వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పెట్టుబడి
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 11:54, 4 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పేజీని గతంలో సుజాత గారు తొలగించారు. కొన్ని నెలల తరువాత వైవిఎస్రెడ్డి గారు, రాజశేఖర్ గారిని అడిగి పునస్స్థాపింపజేసుకున్నారు. ఆ తరువాత కూడా అదే పరిస్థితి-మొలక. ఉన్న కాస్త సమాచారానికీ మూలాల్లేవు. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 10:56, 13 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- వారం రోజుల (మే 20) వరకు ఈ వ్యాసాన్ని విస్తరించకుంటే తొలగించాలి. Pranayraj Vangari (Talk2Me|Contribs) 11:16, 13 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- చదువరి గారు ఈ పేజీని గతంలో సుజాత గారు తొలగించనూలేదు. కొన్ని నెలల తరువాత వైవిఎస్రెడ్డి గారు, రాజశేఖర్ గారిని అడగనూ లేదు. చేసిన తప్పు తెలుసుకొని రాజశేఖర్ గారే పునరుద్ధరించారు.
- మీరు చేర్చిన వ్యాసాల విషయంగా ఏమైనా దురుసుగా ప్రవర్తిస్తే క్షమించండి. సభ్యులందరూ కలిసికట్టుగా చేస్తున్న వికీ ఉగాది మహోత్సవానికి వేంచేసి మాకందరికీ ఆనందాన్ని కలిగించమని విన్నపము.Rajasekhar1961 (చర్చ) 08:16, 8 ఏప్రిల్ 2013 (UTC)-ఇది నా చర్చా పేజీ నుంచి
YVSREDDY (చర్చ) 15:22, 13 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- YVSREDDY గారూ, మీరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారో.., లేక అలవాటుగా నిజాన్ని చెప్పలేక పోతున్నారో తెలియదు. కింది వాస్తవాలు చూదండి:
- ఈ లింకు చూస్తే ఎవరు తొలగించారో, ఎవరు పునస్థాపించారో తెలుస్తుంది.
- పోతే, మీ చర్చాపేజీ నుండే గ్రహించిన కొన్ని వాస్తవాలు ఇక్కడ ఇస్తున్నాను. వాటిని బట్టి మీరు చెప్పే రాజశేఖర్ గారి క్షమాపణ చెప్పిన సందర్భమే వేరనీ, మీరు పునస్థాపన కోరింది అది జరిగిన ఏడు నెల్ల తరవాతనీ ఈ రెంటికీ సంబంధమే లేదనీ తెలుస్తుంది:
- మీరుదహరించిన రాజశేఖర్ గారి క్షమాపణ తేదీ: 2013 ఏప్రిల్ 8
- తొలగించిన పేజీలను పునస్థాపించమని మీరు అడిగిన తేదీ: 2013 నవంబరు 23
- రాజశేఖర్ గారు పునస్థాపించిన తేదీ: 2013 నవంబరు 27
- పునస్థాపించానని ఆయన మీకు చెప్పిన తేదీ: 2013 నవంబరు 27
- నిజానికి ఇదంతా నేను మీకు చెప్పాల్సిన పన్లేదు. నాకంత ఆసక్తీ లేదు. కానీ మీ తప్పు మీకు చెబితే రెండు ఉపయోగాలున్నాయి:
- మీరు చెబుతున్నవి అబద్ధాలని మాకు తెలిసిపోతున్నాయన్న సంగతి మీకు తెలుస్తుంది. దాంతో ఇకపై అలా చెప్పకుండా ఉంటారని ఆశ.
- ఒకవేళ మీరు అమాయకులైతే, మీరు చెప్పేది తప్పని మీకు తెలిసి వస్తుంది. ఇక ముందు అలాంటి తప్పులు చెయ్యకుండా ఉంటారని ఆశ.
- అందుకే రచ్చబండలో చెప్పాను. ఇక్కడా చెబుతున్నాను. ఉంటానండి. __చదువరి (చర్చ • రచనలు) 16:22, 13 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- 16:33, 30 అక్టోబరు 2012 YVSREDDY చర్చ రచనలు 4,036 బైట్లు +4,036 కొత్త పేజీ: పెట్టుబడిని మూలధనం అని కూడా అంటారు. పెట్టుబడిని ఆంగ్లంలో కాప...
- పెట్టుబడిని మూలధనం అని కూడా అంటారు. పెట్టుబడిని ఆంగ్లంలో కాపిటల్ అంటారు. పెట్టిన ధనం కన్నా రాబడి ద్వారా ఎక్కువ ధనం సంపాదించడానికి పెట్టే ధన, వస్తువుల మూలములను మూలధనం లేక పెట్టుబడి అంటారు. అర్ధశాస్త్రంలో పెట్టుబడి, మూలధన వస్తువులు, లేక నిజ మూలధనం ఇప్పటికే మన్నికగల వస్తువులను ఉత్పత్తి చేసేవిగా ఉన్నాయి, వస్తువులు లేదా సేవలు యొక్క ఉత్పత్తిలో ఈ పెట్టుబడిని ఉపయోగిస్తారు. మూలధన వస్తువులు ఒకసారిగా గణనీయంగా వినియోగితమవవు, అయితే ఉత్పత్తి ప్రక్రియలో వీటి విలువ క్షీణిస్తూ ఉంటుంది. పెట్టుబడి భూమి నుండి ప్రత్యేకంగా ఉంటుంది, మానవుని శ్రమ చేత ఉత్పత్తి ప్రారంభించేందుకు ముందు ఉత్పత్తి కారకంనకు అవసరమైన పెట్టుబడి తప్పని సరిగా అవసరమవుతుంది.
వ్యాపార పెట్టుబడి
[మార్చు]వ్యాపారం చేయడం కోసం పెట్టే పెట్టుబడిని వ్యాపార పెట్టుబడి అంటారు.
వ్యవసాయ పెట్టుబడి
[మార్చు]వ్యవసాయానికి పెట్టే పెట్టుబడిని వ్యవసాయ పెట్టుబడి అంటారు.
- వ్యాపారం
- ఆస్తి
- వాస్తవ ఆస్తి
- 16:05, 25 ఏప్రిల్ 2013 K.Venkataramana చర్చ రచనలు 1,980 బైట్లు +62 తొలగింపు ప్రతిపాదన - పూర్తి ఆంగ్ల వ్యాసం దిద్దుబాటు రద్దుచెయ్యిధన్యవాదాలు పంపండి
- చదువరి గారు 30 అక్టోబరు 2012న ఈ పేజీ ప్రారంభమే 4,036 బైట్లు పూర్తి తెలుగులో, K.Venkataramana గారు 25 ఏప్రిల్ 2013న ఇది పూర్తి ఆంగ్ల వ్యాసమని తొలగింపు ప్రతిపాదన చేశారు. ఇది ఎలా సాధ్యం.YVSREDDY (చర్చ) 16:58, 13 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- YVSREDDY గారూ, ఇప్పటి తొలగింపు ప్రతిపాదన గురించీ మూలాలు ఇవ్వకపోవడం గురించీ ఒక్కముక్క మాట్టాడలేదు మీరు. మీ తప్పులను ఇంకా ఒప్పుకోవడం లేదు. తొలగింపు ప్రతిపాదనలు చేసిన వాళ్లందరిపైనా ఆరోపణలు చేస్తున్నారే గానీ మీ తప్పులను సవరించుకోవడం లేదు. ఈ అసందర్భమైన, మేకపోతు గాంభీర్యపు వాదనలు ఇక ఆపండి. వికీకి పనికొచ్చే వ్యాసాలు రాయండి. ఏదో దిద్దుబాటు లెక్కకోసం నాలుగైదు వాక్యాలతో కొత్త వ్యాసాలు సృష్టిస్తే మీకు మాత్రమే ఉపయోగం. ఒక అర్థవంతమైన వ్యాసాన్ని అర్థవంతమైన పరిమాణంలో, తగు మూలాలతో, తగు వికీలింకులతో, తగు ఇన్కమింగు లింకులతో, అంతర్వికీ లింకులతో రాస్తే వికీకి కూడా ఉపయోగం. చిరకాలం నిలబడుతుంది. తప్పులను ఒప్పుకోవడం, సరిదిద్దుకోవడం తప్పేమీ కాదు. తెలియని సంగతులను తెలుసుకోవడం తప్పేమీ కాదు. వికీలో ఎలా రాయాలో కొత్తవారు తెలుసుకునేందుకు ఆదర్శంగా నిలవాల్సిన స్థితిలో ఉన్నారు మీరు. అలాంటిది.. ఎలా రాయకూడదో చూపించేందుకు నమూనాగా మారతారా? ఆలోచిచుకోండి. __చదువరి (చర్చ • రచనలు) 17:34, 13 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాలు లేని ఈ వ్యాసాన్ని విస్తరించనిచో తొలగించాలి. కె.వెంకటరమణ (చర్చ) 17:54, 17 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.