వాసుదేవ బల్వంత ఫడ్కే
వాసుదేవ బలవంత ఫడ్కే | |
---|---|
జననం | షిర్ధాన్ గ్రామం, పాన్వెల్ తాలూకా, రాయిఘర్ జిల్లా, మహారాష్ట్ర(భారతదేశం) | 1845 నవంబరు 4
మరణం | 1883 ఫిబ్రవరి 17 | (వయసు 37)
వృత్తి | విప్లవకారుడు |
వాసుదేవ బల్వంత ఫడ్కే (ఉచ్ఛారణ (help·info)) (4 నవంబర్ 1845 – 17 ఫిబ్రవరి 1883) బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. బ్రిటీష్ పరిపాలనలో రైతుల దుస్థితి ఆయనను కదిలించింది. ‘స్వరాజ్’ ఈ సమస్యలన్నిటీకీ సరైన విరుగుడు అని ఫడ్కే నమ్మారు. మహారాష్ట్రలోని కోలీలు, భిల్లులు, ధాంగర్లు మొదలైన తెగల సహకారంతో రామోషీ అనే విప్లవ బృందం తయారుచేశారు. బృందం బ్రిటీష్ పరిపాలనను అంతం చేయడానికి సాయుధ పోరాటం ప్రారంభించింది. వీరు ఆంగ్ల వ్యాపారవేత్తలపై దాడులు చేసి, దోచుకుని వారి విముక్తి పోరాటానికి నిధులు సమకూర్చుకున్నారు. బ్రిటీష్ సైనికులపై హఠాత్తుగా జరిపిన గెరిల్లా దాడుల్లోని ఒకదానిలో ఏకంగా పుణె నగరంపైనే ఫడ్కే పట్టు సాధించి కొద్దిరోజులు నిలబెట్టుకోవడంతో ఆయన వెలుగులోకి వచ్చారు.
తొలినాళ్ళ జీవితం
[మార్చు]ఫడ్కే 1845 నవంబర్ 4లో మహారాష్ట్రలోని రాయఘడ్ జిల్లాకు చెందిన పన్వెల్ తాలూకా షిర్ధాన్ గ్రామంలో మరాఠీ చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబంలో బలవంతరావ్ ఫడ్కే, సరస్వతీబాయ్య దంపతులకు జన్మించారు. ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉన్న కాలంలో కుస్తీ, గుర్రపుస్వారీ వంటివి ఉత్సాహంగా నేర్చుకున్నారు. అటుపైన పాఠశాల చదువు మధ్యలో వదిలివేశారు. తనకి 16 సంవత్సరాల వయసులో పెళ్ళి జరిగింది.కొంతకాలం రైల్వే సర్వీసులో పనిచేసి స్వాభిమానంతో తాను స్వీయ విరమణ చేసారు. తరువాత బంధు మిత్రుల సహాయంతో పుణే నగరం చేరుకుని మిలటరీ అక్కౌంట్స్ డిపార్టుమెంటులో గుమస్తాగా 15 సంవత్సరాల పాటు .[1] అక్కడ సంస్కృతం అధ్యయనం నేర్చుకున్నారు. అక్కడే సార్వజనిక సభా అధ్యక్షుడైన గణేష్ జోషి, రనడే ఏకనాథ వంటి ఉద్యమకారుల పరిచయంతో స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొనేవారు. అప్పుడే పూణే నేటివ్ అన్న సంస్థను స్థాపించారు. స్థాపించిన కొన్నాళ్ళకి, తల్లికి ఆరోగ్యము బాగోలేదు అన్న విషయం తెలుసుకొని, తనవల్ల పీడించబడిన బ్రిటిష్ అధికారులకు దొరకకుండా స్వగ్రామం చేరుకునేసరికే, తల్లి దహన సంస్కారాలు అభికారుల ప్రోద్బలంతో ముందే ముగించేయబడినందువలన బాధపడి అప్పుడే బ్రిటీషు వారిమీద తాను చేస్తున్న ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాను అని తన గ్రామం మధ్యలో శపథం చేపట్టారు. తన భార్య మరణానంతరం, చిన్న పిల్లలను చూసుకొనొటకొరకు గోపికాబాయ్యిని పెళ్ళిచేసుకొన్నారు.
మహారాష్ట్ర ఎడ్యుకేషన్ సొసైటీ కో-ఫౌండింగ్
[మార్చు]బొంబాయి ప్రెసిడెన్సీలో బ్రిటిష్ స్థాపించిన సంస్థ నుండి గ్రాడ్యుయేట్ చేసిన తొలి వ్యక్తులలో వాసుదేవ బల్వంత ఫడ్కే ఒకరు.[2] 1860లో, తోటి సామాజిక సంస్కర్తలు, విప్లవకారులు లక్ష్మణ్ నరహర్ ఇందాపూర్కర్, వామన్ ప్రభాకర్ భావేతో కలిసి అతను పూణే నేటివ్ ఇన్స్టిట్యూషన్ (పి.ఎన్.ఐ)ని స్థాపించారు. తరువాత దీనిని మహారాష్ట్ర ఎడ్యుకేషన్ సొసైటీ (ఎం.ఇ.ఎస్)గా మార్చారు. పూణే నేటివ్ ఇన్స్టిట్యూషన్ ద్వారా పూణేలో అతను భావే స్కూల్‌ను స్థాపించాడు. ఇప్పుడు మహారాష్ట్ర ఎడ్యుకేషన్ సొసైటీ రాష్ట్రవ్యాప్తంగా 77 సంస్థలను నిర్వహిస్తోంది.[3]
ఉద్యమకారుడు
[మార్చు]ఆయుధాలు లేకుండా బ్రిటుషు వారిపై తిరుగుబాటు చేయుట కష్టమని నిర్ణయించుకొని ఫడ్కే 1879 సంవత్సరంలో రామోషి స్నేహ సహకారంతో అడవి ప్రాంతమ్లో రహస్యంగా గిరిజన యువకులతో సైన్య సమృద్ధి చేశారు.తన సైన్యం యొక్క ఆయుధాల సమీకరణ, ఆర్థిక అవసరాలకోసం ధనికులైన ఆంగ్లీయులను బంధించి, దోపిడే చేసేవారు.1857 సంవత్సరంలో ప్రథమ స్వాతంత్ర్యొద్యమంలో తన సైన్యంతో పాల్గొన లండన్ లో ఉన్న బ్రిటీష్ అధికారుల దృష్టిలో ఫడ్కే పడ్డారు. తనని పట్టుకున్న వారికి వెయ్యి రూపాయల బహుమతి ఇస్తామని బ్రిటీష్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
దేశవ్యాప్తంగా వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకకాలంలో అనేక దాడులను నిర్వహించడానికి వాసుదేవ బల్వంత ఫడ్కే ప్రణాళికలు రచించినా పరిమిత విజయాన్నే అందించాయి. ఒకసారి ఘనూరు గ్రామంలో సైన్యంతో నేరుగా తలసడ్డాడు. ఆ తర్వాత అతడిని పట్టుకోవడానికి ప్రభుత్వం బహుమతి ప్రకటించింది. ఆ తర్వాత రోహిల్లా, అరబ్బులను తన సంస్థలో చేర్చుకోవడానికి హైదరాబాద్ రాష్ట్రానికి వెళ్ళాడు. బ్రిటిష్ మేజర్ హెన్రీ విలియం డేనియల్, హైదరాబాద్ నిజాం పోలీసు కమిషనర్ అబ్దుల్ హక్.. తదతరులు పగలు-రాత్రి ఆయన అచూకి కోసం వెతికారు. అతను 1879 జూలై 20న పండార్‌పూర్ వెళ్తున్నప్పుడు కలడ్గి జిల్ ధనాశా పూరితమైన కొందరు స్త్రీల సహాయంతో ఫడ్కే ఆచూకొ కనుక్కొని బ్రిటిష్ సైనికులు లాలో జరిగిన తీవ్రమైన పోరాటంలో అతడిని ఒక దేవాలయంలో బంధించారు.
ఇక్కడ నుండి వాసుదేవ బల్వంత ఫడ్కేని విచారణ నిమిత్తం పూణేకు తీసుకెళ్లారు. సర్వజనిక్ కాకా అని పిలువబడే గణేష్ వాసుదేవ్ జోషి అతని కేసును వాదించాడు.[4] విచారణ సమయంలో అనుచరులతో పాటూ అతన్ని సంగం వంతెన సమీపంలోని జిల్లా సెషన్ కోర్టు జైలు భవనంలో ఉంచారు. ఇది ఇప్పుడు రాష్ట్ర సిఐడి భవంతి. ఫడ్కేకి జీవిత ఖైదు విధించారు. దీనికి అతని స్వంత డైరీయే ఆధారం అయింది. అతనిని ఏడెన్‌లోని జైలుకు తరలించారు. అక్కడ 1883 ఫిబ్రవరి 13న జైలు నుండి అతను తప్పించుకున్నా మళ్ళీ వెంటనే తిరిగి స్వాధీనం చేసుకున్నారు బ్రిటీష్ పోలీసులు. అప్పటినుంచి నిరహార దీక్ష చేస్తూ 1883 ఫిబ్రవరి 17న వాసుదేవ బల్వంత ఫడ్కే తుది శ్వాస విడిచాడు.[5]
గుర్తింపు
[మార్చు]- ఫడ్కే భారత సాయుధ తిరుగుబాటు పితామహుడిగా పేరు పొందారు. స్వతంత్ర ఉద్యమంలో సహ సభ్యులకు స్ఫూర్తిని అందించాడు. ఈ సమయంలో అతని కార్యకలాపాలను బంకిం చంద్ర చటోపాధ్యాయ్ రచించించిన దేశభక్తి నవల ఆనంద్ మఠ్ లో పొందుపరిచారు. కానీ అప్పటి బ్రిటీష్ వలస ప్రభుత్వం దీన్ని ఆమోదించలేదు. అందుకని ఈ అంశాలు తొలగించి పుస్తకాన్ని ముద్రించాల్సి వచ్చింది.[6]
- 1984లో, భారతీయ పోస్టల్ సర్వీస్ ఫడ్కే గౌరవార్థం 50 పైసల స్టాంపును విడుదల చేసింది.
- అతని గౌరవార్థం దక్షిణ ముంబైలోని మెట్రో సినిమా సమీపంలో ఒక చౌక్ పేరు పెట్టబడింది.
- అతని జీవిత చరిత్ర ఆధారంగా గజేంద్ర అహిరే దర్శకత్వం వహించిన మరాఠీ చిత్రం వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే (2007)
మూలాలు
[మార్చు]- ↑ రిపోర్ట్ ఆన్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ బాంబే ప్రెసిడెన్సీ. p. 36.
- ↑ "Vasudev Balwant Phadke was one of the earliest graduates from the Bombay University in 1862". Indore(M.P.), India. 25 January 2020. Archived from the original on 22 అక్టోబరు 2021. Retrieved 22 అక్టోబరు 2021.
- ↑ "Celebrations as MES turns 150". DNS. 18 November 2009. Retrieved 17 August 2012.
- ↑ Rao, Parimala V. (24 January 2009). "New Insights into the Debates on Rural Indebtedness in 19th Century Deccan" (PDF). Economic & Political Weekly. Archived from the original (PDF) on 12 ఆగస్టు 2014. Retrieved 11 August 2014.
- ↑ Rigopoulos, Antonio (2 April 1998). Dattatreya: The Immortal Guru, Yogin, and Avatara: A Study of the Transformative and Inclusive Character of a Multi-faceted Hindu Deity. SUNY Press. p. 167. ISBN 978-0-7914-3696-7.
- ↑ Das, Sisir (1991). A History of Indian Literature. New Delhi: Sahitya Akademi. p. 213. ISBN 81-7201-006-0.