వాసిరెడ్డి పద్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాసిరెడ్డి పద్మ
వాసిరెడ్డి పద్మ


ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
ముందు నన్నపనేని రాజకుమారి

వ్యక్తిగత వివరాలు

జననం 1975
జగ్గయ్యపేట, కృష్ణాజిల్లా , ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, ప్రజారాజ్యం పార్టీ
జీవిత భాగస్వామి వెస్లీ
సంతానం రచన, మేఘన
నివాసం వికాస్ నగర్, గుంటూరు

వాసిరెడ్డి పద్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా పనిచేస్తుంది.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

వాసిరెడ్డి పద్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట దగ్గర గల కంభంపాడు లో జన్మించింది. ఆమె డిగ్రీ వరకు చదువుకుంది.

రాజకీయ జీవితం[మార్చు]

వాసిరెడ్డి పద్మ 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాలోకి వచ్చింది. ఆమె ప్రజారాజ్యం పార్టీకి అధికార ప్రతినిధిగా పనిచేసింది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీని విలీనం చేయడంతో ఆమె 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా పనిచేసింది. వాసిరెడ్డి పద్మను 2019 ఆగస్టు 8న మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించగా ఆమె ఆగస్టు 26న బాధ్యతలు చేపట్టింది.[2][3]

మూలాలు[మార్చు]

  1. Business Standard India (22 August 2019). "Vasireddy Padma appointed at State Women's Commissionirperson". Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.
  2. HMTV (26 August 2019). "పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వాసిరెడ్డి పద్మ". Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.
  3. The Hindu (19 June 2019). "Vasidreddy Padma is new women's commission chairperson" (in ఇంగ్లీష్). Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.