియు మౌర్యుడు (చర్చదిద్దుబాట్లు) sockpuppets అని అనుమానం వచ్చి, మెటాలో CheckUser విజ్ఞప్తి చేసాను. ఒక సారి చూడండి. చర్చసాయీరచనలు 12:01, 28 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఆ సభ్యనామాలు ఇంకొకరు నడుపుతున్న sockpuppets, అయ్యుండొచ్చు అయ్యుండకపోవచ్చు. కానీ ఎవరు నడిపారో తెలుసుకుని ఏం చేస్తారు? సాధారణంగా వికీపీడియా చర్చలలో ఎంతమంది ఫలానా విషయానికి మద్దతిస్తున్నారు అని చూసే బదులు, ఎంతమంది సరయిన కారణాలతో మద్దతిచ్చారు(లేదా ఇవ్వలేదో) చూస్తారు. దాని వలన వోటు ఎవరేవరు లేదా ఎంతమంది వేశారు అనే దానికన్నా, అలా వోటేస్తున్నందుకు వారిచ్చిన కారణాలకు ప్రాముఖ్యం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది సభ్యులు అప్పుడే వచ్చి కొత్తగా సభ్యత్వం తీసేసుకుని చర్చల్లో పాల్గొన్నట్లు అనిపిస్తుంది, కానీ ఎన్నో రోజుల నుండీ అజ్ఞాతంగా వికీతీరును పరిశీలిస్తూ ఉండి ఉండవచ్చు, లేదా వారు వికీలో ప్రవేశానికి సరైన సమయంకోసం ఎదురు చూస్తూ ఉండి ఉండవచ్చు. __మాకినేని ప్రదీపు (+/-మా) 19:22, 28 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
వికీ నియమాలను పాటించని వారందరిని పట్టుకోవాలి. చర్చసాయీరచనలు 02:27, 29 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]