చర్చ:మొదటి పేజీ/పాత చర్చ 4

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీవీడియా పేజి పేరు మార్పుకు ప్రతిపాదన (స్వేచ్చా, ఉచిత)[మార్చు]

తెలుగు వికీపీడియా కి '"స్వేచ్ఛా" విజ్ఞాన సర్వస్వము' అని నామకరణం జరిగింది. (హిందీ భాష లో కూడా 'Free' అన్న పదాన్ని 'ముక్త్' గా అనువదించడం జరిగింది.). '"ఉచిత" విజ్ఞాన సర్వస్వము' సరి అయిన అనువాదము గా భావిస్తున్నాను. ఇంతకు ముందు ఈ విషయం మీద చర్చ జరిగినట్టు గమనించలేదు. Stnvishwanadh 09:31, 7 సెప్టెంబర్ 2008 (UTC)

విశ్వనాధ్ గారి ప్రతిపాదన ఆలోచంచదగినది. నాకు అనిపించేదేమంటే "Free" అన్న పదానికి Freedom to edit, Available at no cost అనే రెండు భావాలు ఉన్నాయి. అయితే "ఎవరైనా వ్రాయదగిన, ఎవరైనా వాడుకోదగిన" అన్న భావం ఎక్కువ ప్రాముఖ్యత కలిగింది అనుకొంటున్నాను. అలాగయితే "స్వేచ్ఛా" అన్న పదమే సముచితంగా ఉన్నదనుకొంటున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:56, 7 సెప్టెంబర్ 2008 (UTC)

హిందీ భాష లో "Free" అన్న పదానికి 'ముక్త్' గా అనువదించడం తప్పు. ఈ విషయంలో కాసుబాబు గారి "Freedom to edit" "స్వేచ్ఛా" అన్న పదమే సరైనది. భవాని62

http://en.wikipedia.org/wiki/Free_software_definition నుండి -->The word "free" in our name does not refer to price; it refers to freedom. First, the freedom to copy a program and redistribute it to your neighbors, so that they can use it as well as you. Second, the freedom to change a program, so that you can control it instead of it controlling you; for this, the source code must be made available to you.[1]
కనుక మన అనువాదమైన స్వేచ్చ నే కరక్టు. ముఫ్త్ సరిగ్గా నప్పదు. Chavakiran 07:07, 30 నవంబర్ 2008 (UTC)

స్వేచ్చా అనే పదమే సరైనదని నాకని పిస్తున్నది. ఉచితం అనే పదం... ఎక్కువగా వస్తు రూపేణా ఒకరికి ఇవ్వడాని కే ఎక్కువగా ఉపయోగం లో వుందని నా నమ్మకం.ellanki 05:52, 21 జనవరి 2012 (UTC)

़~~़సతిష్ కృతజ్ఞతలు. భవానీ

తెలుగులో[మార్చు]

మొదటి పేజీలో wiki in 5 minutes అనే ట్యాబ్ ని ఐదు నిమిషాల్లో వికీ అని మార్చాలి. రవిచంద్ర(చర్చ) 04:15, 30 సెప్టెంబర్ 2008 (UTC)

వెతుకు పెట్టెలో తెలుగులిప్యంతరీకరణని ఎంచుకునేటట్లు వేయండి[మార్చు]

వేరే కీబోర్డు మాపింగు వాడే వారికి ఆసౌకర్యంగా వుంటుంది కాబట్టి వెతుకు పెట్టెలో అప్రమేయపు తెలుగులిప్యంతరీకరణని తీసివేయండి, లేక ఎంచుకొనేటట్లుగా చేయండి.అర్జున 09:06, 20 డిసెంబర్ 2008 (UTC) నేనే పొరబడినాను. నా కీబోర్డు మాపింగు పనిచేస్తుంది.అర్జున 02:34, 21 డిసెంబర్ 2008 (UTC)

ఎక్కడైనా esc నొక్కితే చాలు. అప్రమేయపు లిప్యాంతరీకరణ ఆగిపోతుంది. --వైజాసత్య 15:14, 21 డిసెంబర్ 2008 (UTC)

వికీపీడియా వ్యాసాల నాణ్యతను త్వరగా పెంచడం[మార్చు]

కేరళ ప్రభుత్వము మళయాళ విజ్ఞాన సర్వస్వమును వికీపీడియాలో పెట్టటానికి అంగీకరించిందని, జిమ్మీ వేల్స్ తెలిపారు. మనము తెలుగులో కూడా ఆ పని చేస్తే బాగుంటుంది. ఏమంటారు? అర్జున 08:16, 21 డిసెంబర్ 2008 (UTC)

అవును అలా చేయటానికి అంగీకరిస్తే సాహిత్యం, దర్శనాలు వంటి కొన్ని విషయాల్లోనైనా తెలుగు వికీపీడియాలో విస్తృత సమాచారముంటుంది --వైజాసత్య 15:16, 21 డిసెంబర్ 2008 (UTC)
కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు రచించిన ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం కూడా మన తెలుగు వికీపీడియాలో చేర్చటానికి గల అవకాశాలను కూడా పరిశీలించండి . భారతి మాస పత్రిక లోని వ్యాసాలను కాల క్రమంలో మన తెలుగు వికీపీడియా లో చేర్చగల అవకాశాల గురించి చర్చించండి. Talapagala VB Raju
ప్రస్తుతం దాని హక్కు దార్లు తెలుగు విశ్వవిద్యాలయం విజ్ఞాన సర్వస్వం శాఖ. వారితో నేను క్రిందటి సంవత్సరం సంప్రదించాను. హైద్రాబాద్ లో ఆసక్తిగల తెలుగు వికీపీడియన్లు చర్చ కొనసాగించితే ఫలితం వుండ వచ్చు. --అర్జున 14:04, 12 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఎలక్షన్ స్పెషల్ పోర్టల్ ఒకటి తయారు చేసి, అక్కడికి లింకు తొలి కాగితం నుండి ఇస్తే బాగుంటుంది.[మార్చు]

ఎలక్షన్ స్పెషల్ పోర్టల్ ఒకటి తయారు చేసి, అక్కడికి లింకు తొలి కాగితం నుండి ఇస్తే బాగుంటుంది. Chavakiran 04:27, 2 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ఆలోచన చాలా బాగుంది. ఇప్పుడున్న నియోజకవర్గాల వ్యాసాలు, రాజకీయ నాయకుల, రాజకీయ పార్టీల వ్యాసాలను చేరుకోవడానికి కొత్తవారికి ఉన్న ఇబ్బందికి దీని ద్వారా పరిష్కారం లభిస్తుంది. -- C.Chandra Kanth Rao-చర్చ 19:57, 2 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
అవునండి, సమయోచితమైన "చక్కటి సూచన". సమగ్ర పరచడానికి, ఇంకనూ విశాలపరచడానికి చక్కటి ఉపకారి. అహ్మద్ నిసార్ 20:08, 2 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
అయితే పోర్టల్ రెడీ చేద్దామా? δευ దేవా 21:01, 2 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
దేవా గారు, పోర్టల్ తయారు చేయండి. తరుచుగా మారే అంశాలు లేకుండా బాక్సులు చేయండి. ఎందుకంటే ఎన్నికల తర్వాత చేర్చాల్సిన కొత్త విషయాలు ఉండకపోవచ్చు. -- C.Chandra Kanth Rao-చర్చ 21:25, 2 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
శుభం శీఘ్రం, దేవా గారూ, భేషైన పని ప్రారంభించారు. అహ్మద్ నిసార్ 08:33, 3 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
థాంక్స్ నిసార్ గారు. కానీ మిగతా సభ్యుల సహాయం కూడా కావాలి, దీనికి. మూస:అసెంబ్లీ నియోజకవర్గం 1 చూడండి, అలా ఒక బొమ్మ కొంత వివరణతో ఒకసారి అన్ని నియోజకవర్గాలు తయారయితే ఆ వేదికలో మళ్ళీ మళ్ళీ మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. మూస:అసెంబ్లీ నియోజకవర్గం <నియోజక వర్గం వరుస సంఖ్యతో అన్ని నియోజకవర్గాలు చేయగలితేనే ఈ వేదికవల్ల ఉపయోగం. లేదా మీకు తోచిన ఆలోచనలను తెలియపరచండి. δευ దేవా 15:19, 3 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]
దేవా గారు, నియోజకవర్గాల వ్యాసాలలొ ఉపోద్ఘాతం పని నేను చూసుకుంటాను. ఆ పని చేయడం నాకు తేలికే. మీరు బొమ్మలు, మూసలు తయారుచేయండి. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల వ్యాసాలలో ఉపోద్ఘాతం ఉంది. -- C.Chandra Kanth Rao-చర్చ 17:24, 3 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఈవారం బొమ్మ క్రిందకి జరిపి మార్గదర్శి పైకి జరిపితే ఎలా ఉంటుంది?[మార్చు]

తద్వారా వచ్చిన వాళ్లు ఎక్కువ వ్యాసాలు చదివి, వ్రాయడం జరగవచ్చు. గతంలో మార్గదర్శిలో ఎర్రలింకులు ఎక్కువగా ఉండేవి, కాని ఇప్పుడు ఆ సమస్య లేదు కదా Chavakiran 04:01, 30 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

Small request[మార్చు]

Hello! I am a Polish wikipedian and I would like to ask you for writing a new article about former Polish President who won the Nobel Peace Prize in 1983 – Lech Wałęsa. I have looked for his article in your Wikipedia but without success. Polish Wikipedians will be grateful for your help. Thank you so much in advance! PS article in English you can find here. Best wishes from Poland, Patrol110 19:51, 21 సెప్టెంబర్ 2009 (UTC)

Sure. we will create it shortly. --కాసుబాబు 21:23, 21 సెప్టెంబర్ 2009 (UTC)
అందరు ఛూడండి! --జ్ఞానము 04:38, 26 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

నాది ఒక విన్నపం మన తెలుగు వికిపిడియా మొదటి పేజీలో కొంచం ఖాళీగా ఉన్న పేజీలో ఏదేనా పెట్టగలరు.--జయంత్ కుమార్ 06:07, 4 నవంబర్ 2009 (UTC)

ఈవారం వ్యాసం పెద్దగా ఉన్నందున పొడవు ఎక్కువై ఎడమ వైపు కిందిబాగాన ఖాళీ ఏర్పడింది, ఈ ఖాళీ వచ్చే వారంలో సర్దుబాటు కావచ్చు. ఇప్పుడు ఆ ఖాళీ స్థానంలో ఏదైన పెడితే వచ్చే తదుపరి వారాలలో కుడివైపు ఖాళీ ఏర్పడుతుంది. -- C.Chandra Kanth Rao-చర్చ 19:40, 4 నవంబర్ 2009 (UTC)
సాధారణంగా చరిత్రలో ఈరోజు, ఉపశీర్షికలో అన్ని విషయాలు ఉండవు, అందుకే ఇప్పుడు ఎడమవైపు అంత ఖాళీ ఏర్పడింది. ఈ మధ్య వాటిలో సమాచారం బాగా పెరిగిపోయినట్లుంది. __మాకినేని ప్రదీపు (+/-మా) 06:09, 5 నవంబర్ 2009 (UTC)
మీ యెక్క సలహాకు నా యెక్క ధన్యవాధములు. --జయంత్ కుమార్ 06:32, 5 నవంబర్ 2009 (UTC)

వేదికలు[మార్చు]

వేదికలకు ఎలా వెళ్ళాలో అర్థం కావటం లేదు. ఒక సారి అసంకల్పితంగా అక్కడికి వెళ్ళాను. అప్పటి నుండి కావాలంటే భారత దేశం వ్యాసం కుడి వైపున ఉన్న భారత దేశము వేదిక లింకు పట్టుకుని వెళ్తున్నాను, వేదికలకు లంకె మొదటి పేజిలో ఉంటే బాగుంటుంది. TeluguPadam 07:26, 11 నవంబర్ 2009 (UTC)

మీరన్నది నిజమే మొదటిపేజీలో లింకు ఉండాల్సిందే కాని వేదిక శీర్షికలను మనం ఎప్పటికప్పుడు తాజాకరించడం లేదు. కాబట్టి దీనిపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేము. ఎవరైనా చొరవగా ముందుకు వస్తే ఈ విషయంపై ఆలోచించాల్సి ఉంటుంది. మీరు వేదికలకు వెళ్ళడానికి వెతుకు డబ్బాలో సరాసరిగా వేదిక:భారతదేశం అని టైపు చేసి వెళ్ళవచ్చు.-- C.Chandra Kanth Rao-చర్చ 19:29, 11 నవంబర్ 2009 (UTC)

మొదటి పేజీ రూపంలో మార్పుల ప్రతిపాదన.[మార్చు]

ప్రస్తుతం తెరలో పది శాతం కన్న తక్కువగా ఈ వారం వ్యాసం ఉంది. వెడల్పాటి (16:9) తెరలు సామాస్యం అవుతున్న నేపథ్యంలో, వీక్షకులకు అసక్తి కలిగించటానికి, కొన్ని మార్పులు చేస్తే బాగుంటుంది.
1. Not able to view the Telugu script? Click Here లైనుని, Telugu help అని మార్చి, పక్క పానెల్ లో మార్గ దర్శకము పైగా పెట్టాలి. దీనిని ఐఛ్ఛికంగా మలచుకనే వీలుకంటే, పక్క పానెల్ కు తీసుకెళ్లటమే మంచిది.
2. వికీపీడియా స్వాగతం బానర్ ని పక్కపానెల్ లొ తీసుకెళ్లాలి.
3. వికీపిడియా ప్రతి రోజు చూసేటట్లుగా ఆసక్తి కలిగించటానికి, చరిత్రలో ఈరోజుని పై వరుసలో ఎడమ పక్క పెట్టాలి.
4. ఈ వారం వ్యాసం కుడి పక్క వుండాలి. వ్యాసంలో బొమ్మని పెద్దదిగా చూపాలి.
5. స్వాగతం బానర్ని, ఐఛ్చికంగా వుంచాలి.
6. మార్గదర్శిని పైన కనిబడేట ట్లు ఇంకొక పానెల్ గా జతచేస్తే బాగుంటుంది.
అర్జున 05:27, 25 డిసెంబర్ 2009 (UTC)

పది శాతం అన్న విషయం సరిగా అర్ధం కాలేదు. తెర వెడల్పులో ఈ వారం వ్యాసం 50% వెడల్పుండేలా కోడ్ చేయబడింది కదా. నా 15.4 అంగుళాల తెరలో సైడ్ బార్ ఒక 15% పోయిందనుకున్నా. ఈ వారం వ్యాసం దాదాపు ఓ 40% వెడల్పుగా కనిపిస్తుంది. --వైజాసత్య 19:33, 25 డిసెంబర్ 2009 (UTC)
4:3 నిష్పత్తి తెరలో, తెలుగు చదవకలిగేటంత పరిమాణాన్ని పెంచినప్పుడు (ఫైర్ఫాక్స్ లో ctrl +, ctrl - తో పరిమాణం మార్చవచ్చు) 71.5 శాతం, మార్గ దర్శకాలు, ప్రకటనలు, స్వాగతం పానెల్ కనబడతాయి. 18.5 శాతం మాత్రమే, ఈ వారం వ్యాసం (బొమ్మలో లేత ఆకు పచ్చ మిళితమైన భాగం) కనబడుతుంది.
పిక్సెల్ వివరాలు, బొమ్మ పేజిలో చూడండి.అర్జున 07:04, 27 డిసెంబర్ 2009 (UTC)

Greetings fellow Telugu Wikipedians!![మార్చు]

I am learning Telugu (I can read and write, but my speaking is still not good). I am also interested in Wikipedia Telugu, but it is a bit difficult for newcomers to the language to pick up the interface, so I made this. Please tell me what you think. Cheers! --జ్ఞానము 00:47, 20 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

చాలా బాగుంది. నేను వీక్షణ జాబితా ని విస్తరించాను . అర్జున 06:23, 20 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]
చాల ధన్యవాదములు! --జ్ఞానము 09:19, 21 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]
Good effort. But, there is a better way. You can set the language of the interface in the preferences ప్రత్యేక:అభిరుచులు. Under అంతర్జాతీయీకరణ, choose the interface language. This is better because interface messages might change over time and your page might not reflect that in a timely manner. However, if you want to get used to the Telugu interface, you can continue the way you do. — వీవెన్ 07:17, 20 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]
Doh! చాలా ధన్యవాదములు, I've been scanning back and forth, but this makes things much easier! --జ్ఞానము 09:19, 21 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

Suggestion for an article to create[మార్చు]

Hi! I notice on EN that there are en:Air India Express and en:Air India Express Flight 812 but so far there are no Telugu articles for those subjects. I think it would be useful for Telugu-speaking people if there was at least a stub about those subjects created in Telugu. Air India does have a Telugu article. WhisperToMe 02:18, 26 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

We do have an article called ఎయిర్ ఇండియా. Which inkterlinks to en:Air India. --రవిచంద్ర (చర్చ) 04:19, 26 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]
Yup. I would think that the Telugu Wikipedia would benefit from also having articles specifically about those subjects
Also, it would be nice to have an article about en:Super (2010 Indian film)
Thanks,
WhisperToMe 20:06, 2 సెప్టెంబర్ 2011 (UTC)
Also en:Psycho (2008 film) would be a good idea WhisperToMe 17:19, 1 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

చరిత్ర లో ఈ రోజు పైకి జరుపుట[మార్చు]

చరిత్ర లో ఈ రోజు పానెల్ ని మొదటి పేజీలో స్వాగతం స్థానంలో కి మారిస్తే బాగుంటుంది. విహరిణిలో నివాస పేజీ గా చేసుకున్న వారికి రోజు కొంత కొత్తగా కనబడుతుంది. మొదటి పేజీ వినూత్నంగా చేయటానికి సలహాలు చర్చించి అమలు జరిపితే బాగుంటుంది. ఉపమానంగా నేను షాపింగ్ చేసే బిగ్ బజార్, అప్పుడప్పుడు దుకాణంలో అమరిక స్వల్ప మార్పులు చేస్తుంటారు అందుకని ఆకర్ష ణీయంగా వుంటుంది. అర్జున 05:32, 5 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జునరావు గారూ! మీ సూచన బాగానే ఉందిగాని రెండు సమస్యలు పరిశీలించాలి (1) "చరిత్రలో ఈ రోజు" శీర్షికను రెగ్యులర్‌గా అప్‌డేట్ చేయలేకపోతున్నాము కనుక కొన్ని రోజులు అది ఖాలీగా ఉండవచ్చును (2) మొదటి పేజీ నర్వహణను ఇదివరకు చూసే వీవెన్, వైజాసత్యలు బిజీగా ఉన్నట్లున్నారు - మీరు గనుక ప్రయత్నించే వీలుంటే క్రొత్త డిజైన్ చేసి ప్రతిపాదించండి. సభ్యుల అభిప్రాయాలు కనుక్కుందాము --కాసుబాబు 11:57, 7 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

మీ స్పందనకి ధన్యవాదాలు. త్వరలో కొంత విశ్లేషణ చేసి ప్రయత్నిస్తాను. అర్జున 04:29, 8 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]
నా మొదటి చిత్తు ప్రతి] చూసి స్పందించండి. --అర్జున 09:50, 3 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

సాక్షాత్[మార్చు]

Please translate the article on the Sakshat computer to Hindi. Thanks. --92.11.24.4 ౧౭:౨౨, ౨౩ జులాఈ ౨౦౧౦ (UTC)


తెలుగు numbers[మార్చు]

As direct edit in telugu option in telugu wikipedia will not support Telugu numbers, people will forget that there are separate symbols in Telugu script for numbers. I request people to use Telugu numbers in wikipedia inplace of English numbers. Please dont let cultural scripts to vanish.

I request administrator to look into this issue ASAP. Tou can contact me on teju2friends@gmail.com

Teju2friends

Any updates on this? Teju2friends 18:43, 25 మార్చి 2011 (UTC)[ప్రత్యుత్తరం]
Any Admins active here??? Teju2friends 04:15, 26 మార్చి 2011 (UTC)[ప్రత్యుత్తరం]
తెవికీలో తెలుగు అంకెలు ఉపయోగించే విషయమై జరిగిన చర్చను చూడండి. అన్నట్టు, మీరు తెలుగులో వ్రాయొచ్చు కదా? — వీవెన్ 08:16, 26 మార్చి 2011 (UTC)[ప్రత్యుత్తరం]
Thanks for the reply. I dont know Telugu. Could you please translate the summary to english? Teju2friends 18:18, 26 మార్చి 2011 (UTC)[ప్రత్యుత్తరం]
Current policy /tradition of Telugu wikipedia is to use International form of Indo arabic numerals, as Teligu society and its media use the same. Please do not change numbers into Telugu forms in any Telugu wiki articles, such changes will be reverted without notice as the same will be considered as Vandalism..--అర్జున 03:53, 27 మార్చి 2011 (UTC)[ప్రత్యుత్తరం]
Thanks అర్జున, I was not aware that Telugu numbers are now extinct. Teju2friends 05:22, 27 మార్చి 2011 (UTC)[ప్రత్యుత్తరం]
Thanks for your understanding. For any future discussion proposals, please use the villagepump (Rachhabanda).--అర్జున 06:16, 30 మార్చి 2011 (UTC)[ప్రత్యుత్తరం]

Wikipedia in Tatar[మార్చు]

Dear friends, may I ask you to add a hyperlink to our Tatar Wikipedia (http://tt.wikipedia.org) to yourr Front page. Tatars - are turkic nation living in Tatarstan Republic, second biggest nation in Russian Federation. hope to hear from you soon. sincerely yours, Muhtac 21:17, 20 మార్చి 2011 (UTC)[ప్రత్యుత్తరం]

Added. -అర్జున 04:55, 3 సెప్టెంబర్ 2011 (UTC)

మొబైల్ తెవికీ[మార్చు]

te.m.wikipedia.org అన్న చిరునామాకి వెళ్ళడం ద్వారా ప్రస్తుతం తెలుగును చూపించే మొబైళ్ళలో తెలుగు వికీపీడియాని చూడవచ్చు. అయితే, మొబైలు కోసం మొదటి పేజీని అమర్చుకోలేదంటూ ఒక గమనిక కనబడుతుంది. ప్రస్తుతం మొబైలు తెవికీలో వెతవచ్చు (కానీ మొబైళ్ళలో తెలుగులో టైపు చెయ్యలేము కదా) మరియు యాదృచ్ఛిక పేజీ లంకె ద్వారా పేజీలను చూడవచ్చు.

మొబైలు కొరకు మొదటి పేజీలో కొంత విషయం ఉండేలా చూస్తే బావుంటుంది. ఇందుకోసం మొబైలు కోసం మొదటి పేజీని తయారు చేసుకోవాలి. దాన్ని నేను ఇక్కడ మొదలుపెట్టాను. ప్రస్తుతం మొదటి పేజీలోని ఈ వారపు వ్యాసం, మీకు తెలుసా?, చరిత్రలో ఈ రోజు అన్న విభాగాలను చేర్చాను. మామూలు మొదటి పేజీలో వీటిని మార్చగానే మొబైలు పేజీలోనూ తాజా అవుతాయి. మొబైలు మొదటిపేజీని ప్రత్యేకంగా మార్చాల్సిన పనిలేదు.

ఇదీ తయారీలో ఉన్న మొబైలు మొదటి పేజి. మొబైళ్ళ ద్వారా దీన్ని చూడాలంటే ప్రస్తుతం ఈ లంకెకి వెళ్ళాలి: te.m.wikipedia.org/wiki/WP:MOBILE. మీ తెలుగు చూపించే మొబైళ్ళలో దీన్ని ప్రయత్నించి చూడండి; మీ సూచనలనూ సలహాలనూ తెలియజేయండి. (సరే అంటే దీన్ని మొబైలు మొదటి పేజీగా చేయమని బగ్‌జిల్లాలో అభ్యర్థిద్దాం. ఆ తర్వాత నేరుగా te.m.wikipedia.org కి వెళితే, ఈ పేజీ మొదటి పేజీగా కనిపిస్తుంది.) —వీవెన్ 15:09, 18 ఏప్రిల్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]

బగ్జిల్లాలో నమోదుచేసాను. #28652వీవెన్ 21:14, 21 ఏప్రిల్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ బగ్గును పరిష్కరించారు. ఇప్పుడు te.m.wikipedia.org అన్న చిరునామాకి వెళ్తే, ఈవారపు వ్యాసం, మీకు తెలుసా, చరిత్రలో ఈ రోజు అన్న విభాగాలు కనిపిస్తాయి. మైబైలు మొదటి పేజీని ఇంకా ఎలా మెరుగుపరచవచ్చు అన్న మీ సూచనలను మొబైలు మొదటి పేజీ యొక్క చర్చా పుటలో తెలియజేయవచ్చు. — వీవెన్ 15:32, 22 ఏప్రిల్ 2011 (UTC)[ప్రత్యుత్తరం]
స్మార్ట్ ఫోన్లలో తెలుగు వికీపీడియా మొబైల్ రూపం బొమ్మ. -- అర్జున 10:23, 30 అక్టోబర్ 2011 (UTC)
స్మార్ట్ ఫోన్లలో తెలుగు వికీపీడియా మొబైల్ రూపం

మొదటి పేజీ నిర్వహణ[మార్చు]

జనవరి 1, 2012 న వికీపీడియా చూస్తే 2012 52 వవారం గా (ISO ప్రకారం) గుర్తించబడి ఈ వారం వ్యాసం, బొమ్మ లు ఖాళీగా వున్నాయి. ప్రస్తుతానికి నేను వాటిలో గత వారం వివరాలతో భర్తీచేశాను. రేపు మామాలు 1 వ వారం అంశాలు ప్రదర్శితమవుతాయనుకుంటాను. మొదటి పేజీ నిర్వహణకు కనీసం ముగ్గురు సభ్యుల జట్టు ఏర్పరిస్తే బాగుంటుంది. ఇటువంటి సమస్యలు మరల జరగకుండా ప్రయత్నించవచ్చు. --అర్జున 06:14, 1 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటిపేజీ మార్పు ప్రతిపాదన[మార్చు]

మొదటి_పేజీ/2012ముసాయిదా1 చూడండి. మూస_చర్చ:మార్గదర్శిని లో నమూనా మెరుగు కూడా చూడండి. స్పందించండి.--అర్జున 17:35, 4 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

అన్ని templates (including relevant categories) వేరు వేరు tool bars రూపములో ఏర్పాటు చేస్తే బావుంటుంది. అదే విధముగా పుట క్రింద భాగములో కూడా tool bars వుంటే వాడుకరులకు ఆసక్తిగా ఉంటుంది జె.వి.ఆర్.కె.ప్రసాద్ 18:20, 4 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
మీ రు ఒక నమూనా చూపిస్తే మీ వ్యాఖ్య అర్థం చేసుకోవటం సులభంగా వుంటుంది. --అర్జున 12:46, 7 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
స్వాగతం మూసని స్వాగతం పేజీలోకి మారుద్దాం. అప్పుడు చాలా విలువైన ముఖపత్రపేజీ సమర్థవంతంగా చలనశీల విషయాలతో నిండివుంటుంది.--అర్జున 09:08, 8 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
మొదటి_పేజీ/2012ముసాయిదా1 పూర్తయింది. దీనిపై వ్యాఖ్యానించండి.--అర్జున 10:02, 8 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
2012-01-14 నాటి వెబ్ చాట్లో కొత్త రూపానికి మార్చటానికి నిర్ణయించబడింది. --అర్జున 03:51, 15 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
వెబ్ ఛాట్ నిర్ణయాలకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటాను. వారానికి ఒకసారి గంట సేపు జరిగే ఛాట్‌లో అందరికీ పాల్గొనే వీలుకాకపోవచ్చు, ఆ సమయంలో వేరే వ్యాపకాలుండవచ్చు, మరికొందరికీ అసలు ఛాట్‌లో పాల్గొనడమే ఇష్టం లేకపోవచ్చు. కాబట్టి ఛాట్ నిర్ణయాలు తెవికీ సభ్యుల నిర్ణయాలుగా భావించలేము. తెవికీలో చర్చ ప్రారంభించి వారం పాటు కొనసాగిన వాటిలో సభ్యులు ఆలోచించి తమ అభిప్రాయాలు చెప్పినవాటికి, అసలు ఆలోచించడానికి అవకాశం లేకుండా అప్పటికప్పుడు తీసుకొనే నిర్ణయాలకు చాలా తేడా ఉంటుంది. అందులోనూ మొదటిపేజీకి తెవికీలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:07, 6 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట[మార్చు]

మా తెలుగు తల్లికి మల్లె పూదండ పాటను తెలుగుతల్లి బొమ్మతో బాటుగా మొదటిపేజీలో సరైన స్థానంలో ఉంచితే అది వికీ రచయితలకు ఉత్తేజాన్ని కలిగిస్తుందని నా అభిప్రాయం. సాంకేతికంగా దానిని ఎలా చేయాలో తెలిసిన వారు ఆలోచించి నిర్ణయించండి. ఈ పాట కాపీహక్కుల నుండి విముక్తి పొందినది.Rajasekhar1961 09:59, 6 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు [1]విక్షనరీ సైటు మొదటిపేజీలో ఉంచాను. అంతకంటే ఎక్కువ మార్పులు చేసేందుకు పెద్దల అనుమతి, చర్చ అవసరమని అనుకుంటున్నాను. నాకు కంప్యూటర్ విద్య మాత్రము, ఈషణ్మాత్రము రాదు అని గ్రహించగలరు.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 13:28, 6 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

మొబైల్ పేజీ దోషం[మార్చు]

మొబైల్ పేజీ లో ఈ వారంవ్యాసం రెండవ పేరా వరుసఅంతరము(linespacing) తక్కువగా వుంది. --అర్జున 06:34, 29 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారపు వ్యాసం పేజీలో సరిచేసాను. మొబైల్ కాషే తాజాకాగానే సరిగా కనబడుతుంది. —వీవెన్ (చర్చ) 02:14, 1 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
ఫైర్ఫాక్స్(ఉబుంటు) లో మరియు మొబైల్ లో అండ్రాయిడ్ విహరిణి మరియు మిరేన్ విహరిణిలో కూడ సమస్య అలానేవుంది.--అర్జున (చర్చ) 03:40, 1 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
ఇప్పుడు చూడండి. (ఈ వారపు వ్యాసంలో <noinclude> ట్యాగుని వేరే పంక్తిలో ఉంచితే, కావాల్సిన <p> వచ్చి పంక్తుల మధ్య ఖాళీ సరిగా వస్తుంది.) — వీవెన్ (చర్చ) 15:02, 1 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
ఇప్పుడు సరిగా వుంది. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 01:07, 2 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

2012కు మొదటిపేజీ నిర్వాహకులు[మార్చు]

మొదటిపేజీ నిర్వాహకత్వానికి ఆహ్వానం. మీ వాడుకరి పేరుకి లింకు క్రింద సరియైన పెట్టెలో రాయండి. ఉపబాధ్యత తీసుకొనేవారు, ప్రధానబాధ్యత తీసుకొనే వారికి సహాయమందించి వాళ్లు సెలవులో వున్నప్పుడు, శీర్షికని ఎడతెగకుండా కొనసాగించేటట్లుచూడాలి.

శీర్షిక ప్రధాన బాధ్యత (ఒక్కరు మాత్రమే) ఉపబాధ్యత (ఎంతమందైనా)
ఈ వారం వ్యాసం అర్జున , రాజశేఖర్
ఈ వారం బొమ్మ అర్జున
మీకు తెలుసా రాజశేఖర్
చరిత్రలో ఈ రోజు వీవెన్ రాజశేఖర్

--అర్జున (చర్చ) 06:16, 4 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

దాదాపు 5 సంవత్సరాలు నిర్వహించిన కాసుబాబు చాలాకాలం నుండి క్రియాశీలంగా లేరు. దీనిలో ఈ వారం వ్యాసం, ఈ వారం బొమ్మ నిర్వహణ ప్రధాన బాధ్యతతీసుకొనే ఔత్సాహికులకొరకు మరొకసారి విజ్ఞప్తి.--అర్జున (చర్చ) 09:59, 30 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]
కాసుబాబు గారు తన చర్చా పేజీలో స్పందన ప్రకారం జనవరి తరువాత వీలవుతుందని చెప్పారు. నేను డిసెంబరు2012వరకు ఈవారం వ్యాసం, బొమ్మల బాధ్యతను చేపట్టతాను. --అర్జున (చర్చ) 04:15, 19 జూలై 2012 (UTC)[ప్రత్యుత్తరం]
2012వరకు ఈవారం శీర్షికలు తయారయ్యాయి. 2013 లో తెవికీ నిత్యనూతనంగా వుంచడానికి తగిన విధంగా తోటి వికీపీడియన్లు స్పందిస్తారని ఆశిస్తున్నాను.--అర్జున (చర్చ) 07:32, 11 నవంబర్ 2012 (UTC)

మీకు తెలుసా[మార్చు]

మీకు తెలుసా ఈ వారం పాతదే వచ్చింది. మారలేదు ఎందువలన.Rajasekhar1961 (చర్చ) 06:55, 12 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

దీన్ని ప్రతీవారం మార్చాలి. మార్చి 5 తర్వాత మార్పులు లేవు కదా. ఆ పేజీ చరిత్రవీవెన్ (చర్చ) 11:17, 12 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

చరిత్రలో ఈరోజు[మార్చు]

చరిత్రలో ఈరోజు రెండు రోజులుగా మారడం లేదు. తెలిసిన వారు సరిచేయండి.Rajasekhar1961 (చర్చ) 05:24, 25 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది ప్రోగ్రామ్ ద్వారా మారుతుంది. పరిశీలించేటప్పుడు భారతకాలమానం ప్రకారం ఉ 05:30 తర్వాత చూడండి ఎందుకంటే గ్రీన్విచ్ మీన్ టైమ్ ప్రకారం మారుతుంది.--అర్జున (చర్చ) 13:11, 25 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి పుట.... మొదటి వరుస (లైన్) గురించి[మార్చు]

ఆర్యా.... వికిపీడియాలో మొదటి పుటలో పైనున్న పైన వున్న మొదటి లైన్ ......"టైపింగ్ పద్దతి, పేరు... నాగురించి చర్చ, నాఅభిరుచులు, నావీక్షణా జాబితా, నామార్పులు చేర్పులు, నిష్క్రమణ::: రెండో లైన్లో వెతుకు పెట్టె, ఇవేవి "క్లిక్"కు స్పందించడము లేదు. కారణ మేమై వుండునో...... . ఏ ఇతర ప్రాజెక్టూలో కూడ ఇవి పని చేయడము లేదు. ఈ సమస్య నాకేనా....... లేక సర్వత్రా వున్నదా? ఇది ఈరోజు నుంచె వున్నది. దీని వలన నాపనికి అవరోధము ఏర్పడినది. తెలిసిన వారు తెలుపగలరు.. Bhaskaranaidu (చర్చ) 14:18, 26 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ లంకెలు నాకు పనిచేస్తున్నాయండీ. టైపింగు పద్ధతి లంకె పనిచేయడానికి జావాస్క్రిప్ట్ అవసరం. మీ విహారిణిలో జావాస్క్రిప్టు చేతమైవుందో లేదో చూడండి. తతిమా లంకెలు మామూలుగానే పనిచేయాలి. మీ కంప్యూటర్లో మరేదైనా విహారిణి ఉంటే దానిలో ప్రయత్నించి చూడండి. — వీవెన్ (చర్చ) 09:20, 29 మే 2012 (UTC)\[ప్రత్యుత్తరం]

విక్షనరీ లో వ్రాయటం గురించి[మార్చు]

విక్షనరీ వ్రాయడాని ప్రయత్నిస్తుంటే ద్విత్వాక్షరాలు వస్తున్నాయి. కారణమేమయి ఉండును?Bhaskaranaidu (చర్చ) 06:01, 3 ఆగష్టు 2012 (UTC)

ఒక మీట నొక్కితే రెండుసార్లు ప్రవేశపెట్టుతున్న నరయం గురించిన సమస్య బగ్ ఫైల్ చేశాను. https://bugzilla.wikimedia.org/show_bug.cgi?id=39009 ఇకపైన ఇటువంటి సమస్యలు రచ్చబండలో రాయగలరు. --అర్జున (చర్చ) 14:08, 3 ఆగష్టు 2012 (UTC)
పరిష్కరించబడింది. --అర్జున (చర్చ) 02:04, 4 ఆగష్టు 2012 (UTC)

జాతీయములు గురించి[మార్చు]

జాతీయము అనగా కొన్ని పదములు కలిసి అర్థవంతమయిన సమాచారాన్నిచే పద సమూహము. కాని ఇక్కడ దాని నిజార్థమును మాత్రమే వ్రాస్తే అది జాతీయము కానేరదు. దానికి మరొక అర్థం వుంటుంది. అ అర్థాన్నిచ్చేదే జాతీయం. ఉదాహరణకు చూడండి. "నట్టేట ముంచాడు" అనేది ఒక జాతీయము. దానర్థం నిజానికి ఒక నదిలో మరొకడిని ముంచడము. ఇది కాదు దానర్థం. జాతీయంగా దానర్థం "ఏదో మోసపూరిత మాటలతొ/పనులతో మరొకరిని నష్టపరచడము" అని అర్థం. కొన్ని జాతీయాలకు దానికున్న నిజార్థాన్ని మాత్రమే వ్రాసి వూరుకున్నారు. అది సమంజసం కాదని నా అభిప్రాయము. మరి కొన్ని ఉదాహరణలు కావాలంటే..... "వాడు నన్ను కాల్చుక తింటున్నాడు" "వాడు నా మెదడు తింటున్నాడు" "వాడి మాట వేద వాక్కు" "గుండెలు తీసిన బంటు" "గుండెల్లో నిద్ర పోతా" "చాపకింద నీరు లాగా" ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. వాటి నిజార్థాలు వివరణగా వ్రస్తే చాల వాటికి అసంబద్దమైన అర్థం వస్తుంది. జాతీయం అంటే దానికి వేరె అర్థం వుంటుంది. అది వాడితేనె దానికి సరిపోతుంది. జాతీయాలలో ఆయా జాతీయాలకు నిజార్థాలు వివరణగా వ్రసిన సందర్బాలు గమనించాను. అందుకే ఈ వివరణ. నా ఈ వివరణను వ్వతిరేకించే వారు వారి సమర్థతను చెప్పండి. చర్చిదాం. లేదా అటు వంటి వాటిని చేయగలిగినవారు సరిదిద్దండి. అప్పుడు జాతీయాలు అర్థవంతంగా వుంటాయి.Bhaskaranaidu (చర్చ) 16:39, 18 ఆగష్టు 2012 (UTC)

అగ్నానము........ ఎలావ్రాయాలి తెలిసిన వారు చెప్పగలరు[మార్చు]

Bhaskaranaidu (చర్చ) 15:14, 19 ఆగష్టు 2012 (UTC)

అఙానము = a~manamu, అజ్గ్నానము==ajgnaanamu, అగ్జ్నానము==agjnaanamu అని అనుకుంటాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:57, 19 ఆగష్టు 2012 (UTC)
అజ్ఞానము (aj~nanamu) సి. చంద్ర కాంత రావు- చర్చ 07:19, 20 ఆగష్టు 2012 (UTC)

మొదటి పేజీలో బయటి లంకెల స్థితి[మార్చు]

మొదటి పేజీలో బయటి లంకెలను క్లిక్కినపుడు అవి అదే కిటికీలో తెరుచుకుంటున్నాయి, అలా కాకుండా పక్క కిటికీలో తెరుచుకునేలా సదుపాయం ఉండాలి. ఉదాహరణకు, ఇతర వికీ ప్రకరణాల పేజీలను క్లిక్కినపుడు అవి అదే కిటికీలో వస్తున్నాయి. రహ్మానుద్దీన్ (చర్చ) 03:59, 31 ఆగష్టు 2012 (UTC)

మీడియావికీ లో బగ్ చేర్చండి.--అర్జున (చర్చ) 01:48, 12 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]