Jump to content

వాయవ్యం

వికీపీడియా నుండి
(వాయివ్యం నుండి దారిమార్పు చెందింది)
ఎనిమిది దిక్కుల సూచిక

వాయవ్యం, ఉత్తరానికి, పశ్చిమానికి మధ్యన ఉన్న దిక్కు. ఇది, 315° (౩౧౫°) వద్ద ఉత్తర, పశ్చిమాలకు సరిగ్గా మధ్య, ఆగ్నేయానికి వ్యతిరేకంగా ఉంటుంది. హిందూ సంప్రదాయంలో దీనికి అధిపతి వాయుదేవుడు. ఇతను అష్టదిక్పాలుకులలో ఒకడు. ఇతనిని భీముని తండ్రి, హనుమంతుడి ఆధ్యాత్మిక తండ్రిగా పరిగణిస్తారు. అలాగే ప్రకృతి ఉనికికి కారణమైన పంచభూతాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు.[1] "వాయు"ను ఇంకా గాలి, పవన, ప్రాణ అని వర్ణించారు. ఋగ్వేదం ప్రకారం రుద్ర అని కూడా వర్ణించారు.[2]ఈ దిశ గ్రహం చంద్రుడు. అతని వాహనం గుర్రం. వాయుదేవుని భార్య అంజనాదేవి. ఇతని వాహనం గుర్రాలుతోలే రధం. నివాసం గంధవతి.[3] ఆయుధం ధ్వజం.

వాస్తుశాస్త్రంలో వాయవ్యం

[మార్చు]

వాయువ్యానికి అధిదేవత వాయువు.ఇది నైరుతి, ఆగ్నేయ దిశలకంటే పల్లంగానూ, ఈశాన్యంకంటే ఎత్తుగానూ ఉండాలి. అలాగే ఈ దిశలో నూతులు,గోతులు ఉండకూడదు.ఈ దిశ ఈశాన్యం కంటే హెచ్చుగా పెరిగి ఉండరాదు. ఇలా ఉంటే పుత్ర సంతానానికి హాని, అభివృద్ధికి అవరోధం కలిగే అవకాశం ఉందని వాస్తుశాస్త్రం ద్వారా తెలుస్తుంది.[4]వాయవ్యం మూలలో ప్రదేశం గాలి మూలకం ద్వారా శక్తిని పొందుతుంది.అందువలన చాలా అస్థిరంగా ఉంటుంది.ఈ దిశ జీవితంలో అవకాశాలను సృష్టిస్తుంది.అది శక్తివంతమైంది.

అనుకూలతలు

[మార్చు]

వాయువ్య లేదా వాయు మూలలో మార్పు, కదలిక లక్షణాలతో[5] ప్రేరేపించబడింది.అన్ని జీవులకు దిశ ముఖ్యమైంది. ఎందుకంటే మానవుని మనుగడ, మార్పు కోసం గాలి అవసరం.మాస్టర్ బెడ్‌రూమ్ ఏర్పాటుకు నైరుతి తరువాత నార్త్-వెస్ట్ ప్రత్యామ్నాయ ఎంపికచేసుకుంటారు. ఎందుకంటే పిల్లలపై సరైన నియంత్రణ కలిగి ఉండటానికి ఇది సహాయపడుతుంది.ఈ దిశలో మహిళల అభివృద్ధి, ఆడపిల్లల వివాహం. సంతానం, ఆరోగ్యంతో వాయువ్య దిక్కుకు సంబంధం ఉంది. ఇది చాలా కారణాల వల్ల అమ్మాయిలకు కూడా అనువైనదిగా పరిగణించబడుతుంది. వాయువ్య దిశలో బాగా నిర్మించిన ఇంటి యజమానులు అభివృద్ధి, ఆనందం, శాంతి. కలిగి ఉంటారని నమ్మకం.[6]

ప్రతికూలతలు

[మార్చు]

పోలీసు కేసులు, చట్టపరమైన విషయాలు, కోర్టు కేసులు కుటుంబంలో, పొరుగువారితో ఘర్షణల ఉత్పన్నమవుతాయి.ఇది జైలు శిక్షకు కూడా దారితీయవచ్చు. వ్యక్తులపై ఆత్మవిశ్వాసం పని చేస్తుంది. అతను తప్పు నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెడతాడు (అతను సరైన వాటిని తీసుకుంటున్నాడని అనుకుంటాడు) ఇది క్రమంగా విపరీతమైన ఆర్థిక నష్టాలకు, ఇతరులతో ఘర్షణలకు దారితీస్తుంది[7]

గమనిక

[మార్చు]

వాస్తుశాస్త్రం ప్రకారం జరిగే మంచి,చెడు ఇది పూర్తిగా ఎవరెవరి నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.దీనిని కొందరు నమ్ముతారు.కొందరు పూర్తిగా నిరాధారమంటారు.అందుకే ఇది వారి వారి ఇష్టా.ఇష్టాల మీద ఆధారపడి ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "పంచభూతాలలో ఒకటైన ... వాయువు". డ్రూపల్. 2016-08-05. Retrieved 2020-07-15.
  2. The Rigveda, with Dayananda Saraswati's Commentary. Sarvadeshik Arya Pratinidhi Sabha. 1974.
  3. కోశము, అమర (1925). అమరకోశము ( నామలింగానుశాసనము ). Chennai, India: వావిళ్ళ రామస్వామి శాస్త్రులు & సన్స్.
  4. "వాస్తు శాస్త్రం". Pothugantivenkataramana's Blog. 2010-04-27. Archived from the original on 2023-11-20. Retrieved 2020-08-05.
  5. Khandelwal, Abhishek (2022-04-06). "North West Kitchen Vastu -The Power of Vayu Devta in Vastu [2023]". Vastu Shastra Journal. Retrieved 2023-03-24.
  6. "North-west Direction, Know about north-west Direction". www.vaastu-shastra.com. Retrieved 2020-08-05.
  7. "North West Vastu Dosh & Remedies". Vastu Shastra Guru. 2014-08-14. Retrieved 2020-08-05.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వాయవ్యం&oldid=4226668" నుండి వెలికితీశారు