వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 27
స్వరూపం
- 1332: చరిత్రకారుడు, పండితుడు, ధార్మిక శాస్త్రవేత్త, రాజకీయ వేత్త ఇబ్నె ఖుల్దూన్ జననం (మ.1406).
- 1910: జర్మనీకి చెందిన వైద్యుడు, శాస్త్రవేత్త రాబర్ట్ కోచ్ మరణం (జ.1843).
- 1919: భారతదేశ సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు మరణం (జ. 1848). (చిత్రంలో)
- 1931: మలయాళ కవి, సినీ గేయకర్త ఒ.ఎన్.వి.కురుప్ జననం (మ.2016).
- 1934: రెండవ ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు ఇటలీ లో ప్రారంభమయ్యాయి.
- 1962: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు రవిశాస్త్రి జననం.
- 1964: భారత తాత్కాలిక ప్రధానమంత్రి గా గుల్జారీ లాల్ నందా నియామకం.
- 1964: భారతదేశపు ప్రథమ ప్రధాన మంత్రిజవహర్ లాల్ నెహ్రూ మరణం (జ.1889).
- 1980: తెలుగు, కన్నడ సినిమా సంగీత దర్శకులు సాలూరు హనుమంతరావు మరణం (జ.1917).
- 1982: రస్నా బేబీగా పేరొందిన తెలుగు సినిమా కథానాయిక అంకిత జననం.