వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 26
స్వరూపం
- 1925: అమెరికన్ నటుడు, చిత్ర దర్శకుడు, సాహసికుడు, మానవతావాది పాల్ న్యూమాన్ జననం.
- 1935: తెలుగు సినీ రచయిత, కవి, రాష్ట్ర పురస్కార గ్రహీత, వక్త, వ్యాఖ్యాత, రూపకకర్త, ఆకాశవాణి ప్రసంగికుడు భావశ్రీ జననం (మ.2021).
- 1950: భారత్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది. (చిత్రంలో)
- 1950: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అవతరించింది.
- 1950: భారత సుప్రీం కోర్టు పనిచెయ్యడం మొదలుపెట్టింది.
- 1956: భారతదేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారిణి డయానా ఎడుల్జీ జననం.
- 1968: తెలుగు సినిమా నటుడు రవితేజ జననం.
- 2010: తెలుగు సినిమా నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు మరణం (జ.1927).
- 2015: భారతీయ వ్యంగ్యచిత్రకారుడు ఆర్.కె.లక్ష్మణ్ మరణం (జ.1924).