వికీపీడియా:మంచి వ్యాసం లక్షణాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Merge-arrow.svg
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని మంచివ్యాసం ప్రమాణాలు వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)

సంతృప్తికరమైన సమాచారముతో వికీ నిబంధనలు లోబడి ఉన్న వ్యాసమే మంచి వ్యాసంగా పరిగణించబడుతుంది. వ్యాసంలోని సమాచారం స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా, అక్షరదోషాలు లేకుండా, అవసరమైన చోట్ల మూలాలు, గణాంకాలు, బొమ్మలు చేరుస్తూ, తటస్థ దృక్కోణంలో, కనీసం 5,6 విభాగాలతో ఉన్న వ్యాసం మంచి వ్యాసం అనబడుతుంది.

ప్రమాణాలు[మార్చు]

తక్షణ వైఫల్యాలు[మార్చు]

ఈ క్రింద నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేకుంటే, వ్యాసం మంచి వ్యాసం ప్రమాణాలలో వెనువెంటనే విఫలం అయిపోతుంది.

 1. వ్యాసానికి ఏ శుద్ధి మూసలూ ఉండకూడదు. మూస:శుద్ధి, మూస:మూలాలు లేవు లాంటి మూసలు ఉండకూడదు, అలానే మూస:ఆధారం వంటి మూసలు ఎక్కువగా ఉండకూడదు.
 2. మంచి వ్యాసానికి ఉండాల్సిన ఆరు ప్రమాణాల్లో ఏ ఒక్కదానినైనా అందుకునేందుకు వీలులేనంత దూరంలో వ్యాసం ఉండకూడదు.
 3. కాపీహక్కులకు భంగకరమైనది ఏదీ ఆ వ్యాసంలో ఉండకూడదు.

మంచి వ్యాసపు లక్షణాలు[మార్చు]

వ్యాసం నిడివి
 1. వ్యాసం కనీసం 5,6 విభాగాలు కలిగి ఉండాలి.
 2. వ్యాసం సుమారు 10 KB[ఆధారం చూపాలి] ల పరిమాణంతో ఉండాలి.
 3. వ్యాసానికి కనీసం 5,6 వాక్యాల ఉపోద్ఘాతం ఉండాలి.
వ్యాకరణ, అక్షరదోషాలు
 1. వ్యాసంలో అక్షరదోషాలు ఉండరాదు.
 2. వ్యాసంలో వ్యాకరణ దోషాలు ఉండకపోవడమే కాకుండా సాధ్యమైనంతవరకు బాష అందరికీ అర్థమైయ్యేటట్లు సరళంగా ఉండాలి.
 3. వ్యాసంలో కఠినపదాలు, వాడుకలో లేని పదాలు ఉండరాదు.
మూలాలు
 1. వ్యాసంలో అవసరమైన చోట్ల మూలాలు పేర్కొనడం తప్పనిసరి.
 2. అనుమతి లేనిదే వ్యాసంలోని భాగాలను యధాతథంగా ఉన్నవి ఉన్నట్లుగా ఇతర గ్రంథాలు, వెబ్‌సైట్ల నుంచి కాపీ చేసినవై ఉండరాదు.
బొమ్మలు
 1. వ్యాసాన్ని ఆకర్షణీయంగానే కాకుండా సులభంగా అర్థమయ్యేటట్లు చేయడానికి వ్యాసంలో కనీసం 2,3 బొమ్మలు ఉండాలి.
 2. బొమ్మలు కాపీహక్కుల ఉల్లంఘనకు సంబంధించినవై ఉండరాదు.
అభిప్రాయాలు
 1. వ్యాసంలో స్వంత అభిప్రాయాలు చేర్చరాదు.
 2. వ్యాసం ఏ పక్షమూ వహించకుండా తటస్థ దృక్కోణంతో ఉండాలి.