వికీపీడియా:రచ్చబండ (సాంకేతికము)/పాత చర్చ 2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత చర్చ 1 | పాత చర్చ 2 | పాత చర్చ 3

Esc key for Internet Explorer[మార్చు]

తెవికిలో ఉన్న Transliteratorని ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్లో కూడా enable/disale చేసుకోవచ్చు. ఇంతకుమునుపు ఉన్న javascriptలో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరరుకు ఆ సదుపాయాన్ని నిరోధించారు, ఇప్పుడు దానిని సరి చేసాను. ie-6లో పరీక్షించాను బాగానే పని చేస్తుంది. ie-7లో ఎవరయినా ఒక సారి పరీక్షించగలరు. పరీక్షించే ముందు మీ బ్రౌజరు కాషేను ఒక సారి తొలగించి, వికీపీడియా పేజీని ctrl+f5 ఉపయోగించి refresh చేయగలరు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 10:14, 22 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రదీప్ గారికి ధన్యవాదాలు..ie7 esc బటన్ అని చేస్తోంది, నా బ్రౌజ్రర్ ie 7. కాని ఒక ప్రోబ్లమ్ ,వాక్యం మభ్యలో esc నొక్కినప్పుడు వాక్యం అంతా పోతోంది.--మాటలబాబు 11:31, 22 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అందుకనే ieకి దానిని disable చేసినట్లున్నారు. ESC బదులు ఇంకో keyతో disable/enable చేసుకునే సదుపాయం చూడాలి. బహుషా '#'ని ఉపయోగిస్తే బాగుంటుందేమో. RTSలో '#'కు కూడా ఇలా భాషలమధ్య మారడానికే ఉపయోగిస్తారు కదా. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 12:24, 22 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
  1. ఉపయౌగిస్తే # తో నంబరింగ్ ఇవ్వలేము కదా. (వికీకరణ) --మాటలబాబు 12:46, 22 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఇప్పుడు IEకి కూడా ESC పని చేస్తుంది. కానీ IEలో ESC నొక్కిన వెంటనే అప్పటి దాకా తైపు చేసిన సమాచారమంతా ఎగిరిపోతుంది. అలా ఎగిరిపోయిన సమాచారాన్ని తిరిగి పొందాలంటే ctrl-z నొక్కాలి. ఒకవేళ ఈ ESCతో ఇంకేమయినా సమస్యలుంటే గనక ఇక్కడే రాయండి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 08:00, 2 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

searching in telugu wikipedia[మార్చు]

వికీపీడియాలో సెర్చ్‌ఎలా పని చేస్తుందో అయోమయంగా ఉంది. మొన్నొక రోజు ఈమాట కోసం గుంటూరు శేషేంద్ర శర్మ ని వెతకడానికి 'గుంటూరు కోసం వెతికితే తిన్నగా గుంటూరు పేజీ వచ్చింది. వికీ సెర్చి బహుశా title లో ఉన్నదానికి ప్రాధాన్యత ఇస్తుంది అనుకుంటాను. కానీ 'గుంటూరు' search రిజల్ట్స్‌ పేజీ చూపి ఉంటే అందులోంచి శేషేంద్ర శర్మ పేజీకి వెళ్ళచ్చు. శేషేంద్ర కోసం వెతికినా వచ్చే రిజల్ట్స్ పేజీలో గుంటూరు శేషేంద్ర శర్మ పేజీ ఉండదు. శేషేంద్ర శర్మ పేరు ఉండే మరొక పేజీని చూపుతుంది. 'ముత్యాల ముగ్గు' వగైరా. అక్కడి నించి శేషేంద్ర శర్మ పేజీకి వెళ్ళాలి.ఇంగ్లీషు వికీ లో Bush కోసం వెతికితే తిన్నగా President Bush పేజీకి వెళ్ళదు. ఒక అయోమయ నివృత్తి పేజీ లాంటి దానికి వెళుతుంది. ఇలా తెలుగు వికీపీడియాలో ఎందుకు జరగదు? దీనిని వికీకారులు ఎవరైనా వివరించగలరా? లేదా బాగు చేయదగినది, చేయవలసినది అయితే బాగు చెయ్యగలరా? ధన్యవాదాలు. -- పద్మ ఇం. తా.కా. అన్ని టెక్ష్ట్స్ బాక్సుల్లోనూ తెలుగు లో టైపు చేయగలిగే సౌకర్యం ఎందుకు లేదు? ఉదాహరణకి దీనిపైన ఉన్న 'విషయం/శీర్షిక బాక్సులో తెలుగు సౌకర్యం లేదు. ఇది బగ్గా? ఫీచరా? :-)

ఈ వికీపీడియా సెర్చ్ ఖచ్చితంగా అంతర్గతంగా ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు కానీ మీరు చెప్పిన సమస్య రెప్లికేట్ చెయ్యటానికి ప్రయత్నించాను. మొదటగా మీకు వెళ్లు, వెతుకు ల మధ్య ఇక్కడ భేదము తెలుసనుకుంటాను (ఒకవేళ తెలియకపోతే గుంటూరు వెళ్లు నొక్కితే ఖచ్చితంగా గుంటూరు పేరుతో ఉన్న పేజీకే వెళుతుంది. ఇది చాలా స్ట్రిక్ట్ గుంటూరులో చివరి అక్షరంలో ర కు ఊత్వం తప్పినా వెతుకు మోడ్ లోకి వెళుతుంది...గుంటూరు వెతుకు నొక్కితే గుంటూరుతో అలా పోలిక ఉన్న పేరుతో ఉన్న వ్యాసాలతో పాటు..వ్యాసంలో ఎక్కడైనా గుంటూరు ఉంటే అవి కూడా చూపిస్తుంది. ఇక్కడ నాకూ అర్ధం కాని విషయమేమిటంటే గుంటూరు వెతుకు అంటే ఖచ్చితమైన పేరు గల గుంటూరు వ్యాసాన్ని తొలి ఫలితంగా చూపిస్తందనుకుంటాము కదా..కానీ 1156 ఫలితాల్లో గోటూరు, గోటేరు, పొంగుటూరు, టంగుటూరు, ఉంగుటూరు...ఆ తరువాతనే గుంటూరు వచ్చింది)
ఇక గుంటూరు శేషేంద్ర శర్మ అని వెళ్ళు నొక్కితే ఖచ్చితంగా ఆ పేజీకి వెళుతుంది. కానీ శేషేంద్ర వెతికితే శేషేంద్ర అనే పేజీ ఇక్కడ లేదు కాబట్టి అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. అంగ్ల వికీలాగా ఇక్కడ శేషేంద్ర అనే అయోమయనివృత్తి పేజీకి ఎందుకు లేదంటే ఇప్పటిదాకా ఒకే పేరుతో కనీసం ఇద్దరు వ్యక్తుల వ్యాసాలు/పేర్లు తారసపడితే గానీ తెవికీలో అలా అయోమయనివృత్తి పేజీలు తయారు చెయ్యలేదు. ఇంకో శేషేంద్ర పేరుతో తెవికీలో వ్యాసమేదైనా ఉండింటే ఈ పాటికి అయోమయనివృత్తి పేజీ ఉండిఉండేది. గ్రామాల పేర్లకు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఆత్మకూరు పేజీ చూడండి.
తా.కా.?? ఈ స్క్రిప్టును వికీపీడియాకు అనుగుణంగా మార్చిన వ్యక్తి ఎవరోకాని అన్ని ఇన్పుట్ బాక్సులను పరిగణలోకి తీసుకోలేదు. నేను ఎడిట్ సారంశము పెట్టె కు ఎక్స్‌టెండ్ చేశాను. మిగిలినవాటికి కూడా చేర్చే ప్రయత్నములో ఉన్నాను --వైజాసత్య 20:17, 6 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
అన్వేషణతో ఏదో తేడా ఉన్నట్టు తోస్తోంది. వందేమాతరం కోసం వెతికాను (వెళ్ళలేదు). ఫలితాల్లో వచ్చిన మొదటి నాలుగైదు వ్యాసాల్లో ఎక్కడా వందేమాతరం అనే మాట లేదు. గుజరాత్ లోను, నందమూరి తారక రామారావు, గరిమెళ్ళ సత్యనారాయణ, నవంబర్ 2005 పేజీల్లో కేవలం వం మాత్రమే ఉంది. గజేంద్ర మోక్షము వ్యాసంలో వంద ఉంది. అంతకంటే దగ్గరగా ఉన్న ఫలితాలు రాలేదు. ఇక నేను వందేమాతరం సినిమా కోసం వెతకబోయాను (నాకసలు కావలసింది అదే), అదీ దొరకలేదు.
నాకు గుర్తున్నంతవరకు ఇదివరలో ఇలా లేదు. వెతకబోయిన తీగ కాలికడ్డం పడకపోయినా ఏదో ఒక లింకంటూ దొరికేది, మరీ ఇలా సంబంధం లేనివి చొరబడిపోయేవి కావు. ఈమధ్య కాలంలో అన్వేషణ విధానాన్ని మార్చారేమోనని నా అనుమానం! (తా.కా. - తాజాకలం (తా.క.) అయ్యుండొచ్చు.) _చదువరి (చర్చరచనలు) 07:12, 18 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నిజమే! ఇది చాలా గందరగోళంగా ఉంది. ఇంగ్లీషు వికీ లో వ్యాసం లోపల మాటల కోసం కూడా వెతుకుతుంది. అక్కడ నాకు తెలిసిన ఒక మాట ఒకేఒక వ్యాసంలో ఉంది. ఆ మాట ఆ వ్యాసంలో శీర్షికలలో లేదు, అయినా ఆ మాట కోసం "వెతక" గానే ఆ వ్యాసం వచ్చింది. ఇలా ఇక్కడ పని చేయడం లేదు. నేను తెలుగు వికీలో వెతకవలసి వచ్చినప్పుడు గూగుల్ లో వెతుకుతున్నాను. ప్రతిభామూర్తులు లాగ. (ఇది కేవలం సమాచారం కోసమే చెబుతున్నాను, విమర్శ కాదు. ) --పద్మ ఇం.

using label tag[మార్చు]

ఇంగ్లీషు తెలుగు మార్పు చేసే చెక్ బాక్సు పక్కన ఉండే టెక్స్ట్‌ ని label tagలో wrap చేస్తే క్లిక్‌ చేయడం తెలిక. ఈ పేజీలో 'విషయం/శీర్షిక' అన్న మాటలని label tag లో wrap చేసినందువల్ల టెక్స్ట్‌ బాక్స్‌ లోనే కాక లేబులు మీద క్లిక్ ఛేసినా టెక్స్ట్‌ బాక్స్ కి ఫోకస్‌ వస్తోంది. ఇలా ముఖ్యంగా checkboxes, radio buttons ఉన్నచోట్ల చేస్తే బావుంటుంది. -- పద్మ ఇం.

మంచి ఐడియా ఇచ్చినందుకు కృతజ్ఞతలు. త్వరలోనే అచరణలో పెడతాం --వైజాసత్య 20:18, 6 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

Inscript[మార్చు]

this is giving lot of problems now a days as i type in edit boxes in wikipedia, i dont know about other members regarding this , may be it would not be problem if type in lekhini and paste here i am giving example here what is happenning, this problem is new not there few days back... example:

i want to write ఖండం iam typing KMDM it is giving this ఖ్ండ్ం, but earlier this problem not there.
lekhini if you type KMDM it gives requiredఖండం
hope some one will look into matter and help me and telugu wikipedia--మాటలబాబు 15:39, 2 ఆగష్టు 2007 (UTC)
ప్రస్తుతానికి ఖండం రాయటానికి khandam అని రాయండి. మధ్యలో స్క్రిప్టు కొంత మార్చాము. అందువల్ల ఈ సమస్య వచ్చిఉంటుంది. పరిశీలిస్తా --వైజాసత్య 15:53, 2 ఆగష్టు 2007 (UTC)
this is a request for adminstrators, I dont know whether i can write like this or not.. please dont play with the inscript, it is getting very difficult to type in telugu now because.. finger have adjusted for one kind of typing the alphabets, if inscript keeps on changing the fingers are really struggling to get correct word and some times i have to fiddle around so many times , some times getting frustration as well .., when your not getting right word... i use both lekhini and edit box inscript for writing telugu... please this is a request for admins not to fiddle around inscript .. thank you please dont think other wise... other members who are used to edit box inscripts might have difficulty as well--మాటలబాబు 22:21, 2 ఆగష్టు 2007 (UTC)
ఇప్పుడు KMDM కూడా పని చేస్తూ ఉంటుంది, రీఫ్రెష్ చేసి (ctrl+F5 నొక్కి) చూడండి. తెలుగు typing కోసం తయారు చేస్తున్న స్క్రిప్టు ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. ఇంకో 5-6 నెలల తరువాత అది stable అవుతుంది. అప్పటిదాకా ఇలాగే ఉంటుంది. ఒక సారి stable అయింది అని అనుకున్న తరువాత ఇంక ఎట్టువంటి మార్పులు ఉండవు. అంతవరకూ, ఇలాంటి కొన్ని సమస్యలు కనపడుతూ ఉంటాయి. మీకు కనపడిన సమస్యలను వెంటనే ఇక్కడ కానీ లేదా మీడియావికీ చర్చ:TeTranslit.js పేజీలో కానీ తెలుపండి. వంటనే అలాంటి సమస్యలను పరిష్కరించి స్క్రిప్టుని stable దిశగా తీసుకు వెల్లవచ్చు. __మాకినేని ప్రదీపు (+/-మా) 06:35, 3 ఆగష్టు 2007 (UTC)
ప్రదీప్ గారి కి ధన్యవాదాలు, తప్పకుండా ఇంకా ఏమైన కష్టాలు ఉంటే ఆ చర్చాపేజిలొ వ్రాస్తాను, నిన్న ఒక పదం రాయడం కోసం చాలా సార్లు చెరుపుళ్ళు, రాయడాలు కరిగింది అందువలన విసుగు వచ్చి ఇలా వ్రాసాను, ఏమి అనుకోవద్దు. చేతి వ్రేళ్ళు ఒకలాగ అలవాటు పడీతే మళ్ళి వ్రాయడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది, అంతేకాదు సమయం అప్పుడప్పుడు ఎక్కువ వ్యర్థం అవుతోంది అని అనిపిస్తుంది. మరొకసారి ప్రదీప్ గారికి ధన్యవాదాలు--మాటలబాబు 06:40, 3 ఆగష్టు 2007 (UTC)
ఏమీ అనుకోలేదు. ఇలాంటివి తెలిస్తేనేకదా మెరుగయ్యేది. ఇది ఇదివరకున్న స్క్రిప్టు కంటే మెరుగైనది (కానీ తప్పులు లేవని కాదు). --వైజాసత్య 06:56, 3 ఆగష్టు 2007 (UTC)
పెట్టెలు లొ టైపు చేసేటప్పుడు ఒకసారి తెలుగు లొ పడు తోంది మారోసారి అదే పెట్టె లొ ఆంగ్లం పడుతోంది. తెలుగు పడుతుందో , ఆంగ్లం పడుతుందో ముందే తెలుసుకొనే అవకాశం ఏమైన ఉన్నదా, కాలం కొద్దిగా ఆదా అవుతుందేమో నని ఈ ప్రశ్న అడిగాను, నస పెట్టుతున్నాడని బావించవద్దు.--మాటలబాబు 21:26, 4 ఆగష్టు 2007 (UTC)
ఆ పెట్టేలో మీరు చివరి సారిగా ఏ అక్షరాలతో రాసారో తెవికీ గుర్తు పెట్టుకుంటుంది (కూకీల ద్వారా). కాబట్టి మీరు అంతకు ముందు ఏ అక్షరాలతో టైపు చేసారో ప్రస్తుతం టైపు చేస్తున్నప్పుడు కూడా అవే అక్షరాలు పడుతూ ఉంటాయి. బ్రవుజరు మూసేసినా సరే గుర్తుపెట్టుకుంటుంది. __మాకినేని ప్రదీపు (+/-మా) 04:10, 5 ఆగష్టు 2007 (UTC)
ఎడిట్ బాక్సు లొ డిఫాల్ట్ గా తెలుగు పడేటట్లు ఏర్పాటు తిరిగి చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి, టిక్కులు పెట్టుకోవడానికి తీసుకోవడానిక్ సరిపోతోంది సమయం. ఇదివరకటి ఏర్పాటే బాగున్నట్లు అనిపిస్తోంది. దీని మీద కొద్దిగా దీర్ఘంగా చర్చ జరిగితే బాగుంటుందేమో?--మాటలబాబు 21:53, 6 ఆగష్టు 2007 (UTC)

SVG ఫైళ్లలలో తెలుగు టెక్స్ట్[మార్చు]

నేను కొన్ని SVG ఫైళ్ళలో ఆంగ్లములో ఉండే టెక్స్ట్‌ను తొలగించి దాని స్థానములో ఇంక్‌స్పేసు ఉపయోగించి తెలుగు టెక్స్ట్ చేర్చి సేవ్ చేస్తే ఇంక్‌స్పేసు వరకు బాగానే కనిపిస్తుంది కానీ ఇక్కడ అప్లోడ్ చేస్తే తెలుగు టెక్స్ట్ ఉన్న స్థానములో ఖాళీగా కనిపిస్తున్నాయి ఆ బొమ్మలు. ఎందుకిలా జరుగుతుంది. నేనేదైనా తప్పు చేస్తున్నానా లేకపోతే మీడియావికీలో తెలుగుకు ఎస్వీజీ మద్దతు లేదా? నా దగ్గర ఫ్రీహాండ్ ఉంది కాని అది యూనీకోడ్ కు మద్దతునివ్వట్లేదు. ఇంకా ఏమైనా వెక్టర్ గ్రాఫిక్స్లో తెలుగును సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్లు ఉన్నాయా? నేను ప్రయత్నించిన కొన్ని బొమ్మలలో ఇది ఒకటి బొమ్మ:Distancedisplacement-te.svg. --వైజాసత్య 00:46, 6 ఆగష్టు 2007 (UTC)

తప్పు మీది కాదు, మీడియావికీలో వాళ్ళు ఉపయోగించే SVG-PNG convertorతో తెలుగు ఫాంటుని ఉపయోగించటం లేదు. తమిళ, హిందీలకు ఫాంటులు మాత్రం వాడుతున్నారు. అలాగే FF ప్రస్తుతానికి SVG ఫైళ్ల లోపట unicode అక్షరాలు ఉంటేగనక వాటిని render చేయదు. FF3లో ఈ సమస్యను పరిశ్కరిస్తారంట. bugzillaలో ఇప్పుడే మీ కామెంట్లను చూసాను. వారికి తెలుగు ఫాంట్లు ఎక్కడెక్కడ లభిస్తాయో లింకులు ఇచ్చాను. మీడియావికీలో దీనిని తొందరలోనే పరిశ్కరించేస్తారేమో చూద్దాము. __మాకినేని ప్రదీపు (+/-మా) 04:58, 6 ఆగష్టు 2007 (UTC)
ఇంక్‌స్కేప్‌లో ఫాఠ్యం మనక్కావలసిన సైజు మరియు ఖతిలో రాసి, దాన్ని ఆబ్జెక్టుగా మారిస్తే ఈ సమస్యరాదు. కానీ ఆబ్జెక్టుగా మారిన తర్వాత ఆ పాఠ్యాన్ని మార్చలేము. మళ్ళీ రాసుకోవాల్సిందే. ఈ చిట్కాని ఖతుల నమూనాలకు వాడా.
బాగుంది ఈ పద్దతి. __మాకినేని ప్రదీపు (+/-మా) 06:43, 12 అక్టోబర్ 2007 (UTC)

ఎడిట్ పెట్టె సమస్య[మార్చు]

ఎడిట్ పెట్టెలో ఉన్న లిప్యాంతరీకరణ సౌకర్యంలో ఒక చిన్న లోపం కనబడింది.. భృ (bhR భృతి లో) ని రాయలేకపోతున్నాం. ఒకసారి పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 15:31, 27 అక్టోబర్ 2007 (UTC)

సరిచేశాను. తెలియజేసినందుకు నెనర్లు --వైజాసత్య 18:42, 27 అక్టోబర్ 2007 (UTC)

రసాయనశాస్త్రం లో వచ్చే నిర్మాణక్రమాలు (Structural Formulas)రాయటం ఎలా?[మార్చు]

రసాయనశాస్త్రం లో రెండు రకాల formuals వాడతాం కదా. Methane ని CH4 అని రాయవచ్చు లేదా C కి నాలుగు పక్కలా నాలుగు చిన్న గీతలు గీసి ఆ గీతల పక్కని ఒకొక్క H రాయ వచ్చు. ఈ రెండో పద్దతిని నిర్మాణక్రమం అంటారు. యూనీకోడ్‌లో రాసేటప్పుడు ఈ నిర్మాణక్రమాలు రాయటం ఎలాగో తెలిస్తే రసాయన శాస్త్రపు విషయాలు కొన్ని నేను రాయగలను. తెలిసిన వారు చెప్పగలరు. Vemurione 01:20, 30 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అలా చేయటం కుదరదు. ఇలాంటి బొమ్మలు వాడుకోండి. Methane-2D-stereo.svg చర్చసాయీరచనలు 01:30, 30 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బేటావికీ నుండి మీడియావికీ నేంస్పేసు ట్యాగులు[మార్చు]

ఈ మధ్య sidebarలో తరచుగా "సహాయము" డబ్బా ఎగిరిపోవటం గమనించాను. అలాగే "మార్గదర్శకము" డబ్బాలో "విరాళములు"కు బదులుగా Donate అని వచ్చేస్తుంది. మీడియావికీ:Sidebar అనే పేజీని purge చేస్తుంటే మళ్లీ మామూలుగా వచ్చేస్తుంది. దీనికి కారణం బేటావికీ నుండి మీడియావికీ నేంస్పేసు ట్యాగులు ఎప్పటికప్పుడు తాజాకరించడం వలన అయ్యుండవచ్చని అనుకుంటున్నాను. అందుకని ఇక్కడ ఉన్న వాక్యాలనే అక్కడ కూడా చేర్చేసాను. కానీ పూర్తి కారణాలు ఇంకా తెలియటం లేదు. __మాకినేని ప్రదీపు (+/-మా) 07:58, 2 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వ్యాసాలకి లైను మధ్య ఖాళీని పెంచాలి[మార్చు]

ఈ మధ్య నేను వికిపీడియా మొదటి పేజీని ముద్రించితే వ్యాసం పేజీ ఒక లైనుకి తరువాత లైనుకి సరిపోయినంత ఖాళీ లేకుండాముద్రించబడింది. స్వాగతం పేజీ సరిగా ముద్రించబడింది. పరికించి చూస్తే తెర పైనకూడా, వత్తు లేక గుణింతం అక్షరాలు రెండు లైనులలో దగ్గరగా వున్నపుడు సరిపోయినంత ఖాళీ లేదనిపించిది. మీరేమంటారు?--అర్జున 17:52, 25 సెప్టెంబర్ 2008 (UTC)

ఇంటర్నెట్ చక్కగా ఉపయొగించుకొవడం[మార్చు]

   ఇంటర్నెట్ చక్కగా ఉపయొగించుకొవడం గురించి మీరెవరైనా చక్కని వివరంచగలరు

#దారిమార్పు (#REDIRECT కి బదులుగా)[మార్చు]

మీకు తెలుసా, ఇప్పుడు దారిమార్పు పేజీలకి #దారిమార్పు అన్న సంకేతాన్ని వాడవచ్చని? నేను #దారిమార్పుని వాడుతూ రెండు మార్పులు చేసాను. చూడండి. —వీవెన్ 14:41, 22 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

అవునా! బావుంది. తెలియజేసినందుకు నెనర్లు --వైజాసత్య 16:18, 22 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా ప్రకటనలు లో లింకు పని చేయటం లేదు[మార్చు]

మరొక ప్రకటనను చూపించు లింకు వాడుకరి పేజీలనుండి ఉదా: వాడుకరి: Arjunaraoc రెండు కంటే ఎక్కువ సార్లు పనిచేయటం లేదు.అర్జున 07:21, 27 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా లో మార్పుల వేగం ఆధారంగా పనిచేస్తుందట. నవీకరించిన మూసకి మార్చాను. అర్జున 11:54, 2 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికి గాలింపు(Searching)[మార్చు]

తెవికి గాలింపు వేరే పద్దతిలో వుంది. ఆంగ్ల వికిలో "Infobox desease" అని వెతికితే ఫలితాలు(results) చాల చూపించింది, అదే తెవికి మాత్రం ఎలాంటి ఫలితాలు లేవు. తెవికి లో "Infobox Desease" పేరుతో వ్యాసము వునప్పటికి, సున్నా ఫలితాలను చూపుతుంది, బహుశ తెవికి గాలింపు పద్దతి Case Sensitive కావచు. ఈ లోటు పురించమని నా మనవి.--Ranjithsutari 11:51, 22 సెప్టెంబర్ 2010 (UTC)

మనం సాధారణంగా ఆంగ్ల పేర్లని తెలుగు లోకి మార్చుకుని వాడుతాము. అప్పుడు ఇబ్బంది వుండకపోవచ్చు. మీకు తప్పనిసరికావాలనిపిస్తే మీడియా వికీ బగ్ ఫైల్ చేయండి.--అర్జున 12:28, 22 సెప్టెంబర్ 2010 (UTC)