వాడుకరి చర్చ:Veeven/2006 - మే 2007

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Veeven/2006 - మే 2007 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. Smile icon.png __చదువరి (చర్చ, రచనలు) 10:53, 23 ఫిబ్రవరి 2006 (UTC)


చిన్న రహస్యము[మార్చు]

నిర్ధిష్ట సైజు కన్నా (బైట్లలో) ఎక్కువుండి పేజీలో కనీసము ఒక అంతర్గత లింకు ఉంటేనే అది నిజమైన వ్యాసముగా మీడియావికి గుర్తిస్తుంది. కాబట్టి చిన్న వ్యాసాలు సృష్టించినప్పుడు అంతర్గత లింకు కల్పించడానికి ప్రయత్నము చెయ్యండి. తెలుగు వికికి స్వాగతము --వైఙాసత్య 05:21, 24 ఫిబ్రవరి 2006 (UTC)

లేఖిని[మార్చు]

లేఖిని చాలా బాగుంది, నాకు తెగ నచ్చేసింది. పద్మ ఆన్‌లైను వర్షన్ కంటే ఇది చాలా వేగంగా పనిచేస్తుంది. చాలా థాంక్స్ --వైఙాసత్య 15:04, 15 మార్చి 2006 (UTC)

telugu vikshanarI[మార్చు]

వీవెన్! ఓ సారి తెలుగు విక్షనరీలోని ఈ పేజీ చూడండి. పదానికి సంబంధించిన పేజీ మూసను చెయ్యాలనేది నా ఉద్దేశం. ఇంగ్లీషు విక్షనరీలో పేజీలు గందరగోళంగా కనిపిస్తున్నాయి. తెలుగులో ఓ కట్టుదిట్టమైన మూసతో మొదలుపెడితే.. ఆపై అందరూ అదే మూసను అనుసరిస్తే, ఓ పద్ధతిలో సాగిపోతుందని నా ఈ ప్రయత్నం. మీరీ పేజీని చూసి, తగు మార్పులు చెయ్యండి. థాంక్స్! __చదువరి (చర్చ, రచనలు) 18:03, 18 మార్చి 2006 (UTC)

చదువరీ, బాగుంది. వ్యాకరణ విశేషము రెండవ స్థాయి శీర్షికగా ఉంటే ఎలా ఉంటుంది (ఒకే పదాన్ని ఒకటికంటే ఎక్కువ భాషాభాగాలుగా వాడదగిన సందర్భాలలో)? ఇతర పదాలు వాస్తవంగా other/alternate spellings or varations. వాటిని రూపాంతరాలు అంటే బాగుంటుందని నా అభిప్రాయం.
తెలుగు పద్దుని నేను కొంచెం చక్కపరిచా, చూడండి.
నేను ప్రస్తుతం లేఖిని పునర్నిర్మాణంలో బిజీ. మరింత వివరంగా మళ్ళీవచ్చినప్పుడు.

నిర్వాహక హోదా[మార్చు]

వీవెన్ గారూ, మిమ్మల్ని నిర్వాహక హోదాకై ప్రతిపాదించాను. మీ అంగీకారము ఇక్కడ తెలియజేయండి --వైఙాసత్య 16:22, 7 సెప్టెంబర్ 2006 (UTC)

వీవెన్, నిర్వాహకుడైనందుకు శుభాకాంక్షలు --వైఙాసత్య 14:15, 14 సెప్టెంబర్ 2006 (UTC)
కృతజ్ఞతలు.--వీవెన్ 14:18, 14 సెప్టెంబర్ 2006 (UTC)


అభినందనలు - కాసుబాబు 16:57, 14 సెప్టెంబర్ 2006 (UTC)
వీవెన్, నిర్వాహకుడైనందుకు శుభాభినందనలు Varmadatla 17:44, 14 సెప్టెంబర్ 2006 (UTC)
అభినందనలు! __202.65.138.18 18:27, 14 సెప్టెంబర్ 2006 (UTC)
అభినందనలు! __చదువరి (చర్చ, రచనలు) 18:39, 14 సెప్టెంబర్ 2006 (UTC)
అందరికి కృతజ్ఞతలు.--వీవెన్ 06:41, 15 సెప్టెంబర్ 2006 (UTC)


కృతజ్ఞతలు[మార్చు]

నన్ను అధికారిగా చేయాలన్న ప్రతిపాదనకు మద్దతిచ్చి, దాన్ని జయప్రదం చేసినందుకు మీకు నా కృతజ్ఞతలు. __చదువరి (చర్చ, రచనలు) 16:26, 28 సెప్టెంబర్ 2006 (UTC)

Translation Request[మార్చు]

Greetings Veeven!

I know that you are probably not a Christian, but can you kindly help me translate this article: యేసుక్రీస్తు into the Telugu language? Please.

Any help would be gratefully appreciated, Thankyou. --Jose77 02:21, 7 నవంబర్ 2006 (UTC)

Thankyou very much for your help! --Jose77 02:36, 7 నవంబర్ 2006 (UTC)

లేఖిని శృష్టి[మార్చు]

థాంక్స్ వీవెన్ గారు మీ అభినందనకు.మీరు శృష్టించిన లేఖిని చాలా బాగుంది.వీకీకి లేఖిని అందించిన మీకు అభినందన పంపడానికి అవకాశం ఇచ్చినందుకు థాంక్స్. t.sujatha


కృతజ్ఞతలు[మార్చు]

వీవెన్, నా నిర్వాహక హోదా ప్రతిపాదనకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు - కాసుబాబు 11:04, 5 జనవరి 2007 (UTC)

సందేహాలు వగైరా[మార్చు]

వీవెన్ గారూ!

 • బ్రాకెట్ల ముందు ఖాళీ ఉంచాలనే చిన్న విషయాన్ని విస్మరించి బహుశా వందలలో గ్రామాల పేజీలు తయారుచేసి ఉంటాను. ఇకముందు జాగ్రత్త పడతాను. పాత పేజీలు గురించి - ఎవరైనా ఏదైనా వూరిగురించి వ్యాసం వ్రాసినపుడు సంబంధిత పేజీని పేరు మారుస్తాను.
 • నాకు ఫైర్‌ఫాక్స్‌లో http://www.andhrabharati.com/ తెలుగు display రావడం లేదు (నేను Padma extension install చేశాను. ఈనాడు పేపరు స్పష్టంగానే వస్తున్నది.) దీనికేమైనా ఉపాయం చెప్పగలరా?
 • తెలుగు OCR software గురించి మీకు ఏమైనా తెలుసా? నాకు ఒక దురాశ ఉన్నది. తెలుగు భాషా సమితి ప్రచురించిన విజ్ఞాన సర్వస్వం కాపీరైటు గురించి వాకబు చేసి (బహుశా అనుమతి లభించవచ్చును), దానిని OCR ద్వారా యూనికోడ్‌కు మార్చి వికీలో పెట్టే ప్రయత్నం ఎందుకు చేయకూడదని? కొమర్రాజు లక్ష్మణరావుగారి స్మృతి చిహ్నంగా!

--కాసుబాబు 15:28, 21 ఏప్రిల్ 2007 (UTC)

 • నేను కూడా ఆయా పేజీలకు మార్పులు చేస్తుంటే, వాటి పేర్లుకూడా మారుస్తా.
 • ఆంధ్రభారతి సైటు నాకూ రావట్లేదు. మేధాస్ నుండి ప్రయత్నించినా ఖాళీ పేజీ మాత్రమే వస్తుంది. పరిష్కారమేంటో అంతుపట్టట్లా.
 • OCR తయారుచేసినతన్ని ఐఐఐటి, హైదరాబాదులో కలిసా. అతను మరో సమావేశానికి వెళ్ళాల్సిరావడంతో మా సంభాషణ అరనిమిషం మాత్రమే జరిగింది. OCR ని బయటకు తీసుకురావడానికి నావంతు కృషి చేస్తా.
వీవెన్ 11:53, 22 ఏప్రిల్ 2007 (UTC)

కృతజ్ఞతలు[మార్చు]

వీవెన్ గారు, నా నిర్వాహక హోదా ప్రతిపాదనకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు --నవీన్ 08:59, 23 ఏప్రిల్ 2007 (UTC)

కృతజ్ణతలు[మార్చు]

చదరంగం పేజీలో బొమ్మలోని టైటిల్స్ ని మార్చడం నాకు చేతకాలేదు, మీరు చెసి నందుకు కృతజ్ఞతలు, ఎలా చెయ్యాలో నాకూ చెప్పగలరా?

పవన్ (నవమోయుని)

పవన్, వాటిని కాసుబాబు గారు మార్చారు, నేను కాదు. ఎలా చెయ్యాలో, పేజి మార్పులో మీకు కోడ్ చూస్తే అర్థమవుతుంది. వికీపీడియా:బొమ్మల పాఠం చూడండి.--వీవెన్ 06:20, 4 మే 2007 (UTC)

మొదటి పేజీ మార్పు[మార్చు]

వీవెన్! ఈ పని మీకు అప్పజెప్పక తప్పడంలేదు. మీ వీలును బట్టి మొదటి పేజీలో కొన్ని మార్పులు చేయగలరా? ఈ పని నాకు చేత కాదు. నా సూచనలు కొన్ని ఇక్కడ ఇస్తున్నాను.

 • విశేష వ్యాసం బదులు "ఈ వారం వ్యాసం" మెరుగనుకొంటాను. ఎందుకంటే "విశేష వ్యాసం" స్థాయి వ్యాసాలు అంతగా తయారవ్వడం లేదు.
 • "ఈ వారం బొమ్మ" ఒకటి పెడితే బాగుంటుంది. అందులోనే చిన్న సూచన "మీరు మంచి ఫొటో అందించ గలిగితే మాకు (ఇలా) పంపండి" లాంటి వాక్యం కలపొచ్చు.
 • "ఇటీవలి వార్తలు" లాంటి పెట్టె కూడా బాగుంటుంది.
 • "ఈ వారం పద్యం / గేయం" కూడా చాలా బాగుంటుందని నా అభిప్రాయం.
 • "తెలుగు వికీని ప్రోత్సహించండి" లాంటి సందేశానికి ఏమయినా ఆస్కారం ఉన్నదా?

నా సందేశాన్ని ముందుగా మీరు పరిశీలించి, తరువాత మొదటి పేజీ చర్చలో పెట్టవచ్చును.

నా వంతుగా వారం వారం మొదటి పేజీ సమాచారాన్ని మార్చడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తాను. --కాసుబాబు 09:47, 10 మే 2007 (UTC)

కాసుబాబు గారూ, మీ సలహాలన్ని బాగున్నాయి కానీ ఈ వారం పద్యం/గేయం సోర్స్ కు తగినదికానీ వికీపీడియాకి అంత సమంజసమనిపించట్లేదు. --వైఙాసత్య 22:41, 10 మే 2007 (UTC)
కాసుబాబు గారూ, ఈ వారాంతం ప్రయత్నిస్తా. ఈవారం పద్య ఆలోచన నాకూ అంతగా నచ్చలేదు.--వీవెన్ 10:55, 11 మే 2007 (UTC)
కొత్త మొదటి పేజీ (తయారీలో ఉంది) చూడండి. ఇంకెలా మెరుగుపరచాలో చర్చించండి.--వీవెన్ 07:59, 12 మే 2007 (UTC)

సభ్యుల చర్చాపేజీల్లో పెద్ద అక్షరాలు[మార్చు]

సభ్యుల చర్చాపేజీల్లో అక్షరాలు పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయేంటి? చదవడానికి ఇబ్బందిగా ఉంది. —వీవెన్ 10:51, 11 మే 2007 (UTC)

అందరి పేజీల్లోనూ ఇలాగే ఉందా? ఏమయ్యిందో --వైఙాసత్య 16:24, 11 మే 2007 (UTC)
వీవెన్‌గారు, కొన్ని రోజుల క్రితం మీ చర్చా పేజీని చూసి మీరే కావాలని పెద్ద అక్షరాలు పెట్టుకున్నారేమో అని అనుకున్నాను. ఇవాలే తెలిసింది అది అలా అనుకోకుండా వచ్చిన ఒక సమస్య అని. మీ చర్చా పేజీని సరిచేసాను. మిమల్ని స్వాగతతించటానికి చేర్చిన HTMLలో ఒక </font> అనేది తక్కువయ్యింది అది నేను సరి చేసాను(పేజీ చరిత్రను ఒక సారి చూడండి). ఇప్పుడు మీ చర్చా పేజీలో ఎటువంటి సమసా ఉండకూడదు మరి! ఇలాంటి సమస్య నాకు మీ పేజీలో మాత్రమే కనపడింది. ఇంకెవరి పేజీలోనయినా ఇలాంటి సమస్య ఉంటే పైన ఉండే స్వాగతం తోనే సమస్య. --మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 19:12, 11 మే 2007 (UTC)
వైఙాసత్య, చాలా సభ్యుల చర్చాపేజీలలో అలాగే ఉంది. ప్రదీపు, థ్యాంక్సు. --వీవెన్ 01:38, 12 మే 2007 (UTC)

my lekhini[మార్చు]

Dear Veeven, Lekhin which was there in the default form on my editting screen disappeared after me messing around with my "na abhiruchulu" on my user page. Is it possible to get that back. I appreciate your help thank you--చామర్తి 03:11, 12 మే 2007 (UTC)

చామర్తి, "నా అభిరుచులు" పేజీలో "మునుపటి వలె" అన్న మీటపై నొక్కి చూడండి.--వీవెన్ 03:21, 12 మే 2007 (UTC)

i messed with my user page somuch that i cannot get back to that.. please help me--చామర్తి 03:25, 12 మే 2007 (UTC)

మీకు జీమెయిల్ ఉంటే నాతో మాట్లాడండి (నాది veeven)--వీవెన్ 03:42, 12 మే 2007 (UTC)