వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022/చిత్ర యాత్రలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గమనిక: ఈ ప్రాజెక్టులో భాగంగా మెరుగైన కృషి అందిస్తున్న వారికి ఈ సదుపాయం అందించబడుతుంది.

చిత్ర యాత్ర అంటే యాత్రల్లో తిరుగుతూ చిత్రాలు తీయాలేమో అనుకుంటున్నారా!

అవును! మీరు అనుకున్నది అక్షరాలా నిజం !

ఈ సారి ప్రాజెక్టులో మీరు మీ ప్రాంతానికి చుట్టుపక్కన ఉన్న ఊర్లలో/ప్రదేశాలలో తిరుగుతూ ఏవైతే వికీ వ్యాసాల్లో చిత్రాలు అవసరమో అవి చిత్రించి వికీ కామన్స్ లో చేర్చాలి.

ఆగండి ! ఇంతటితో అయిపోలేదు, మీరు కామన్స్ లో ఎక్కించిన చిత్రాలు తెలుగు వికీలోని వ్యాసాల్లో చేర్చాలి(పోటీ షరతులు వర్తిస్తాయి సుమీ).

చిత్ర యాత్రలో పాల్గొనాలి అనుకునే వాడుకరులు అక్టోబరు 8 లోగా ఈ పేజీలో మీ అభ్యర్థనలు తెలుపవచ్చు.

చిత్ర యాత్రకు మార్గదర్శకాలు

  1. ప్రాజెక్టులో భాగంగా 10 మంది వాడుకరులు ప్రతి ఒక్కరు మూడు రోజుల పాటు ఈ చిత్ర యాత్రలో పాల్గొనవచ్చు.
  2. అలాగే సముదాయంలో అనుభవం గల వాడుకరుల్లో ఎవరైనా ఒక్కరు 5 రోజుల పాటు ఈ చిత్ర యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. అయితే సముదాయం నుండి ఈ చిత్ర యాత్రలో పాల్గొనే వాడుకరి కామన్స్ లో చేర్చిన చిత్రాలు తెవికీ వ్యాసాల్లో చేర్చవద్దు. వాటిని కార్యశాలలు నిర్వహించేటప్పుడు కొత్త వాడుకరులకు శిక్షణలో భాగంగా వ్యాసాల్లో చేర్చనిద్దాం. అలా పూర్తిగా వాటిని వాడని పక్షాన వాటిని కామన్స్ లో చేర్చిన వాడుకరే వ్యాసాల్లో చేర్చాలి.
  3. ఈ చిత్ర యాత్రలో భాగంగా ప్రతి రోజు మీరు మీకు వీలైన ప్రదేశాలలో తిరుగుతూ ఆయా ప్రాంతాలకు సంబంధించిన వ్యాసాలలో అవసరమైన బొమ్మలు చిత్రీకరించి కామన్స్లో చేర్చి ఆపై వ్యాసాలలో పొందుపరచాలి.
  4. తీసిన చిత్రాలన్నీ కూడా కామన్స్ లో చేర్చేటప్పుడు CC0, CC BY-SA 4.0 లేదా పబ్లిక్ డొమైన్లో ఉండే లైసెన్సులను మాత్రమే ఉపయోగించాలి.
  5. చిత్ర యాత్రలో భాగంగా కామన్సులో ఎక్కించే చిత్రాలకి #WPWPTE అనే హాష్ ట్యాగ్ తప్పనిసరి ఉపయోగించాలి. (అంటే తెలుగు వికీపీడియాలో ఎలాగైతే దిద్దుబాటు సారాంశంలో (#WPWPTE) అని రాస్తారో అలాగే వికీ కామన్స్ లో కూడా చిత్రం చేర్చే దిద్దుబాటు సారాంశంలో #WPWPTE చేర్చాలి.)
  6. ఇక మీరు చిత్రాన్ని చేర్చే వ్యాసంలో ఇది వరకు ఏ బొమ్మ ఉండకుండా ఉండాలి (మ్యాపులకి మినహాయింపు కలదు), అలాగే ఆ వ్యాసం తప్పనిసరిగా మొలక స్థాయిని దాటి ఉండాలి.
  7. అలా వ్యాసంలో చిత్రం చేర్చేటప్పుడు యధావిధిగా నియమాల ప్రకారం #WPWPTE ఉపయోగించాలి.
  8. మీరు ఈ మూడు రోజుల యాత్ర ఏయే రోజుల్లో చేయబోతున్నారో, మీ అభ్యర్ధనల్లో తెలపండి.

ఇక మిగిలిన నియమాలు అన్ని పోటీలో యధావిధిగా ఉంటాయి.

ఈ యాత్రలో పాల్గొనే వారు తమ మూడు రోజుల వ్యవధి పూర్తి చేసుకొని ఆ చిత్రాలని తెలుగు వికీ వ్యాసాల్లో పొందుపరచినాక మీకు ఈ అలవెన్సు అందించబడుతుంది. దీంట్లో భాగంగా వాడుకరులకు రోజుకి 1500 రూపాయల చొప్పున ట్రావెల్ అలవెన్సు అందించగలం.

దండోరా

[మార్చు]

నమస్కారం !

ఈ క్రింది వాడుకరులు ప్రాజెక్టులో చురుకైన సేవ అందిస్తున్న మూలాన, వారిలో ఆసక్తి గల వారు చిత్రయాత్రలకు అభ్యర్థించుకోగలరని మనవి.

వాడుకరి: Divya4232, వాడుకరి: స్వరలాసిక, వాడుకరి:K.Venkataramana, వాడుకరి: Tmamatha , వాడుకరి: యర్రా రామారావు, వాడుకరి:ప్రశాంతి, వాడుకరి: Pranayraj1985, వాడుకరి: Vadanagiri bhaskar, వాడుకరి: Thirumalgoud.

ప్రాజెక్టు కాలం ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్న కారణాన, ముందుగా అభ్యర్థించిన వారిని పరిగణించటానికి ఎక్కువ ఆస్కారం ఉంది.

ధన్యవాదాలు.

NskJnv 13:49, 8 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

అభ్యర్థనలు అందించిన అభిలాష్ మ్యాడం, ~~ramesh bethi~~, Vadanagiri bhaskar, ప్రశాంతి, ఆదిత్య పకిడే Adbh266 గార్లకి నమస్కారం, అక్టోబరు 11 మొదలుకొని 20 లోపు ఏవైనా మూడు రోజులు మీరు ఈ యాత్రలో పాల్గొనచ్చు. ఈ యాత్రకి సంబందించిన అలవెన్సు అందుకోవడానికి మీ బ్యాంకు వివరాలు wikikiranam@gmail.com కి ఈ-మెయిల్ పంపించగలరు.

చిత్రయాత్ర తేదీలు

[మార్చు]

మీ చిత్ర యాత్రల తెదీలు ఇక్కడ తెలపండి.

అలవెన్సు వివరాలు

[మార్చు]

మీకు అందిన అలవెన్సు వివరాలు ఇక్కడ తెలపండి.

రెండవ దఫా

[మార్చు]

మూడవ దఫా

[మార్చు]

అభ్యర్థనలు

[మార్చు]

మొదటి దఫా

[మార్చు]
  1. చిత్రయాత్రలో పాల్గొనుటకు నేను సిద్ధం. పాల్గొనుటకు గల తగు సూచనలు సలహాలు ఇవ్వగలరని అభ్యర్థిస్తున్నాను.--అభిలాష్ మ్యాడం (చర్చ) 16:51, 3 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  2. చిత్రయాత్రలో పాల్గొనుటకు నేను సిద్దం. పాల్గొనుటకు తగిన సలహాలు,సూచనలు ఇవ్వగలరు.--~~ramesh bethi~~ (చర్చ) 06:11, 6 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  3. చిత్రయాత్ర లో పాల్గొనడానికి నేను సిద్దంగా ఉన్నాను.ఆదిత్య పకిడే Adbh266 (చర్చ) 14:39, 8 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  4. చిత్ర యాత్రలో పాల్గొనడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తగిన సూచనలు , సలహాలు ఇవ్వగలరని ఆశిస్తున్నాను. Vadanagiri bhaskar (చర్చ) 16:01, 8 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  5. చిత్ర యాత్రలో పాల్గొనడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తగిన సూచనలు , సలహాలు ఇవ్వగలరని ఆశిస్తున్నాను. ప్రశాంతి (చర్చ) 20:23, 8 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  6. చిత్ర యాత్రలో పాల్గొనడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తగిన సూచనలు , సలహాలు ఇవ్వగలరని ఆశిస్తున్నాను.KINNERA ARAVIND (చర్చ) 03:30, 15 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

రెండవ దఫా

[మార్చు]
  1. సాయి కిరణ్ గారు నమస్కారం, నా వంతు మూడు రోజుల చిత్రయాత్ర అనుకున్న సమయం కంటే ఒకరోజు ముందే పూర్తయింది. ఇంకా అవకాశం ఉంది కాబట్టి మిగిలిన మూడు రోజుల చిత్రయాత్ర నేనే నిర్వహిస్తాను.౼ అభిలాష్ మ్యాడం (చర్చ) 05:41, 18 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  2. సాయి కిరణ్ గారు నమస్కారం, నా మూడు రోజుల చిత్రయాత్ర అనుకున్న సమయం కంటే ఒకరోజు ముందే పూర్తయింది. ఇంకా అవకాశం ఉంది కాబట్టి మిగిలిన మూడు రోజుల చిత్రయాత్ర నేనే నిర్వహిస్తాను.అవకాశం ఇవ్వగలరు. KINNERA ARAVIND (చర్చ) 15:28, 19 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మూడవ దఫా

[మార్చు]
  1. సాయి కిరణ్ గారు నమస్కారం, నా మూడు రోజుల చిత్రయాత్ర రెండు రౌండ్లు పూర్తయింది. ఇంకా అవకాశం ఉంది కాబట్టి మిగిలిన మూడు రోజుల చిత్రయాత్ర నేనే నిర్వహిస్తాను.అవకాశం ఇవ్వగలరు.KINNERA ARAVIND (చర్చ) 18:01, 26 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  2. సాయి కిరణ్ గారు నమస్కారం, నా మూడు రోజుల చిత్రయాత్ర రెండు రౌండ్లు పూర్తయింది. మూడో రౌండ్ చిత్రయాత్రకు అవకాశం ఇవ్వగలరు.-అభిలాష్ మ్యాడం (చర్చ) 02:52, 27 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]