గుల్జారీలాల్ నందా

వికీపీడియా నుండి
(గుల్జారీ లాల్ నందా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గుల్జారీలాల్ నందా
గుల్జారీలాల్ నందా

గుల్జారీలాల్ నందా


పదవీ కాలం
11 జనవరి 1966 – 24 జనవరి 1966
రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్
ముందు లాల్ బహాదుర్ శాస్త్రి
తరువాత ఇందిరా గాంధీ
పదవీ కాలం
27 మే 1964 – 9 జూన్ 1964
అధ్యక్షుడు సర్వేపల్లి రాధాకృష్ణన్
ముందు జవాహర్ లాల్ నెహ్రూ
తరువాత లాల్ బహాదుర్ శాస్త్రి

హోం మంత్రి
పదవీ కాలం
29 ఆగస్టు 1963 – 14 నవంబరు 1966
ప్రధాన మంత్రి జవాహర్ లాల్ నెహ్రూ
లాల్ బహాదుర్ శాస్త్రి
ఇందిరా గాంధీ
ముందు లాల్ బహాదుర్ శాస్త్రి
తరువాత యశ్వంతరావు చవాన్

వ్యక్తిగత వివరాలు

జననం (1898-07-04)1898 జూలై 4
సియాల్ కోట్ , పంజాబ్ , బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుతం పంజాబ్, పాకిస్థాన్)
మరణం 1998 జనవరి 15(1998-01-15) (వయసు 99)
అహ్మదాబాద్, గుజరాత్, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి లక్ష్మీ
సంతానం 2 కుమారులు ఒక 1 కుమార్తె
పూర్వ విద్యార్థి అలహాబాదు విశ్వవిద్యాలయం
మతం హిందూ మతం
గుర్జారీలాల్ నందా

గుర్జారీలాల్ నందా (జూలై 4, 1898 - జనవరి 15, 1998) [1][2]భారత జాతీయ రాజకీయనాయకుడు, ఆర్థికవేత్త. అతను కార్మిక సమస్యలపై ప్రత్యేకంగా కృషిచేసిన వ్యక్తి. అతను రెండు పర్యాయములు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. తొలి సారి 1964లో జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత, రెండవ సారి 1966లో లాల్ బహుదూర్ శాస్త్రి మరణం తర్వాత ఈ పదవిని అలంకరించాడు. రెండు సందర్భములలో ఇతను నెల రోజుల లోపే పదవిలో ఉన్నాడు. అతను భారత జాతీయ కాంగ్రేసు ప్రధానమంత్రిగా కొత్త నేత ఎన్నిన్నుకునే వరకు ఈ రెండు సందర్భాలలో పరిపాలన చేశాడు. 1997లో అతనికి భారత రత్న పురస్కారం లభించింది.

ప్రారంభ జీవితం

జననం

నందా 1898 జూలై 4న బ్రిటిష్ ఇండియాలో అవిభాజ్యిత పంజాబ్ ప్రాంతములోని సియాల్‌కోట్ (ప్రస్తుతము పంజాబ్ (పాకిస్తాన్)లో ఉన్నది) పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించాడు. అతను లాహోర్, అమృత్‌సర్, ఆగ్రా, అలహాబాద్ లలో విద్యాభ్యాసం చేసాడు.


పరిశోధనా కార్యకర్త

అతను 1920-1921 వరకు ఈయన అలహాబాద్ విశ్వవిద్యాలయములో కార్మిక సమస్యలపై పరిశోధన చేశాడు. 1921 లో బొంబాయిలోని నేషనల్ కాలేజీలో ఆచార్య పదవిని పొందాడు. అదే సంవత్సరము బ్రిటిష్ రాజ్ కు వ్యతిరేకంగా జరిగిన సహాయనిరాకరణోద్యమములో పాల్గొన్నాడు. 1922లో అహమ్మదాబాద్ టెక్స్‌టైల్ కార్మిక సంఘము కార్యదర్శిగా చేరి 1946 వరకు అందులోనే కొనసాగాడు. 1932లో సత్యాగ్రహము చేసి జైలు కెళ్లాడు. మరలా 1942 నుండి 1944 వరకు జైలులో గడిపాడు. అతను 407/2000 సంఖ్యతో 1860 సొసైటీ చట్టం పరిధిలో రిజిస్టరు కాబడిన "అలహాబాదు విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల అసోసియేషన్" విడుదలచేసిన 42 సభ్యుల జాబితాలో "గర్వపడవలసిన పూర్వ విద్యార్థి" గా గౌరవింపబడ్డాడు.[3][4][5]

అతని వివాహం లక్ష్మీ తో జరిగింది. వారికి ఇద్దరు కూమరులు ఒక కుమార్తె. [6]

అసెంబ్లీ, పార్లమెంట్ సభ్యులు

బ్రిటిష్ రాజ్

అతను 1937లో బ్రిటిష్ ప్రభుత్వంలో బొంబాయి శాసనసభకు ఎన్నికైనాడు. తరువాత 1937 నుండి 1939 వరకు బొంబాయి ప్రభుత్వంలో పార్లమెంటు సెక్రటరీ గా (కార్మిక, ఎక్సైజ్ శాఖలు) తన సేవలనందించాడు. 1946 నుండి 1950 వరకు బొంబాయి ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు అతను రాష్ట్ర శాసనసభలో కార్మిక వివాదాల బిల్లును ప్రవేశపెట్టడంలో విజయవంతంగా నాయకత్వం వహించాడు. అతను కస్తూర్బా మెమోరియల్ ట్రస్టు లో ఒక ట్రస్టీగా తన సేవలనంచించాడు. అతను హిందూస్థాన్ మజదూర్ సేవక్ సంఘ్ కు సెక్రటరీగా, బొంబాయి హౌసింగ్ బోర్డు కు చైర్మన్ గా తన సేవలనందించాడు. అతను జాతీయ ప్లానింగ్ కమిటీలోసభ్యుడు.

అతను "ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్" ను నిర్వహించడంలో ముఖ్యపాత్ర వహించాడు. తరువాత ఆ సంస్థకు అధ్యక్షునిగా భాద్యతలు చేపట్టాడు.

1947లో, అతను జెనీవా, స్విడ్జర్లాండ్ దేశాలలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సభలకు ప్రభుత్వ ప్రతినిధిగా హాజరయ్యాడు. ఆ సమావేశంలో "ప్రీడం ఆఫ్ అసోసియేషన్ కమిటి"లో పనిచేస్తూ అతను స్వీడన్, ఫ్రాన్స్, స్విడ్జర్లాండ్, బెల్జియం, యు.కె దేశాలను సందర్శించి ఆ దేశాలలో గల కార్మికులు, వారి గృహ పరిస్థితులను అధ్యయనం చేసాడు.

ఇండియన్ ప్లానింగ్ కమిషన్

మార్చి 1950లో అతను భారత ప్లానింగ్ కమీషన్ లో వైస్ చైర్మన్ గా చేరాడు. 1951 సెప్టెంబరులో అతను భారత ప్రభుత్వంలో ప్లానింగ్ మంత్రి గా నియమింపబడ్డాడు. అతనికి వ్యవసాయం, విద్యుత్ శాఖలను కూడా అదనంగా కేటాయించారు. 1952 సార్వత్రిక ఎన్నికలలో బొంబాయి నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. అతను మరలా ప్లానింగ్, వ్యవసాయం, విద్యుత్ శాఖలకు మంత్రిగా మనలా నియమితుడయ్యాడు. అతను 1955 లో సింగపూర్ లో జరిగిన ప్లాన్ కన్సల్టేటివ్ కమిటీకి భారతీయ ప్రతినిధులకు నాయకత్వం వహించాడు. 1959 లోజెనీవా జరిగిన అంతర్జాతీయ కార్మిక సమావేశాలలో పాల్గొన్నాడు.

లోక్‌సభ సభ్యుడు

నందా 1957 ఎన్నికలలో లోక్‌సభకు ఎన్నికయ్యాడు. అతను కార్మిక, ఉపాధి, ప్లానింగ్ శాఖలకు కేంద్రమంత్రిగా పనిచేసాడు. తరువాత అతను ప్లానింగ్ కమీషన్ డిప్యూటీ చైర్మంగా భాద్యతలు చేపట్టాడు. అతను 1959లో ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, యుగోస్లేవియా, ఆస్ట్రియా దేశాలకు పర్యటించాడు.

నందా 1962 ఎన్నికలలో లోక్‌సభకు గుజరాత్ లోని శంబర్‌కాంత నియోజకవర్గంనుండి తిరిగి ఎన్నికయ్యాడు. అతను సామ్యవాద నిర్మాణం కోసం కాంగ్రెస్ ఫోరం ప్రారంభించాడు. అతను 1962 – 1963 కాలంలో కార్మిక, ఉపాధి శాఖలకు కేంద్రమంత్రిగాను, 1963 – 1966 కాలంలో హోం మంత్రిగానూ పదవులను చేపట్టాడు.

అతను 1967,1971 లోక్‌సభ ఎన్నికలలో తిరిగి హర్యానాలోని కైతల్ నియోజవవర్గం నుండి ఎన్నికైనాడు. 1970 – 1971 కాలంలో రైల్వే శాఖకు కేంద్రమంత్రిగా తన సేవలనందించాడు.[7]

ఆపద్ధర్మ ప్రధానమంత్రి

నందా భారతదేశానికి రెండు సార్లు ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా భాద్యతలను చేపట్టాడు. మొదటి సారి 1964 లో భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరణం తరువాత 13 రోజులు, రెండవసారి 1966లో లాల్‌బహదూర్ శాస్త్రి మరణం తరువాత 13 రోజులు ఈ పదవిని చేపట్టాడు.[8] రెండు కాలాలలోనూ అతను ఏవిధమైన గొప్పతనం పొందనప్పటికీ ఆ కాలం దేశంలో అతి సున్నితమైన ముఖ్యమైనది. నెహ్రూ మరణం తరువాత 1962 చైనా యుద్ధం, శాస్త్రి మరణం తరువాత 1985 పాకిస్థాన్ యుద్ధం జరిగినందున ఈ సమయం దేశానికి ప్రమాదకరమైనది. [9]

నందా 1998 జనవరి 15న తన 99వ యేట మరణించాడు. [10]

మూలాలు

  1. "Rediff On The NeT: Former PM Gulzarilal Nanda dead". Rediff.com. Retrieved 2015-05-25.
  2. Former PMs of India Archived 25 జూన్ 2014 at the Wayback Machine
  3. "Gulzarilal Nanda Biography - Gulzarilal Nanda Profile, Childhood, Life, Timeline". Iloveindia.com. 1998-01-15. Retrieved 2015-05-25.
  4. https://www.washingtonpost.com/archive/local/1998/01/18/deaths/3c6cae5b-af47-4075-a8b6-a3ce7c65702f/
  5. "" Internet Archive of Proud Past Alumni"
  6. Kalhan, Promilla (1997). Gulzarilal Nanda: A Life in the Service of the People. Allied Publishers. p. xvi. Retrieved 26 August 2014.
  7. "Fifth Lok Sabha -State wise Details - Haryana". Retrieved 22 December 2017.
  8. Former PMs of India Archived 25 జూన్ 2014 at the Wayback Machine
  9. "Gulzarilal Nanda Biography - Gulzarilal Nanda Profile, Childhood, Life, Timeline". Iloveindia.com. 1998-01-15. Retrieved 2015-05-25.
  10. https://www.washingtonpost.com/archive/local/1998/01/18/deaths/3c6cae5b-af47-4075-a8b6-a3ce7c65702f/

ఇతర పఠనాలు

రాజకీయ కార్యాలయాలు
అంతకు ముందువారు
లాల్ బహాదుర్ శాస్త్రి
భారత హోం మంత్రి
1963–1966
తరువాత వారు
యశ్వంతరావు చవాన్
అంతకు ముందువారు
జవాహర్ లాల్ నెహ్రూ
భారత ప్రధానమంత్రి
ఆపద్ధర్మ

1964
తరువాత వారు
లాల్ బహాదుర్ శాస్త్రి
భారత ప్లానింగ్ కమీషన్ చైర్‌పర్సన్
ఆపద్ధర్మ

1964
భారత హోం మంత్రి
1964
అంతకు ముందువారు
లాల్ బహాదుర్ శాస్త్రి
భారత ప్రధానమంత్రి
ఆపద్ధర్మ

1966
తరువాత వారు
ఇందిరా గాంధీ
భారత ప్లానింగ్ కమీషన్ చైర్‌పర్సన్
ఆపద్ధర్మ

1966