చర్చ:మొదటి పేజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మొదటి పేజీ పరికరపెట్టె
చరిత్రలో ఈ రోజు క్యాలెండర్‌ చఈరో మూస
మీకు తెలుసా? భండారము మీతె? మూస
ఈ వారపు వ్యాసం ఈవావ జాబితా ఈవావ మూస
ఈ వారపు బొమ్మ ఈవాబొ జాబితా ఈవాబొ మూస
ప్రస్తుత సమయం 17:20 UTC
మొదటిపేజీని విసర్జించు
ఈ పేజీని విసర్జించు


మొదటి పేజీలో మార్పులు

[మార్చు]

বিষ্ণুপ্রিয়া মণিপুরী (విష్ణుపురి మణిపూరి)
বিষ্ণুপ্রিয়া মণিপুরী (విష్ణుప్రియా మణిపూరి)
దయచేసి నిర్వహణాధికారులు గమనించగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 13:35, 27 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది {{భారతీయ_భాషలలో_వికిపీడియా}} మూసలో ఎ‌వరైనా చేయవచ్చు. ప్రస్తుతానికి నేను సవరించాను. --అర్జున (చర్చ) 01:46, 12 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటిపేజీ నిర్వహణ స్థితి

[మార్చు]

మొదటిపేజీ నిర్వహణ స్థితి మూసని ఈ పేజీలో చేర్చడమైనది. ఎర్ర లింకుల వారాలున్నప్పుడు, నాలుగైదు వారాల పైగా తెవికీలో మార్పులు చేసిన సభ్యులు ఆయా వారాలకి వ్యాసాలు,బొమ్మలు సిద్ధంచేసి నిర్వహణలో తోడ్పడమని మనవి. దీని నిర్వహణని ఎవరైనా చేపట్టితే మరీమంచిది. --అర్జున (చర్చ) 12:37, 10 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి పేజీ సమతౌల్యం

[మార్చు]

మొదటి పేజీలోని ముఖ్యమయిన శీర్షికలు - ఈ వారం వ్యాసం, ఈ వారం బొమ్మ, మీకు తెలుసా అనేవి సరిసమానంగా ఉండటం లేదు. అందువలన ఈ వారం వికీపీడియను అని లేదా వార్తలు అనే శీర్షికతో ఒక కొత్త విభాగాన్ని ఏర్పరిచి మిగితా మూడు శీర్షికలకు సరిపోయే విధంగా ఇది మార్చుతూ నిర్వహించాలి. ఒకవేళ ఈ వార బొమ్మ, మీకు తెలుసా శీర్షికలు సరిపోతే, ఆ వారం ఈ శీర్షికను తీసివేయాలి. అయితే వార్తలు అనే శీర్షిక బాగుంటుందా లేక ఈ వారం వికీమీడియను శీర్షిక బాగుంటుందా, సభ్యులు తెలియచేయగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 06:55, 26 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

  • రహ్మానుద్దీన్ గారి సూచన ఈ రోజే చూడడం జరిగింది. మొదటి పేజీ నిర్వహణలో చాలా తక్కువమంది పాల్గొంటున్నందున, నిర్వహణభారం పెంచకుండా రూపం మెరుగుచేస్తే మంచిది.--అర్జున (చర్చ) 06:51, 26 అక్టోబర్ 2013 (UTC)
  • దాదాపుగా మీతో కలిసిన అన్ని సందర్భాల్లో ఈ విషయమై చర్చ జరపటం జరిగింది. మీకు మార్పు చేయటం ఇష్టం లేదని నేరుగా చెప్పవలసినది కదా! రహ్మానుద్దీన్ (చర్చ) 07:12, 26 అక్టోబర్ 2013 (UTC)
  • రహ్మానుద్దీన్ నామాటలకు వేరే అర్ధాలు ఆపాదించడం ఖండిస్తున్నాను. ఇలా మాట్లాడడం వికీలోని సౌహర్ద్రాపూర్వక వాతావరణాన్ని పాడుచేస్తుంది. నేను కొన్నాళ్లు అంత క్రియాశీలంగా లేకపోయినందున ఇది నిజంగానే చూడలేదు. మీరు నేరుగా మాట్లాడినప్పుడు నేను సరే అన్నాను కూడా. పై ప్రతిపాదనలో వార్తలు అనే శీర్షిక వుండడంతో (అది మనం చర్చలలో లేదు. తమిళవికీలో సమతౌల్యత ఎలా సాధించారో చెప్పారు తప్ప). ఇటీవలి మొదటి పేజీ నిర్వహణ ని గమనించి కొన్ని దోషాలను చర్చలలో రాశాను కూడా. అందువలననే పై వ్యాఖ్య రాయడం జరిగింది. మీరు నిర్వహణ బాధ్యతలో క్రియాశీలంగా వుంటానంటే నాకేమీ ఇబ్బంది లేదు. మీరు ప్రతిపాదించి ఆమోదమైన మార్పులన్నీ వికీలో తేవచ్చు. --అర్జున (చర్చ) 09:48, 26 అక్టోబర్ 2013 (UTC)
  • ఈవారం వికీపీడియను గా ఆవారం కృషిచేసిన వ్యక్తి మరియు ఆ వ్యక్తి చేసిన వ్యాసాల గురించి టూకీగా చేరిస్తే కొత్త సభ్యులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.Rajasekhar1961 (చర్చ) 09:54, 26 అక్టోబర్ 2013 (UTC)
  • పాతచర్చ గమనించండి. మీకు తెలుసాలో కొత్త విషయాలు చేర్చిన వికీపీడియన్ల పేరు రాయటమే కొందరి సభ్యులకు రుచించలేదు. --అర్జున (చర్చ) 04:24, 31 అక్టోబర్ 2013 (UTC)
  • మొదటి పేజీలో నాలుగు శీర్షికలు సరిసమానంగా ఉండటం లేదని యిదివరకు రహ్మానుద్దీన్ గారు తెలియజేశారు. మొదటి పేజీ సమతౌల్యం చేయుటకు ఒక నమూనాను తయారు చేసితిని. సహ సభ్యుల అంగీకారమైతే మార్చే ప్రయత్నం చేద్దాము.----K.Venkataramana (talk) 17:14, 1 నవంబర్ 2013 (UTC)
  • ఇప్పటికే మీరు మొదటి పేజీ కూర్పులో కొంత మార్పు చేసి ఉంచారు, అది చాలా బాగుంది - మీరు మార్చిన రోజే గమనించాను. మీరు పైన ఇచ్చిన లంకెలో చతురస్రాలకు కోణాలు గుండ్రటివి ఉంచారు, పేజీలో అన్నీ చతురస్రాలు అలానే ఉండాలి కానీ లేవు; అది నప్ప లేదు. ఇంకా రంగుల కాంబినేషన్ కూడా బాగులేదు. రహ్మానుద్దీన్ (చర్చ) 20:14, 1 నవంబర్ 2013 (UTC)

వికీ ట్రెండ్స్

[మార్చు]

అభినందన సమేత నమస్కారాలు తెవికె నిర్వాహకులకు. ఇప్పుడే 7 రోజుల వికి ట్రెండ్సు చూసాను. చాలా బావుంది. మంచి ఆలోచన. కాకపోతే కుండలీకరణంలో ఆకుపచ్చ అంకెలు వేసారు అవేమిటో సూచిస్తే మరింత బాగుంటుందని నా అభిప్రాయం. నా స్పందన ఎక్కడ ఇవ్వాలో తెలియక ఇక్కడ ఇస్తున్నా. క్షంతవ్యుడను. తెలిసినవారు స్థలమార్పు చేయ మనవి. - గణనాధ్యాయి (చర్చ) 13:40, 24 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారం వ్యాసం - ఈ వారం బొమ్మ

[మార్చు]

{{#time:Y}}_{{#time:W}} మూస ఈ రోజు(30-12-2013) నాటికి "2013_1" గా చూపిస్తున్నందువల్ల అవి ప్రస్తుత సమయానికి వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2013 01వ వారం గానూ వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2013 01వ వారం గానూ కనబడుతుంది. 2013 సంవత్సరం 53 వ వారం వ్యాసం, 53 వ వారం బొమ్మ కనబడుట లేదు. అవి 2014 జనవరి నాటికి మూసలో సంవత్సరం మారుట వల్ల సరికావచ్చునని భావిస్తాను. దీనిని సరిచేయగలమేమో చూడండి.----కె.వెంకటరమణ (చర్చ) 16:07, 30 డిసెంబర్ 2013 (UTC)

2014 జనవరి 1 న పై సమస్య సరియైనది.----కె.వెంకటరమణ (చర్చ) 16:19, 5 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మూలాలు

[మార్చు]

నయాగరాకవులలో ఒకరుగా ప్రసిద్ధులయిన ఏల్చూరి సుబ్రహ్మణ్యం పేజీ సృష్టంచబోతున్నాను. అయితే వారిగురించిన వివరాలు వారి కుమారుడు మురళీధరరావుగారినించి వైయక్తిక ఉత్తరాలద్వారా సేకరిస్తున్నాను. కొన్ని facebookలో ప్రచురించినవి. వీటికి మూలాలు ఎలా ఇవ్వాలి? (Malathi Nidadavolu, 12:44)

Malathi Nidadavolu గారూ, మూలాలు ఎలా ఇవ్వాలో ఇక్కడ చూడండి. కాని వైయక్తిక ఉత్తరాల ద్వారా సేకరించిన సమాచారాన్ని చేర్చడానికి, అలాంటి మూలాలు ఇవ్వడానికి తెవికీ నిబంధనలు ఒప్పుకోవు. వ్యక్తిగత సేకరణలు, పరిశోధన వివరాలు, స్వంత అభిప్రాయాలు, వ్యక్తిగత సమాచారం తదితరాలు ఇక్కడ చేర్చడానికి వీలుండదు. మూలాలు ఇవ్వాలనుకున్ననూ ఆ మూలాలు ఇతర సభ్యులు పరిశీలించడానికి అందుబాటులో ఉండేటట్టుగా ఇవ్వాల్సి ఉంటుంది. మరో విషయం ఏమిటంటే మొదటి పేజీకి సంబంధం లేని ఇలాంటి సందేహాల కొరకు మీ వాడుకరి చర్చాపేజీనే ఉపయోగించండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:41, 8 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర

[మార్చు]

తెలుగు వికి ని సంస్కరించవలసిన అవసరం చాలా ఉందని నాకు అనిపిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ అనే 'పేజీ' (ఈ పదం కూదా ' పుట ' గా మార్చవలసిన అవసరం ఉంది). మొదటి పుటగా ప్రారంభించి, చరిత్ర,, భౌగోళిక స్వరూపం, రాజకీయా స్వరూపం, ప్రకృతి లేదా సహజ వనరులు,జీవన విధానం, ఆర్ధిక వనరులు, సంప్రదాయలు, అనే విభాగలుగా విభజించటం అవసరం. ప్రస్తుత అమరిక లో విషయాలన్నీ విసరివేయబడినట్లు గా ఉన్నాయి. భౌగోళిక స్వరూపం క్రింద జిల్లాలు , ఆ జిల్లాలకు ప్రత్యేక పుటలు గా అమర్చవలసిన అవసరం ఉంది. తెలుగులొ విషయ , విజ్ఞానం పొందుపరిచే విధం గా విస్తరించాలి - 2014-07-28T10:17:10 User:Krishna prasad badarla


Yes Karumanchi madhu (చర్చ) 08:36, 26 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
User:Krishna prasad badarla, Karumanchi madhu గార్ల స్పందనకు ధన్యవాదాలు. మీరు అంటున్నది ఆంధ్ర ప్రదేశ్ పుట గురించి అనుకుంటున్నాను. వికీపీడియాలో ఎవరైనా అభివృద్ధి చేయవచ్చుకావున, మీరు మార్పులు ధైర్యంగా చేపట్టండి.--అర్జున (చర్చ) 04:36, 27 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

On the English Wikipedia, we started a project called TAFI. Each week we identify underdeveloped articles that require improvement. Our goal is to use widespread collaborative editing to improve articles to Good article, Featured article or Featured list quality over a short time frame.

This is all about improving important articles in a collaborative manner, and also inspiring readers of Wikipedia to also try editing. We think it is a very important and interesting idea that will make Wikipedia a better place to work. It has been very successful so far, and the concept has spread to the Hindi Wikipedia where it has been well received.

We wanted to know if your Wikipedia was interested in setting up its own version of TAFI. Please contact us on our talk page or here if you are interested.--Coin945 (talk) 17:48, 2 September 2014 (UTC)

ఈవారం బొమ్మ

[మార్చు]

హంపిలో గల మల్లిఖార్జున స్వామి ఆలయం, కర్నాటక\హంపిలో గల మల్లిఖార్జున స్వామి ఆలయం, కర్నాటకఫోటో సౌజన్యం: Udayaditya Kashyap/ ఈ పుటలో కనబరిచిన ఆలయం బొమ్మ అందులో తెలియజేసినట్లు కర్నాటక/హంపిలో లేదని నా స్థిర నమ్మకము. నానమ్మకానికి అధారమేమంటే..... నేను హంపిలో ప్రతి ఆలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పోటోలు తీశాను. ఆయా ఆలయాల వివరాలు కూడ నామోదు చేశాను. వాటిలో ఈ ఆలయం లేదు. వివరాలు లేవు. దాన్ని నేను ఎలా వదిలిపెట్టానో అర్థం కావడం లేదు. ఆ ఆలయం ఏ ప్రాంతానికి చెందినదో పరిశీలించమని వినతి. Bhaskaranaidu (చర్చ) 13:14, 29 అక్టోబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

చరిత్రలో ఈ రోజు శీర్షిక

[మార్చు]

మొదటి పేజీలోని "చరిత్రలో ఈ రోజు" విభాగంలో ముఖ్యమైన అంశాలు కొన్ని మాత్రమే ఉంటే బాగుంటుంది. ఆ రోజులో గల మిగిలిన విషయాలను సంబంధిత రోజు గల పేజీలో చేర్చితే బాగుంటుంది. అన్ని విషయాలను మొదటి పేజీలో కనబడాలని ఆశిస్తే మొదటి పేజీ సమతౌల్యత పోతుంది. అందువల్ల ఈ శీర్షికలో అంశాలను సంగ్రహ పరిస్తె మంచిదని నా అభిప్రాయం. మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఉదాహరణకు డిసెంబరు 2 లో అనేక విషయాలను చేర్చవచ్చు. చాలా విషయాలు విభాగాలుగా వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 2 లో చేర్చబడినవి. వీటిని పరిశీలించమనవి.-- కె.వెంకటరమణ 12:03, 2 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

కె.వెంకటరమణ గారు, మీ అభిప్రాయముతో నేను ఏకీభవిస్తున్నాను.JVRKPRASAD (చర్చ) 12:12, 2 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి పేజీ

[మార్చు]

నా చర్చా పుటలోని విషయాన్ని ఈ క్రింద పొందుపరచు చున్నాను. వాడుకరులు మీ అభిప్రాయములు తెలియజేయగలరు.

"నమస్కారం ప్రసాద్ గారు,

మీయొక్క స్వాగతాభినందనలకు కృతజ్ఞతలు. బహుశా మీరు తెలుగు వికీపీడియా నిర్వాహక సిబ్బందిలో ఒకరని నా అభిప్రాయము. కావున నాదొక చిన్న మనవి. మన తెలుగు వికీపీడియాలో "మొదటి పేజీ" అని ఉంది. నేను కొన్ని ఇతర భారతీయ భాషల వికీపీడియాలను చూశాను. అందులో వారు "పేజీ" అనే పదాన్ని కూడా అనువదించి వ్రాశారు. ఉదాహరణకు, మరాఠీలో "ముఖపృష్ఠ" అని ఉంది. మనం కూడా "మొదటి పేజీ" ని "మొదటి పుట" అనో "మొదటి పొరట" అనో వ్రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అలా సవరించడానికి నాకు ప్రస్తుతం అర్హత లేదు. అందుకే మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదములు.--భాషాభిమాని (చర్చ) 06:48, 20 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

భాషాభిమాని గారికి, మీకు ముందుగా ధన్యవాదములు. మీరు సూచించినట్లు నేను కూడా ఇంతకు ముందు "పుట" ఉంటే బావుంటుందని మౌఖికంగా చర్చించాను. కానీ ఈ నాటి తరం వారికి, అలాగే చాలా మందికి ఆ పదము అర్థం అంతగా అవదేమో, అవగతం కాదేమోనని విరమించి ముందుకు వెళ్ళలేదు. మరోసారి తప్పకుండా ప్రయత్నము చేద్దాము. JVRKPRASAD (చర్చ) 11:37, 20 జనవరి 2015 (UTC)]" JVRKPRASAD (చర్చ) 11:42, 20 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
జె.వి.ఆర్.కె.ప్రసాద్ మరియు భాషాభిమాని గారూ ఈ మొదటి పేజీ పేరు మార్చుటకు యిదివరకే చర్చ జరిగింది. ఈ లింకు చూడండి.-- కె.వెంకటరమణ 00:30, 24 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారు, పాత చర్చ గురించి కాదండి. ఈ చర్చలు వారి వారి వ్యక్తిగత, సూచన, అభిప్రాయములు క్రోడీకరించి, అందరూ ఒక నిర్ణయానికి ఇక్కడ వస్తున్నారు. అప్పుడు అలా చేసి ఉండవచ్చును. తిరిగి మరలా పునః సమీక్ష చేసుకొనుటలో తప్పు లేదు. నేను వచ్చినప్పుడు అర్జునగారికి మొదటి పుట, మరికొన్ని విషయాల మీద మార్పులకు మేము మాట్లాడుకుని ఆయన సంశయిస్తుంటే వారిని దైర్యముగా ప్రోత్సాహమిచ్చి, కొన్ని మార్పులు చేయుట జరిగింది. అలాగే రాజశేఖర్ గారితో కూడా వ్యక్తిగత చర్చలు చేసి కొత్తదనం కొరకు వికీల్లో కొత్త మార్పులు చేర్పులు జరిగాయి. ఇది నిరంతర కార్యక్రమం. కొత్తదనము అలాగే సాధ్యమయినంత వరకు తెలుగులోకి తర్జుమా చేసుకొనుటలో సంతోషిచదగ్గ విషయము అని నా అభిప్రాయము. JVRKPRASAD (చర్చ) 02:19, 24 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD గారూ, మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను. మొదటి పేజీ అనే కన్నా "మొదటి పుట" అనేది సరియైనది అని నా అభిప్రాయం. పేజీ అనే పదానికి తెలుగులో పుట, పొరట అని అర్థాలు ఉన్నాయి. కనుక తెలుగు వికీపీడియా అయినందున "మొదటి పుట" అని మారిస్తే బాగుంటుంది. యితర వికీలలో కూడా ఆంగ్ల పేజీ కి సరియైన ఆయా భాషా పదాలను ఉపయోగించారు. ఉదాహరణకు హిందీలో मुखपृष्ठ అని , కన్నడ వికీలో ಮುಖ್ಯ ಪುಟ అని గుజరాతీ భాషలో મુખપૃષ્ઠ అనీ, మరాఠీ భాషలో मुखपृष्ठ అనీ ఆయా భాషా పదాలను ఉపయోగించారు. మనం మన తెలుగు భాసలో మొదటి పుట అనుటలో తప్పులెదని నా అభిప్రాయం.-- కె.వెంకటరమణ 02:53, 24 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగులోకి కామనస్

[మార్చు]

కమనస్ అన్ని ప్రముక భషలో ఉంది. అలగే తెలుగులోకి అనువర్థనం చేస్తే అందరికి వీలుగా ఉంటుంది. తెవీకి బలొపతేనికి కామనస్ ని అనువదించదం మంచిది అని నా అభిప్రయం. Raj.palgun13 (చర్చ) 17:26, 12 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

కామన్లు లేదా కామనులు అనుకుంటే సరిపోతుందేమో. JVRKPRASAD (చర్చ) 13:20, 23 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వహణ గణాంకాలకొరకు క్వేరీ స్క్రిప్టులు

[మార్చు]

వాడి ఈ విభాగాలలో పనిచేస్తున్న సహసభ్యులను తెలుసుకొని వారితో సంప్రదిస్తూ నిర్వహణ మరింత మెరుగుగా చేయటకు ఉపయోగపడవచ్చు.--అర్జున (చర్చ) 18:07, 6 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పై స్క్రిప్ట్ లు తాజా చేశాను. --అర్జున (చర్చ) 08:41, 8 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

సాంకేతిక పదంలో సమస్య

[మార్చు]

నా వాడుకరి పేరు భూపతిరాజు రమేష్ రాజు. ఈ మధ్య తరచుగా నా సాంకేతిక పదం పనిచేయుటలేదు. అందువల్ల ఒక్కొక్కసారి వికీపిడియాలోకి లాగిన్ అవ్వలేకపోతున్నాను. తాత్కాలికంగా సాంకేతిక పదంతో లాగిన్ అయ్యి, మరలా నా పాత సాంకేతిక పదంగా మార్చుకొంటున్నాను. దయచేసి ఈ సమస్యను పరిష్కరించమని వికీపిడియావారికి నా మనవి. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 15:39, 10 జూలై 2015 (UTC))[ప్రత్యుత్తరం]

మొదటి పేజీలో ఎర్రలింకులు

[మార్చు]

మొదటి పేజీలో సాధ్యమైనంత వరకు ఎర్రలింకులు లేకుండా మొదటి పేజీని నిర్వహించే వాడుకరులు చూడగలరు. --స్వరలాసిక (చర్చ) 03:43, 17 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Telugu is missing

[మార్చు]

Telugu is missing from this page:
https://meta.wikimedia.org/wiki/There_is_also_a_Wikipedia_in_your_language
Thank you, Varlaam (చర్చ) 04:41, 19 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Thanks very much! Varlaam (చర్చ) 15:54, 20 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
చేర్చబడినట్లుగా గమనించాను. --అర్జున (చర్చ) 04:38, 27 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అక్టోబరు 16

[మార్చు]

అక్టోబరు 16 నాడు అక్టోబరు 14 నాటి వివరాలు ఇచ్చారేమి?--కంపశాస్త్రి 15:20, 16 అక్టోబరు 2018 (UTC)

పేజీ దారిమార్పులో దోషం సరిదిద్దబడినది.--కె.వెంకటరమణచర్చ 16:12, 16 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఎందుకు "మరియు" లేదు?

[మార్చు]

ఈ రోజులు, నేను ఒక పెద్ద ట్రెండ్ చూస్తున్నాను... అన్నీ "మరియు"లు తొలగించబడతాయి. ఏంటి విషయం? (ఇద్దరు ప్రశనం: తెలుగులో "మరియు" ఎప్పుడు ఉపయోగిస్తారు?) MSG17 (చర్చ) 03:42, 5 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

MSG17 గారికి తెవికీ శైలి విభాగం చూడండి. ఇకపై మొదటిపేజీకి సంబంధించని అంశాలను అయా చర్చాపేజీలు లేక రచ్చబండలో చర్చించండి.-- అర్జున (చర్చ) 06:06, 18 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాల సంఖ్య

[మార్చు]

కె.వెంకటరమణ గారు, ఇంతకు మునుపు చూసినప్పుడు 70000 పై చిలుకు వ్యాసాలు ఉండేవి. ఇప్పుడు 69600 మాత్రమే ఎందుకు ఉన్నాయి ? తొలగించే బదులు మెరుగు పరిస్తే సరిపోతుంది కదా ?దేవుడు (చర్చ) 07:31, 16 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

దేవుడు గారూ, తెవికీలో మొలకలు విపరీతంగా సృష్టిస్తుంటే వాటిని ఎవరు విస్తరిస్తారు? కొందరు వాడుకరులతో పాటు నేను కూడా వందల వ్యాసాలను అభివృద్ధి చేసాను. అలాగని ఎన్నని చేయగలం. అజ్ఞాత వాడుకరులు, గతంలో క్రియాశీలకంగా ఉండి చాలాకాలంగా వికీలో పనిచేయనివారికి ఎన్నో వ్యాసాలను అభివృద్ధి చేసాము. అవే కాకుండా ప్రస్తుత క్రియాశీలక సభ్యుల మొలకలను కూడా విస్తరణ చేసాము. కొందరు సభ్యులు క్రియాశీలంగా ఉండి కూడా వారు సృష్టించిన మొలకలను కనీసం అభివృద్ధి చేయనపుడు, వాటిలో తొలగింపు మూసను చేర్చినపుడు అందులో స్పందించకుండా ఉంటే వాటిని ఏం చేయాలి? అలా తొలగించడం జరుగుతుంది. ఇంతకు మునుపు చూసినప్పుడు 70000 పై చిలుకు వ్యాసాలు ఉండేవి. కానీ శుద్ధి చేయని గూగుల్ అనువాద వ్యాసాలు సుమారు 2000 తొలగించబడ్డాయి. వ్యాసంగా పరిగణించలేని విక్షణరీ పదాల వ్యాసాలు అనేకం తొలగించబడినవి. తెవికీ నియమాలకు సరిపడని "లలిత గీతాలు" తొలగించబడినవి. ఇంకా ఏక వాక్య వ్యాసాలు తొలగించబడుతున్నాయి. అందువలన సంఖ్య తగ్గింది. మనకు కావలసింది నాణ్యమైన వ్యాసాలే కానీ వ్యాసాల సంఖ్య కాదు కదా. ఇప్పుడున్న మొలక వీరుల లాంటి వాడుకరులు 10 మంది ఉంటే వికీ నియమాలు పాటించని నాణ్యత లేని మొలక వ్యాసాల సంఖ్య ఒక నెలరోజులలో లక్ష పెంచవచ్చు. అవి మనకు అవసరమా? అందువలన మంచి వ్యాసాలను రాయడానికి అందరూ కృషిచేయాలి. మనకు కావలసినది మంచి వ్యాసాలు గానీ, వ్యాసాల సంఖ్య కాదు. కె.వెంకటరమణ (చర్చ) 09:43, 17 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
@దేవుడు: గారూ, వ్యాసం సృష్టించడం, అభివృద్ధి చేయడం ఎంత ముఖ్యమైనవో విషయ ప్రాముఖ్యత లేని, సరిదిద్దడానికి సాధ్యపడని వ్యాసాలను తొలగించడం, తొలగింపుకు నోటీస్ చేర్చడం, చర్చ చేయడం వంటివి కూడా అంతే ముఖ్యమైన కృషి. --పవన్ సంతోష్ (చర్చ) 06:49, 21 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

జులై 14 నుండి మొదటి పేజీ మొబైల్ వీక్షణ కొత్త రూపు

[మార్చు]

మొదటిపేజీ పాతకాలపు ప్రత్యేక రూపుదిద్దడం జులై 13 తో అంతమవుతుంది కావున మొదటిపేజీకి కొత్తగా template styles వాడి రూపుదిద్దాలి. (చూడండి T254287). ప్రయోగాత్మకంగా మార్పులు చేశాను.. కొత్త రూపు ని పాత రూపుతో మీ మొబైల్ లో పరీక్షించి ఏమైనా సమస్యలు, సూచనలు తెలపండి. --అర్జున (చర్చ) 05:44, 29 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మూస:మొదటి పేజీ పాదములో ము బదులు అనుస్వారం ఉంటే బాగుంటుంది.అంతేగాదు పాదం అనే పదం భాగం అనే అర్థం సూచిస్తుంది. మూస:మార్గదర్శిని అనే దానిలో 'ని' అవసరంలేదు.మూస:మార్గదర్శి అని ఉంటే సరిపోతుంది.మార్గదర్శి అంటేనే ఆంగ్లలో గైడ్ అని,తెలుగులో మార్గ దర్శకుడు అనే అర్థాలు సూచిస్తాయి.నిఘంటుశోధనలో పరిశీలించండి.ఇవి నాసూచనలు.--యర్రా రామారావు (చర్చ) 06:16, 29 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారు. మీ సూచనకు ప్రతిక్రియగా చర్య జరిగింది. ఈ సూచన మీరు బహుశా రచ్చబండలో చేసివుంటే అక్కడ స్పందన చేర్చానని అనుకుంటున్నాను. ఇతరులకొరకు క్లుప్త సమాధానం చేరుస్తున్నాను. మార్గదర్శిని మార్చబడింది. మూస సాంకేతిక అంశంకనుక శైలి అంతముఖ్యకాదు. అర్జున (చర్చ) 04:45, 26 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

పండగలు

[మార్చు]

చరిత్రలో ఈ రోజు అనే పెట్టెలో తేదీకి సంబంధించిన చారిత్రక విషయాలు వస్తున్నట్టే ముఖ్యమైన పండగలు ఉన్న రోజున ఆపండగకు సంబంధించిన ప్రస్తావన మొదటి పేజీలో ఎక్కడో ఒక చోట వస్తే బాగుంటుంది. ఆ పండగకు సంబంధించిన వ్యాసపు పేజీ ద్వారా చాలా చారిత్రక విషయాలు అందరూ తెలుసుకొనుటకు, ఆ పండగ ప్రాముఖ్యత తెలుసుకొనుటకు ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటుంది. వివిధ ధర్మాలకు (హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మొదలైనవి) చెందిన అన్ని పండగల ప్రాముఖ్యతలను తెలియజేసినట్టు ఉంటుందని నా అభిప్రాయం.--అభిలాష్ మ్యాడం 07:24, 22 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@MYADAM ABHILASH, మీ సూచనకు ధన్యవాదాలు. పండగకు సంబంధించిన వ్యాసం వెతుకుయంత్రం ద్వారా చేరుకోవచ్చు. మొదటిపేజీ నిర్వహణలో ముఖ్యమైన అంశాలు, వారం వారీగా మారతాయి. వాటిని నిర్వహించడానికే ఆసక్తి అంతగా లేదు. కావున మీ సూచన అమలు చేయటం అదనపు శ్రమ కాగా,దానికి తగ్గ ఫలితం ఉండదని నా అభిప్రాయం. అర్జున (చర్చ) 04:41, 26 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

2022 జనవరి 25 నాటి Protected దిద్దుబాటు అభ్యర్ధన

[మార్చు]

మదర్ థెరీసా

[మార్చు]

విశ్వమాత మదర్ థెరీసా అన్నదానికి ఆధారాలు లేవు. అలాగే మదర్ థెరీసా వ్యాసంలో కూడా విశ్వమాత అని ఎక్కడా చెప్పబడలేదు. దానిని మిషనరీస్ ఆఫ్ ఛారిటీని స్థాపించిన మదర్ థెరీసా గా లేదా ఆమె పుట్టిన రోజు క్యాలెండర్ పేజీ వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 26 లో ఉన్నట్లుగా అయినా దిద్దుబాటు చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం--అభిలాష్ మ్యాడం (చర్చ) 10:33, 25 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి పాయింటు @MYADAM ABHILASH గారు.__ చదువరి (చర్చరచనలు) 14:42, 25 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు చదువరి గారూ--అభిలాష్ మ్యాడం (చర్చ) 03:16, 26 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

2021 లో మొదటి పేజీ వ్యాసం, మొదటి పేజీ బొమ్మ,మీకు తెలుసా నిర్వహించిన వారు

[మార్చు]

2021 లో మొదటి పేజీ వ్యాసం, మొదటి పేజీ బొమ్మ, మీకు తెలుసా నిర్వహించటంలో కనీసం ఐదు సవరణలు (క్వెరీ 62910 లో సంవత్సరం సంబంధిత ఎంపిక2021 తో)

creator edit_count
రవిచంద్ర 371
Chaduvari 121
K.Venkataramana 65
Adityamadhav83 18
Arjunaraoc 13
B.K.Viswanadh 10
Pavan santhosh.s 6
Nskjnv 5

చేసిన సభ్యులకు ధన్యవాదాలు. తెవికీ ఆకర్షణీయంగా వుండడానికి మీరు చేసిన కృషికి అభివందనాలు. అర్జున (చర్చ) 05:13, 8 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

విభాగాల వారీగా గణంకాలు తెలుసుకోవాలంటే చర్చ:మొదటి_పేజీ#నిర్వహణ_గణాంకాలకొరకు_క్వేరీ_స్క్రిప్టులు (తాజాకరించాను) చూడండి. అర్జున (చర్చ) 08:43, 8 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియా_చర్చ:ఈ_వారపు_వ్యాసం_జాబితా#2021_లో_ఈ_వారం_వ్యాసంగా_ఎంపికైన_వ్యాసాలకు_కృషి_చేసినవారు కూడా చూడండి. అర్జున (చర్చ) 12:15, 21 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

వార్తలు పెట్టుకుందాం

[మార్చు]

ఆంగ్లం వికీ లా వార్తులు పెట్టుకుందాం , మార్చుదానికి ఎక్కువ అయ్యితే వారంకు పెట్టు Helloisgone (చర్చ) 23:20, 20 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]