రాయిఘర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Raigad district జిల్లా

रायगड जिल्हा
Maharashtra లో Raigad district జిల్లా స్థానము
Maharashtra లో Raigad district జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంMaharashtra
పరిపాలన విభాగముKonkan Division
ముఖ్య పట్టణంAlibag
మండలాలు1. Alibag, 2. Panvel, 3. Murud, 4. Pen, 5. Uran, 6. Karjat, 7. Khalapur, 8. Mangaon, 9. Roha, 10. Sudhagad, 11. Tala, 12. Mahad, 13. Mhasala, 14. Shrivardhan, 15. Poladpur
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలు1. Maval (shared with Pune district), 2. Raigad (shared with Ratnagiri district) (Based on Election Commission website)
విస్తీర్ణం
 • మొత్తం7,152 కి.మీ2 (2,761 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం26,35,200
 • సాంద్రత370/కి.మీ2 (950/చ. మై.)
 • పట్టణ
36.91
జనగణాంకాలు
 • అక్షరాస్యత83.89%
 • లింగ నిష్పత్తి955 per 1000 male
ప్రధాన రహదార్లుNH-4, NH-17
సగటు వార్షిక వర్షపాతం3,884 మి.మి.
జాలస్థలిఅధికారిక జాలస్థలి

మహారాష్ట్ర రాష్ట్ర 37 జిల్లాలలో జిల్లా (హిందీ:रायगड जिल्हा) ఒకటి.[1] ఇది కొంకణ్ డివిషన్లో ఉంది. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 2,635,394 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 2,207,929. 2001 - 2011 మధ్య నగరవాసుల సంఖ్య 36.91% అభివృద్ధి చెందింది. 1991 - 2001 మధ్య నగరవాసుల సంఖ్య 24.22% అభివృద్ధి చెందింది.[2]

పేరువెనుక చరిత్ర[మార్చు]

జిల్లాలో ఉన్న రాయ్‌గడ్ కోట కారణంగా జిల్లాకు పేరు నిర్ణయించబడింది. ఈ కోట శివాజీ మహరాజ్ రాజధానిగా ఉండేది. ఈ కోట పశ్చిమకనుమలలోని దట్టమైన అరణ్యాల మధ్య పశ్చిమాభిముఖంగా నిర్మించబడింది.

సరిహద్దులు[మార్చు]

జిల్లా వాయవ్య సరిహద్దులో ముంబయి నౌకాశ్రయం, ఉత్తర సరిహద్దులో ఠాణే జిల్లా, తూర్పు సరిహద్దులో పూనాజిల్లా, దక్షిణ సరిహద్దులో రత్నగిరిజిల్లా, పశ్చిమ సరిహద్దులో అరేబియన్ సముద్రం ఉన్నాయి. జిల్లాలో సహజ సిద్ధమైన పెన్- మంద్వా ఉంది. జిల్లా ఉత్తర భూభాగంలో ప్రణాళికాబద్ధంగా రూపొందించిన నవీ ముంబాయి, జవహర్లాల్ నెహ్రూ నౌకాశ్రయం ఉన్నాయి.

జిల్లాలో పాన్వెల్, ఆలీ బాగ్, మంగఒన్, రొహ, పెన్ (భారతదేశం), ఖొపొలి, ఖర్ఘర్,తలోజ,ఖలపుర్,ఉరన్,పతల్గంగ,రసయని,నగొథన,పొలద్పుర్,ఆలీ బాగ్, కర్జాత్, మహాద్ మొదలైన పట్టణాలు ఉన్నాయి.మ్జిల్లాలోని పాన్వెల్ నగరం వైశాల్యం, జనాభా పరంగా అతిపెద్ద నగరంగా ఉంది. ఉరన్ వద్ద పురాతన హిందూ మతం, బౌద్ధ సంబంధిత ఎలిఫెంటా ద్వీపం, గుహలు (ఘరపురి) ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

మునుపటి కొలబా జిల్లా పేరు రాయ్‌ఘడ్ జిల్లాగా మార్చబడింది.1869లో ఠాణే జిల్లా నుండి కులబ జిల్లా (కొలబా జిల్లా) రూపొందించబడింది. 1872 గణాంకాలను అనుసరించి కులబ జిల్లా జనసంఖ్య 3,50,000. ఇందులో 94% హిందువులు, మిగిలిన వారిలో అత్యధికశాతం ముస్లిములు ఉన్నారు.[3] 1881లో జిల్లా జనసంఖ్య 382,000. వీరిలో హిందువులు 95% ఉన్నారు. రాయ్‌గర్ ఉత్తర భుభాభాగం ఠాణే జిల్లాకు సంబధితమై ఉంది. 1883 వరకు పాంవెల్ కొలబాజిల్లాతో చేర్చబడలేదు, ఆధునిక రాయ్‌ఘడ్ జిల్లా ఈశాన్య భాగంలో ఉన్న కర్జత్ 1891 వరకు కొలబా జిల్లాతో చేర్చబడలేదు.

విధ్య[మార్చు]

పాత కొలబా ప్రాంతాన్ని బ్రిటిష్ స్వాధీనం చేసుకున్న తరువాత 1865 - 1866 మధ్య బ్రిటిష్ వారు 4 ఆగ్లో - వర్నాక్యులర్ మాధ్యమ పాఠశాలలు, 30 ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. 1861లో అలిబాగ్‌లో మొదటి బాలికల పాఠశాల స్థాపించబడింది. క్రైస్తవ మిషన్ 1879లో అలిబాగ్‌లో ఇంగ్లీష్ పాఠశాల స్థాపించారు. ప్రభాకర్ పాటిల్ ఎజ్యుకేషన్ సొసైటీ జిల్లాలో 27 పాఠశాలలను నిర్వహిస్తుంది (5 మరాటీ & ఇంగ్లీష్ ప్రాథమిక పాఠశాలలు, డి.ఇ.డి కాలేజ్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక పాలిటెక్నిక్ ఇంస్టిట్యూట్, ఒక ఎం.ఎం.ఎస్ కాలేజ్).

పరిపాలక ఉపవిభాగాలు[మార్చు]

రాయ్ గఢ్ జిల్లాలో పదిహేను తాలూకా లు,, 1,967 గ్రామాలు, నాలుగు ఉపవిభాగాలున్నాయి.[4]

'ఉపవిభాగం' 'తాలూకా' 'చ.కి.మీ ' 'సెన్సస్ 2001' 'సెన్సస్ 2011' 'పంచాయతీలు' [5] 'గ్రామాలు'
ఆలీ బాగ్ ఆలీ బాగ్ 500 221.661 236.167 62 218
పెన్ ( భారతదేశం) 499 176.681 195.454 63 171
మురుద్ (రాయగడ్) 231 72.046 74.207 24 74
పాన్వెల్ పాన్వెల్ 631 422.522 750.236 90 177
ఉరన్ 184 140.351 160.303 34 62
కర్జాత్ 665 184.420 212.051 50 184
ఖలపూర్ 183 183.604 207.464 42 141
మంగొన్ Mangaon 683 152.270 159.613 74 187
సుధా 467 62.852 62.380 34 98
రోహ 643 161.750 167.110 62 162
తాలా 250 42.869 40.619 26 61
మహాద్ Mahad 1,257 186.521 180.191 134 183
పొలద్పూర్ 373 54.301 45.464 43 87
మహాసల 236 61.010 59.914 40 84
ష్రీవర్ధన్ 120 85.071 83.027 43 78
మొత్తం 15 7.152 2.207.929 2.634.200 821 1,967

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,634,200,[6]
ఇది దాదాపు. కువైత్ దేశ జనసంఖ్యకు సమానం.[7]
అమెరికాలోని. నెవాడ నగర జనసంఖ్యకు సమం.[8]
640 భారతదేశ జిల్లాలలో. 153వ స్థానంలో ఉంది.[6]
1చ.కి.మీ జనసాంద్రత. 368 .[6]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.36%.[6]
స్త్రీ పురుష నిష్పత్తి. 955:1000 [6]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 83.89%.[6]
జాతియ సరాసరి (72%) కంటే.

జిల్లాలో (మహాదేవ్, కొలి ప్రజలు, కత్కరి, ఠాకూర్ )కు చెందిన పలు షెడ్యూల్డ్ తెగలు రాయ్‌గఢ్ జిల్లాలో నివసిస్తున్నారు. [9]

ప్రయాణసౌకర్యాలు[మార్చు]

రహదారి[మార్చు]

రాయ్‌ఘడ్ జిల్లా సియోన్ పాంవెల్ ఎక్స్ప్రెస్వే ద్వారా చక్కగా ముంబాయి రాష్ట్రంతో అనుసంధానించబడి ఉంది. ముంబాయి - పూనా ఎక్స్ప్రెస్వే, జాతీయ రహదారి 4 జిల్లా గుండా పయనిస్తున్నాయి. జాతీయ రహదారి 17 పంవెల్ నుండి జిల్లా అంతటా పయనిస్తుంది.

రైలుమార్గం[మార్చు]

ది కొంకణ్ రైల్వే రోహా వద్ద ఆరంభమై మంగావ్, వీర్ ద్వారా పయనిస్తుంది. ముంబాయి - పూనా ది సెంట్రల్ రైల్వే మార్గం కర్జత్ నుండి ఖొపొలి వరకు పొడిగించబడింది. జిల్లాలో పంవెల్ రైలు స్టేషను ప్రధానమైనదిగా ఉంది. ఇది హార్బర్ మార్గం ద్వారా ముంబాయితో అనుసంధానించబడి ఉంది. జిల్లాలోని ప్రయాణీకులంతా పాంవే రైలు స్టేషను ద్వారా ఇతర నగరాలకు ప్రయాణిస్తుంటారు. ఇది జిల్లాను దక్షిణ భారతంతో అనుసంధానిస్తుంది. నెరల్ నుండి మాథరన్ వరకు నేరోగేజ్ రైలుమార్గం ఉంది. దీనిని మాథరన్ హిల్ రైల్వే అంటారు.

నౌకాశ్రయాలు[మార్చు]

జిల్లాలో జె.ఎన్.పి.టి, మంద్వ, రేవాస్, ముర్ద్ మరియ ష్రీవర్ధన్ వంటి నౌకాశ్రయాలు ఉన్నాయి.

యూనివర్శిటీ[మార్చు]

రాయ్‌ఘర్ జిల్లాలోని లోనెరే వాదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ టెక్నికల్ యూనివర్శిటీ " ఉంది. ఇది 1989లో స్థాపించబడింది. [10] ఇది మహారాష్ట్ర రాష్ట్రంలోని ఒకేఒక యూనివర్శిటీగా గుర్తుంచబడుతుంది.[11][12][13]

మూలాలు[మార్చు]

 1. "List of districts in Maharashtra". http://districts.nic.in. మూలం నుండి 26 ఏప్రిల్ 2013 న ఆర్కైవు చేసారు. Retrieved 19 November 2012. Cite web requires |website= (help); External link in |publisher= (help)
 2. "Raigarh District Population 2011". Census Organization of India. Cite web requires |website= (help)
 3. "1883 Kulaba district" Archived 2016-03-04 at the Wayback Machine., Gazeteer
 4. "District details". Raigad District, Maharashtra State. మూలం నుండి 2014-10-20 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-11-27. Cite web requires |website= (help)
 5. "Block Panchayats of Raigad, Maharashtra". National Panchayat Directory, Panchayat Informatics Division, National Informatics Centre, Government of India. మూలం నుండి 3 జనవరి 2013 న ఆర్కైవు చేసారు. Retrieved 27 నవంబర్ 2014. Cite uses deprecated parameter |deadurl= (help); More than one of |deadurl= and |url-status= specified (help); Cite web requires |website= (help)
 6. 6.0 6.1 6.2 6.3 6.4 6.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
 7. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Kuwait 2,595,62 line feed character in |quote= at position 7 (help); Cite web requires |website= (help)
 8. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Nevada 2,700,551 line feed character in |quote= at position 7 (help); Cite web requires |website= (help)
 9. "1964 Revised Gazeteer of Raigad". మూలం నుండి 2016-03-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-11-27. Cite web requires |website= (help)
 10. "University Grant Commission". Retrieved 19 November 2012. Cite web requires |website= (help)
 11. "Dr. Babasaheb Ambedkar Technological University". dbatu.ac.in. Retrieved 19 November 2012. Cite web requires |website= (help)
 12. "Dr.Babasaheb Ambedkar Tech University,Students' Alumni informative blog". మూలం నుండి 19 డిసెంబర్ 2012 న ఆర్కైవు చేసారు. Retrieved 22 November 2012. Cite web requires |website= (help)
 13. "Maharashtra Prathamik Shikshan Parishad". mpsp.maharashtra.gov.in. మూలం నుండి 18 నవంబర్ 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 19 November 2012. Cite web requires |website= (help)

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]