Jump to content

వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/JVRKPRASAD 2

ఈ వాడుకరికి తెలుగు వికీపీడియాలో నిర్వహణ బాధ్యతలు ఉన్నాయి.
వికీపీడియా నుండి

ఇక్కడ వోటు వెయ్యండి (0/0/0) ముగింపు తేదీ :07:35 07:34, 4 సెప్టెంబర్ 2017 (UTC) JVRKPRASAD (చర్చదిద్దుబాట్లు) - మీ ప్రతిపాదన/సభ్యుని గురించి వివరణ --JVRKPRASAD (చర్చ) JVRKPRASAD (చర్చ) 11:51, 28 ఆగస్టు 2017 (UTC) సభ్యులందరికి వందనములు, నేను (జె.వి.ఆర్.కె.ప్రసాద్) తెవికీ సభ్యుడై గత కొన్ని సంవత్సరములుగా తెలుగుభాష కొరకు ఓ భాషాప్రేమికుడిగా నా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. నా వయసు 62 సం.లు. తెవికీలో నిర్వాహక అభ్యర్థిత్వానికి స్వీయ ప్రతిపాదన చేస్తున్నాను. ఈ అభ్యర్థిత్వానికి నేను అర్హుడిని అని భావిస్తే మద్దతునివ్వండి, ధన్యవాదాలు.[ప్రత్యుత్తరం]

అభ్యర్ధికి ప్రశ్నలు

[మార్చు]

నిర్వాహక అభ్యర్ధి గారూ, వికీపీడియా నిర్వాహణా పనులు చేయటానికి చొరవచూపి ముందుకువచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ప్రతిపాదనలో చర్చకై పాల్గొనే సభ్యులకు తోడ్పడేందుకు దయచేసి ఈ దిగువ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.

1. మీరు ఎటువంటి నిర్వహణా పనులలో పాల్గొన్నారు లేదా పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు?
జవాబు: నాకు తెలిసినవి ఇంతకాలం చేసినవి మాత్రం చేయగలను.
నేను రచనలు చేసే రంగాలు
[మార్చు]


2. వికీపీడియాలో మీ అత్యుత్తమ కృషి ఏమిటి? ఎందుకు?
జవాబు:
విశేషాలు
[మార్చు]
3. మీరు ఏదైనా విషయంపై దిద్దుబాట్ల విషయంలో ఘర్షణకు గురయ్యారా? లేదా, ఇతర సభ్యులెవరైనా మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసిన సందర్భాలున్నాయా? అలాంటి సందర్భాలలో ఎలా వ్యవహరించారు మరియు ఇకముందు అలాంటి సందర్భాలు వస్తే ఎలా ఎదుర్కొని పరిష్కరిస్తారు?
జవాబు:
నా సమాధానం
[మార్చు]

ఇన్ని సంవత్సరాలు వికీలో పనిచేస్తున్న నాకు అనేక అనుభవాలు ఉన్నాయి, అందులో భాగంగానే చర్చా ఘర్షణలు తప్పకుండా వచ్చాయి. ఇతర సభ్యులు నన్ను అనేకసార్లు ఒత్తిడికి గురిచేసిన సందర్భాలున్నాయి. జీవితంలో అనేకం మరియు అనేకమందిని చూస్తూ ఉంటాము. దానివల్లనే నన్ను నిర్వాహకునిగా తొలగించారు. ఆ తొలగింపు కొద్దికాలం మాత్రమే నేనే అడిగాను, కాని ఇప్పటి వరకు నా తొలగింపు అనేది కొద్దికాలమా లేక శాశ్వతమా అనేది తెలియక తిరిగి అభ్యర్దించాలేమేనని ఇప్పుడు అడుగుతున్నాను. ఇకముందు ఘర్షణ లాంటి సందర్భాలు వస్తే నీతులు చెప్పేబదులు, మనసు పాడుచేసుకునేకన్నా ఎక్కడికక్కడ వదలి వేయడమే మంచిది. అయినా నేను రోజూ వికీలోనే ఉంటూ ఉన్నాను. అవసరమైన విషయాలకు మాత్రమే స్పందిస్తున్నాను. నేను కేవలం వ్యక్తులతో మాత్రమే నా సంవాదం కాని వికీతో ఏమాత్రం కాదు. నేను ఒక వికీపీడియన్ అని గర్వంగా ఫీలవుతూ ఉంటాను. ప్రస్తుతం నా ఉచిత సేవలకు కొంతకాలం అంతరాయం మాత్రమే కలిగింది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను.


వాడుకరుల ప్రశ్నలు

మద్దతు

[మార్చు]
  1. ప్రసాద్ గారికి గతంలో నిర్వాహకులుగా పనిచేసిన అనుభవం ఉన్నది. కొన్ని పొరపాట్లు జరిగినప్పటికీ వాటిని దిద్దుకొని మరలా పునరావృతం చేయక ఆయన నిర్వాహకులుగా విశేశంగా రాణిస్తారని, అందరినీ కలుపుకొని వెళుతూ తెవికీ ఆభివృద్దికి పాటుపడతారని ఆశిస్తూ వారికి మద్దతు తెలుపుతున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 17:45, 31 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యతిరేకత

[మార్చు]
  1. వ్యతిరేకిస్తున్నాను: ఈయన నిర్వాహకుడిగా పనికిరారని చెప్పేందుకు కారణాలివి: (ఇవి కొన్ని మాత్రమే, అన్నీ కావు).
    1. గతంలో ఈయన ప్రదర్శించిన దురుసు ప్రవర్తన ఎంత తీవ్రమైనదంటే, నిర్వాహకుడిగా పనికిరారని తేల్చి, తొలగించేటంత. అయినా, తాను తప్పు చేసానని తెలుసుకోలేదు.
    2. కొన్నేళ్ళపాటు నిర్వాహకత్వం నిర్వహించినా, వికీపీడియా విధానాలు, పద్ధతులూ తెలియదు. ప్రస్తుత ప్రతిపాదనను తెర మీదకు తెచ్చేందుకు అనేక తప్పులు జరిగాయి. ఇంకా ఒక తప్పు అలాగే ఉండిపోయింది. ట్రాన్స్‌క్లూజన్ లాంటి చిన్న విషయం ఆయనకు తెలియదు. ఇవన్నీ ఇంతకుముందు చేసినవే. తెలియకపోవడం తప్పు కాదు, కానీ తెలుసుకోకపోవడం తప్పు.
    3. మనం చెప్పేది ఆయన అర్థం చేసుకోరు. మొదటి ప్రశ్నకు ఆయన సమాధానం ఇందుకు మేలిమి ఉదాహరణ.
    4. ఆయన చెప్పేది సరిగ్గా చెప్పలేరు. ఆయన రాసేవి సందిగ్ధంగా ఉంటూంటాయి. మూడో ప్రశ్నకు సమాధానంలో నిర్వాహకునిగా తొలగించారు అని చెబుతూనే "ఆ తొలగింపు కొద్దికాలం మాత్రమే నేనే అడిగాను" అని రాసారు. కొద్దికాలం పాటు తొలగించమని ఆయన అడగలేదు, అలా అని ఎవరూ చెప్పనూ లేదు. ఈయనే ఊహించుకుని, ఆపైన "కొద్దికాలం" అంటే ఏంటో తెలియక ఈ ప్రతిపాదన మళ్ళీ చేస్తున్నారట!! నియమాలు తెలియక పోతే చదువుకోవాలి, లేదా ఎవరినైనా అడగాలి. __చదువరి (చర్చరచనలు)

      ఈ పైన నాలుగు కారణాలు వ్రాసిన వారు ఎవరో తెలియజేస్తే సమాధానం ఇస్తాను. ఇంక ఉన్నవి కూడా వ్రాస్తే మంచిది. JVRKPRASAD (చర్చ) 02:12, 29 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

      సారీ, పైన వ్యతిరేకించిన వాడుకరిని నేను. ఇది చర్చ కాదు కాబట్టి, మీరు సమాధానం ఇవ్వనవసరం లేదు. కానీ ఇవ్వాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తే, కింద "చర్చ" అనే విభాగం పెట్టాను. అక్కడ రాయండి. వోటింగు విభాగాలను నీటుగా ఉంచుదాం. __చదువరి (చర్చరచనలు) 03:33, 29 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

  2. గతంలో ప్రసాద్ గారి దురుసు ప్రవర్తన గమనించాను. ఈయనతో చర్చలు సామరస్య పూర్వకంగా సాగటం నేను చూడలేదు. ఈయన వల్ల కొంతమంది వాడుకరులు బెదిరిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ ప్రతిపాదనను నేను వ్యతిరేకిస్తున్నాను. --రవిచంద్ర (చర్చ) 11:02, 29 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

తటస్థం

[మార్చు]
  1. నా వయసు 62 సం.లు. అని పేర్కొనడం నచ్చలేదు. అది క్వాలిఫికేషన్ కాకూడదు. నిర్వాహకునిగా పనిచేయడానికి వయసుతో నిమిత్తం లేదు.--స్వరలాసిక (చర్చ) 01:59, 29 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
నిర్వాహక హోదా కొరకు నేను చెప్పలేదు. నా వయసు పని చేసేందుకు అడ్డు కాదు, ఇంకా నేను ఎటువంటి పని నాకు తెలిసినది చేయగలను అని నా ఉద్దేశ్యం. ఒక పదవికి వయసుతో ఎటువంటి సంబంధము లేదు. వయసు అనేది అనుభవము అని అనుకోవచ్చు. ఒక అభ్యర్థి ఎ విధంగా వివరాలు ఇవ్వాలో ఒక ఫార్మాట్ ఇస్తే అదేవిధముగా సమర్పిస్తాను. నాకు ఈ పదవి గురించి నాకు ఇక్కడ మరియు ఇతర చోట్ల అనుభావాలు ఉన్నాయి. నా వయసు చెప్పటం అభ్యంతరం అయితే తప్పకుండా తొలగిస్తాను. ఇంకా ఏమైనా తొలగించాల్సినవి ఉంటే చెప్పండి, మార్పులు చేస్తాను. స్వరలాసిక గారు, మిమ్మల్ని తీసుకుని, నన్ను వికీ పెద్దలు తీసుకోక పోయినను, నేను మనసు బాధ పెట్టుకోను, మీకే సంతోషంగా నా మద్దతు ఇస్తాను. JVRKPRASAD (చర్చ) 02:09, 29 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చ

[మార్చు]
    1. గతంలో ఈయన ప్రదర్శించిన దురుసు ప్రవర్తన ఎంత తీవ్రమైనదంటే, నిర్వాహకుడిగా పనికిరారని తేల్చి, తొలగించేటంత. అయినా, తాను తప్పు చేసానని తెలుసుకోలేదు.
    2. కొన్నేళ్ళపాటు నిర్వాహకత్వం నిర్వహించినా, వికీపీడియా విధానాలు, పద్ధతులూ తెలియదు. ప్రస్తుత ప్రతిపాదనను తెర మీదకు తెచ్చేందుకు అనేక తప్పులు జరిగాయి. ఇంకా ఒక తప్పు అలాగే ఉండిపోయింది. ట్రాన్స్‌క్లూజన్ లాంటి చిన్న విషయం ఆయనకు తెలియదు. ఇవన్నీ ఇంతకుముందు చేసినవే. తెలియకపోవడం తప్పు కాదు, కానీ తెలుసుకోకపోవడం తప్పు.
    3. మనం చెప్పేది ఆయన అర్థం చేసుకోరు. మొదటి ప్రశ్నకు ఆయన సమాధానం ఇందుకు మేలిమి ఉదాహరణ.
    4. ఆయన చెప్పేది సరిగ్గా చెప్పలేరు. ఆయన రాసేవి సందిగ్ధంగా ఉంటూంటాయి. మూడో ప్రశ్నకు సమాధానంలో నిర్వాహకునిగా తొలగించారు అని చెబుతూనే "ఆ తొలగింపు కొద్దికాలం మాత్రమే నేనే అడిగాను" అని రాసారు. కొద్దికాలం పాటు తొలగించమని ఆయన అడగలేదు, అలా అని ఎవరూ చెప్పనూ లేదు. ఈయనే ఊహించుకుని, ఆపైన "కొద్దికాలం" అంటే ఏంటో తెలియక ఈ ప్రతిపాదన మళ్ళీ చేస్తున్నారట!! నియమాలు తెలియక పోతే చదువుకోవాలి, లేదా ఎవరినైనా అడగాలి.

జవాబు: మీరు వ్రాసినవి అన్నీ ఏమాత్రం నిజాలు లేవు. నా వ్రాతలు మీకు నచ్చినట్లు ఉండటం లేదు. నిజంగా మీకు మీరు వ్రాశినవాటికి నా నుండి జవాబు కావాలంటే ఫోను చేయండి. వివరించి మీ ప్రశ్నలకు జవాబిస్తాను, నా మాటలు రికార్డు చేయండి. మీరు నా నుండి తెలుసుకోలేకపోతే, ఈ వ్రాసినవి అన్నీ అబద్ధాలే అని అందరూ అనుకోవాల్సి వస్తుంది. నా ఫోను నం.9246196226. మీకు డబ్బులు దండగ అనుకుంటే మీ నంబరు ఇవ్వండి, వివరించి చెబుతాను. JVRKPRASAD (చర్చ) 04:37, 29 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

నా మీద సరయిన సదభిప్రాయం ఎంతమందికి ఉందో కూడా తెలియదు. ఇప్పుడు నేను నిర్వాహక పదవి కోసం అడగడటం అంత మంచి పద్ధతి కాదేమోనని అనిపిస్తోంది. అధికారులకు ఎలాగూ నిర్వాహకుని నియమించే అధికారం ఉన్నది. కొంతమందికి అయినా నా మీద అభిమానం ఉంటే ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు వారికి వారే నన్ను ప్రతిపాదించ వచ్చును. ఇంతకాలం అయినా స్పందనలు కూడా అనుకూలంగా లేవు. అన్ని నిజాలు నిదానంగా తెలుస్తాయి. నాకుగా విరమించుకుంటే మంచిదేమోనని అనిపిస్తున్నది. నా ప్రతిపాదన తొలగించినా సంతోషమే. అందరికీ ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 06:56, 29 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

  • గతంలో ప్రసాద్ గారి దురుసు ప్రవర్తన గమనించాను. ఈయనతో చర్చలు సామరస్య పూర్వకంగా సాగటం నేను చూడలేదు. ఈయన వల్ల కొంతమంది వాడుకరులు బెదిరిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ ప్రతిపాదనను నేను వ్యతిరేకిస్తున్నాను.

జవాబు: మీరు వికీకి రావటం చాలా తక్కువ. ఇంక మీకు విషయాలు ఏమి తెలుస్తాయి. చిన్నపిల్లలు బెదిరిపోయి వెళ్ళి పోయారు అని అనటం సహేతుకంగా లేదు. కొందరు కొత్తవాడుకరులుగా సృష్టింపబడి, కేవలం నాతో వాదులాటలు గొడవలు, అనవసర చర్చలు చేసారు. దానికి కొంతమంది వత్తాసు ఉంది. నిర్వాహకత్వ పదవి ఉంటే నేను దేనికీ పనికి రానని, ఏమీ తెలియదని, అనర్హతగా ప్రకటించి, సీనియర్ల చేత తొలగించేటట్లు వాతావరణం కల్పించి, వ్యక్తిగత మానసిక హింసకు గురిచేసి కావల్సిన పని జరిపించుకున్నారు. నన్ను తొలగించారు, ఎవరికి వారు వెళ్ళిపోయారు. నేనూ నా పని వికీలో తగ్గించుకున్నాను. కాని, వికీ మాత్రం నన్ను తొలగించిన తదుపరి ఏ విధంగా ఎంత అభివృద్ధి చెందుతోందో ఎవరికి వారికే తెలియాలి. నాకు కేవలం పదవి ఉంటే ఎవరూ రారు, పదవి లేకపోతే పోనీ అందరూ బాగా పని చేస్తున్నారా ? నాది దురుసు ప్రవర్తన అయితే ఇన్నాళ్ళు ఇక్కడ పని చేసే వాడిని కాదు. అసలు దోషులు అందరూ బాగానే ఉన్నారు. నా మీద నిందలు వేయటము కొందరికి అలవాటు అయ్యింది. బ్రతికి ఉన్న జీవితకాలం ఇలాగే అంటూ ఉంటారు. దానివల్ల ప్రయోజనం ఏమిటి ? పని కట్టుకుని నేను ఎవరితోనూ మాట్లాడను, అటువంటిది నాకు ఒకరితో సమస్యలు ఎందుకు వస్తాయి ? ఏదయినా ఈ విధమైన ప్రచారం మాత్రం సమంజసంగా లేదు. నాకు పదవి ఉంటే తిరిగి ఏదో విధంగా సమస్యలు సృష్టి చేస్తారనే అనిపిస్తుంది. అటువంటి పదవులు నాకు లేక పోవటమే మంచిది. రవిచంద్ర గారు నిజాలు తెలుసుకోవాలంటే నా చర్చలు మొత్తం చదవండి లేదా పుస్తకం వేసి అందరికీ అంతర్జాలం నందు పంచండి లేదా నన్ను చేయమన్నా చేస్తాను. ఇతరులు చదివితే వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటే మీకు, మీలా ఆలోచించే వారికి కొంత అవగాహన ఏర్పడుతుంది. మీకు ...శలవు. JVRKPRASAD (చర్చ) 11:42, 29 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఫలితం

[మార్చు]

ఈ ప్రతిపాదన క్రియాశీలక సభ్యుల మద్ధతును పొందలేక పోయింది. ఒక్కరు మాత్రమే సమర్ధించగా ఇద్దరు వ్యరిరేకించారు. అంతేకాక అభ్యర్థి చర్చలో "నాకుగా విరమించుకుంటే మంచిదేమోనని అనిపిస్తున్నది. నా ప్రతిపాదన తొలగించినా సంతోషమే" అని తెలియజేసారు. కావున ఈ ప్రతిపాదన విఫలమైనట్లుగా భావించవచ్చు. ----కె.వెంకటరమణచర్చ 17:13, 6 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]