వికీపీడియా:వాడుకరులకు సూచనలు/ట్రాన్స్‌క్లూజన్ సంగతులు
ట్రాన్స్‌క్లూజన్ సంగతులు
[మార్చు]వికీపీడియాలో ఏదైనా ఒక పేజీలో (మూలం పేజీ) ఉన్న సమాచారం మొత్తాన్నీ మరొక పేజీలో (దీన్ని గమ్యం పేజీ అంటారు) చూపించాలంటే ఆ సమాచారం మొత్తాన్నీ గమ్యం పేజీలో మళ్ళీ రాయాల్సిన పని లేదు. దానికి ట్రాన్స్‌క్లూజన్ అనే పద్ధతి ఉంది. దాన్ని వివరించే విభాగమే ఇది.
మూసలను పేజీలో చేర్చేటపుడు {{మూసపేరు}} అని రాసి చేరుస్తాం. ఇలా {{
}}
అనే జమిలి బ్రాకెట్ల మధ్య పేజీ పేరు పెట్టడాన్నే ట్రాన్స్‌క్లూజన్ అంటారు. {{తెలంగాణ నదులు}} అనే మూసను ఏదైనా పేజీలో ట్రాన్స్‌క్లూడు చేసామనుకోండి ఆ పేజీలో అది కింది విధంగా కనిపిస్తుంది:
వికీ ఎడిటరులో పైన ఉండే పరికరాల పెట్టెలో "చొప్పించు"
--> "మూస"
ను ఎంచుకుని, అప్పుడు కనబడే పెట్టెలో "తెలంగాణ నదులు" అని ఇచ్చినా సరిగ్గా ఇదే జరుగుతుంది.
కొన్ని నియమాలు
[మార్చు]"మూస" పేరుబరి లోని పేజీలనే కాదు, ఏ పేరుబరి లోని పేజీనైనా ఇతర పేజీల్లో ట్రాన్స్‌క్లూడు చెయ్యవచ్చు. ఉదాహరణకు, వికీపీడియా:వాడుకరులకు సూచనలు అనే పేజీలో {{వికీపీడియా:వాడుకరులకు సూచనలు/ట్రాన్స్‌క్లూజన్ సంగతులు}}
అని రాసామనుకోండి.. అప్పుడు {{వికీపీడియా:వాడుకరులకు సూచనలు/ట్రాన్స్‌క్లూజన్ సంగతులు}}
అనే పేజీలో రాసిన ప్రత్యక్షరమూ ఉన్నదున్నట్లుగా వికీపీడియా:వాడుకరులకు సూచనలు పేజీలోకి చేరిపోతుంది. అయితే పేరుబరులకు సంబంధించి కొన్ని నియమాలున్నాయి. అవేంటో చూద్దాం.
- ప్రధాన పేరుబరి లోని పేజీలను ట్రాన్స్‌క్లూడు చెయ్యాలంటే పేజీ పేరుకు ముందు కోలన్ (:) పెట్టాలి. అంటే భారతదేశ జిల్లాల జాబితా/పంజాబ్ అనే పేజీని వేరే పేజీలో ట్రాన్స్‌క్లూడు చెయ్యాలంటే, గమ్యం పేజీలో
{{:భారతదేశ జిల్లాల జాబితా/పంజాబ్}}
అని రాయాలి. ముందు "కోలన్"ను గమనించండి. ప్రధాన పేరుబరి లోని వ్యాసాలను ట్రాన్స్‌క్లూడు చేసేటపుడు ముందు కోలన్ తప్పనిసరిగా ఉండాలి. - మూస పేరుబరి లోని పేజీలను ట్రాన్స్‌క్లూడు చేసేటపుడు పేరుబరి లేకుండా ఉత్త పేజీ పేరు రాయాలంతే. గమ్యం పేజీలో సింపులుగా
{{తెలంగాణ నదులు}}
అని రాయాలి. అంటే, మూస పేరుబరి లోని పేజీలను ట్రాన్స్‌క్లూడు చేసేటపుడుపేరుబరిని రాయకూడదు. - ఇతర పేరుబరుల్లోని పేజీలను ట్రాన్స్‌క్లూడు చేసేటపుడు సంబంధిత పేరుబరితో సహా పేజీ పేరు రాయాలి ఉదా:
{{వికీపీడియా:వాడుకరులకు సూచనలు/అనువాదంలో మానవిక అనువాద శాతం}}
. మీకు ఆసక్తి ఉంటే.., వికీపీడియా:వాడుకరులకు సూచనలు అనే పేజీని దిద్దుబాటు మోడ్‌లో తెరిచి, అక్కడ ఏయే పేజీలను ట్రాన్స్‌క్లూడు చేసారో చూడండి.
ఇప్పుడు కొన్ని చిట్కాలు
[మార్చు]అయితే మూలం పేజీ లోను, గమ్యం పేజీలోనూ ఏయే సమాచారాన్ని చూపించాలులి, దేన్ని చూపించకూడదు అనే విషయంలో మనకు కింది విధమైన అవసరాలుండవచ్చు. ఆయా అవసరాలను ఎలా సాధించుకోవాలో కూడా చూడవచ్చు.
- ట్రాన్స్‌క్లూడు చేసే పేజీలో (మూలం పేజీ) ఉన్న కొంత సమాచారం అక్కడ మాత్రమే కనబడాలి, కానీ గమ్యం పేజీలో కనబడకూడదు: ఈ సందర్భంలో సదరు సమాచారాన్ని
<noinclude>
</noinclude>
అనే ట్యాగుల మధ్య ఉంచాలి. అప్పుడు ఆ సమాచారం గమ్యం పేజీలో కనబడదు. - ట్రాన్స్‌క్లూడు చేసే పేజీలో (మూలం పేజీ) ఉన్న కొంత సమాచారం అక్కడ కనబడకూడదు, కానీ గమ్యం పేజీలో మాత్రం కనబడాలి: ఈ సందర్భంలో సదరు సమాచారాన్ని
<includeonly>
</includeonly>
అనే ట్యాగుల మధ్య ఉంచాలి. అప్పుడు ఆ సమాచారం గమ్యం పేజీలో మాత్రమే కనబడుతుంది. ఉదాహరణకు,
ఈ ట్యాగులను మూలం పేజీలోనే పెట్టాలి. గమ్యం పేజీలో కాదు. వీటిని ఎక్కువగా వర్గాలను చేర్చే సందర్భంలో వాడుతారు.