Jump to content

సామినేని ఉదయభాను

వికీపీడియా నుండి
సామినేని ఉదయభాను

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - 2024
ముందు శ్రీరాం రాజగోపాల్
తరువాత శ్రీరాం రాజగోపాల్

వ్యక్తిగత వివరాలు

జననం 1955
జగ్గయ్యపేట , కృష్ణా జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ జనసేన పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు విశ్వనాధం (తండ్రి)
జీవిత భాగస్వామి సామినేని విమల
నివాసం జగ్గయ్యపేట

సామినేని ఉదయభాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం జగ్గయ్యపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా ఉన్నాడు.[1][2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సామినేని ఉదయభాను 1955లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, జగ్గయ్యపేటలో జన్మించాడు. ఆయన జగ్గయ్యపేట లోని 1970లో జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి, 1972లో ఎస్.జి.ఎస్ కాలేజీ నుండి ఇంటర్మీడియట్ 1975లో బీకామ్ పూర్తి చేసాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

సామినేని ఉదయభాను కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి 1999లో జగ్గయ్యపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.2004లో రెండోవసారి కూడా విజయం సాధించారు.2009, 2014 ఎన్నికలలో సమీప తేలుగుదేశం పార్టీ అభ్యర్థి |శ్రీరాం రాజగోపాల్ పై ఓటమి పాలాయినారు. తిరిగి 2019 లో వై. యాస్.కాంగ్రీస్ పార్టీ అభ్యర్థిగా మూడోవ సారి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యారు. 2019 జగన్ మెహన్ రెడ్డి గారి మంత్రి వర్గంలో ఉంటారాని అనుకున్నప్పటికి కోన్ని పరిస్థితిల వలన చోటు దోరకగా, ప్రభుత్వ విప్‌గా ఉన్నరు.

ఆయన 2023 ఆగస్టు 25న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిగా నియమితుడయ్యాడు.[3][4][5]

సామినేని ఉదయభాను 2024 సెప్టెంబర్ 26న మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరాడు.[6]

పోటీ చేసిన నియోజకవర్గాలు

[మార్చు]
సంవత్సరం పేరు గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు ఫలితం
1999 జగ్గయ్యపేట సామినేని ఉదయభాను కాంగ్రెస్ పార్టీ 60877 శ్రీరఘురాం నెట్టెం తెలుగుదేశం పార్టీ 53406 గెలుపు
2004 జగ్గయ్యపేట సామినేని ఉదయభాను కాంగ్రెస్ పార్టీ 70057 శ్రీరఘురాం నెట్టెం తెలుగుదేశం పార్టీ 58363 గెలుపు
2009 జగ్గయ్యపేట శ్రీరాం రాజగోపాల్ తెలుగుదేశం పార్టీ 75107 సామినేని ఉదయభాను కాంగ్రెస్ పార్టీ 65429 ఓటమి
2014 జగ్గయ్యపేట శ్రీరాం రాజగోపాల్ తెలుగుదేశం పార్టీ 80939 సామినేని ఉదయభాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 79093 ఓటమి
2019 జగ్గయ్యపేట సామినేని ఉదయభాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 87,965 శ్రీరాం రాజగోపాల్ తెలుగుదేశం పార్టీ 83,187 గెలుపు
2024[7] జగ్గయ్యపేట శ్రీరాం రాజగోపాల్ తెలుగుదేశం పార్టీ 98479 సామినేని ఉదయభాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 82502 ఓటమి

మూలాలు

[మార్చు]
  1. Sakshi (2019). "Jaggayyapeta Constituency Winyapeta Constituency MLA Election Results 2019". Archived from the original on 24 July 2021. Retrieved 24 July 2021.
  2. TV9 Telugu (11 June 2019). "ప్రజంట్ విప్, తర్వాత మంత్రి పదవి..ఉదయభానుకు జగన్ హామి - TV9 Telugu CM Jagan assures ministry to MLA Samineni Udayabhanu". Archived from the original on 24 July 2021. Retrieved 24 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Andhra Jyothy (26 August 2023). "24 మందితో టీటీడీ బోర్డు". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. Eenadu (26 August 2023). "తితిదే పాలక మండలి సభ్యులుగా 24 మందికి అవకాశం". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  5. Andhra Jyothy (26 August 2023). "టీటీడీ బోర్డు సభ్యునిగా ఉదయభాను". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  6. EENADU (26 September 2024). "పవన్‌ సమక్షంలో జనసేనలో చేరిన బాలినేని, సామినేని, కిలారి". Archived from the original on 26 September 2024. Retrieved 26 September 2024.
  7. "2024 Andhra Pradesh Assembly Election Results - Jaggayyapeta". 4 June 2024. Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.