వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 9
స్వరూపం
- 1895: తెలుగు కవి దువ్వూరి రామిరెడ్డి జననం (మ.1947).
- 2011: నోబెల్ బహుమతి పొందిన జీవ శాస్త్రజ్ఞుడు హరగోవింద్ ఖొరానా మరణం (జ.1922).
- 1924: కారా మాస్టారుగా పసిద్ధి పొందిన సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు కాళీపట్నం రామారావు జననం (చిత్రంలో).
- 1927: స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వనిత, సమాజ సేవిక, రచయిత్రి మాగంటి అన్నపూర్ణాదేవి మరణం (జ.1900).
- 1934: అమెరికన్ ఖగోళ శాస్త్రజ్ఞుడు, ఖగోళ భౌతిక శాస్త్రజ్ఞుడు, రచయిత కార్ల్ సాగన్ జననం (మ.1996).
- 1936: రంగస్థల కళాకారిణి రేకందార్ అనసూయాదేవి జననం.
- 1948: సంగీత విధ్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ జననం.
- 1962: సంఘసంస్కర్త ధొండొ కేశవ కర్వే మరణం (జ.1858) (104 సంవత్సరాలు).
- 2000: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడింది.
- 2005: భారత మాజీ రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ మరణం (జ.1920).